టెన్త్ పేపర్ జవాబు పత్రాలు దిద్దడంలో నిర్లక్ష్యం
ఓ విద్యార్థినికి తీవ్ర అన్యాయం..
రీ వాల్యుయేషన్‌లో విద్యార్థినికి మంచిస్కోరు..
దుండిగల్: పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురతున్నారు. వా ల్యుయేషన్‌లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్‌లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాం«దీనగర్‌లోని గీతాంజలి స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది.
ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్డపడ్డానని, 9.5 గ్రేడ్ సా«ధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యా న్ని నింపారు.
తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్ట్‌కు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్టెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రీవాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కు లు వచ్చాయి.9.3 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది.
ఎగ్జామినర్లదే తప్పు..
పదవ తరగతి జవాబు పత్రాలను ముగ్గురు అధికారులు దిద్దుతారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అస్టిసెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలకు మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచి్చన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపరును దిద్దిన ముగ్గురు అధికారులూ అజాగ్రత్తగా వ్యవహరించారు.
రీ వ్యాలుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిచారు. రీ కరెక్షన్‌లో మీ అమ్మాయి పాసైందని, ఎస్‌ఎస్íసీ సరి్టఫికెట్ తీసుకెళ్లండని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment