revaluation
-
తొలుత ఫెయిల్.. రీవాల్యుయేషన్లో 90% మార్కులు
దుండిగల్: పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురతున్నారు. వా ల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాం«దీనగర్‌లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్డపడ్డానని, 9.5 గ్రేడ్ సా«ధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యా న్ని నింపారు.తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్ట్‌కు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్టెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రీవాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కు లు వచ్చాయి.9.3 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఎగ్జామినర్లదే తప్పు..పదవ తరగతి జవాబు పత్రాలను ముగ్గురు అధికారులు దిద్దుతారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అస్టిసెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలకు మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచి్చన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపరును దిద్దిన ముగ్గురు అధికారులూ అజాగ్రత్తగా వ్యవహరించారు.రీ వ్యాలుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిచారు. రీ కరెక్షన్లో మీ అమ్మాయి పాసైందని, ఎస్ఎస్íసీ సరి్టఫికెట్ తీసుకెళ్లండని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు
న్యూఢిల్లీ: ఆన్సర్ షీట్లను సమర్పించాల్సిందిగా, పునర్మూల్యాంకనం చేయాల్సిందిగా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో ఆ మేరకు నిబంధనలుంటే తప్ప అలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని పేర్కొంది. విచక్షణాధికారంతో నిర్దిష్ట ఆదేశాలిచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 హైకోర్టులకు కల్పించిన అధికారాలను ఈ విషయంలో ఉపయోగించరాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు పీజీ డిప్లొమా విద్యార్థుల ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనానికి ఆదేశిస్తూ 2019లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పులను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది. -
ఇంటర్ బోర్డ్ లీల: అప్పుడు ఫెయిల్... ఇప్పుడు పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ లీల మరొకటి వెలుగులోకొచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థి రీ వ్యాల్యుయేషన్ జరిపిస్తే, ఏకంగా 31 మార్కులు తేడా వచ్చాయి. ఒకటి, అరా ఓకే కానీ, ఇన్ని మార్కుల తేడా ఎలా వచ్చిందని ఇంటర్ బోర్డ్ అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ముస్కాన్ బేగం ఈ ఏడాది మే నెలలో జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు హాజరైంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఆమెకు 741 మార్కులొచ్చాయి. జువాలజీలో 10 మార్కులే రావడంతో ఫెయిల్ అయినట్టు ఫలితం వచ్చింది. దీంతో కంగారుపడ్డ బాలిక రీ వ్యాల్యుయేషన్‌కు వెళ్లింది. పూర్తి చేసిన అనంతరం 41 మార్కులు వచ్చినట్టు తేల్చారు. అంటే 31 మార్కులు తక్కువ వేసి, ఆమెను ఫెయిల్ చేశారు. ఇంటర్ బోర్డ్ నిర్వాకం కారణంగా తాను ఇన్ని రోజులు తీవ్ర మనోవేదనకు గురయ్యాయని ముస్కాన్ తెలిపింది. రీ వ్యాల్యుయేషన్‌కు రూ.600, సప్లిమెంటరీ పరీక్షకు రూ.500 చెల్లించానని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇది కూడా భారమేనని తెలిపింది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరింది. ఘటనతో కంగుతిన్న బోర్డ్ అధికారులు పేపర్ మూల్యాంకనం చేసిన అధ్యాపకుడిపై చర్యలకు సిద్ధమయ్యారు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 5 నుంచి 10 వేలు జరిమానా, మూడేళ్లపాటు మూల్యాంకన బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న పరీక్షల విభాగంలో కొంతమంది జోక్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. -
జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యం.. అప్పుడు 0.. ఇప్పుడు 44
ముదిగొండ: ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు మెమో వచ్చిన విద్యార్థికి ఇప్పుడు ఊరట లభించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్‌తో చదివిన భద్రి గోపి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన అతడికి ఎకనామిక్స్‌లో మాత్రం సు న్నా మార్కులు వచ్చాయి. దీంతో ఎకనామిక్స్ జవాబు పత్రం రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎకనామిక్స్‌లో 44 మార్కులు వచ్చినట్లు కొత్త మెమోను బుధవారం వెబ్సైట్లో పొందు పరచడంతో గోపి ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి👇 తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
అయ్యారే అయ్యర్!
వరాహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (వి.వి.ఎస్. అయ్యర్) భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళ భారతీయ విప్లవకారుడు. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, వి.ఒ. చిదంబరం పిళ్లై వంటి వారు ఉన్నారు, వీరందరూ బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక భావాలు కలవారు. అయ్యర్ తమిళ రచయిత. ఆధునిక తమిళ చిన్న కథకు పితామహుడిగా ఆయన్ని భావిస్తారు. అయ్యర్ 1925 జూన్ 3న.. పాపనాశం జలపాతంలో మునిగిపోతున్న తన కూతురిని రక్షించే ప్రయత్నంలో తనూ చనిపోయారు. వీవీఎస్ ధీశాలి. సునిశిత దృష్టి కలిగినవారు. ఆయన లండన్‌లోని విద్యార్థి వసతిగృహం ‘ఇండియా హౌస్’ లో ఉన్నప్పుడు మహారాష్ట్రకు చెందిన కీర్తికార్ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్’లో చేరాడు. ఆ హౌస్‌లోనే రాజన్ అని అయ్యర్ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్ మీద అనుమానం వచ్చింది. కీర్తికార్ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్ తదితరులు కీర్తికార్ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్. కీర్తికార్ కణతకు రివాల్వర్ గురిపెట్టి నిలదీశారు అయ్యర్. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్. అతన్ని హౌస్‌లోనే ఉంచుకుని అతడి ద్వారా చాలాకాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు అయ్యర్ -వి.వి.ఎస్. అయ్యర్ -
సున్నా మార్కులు.. కోర్టులో పిటిషన్
ముంబై: నీట్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం గురించి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్‌ని ఫెయిల్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో విద్యార్థిని తనకు సున్నా మార్కులు వచ్చాయి.. మాన్యువల్‌గా పేపర్ కరెక్షన్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. వివరాలు..మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని వసుంధర భోజనే నీట్లో 720 మార్కులకు గాను సున్నా(0) మార్కులు సాధించినట్లు రిజల్ట్‌లో చూపించింది. కనీసం 650 మార్కులు వస్తాయని భావించిన ఆమె సున్నా మార్కులు రావడంతో షాక్‌కు గురయ్యింది. దాంతో తన పేపర్ని రీ వాల్యూయేషన్ చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (చదవండి: సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్ కాలేదు, ఎందుకు?) బొంబాయి హైకోర్టు సోమవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించి నోటీసులు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇక విద్యార్థి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ‘వసుంధర మెరిట్ స్టూడెంట్. బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. ఈ పరీక్షలో కనీసం 650 మార్కులు వస్తాయని భావించింది. కానీ సున్నా మార్కులు వచ్చాయి. ఆన్లైన్ టెస్టింగ్ విధానంలోని లోపాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. అందుకే మాన్యువల్‌గా రీవాల్యూయేషన్ చేయాలని కోరుతున్నాం’ అన్నారు. అయితే నీట్ పరీక్షలో రీవాల్యూయేషన్ చేసే విధానం లేదు. అందుకే పరీక్షకు హాజరయిన విద్యార్థులు సమర్పించిన ఓఎంఆర్ షీట్‌ను ఎన్టీఏ అప్లోడ్ చేస్తుంది, ఆన్సర్ కీ కూడా ఇస్తుంది. తమిళనాడులోని ఇద్దరు విద్యార్థులు కూదా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. -
14 తర్వాత ఎప్పుడైనా రెడీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త చట్టంతో సంబంధం లేకుండా మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులను వేగవంతం చేసింది. ఈ నెల 14 తర్వాత ఏ క్షణాన నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా పురపాలక శాఖ సూత్రప్రాయంగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 14 రోజుల్లో వార్డుల పునర్విభజన నుంచి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వరకు అన్నీ పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఏ మునిసిపాలిటీ, కార్పొరేషన్లో ఎన్ని వార్డులు చేయాలో నిర్ధారణ కాగా, ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియతోనే షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. నిర్దేశిత జనాభాకు అనుగుణంగా ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియ ఆదివారమే ప్రారంభమైంది. ఈ పునర్విభజన ప్రతిపాదనలను సోమవారం కల్లా సిద్ధం చేయాలని, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశమివ్వాలని, ఏడో తేదీ కల్లా ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 8వ తేదీ నుంచి కీలక ప్రక్రియలు వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాల తయారీపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టనుంది. ఈ మూడు ప్రక్రియలు 8వ తేదీ నుంచే ప్రారంభించి 12 కల్లా పూర్తి చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్స్టేషన్ల ఏర్పాటు, అభ్యంతరాల స్వీకరణ, తుది ప్రచురణలకు నిర్దేశిత గడువును కూడా షెడ్యూల్లో ఉంచారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత రెండ్రోజుల్లో అంటే ఈ నెల 14వ తేదీ కల్లా వార్డు మెంబర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు/మేయర్ల రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తారు. ఈ ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో మునిసిపల్ ఎన్నికల వ్యవహారాన్ని ఇక ఎలక్షన్ కమిషన్‌కు అప్పగిస్తామని ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధంగా ఉండేలా షెడ్యూల్ రూపొందించామని పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఈ నెల మూడో వారం ఆఖరు కల్లా మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది. సూత్రప్రాయంగా ఖరారు చేసిన షెడ్యూల్: 1. వార్డుల పునర్విభజన: - జూన్ 30 నుంచి జూలై1 వరకు నిర్దేశిత జనాభా ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు తయారీ - జూలై 2 నుంచి 5వ తేదీ వరకు ముసాయిదా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ - జూలై ఆరో తేదీన అభ్యంతరాల పరిష్కారం, 7న ఎన్నికల సంఘం ద్వారా వార్డుల తుది జాబితా ప్రకటన 2. వార్డుల వారీ ఓటరు జాబితాల తయారీ: - జూలై 8న వార్డుల వారీ ఓటరు జాబితాల తయారీ, 9,10 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు. - 11వ తేదీన అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది జాబితా తయారీ, 12న తుది జాబితా ప్రచురణ. 3. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు: - జూలై 8న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా తయారీ, 9,10 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు. - 11న ముసాయిదా జాబితాలు కలెక్టర్లకు అందజేత, 12న కలెక్టర్ల అనుమతితో తుది జాబితా ప్రచురణ. 4. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా తయారీ: - జూలై 8న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ముసాయిదా జాబితాల తయారీ, 9,10 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ. - 11న క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, 12న తుది ఓటర్ల జాబితా ప్రచురణ. (ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత రెండ్రోజుల్లో (14వ తేదీ కల్లా) రాష్ట్రంలోని 138 మునిసిపాలిటీలు/కార్పొరేషన్లలోని వార్డు మెంబర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. దీంతో పురపాలక శాఖ పని పూర్తవుతుంది. ఎప్పుడైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే వెసులుబాటు కలుగుతుంది) -
భవిష్యత్తులో ‘టెన్త్’ పునఃమూల్యాంకనం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల పునఃమూల్యాంకనం (రీ వ్యాల్యుయేషన్) నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కాకపోయినా, భవిష్యత్తులో అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. పునఃమూల్యాంకనం నిర్వ హించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన కోర్టు తీర్పులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాల ప్రకటనలో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అత్యంత పకడ్బందీగా పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్నారు. ఫలితాలపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జవాబు పత్రాల ఐదంచెల పరిశీలన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ గ్రేడ్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారమన్నారు. ఎవరికైనా సున్నా మార్కులొచ్చినా, గైర్హాజరని వచ్చినా, ఒక సబ్జెక్టులో ఫెయిలై మిగిలిన సబ్జెక్టుల్లో మంచి మార్కులొచ్చినా సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన నిర్వహించి ధ్రువీకరించుకున్నామన్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇలాంటి కేసులను గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజయ్ కుమార్ చెప్పారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు రోజుల ముందే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు ఫలితాలు.. ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయడంతోపాటు ఈ ఏడాది తొలిసారిగా ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు సంబంధిత పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ షీట్‌ను పంపిస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు వారి పాఠశాలకు వెళ్లి ఫలితాలను తెలుసుకోవడంతోపాటు ప్రధానోపాధ్యాయుడి నుంచి కౌన్సెలింగ్, సలహాలు పొందొచ్చని వివరించారు. పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు/ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త మొబైల్ యాప్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని యాప్‌లో ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞప్తిని టైప్ చేసి పదో తరగతి బోర్డుకు పంపొచ్చని, అలా పంపిన వారికి అక్నాలెడ్జ్మెంట్ సైతం పంపిస్తామన్నారు. -
ఒక్క మార్కు తగ్గిందని రివాల్యుయేషన్‌కి వెళితే..
బెళగావి: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 625 మార్కులకు గాను 624 మార్కులు సాధించి మిగిలిన ఒక్క మార్కు కోసం రివాల్యుయేషన్‌కు వెళ్లి 100 శాతం మార్కులు సాధించాడు ఓ కర్ణాటక విద్యార్థి. బెళగావికి చెందిన మహ్మద్ కైఫ్ ముల్లా నగరంలోని ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల ఆ రాష్ట్ర పదో తరగతి బోర్డు ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో కైఫ్‌కు 625 మార్కులకు గాను 624 మార్కులు వచ్చాయి. సైన్స్ సబ్జెక్టులో ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే రాసినా ఒక్క మార్క్ ఎలా పోయిందా? అని కైఫ్ అసంతృప్తి చెందాడు. 100 శాతం మార్కులు వస్తాయన్న ఆత్మవిశ్వాసంతో అతను రివాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశాడు. అతను అనుకున్నదే నిజమైంది. రివాల్యుయేషన్లో కైఫ్‌కు ఆ ఒక్క మార్కు కూడా కలిసి వచ్చింది. దీంతో అతను 100 శాతం మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కైఫ్ మాట్లాడుతూ.. టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఆర్ఎల్ఎస్ అనే కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతున్న కైఫ్ ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
నేడు డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఆదివారం విడుదల చేస్తున్నట్లు యూజీ డీన్ ఆచార్య జీవన్‌కుమార్ తెలిపారు. -
అగమ్య గోచరం
సాక్షి, చిత్తూరు:రాష్ట్రంలో పశువైద్య నియామకాలు అగమ్యగోచరంగా మారాయి. పబ్లిక్,ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వార పశువైద్యశాఖలోని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని వెటర్నరీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల జీతం, హోదా తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా వెటర్నరీ చదువుకున్న విద్యార్థులెవరైనా మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభిస్తుందని.. ఫలితంగా స్థానికులకు ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్, గుజరాత్‌లలో పశువైద్య నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. పీపీపీ విధానం వల్ల రాష్ట్రేతరులు బాగుపడతారని స్థానికులు నష్టపోతారని విద్యార్థిసంఘాలు అంటున్నాయి. విద్యార్థుల నుంచి ఆందోళనలు చెలరేగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గన్నవరం, చిత్తూరు ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీని కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. జోనల్ సిస్టమ్ వల్ల భర్తీ సమస్య... ప్రస్తుతం జోనల్ సిస్టమ్ వల్ల కూడా పోస్టుల భర్తీ ఆలస్యం అవుతోంది. పశువైద్య పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాకపట్నంలు ఒక జోన్‌గా, తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా రెండో జోన్‌గా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మూడో జోన్‌గా, రాయలసీమ జిల్లాలు నాలుగో జోన్‌గా విభజించారు. ఆయా జోన్లలోని ఖాళీలను అక్కడే భర్తీ చేయాల్సి ఉంటుంది. మొన్న జరిగిన బ్యాక్లాగ్ భర్తీలో కూడా ఈ జోనల్ సిస్టమ్ వల్ల కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయాయి. గుంటూరులో ఎస్సీ పశువైద్య అభ్యర్థులు ఆ పోస్టులు అలాగే మిగిలిపోయాయి. జోనల్ సిస్టమ్ ఎత్తేసి రాష్ట్రాన్ని ఒకే జోన్‌గా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరతున్నారు. జీవో నెం 474 ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి.. జీవో నెం 474 ప్రకారం పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎంసెట్ లాంటి అ«ధిక పోటీ ఉన్న పరీక్షలో ఉత్తమర్యాంకులు సాధించి సీటు సాధించుకున్నామని.. పాఠ్యాంశాలు కూడా అంత సులభంగా ఉండవని.. ఇన్ని దాటుకొని మళ్లీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకోవాలంటే కష్టంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. ఒక వేళ పరీక్షకు ఒప్పుకున్నా ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియామకాలకు ఒక రోస్టర్ విధానమంటూ లేని ఏపీపీఎస్సీపై నమ్మకం లేదని విద్యార్థులు చెబుతున్నారు. జీవో నెం 474 ప్రకారం అయితే అకడమిక్‌లో మంచి ర్యాంక్‌లు ఉన్నవారికి వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీవో ప్రకారం పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ అవసరం లేదు. నేడు విజయవాడ వెటర్నరీ డైరెక్టరేట్ ముట్టడి.. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరంలోని పశువైద్యకళాశాల విద్యార్థులు విజయవాడ లబ్బీపేటలోని వెటర్నరీ డైరెక్టరేట్‌ను శుక్రవారం ముట్టడించాలని నిర్ణయించారు. దీనికి సుమారు 350 మంది విద్యార్థులు రానున్నారు. -
19+251/2=26
టెన్త్ మూల్యాంకనలో ఇదీ మార్కుల కూడిక.. 10/10 గ్రేడు కోల్పోయిన విద్యార్థిని రీవాల్యుయేషన్లో బయటపడ్డ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కంభం: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో మార్కుల కూడిక తప్పుతో ఒక విద్యార్థిని తీవ్రంగా నష్టపోయింది. 20 మార్కులు తక్కువ వేయడంతో ఆమె గ్రేడ్ తగ్గిపోవడమేగాక ట్రిపుల్‌ఐటీలో అవకాశం కూడా కోల్పోయింది. మళ్లీ పరిశీలించినా అధికారులు ఆ తప్పును పట్టుకోలేకపోయారు. ప్రకాశం జిల్లా కంభంకు చెందిన షేక్ అబ్దుల్‌గఫూర్ కుమార్తె షేక్ రేష్మాభాను స్థానిక వాసవీ విద్యానికేతన్‌లో 2015-16 సంవత్సరంలో చదివి 1616143584 నంబరుతో పరీక్షలు రాసింది. ఫలితాల్లో 9.5 గ్రేడు సాధించింది. అన్ని సబ్జెక్టుల్లో 10కి 10 గ్రేడు రాగా ఇంగ్లిష్‌లో 7 జీపీఏ మాత్రమే వచ్చింది. దీంతో బాలిక తండ్రి రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేశారు. విద్యార్థిని జవాబు పత్రాలు పరిశీలించిన ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ‘నో చేంజ్‘ అని పంపించారు. బోర్డు వారు పంపించిన నకలు సమాధాన పత్రాలను పరిశీలిస్తే కూడిక తప్పు వల్ల విద్యార్థిని 20 మార్కులు కోల్పోయినట్టు స్పష్టమైంది. ఇంగ్లిష్ పార్టు-బి (బిట్‌పేపర్)లో 14, 15 నంబరు ప్రశ్నలకు సమాధానాలు అన్ని కరెక్టుగా రాసినప్పటికీ 5 మార్కులు వేయాల్సి ఉండగా 4 వేశారు. ఇంగ్లిష్ పేపర్ పార్టు-ఎ లో19 మార్కులు, పార్టు-బిలో 25 1/2 మార్కులు వచ్చాయి. ఈ రెండూ కలిపి 46 మార్కులు రావాల్సి ఉండగా 26 మార్కులు మాత్రమే వేశారు. దీంతో గ్రేడ్ తగ్గిపోయింది. అధికారుల తప్పు వల్ల నష్టపోయిన తనకు న్యాయం చేయాలని రేష్మాభాను విజ్ఞప్తి చేస్తోంది. మార్కుల కూడికలో తప్పు వల్ల తన కుమార్తె ప్రతిభ అవార్డుకు దూరమైందని, ట్రిపుల్‌ఐటీలో సీటు దక్కలేదని రేష్మాభాను తండ్రి అబ్దుల్‌గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పోరాడి గెలిచిన ఇంటర్ విద్యార్థిని
- పునర్మూల్యాంకనం ద్వారా న్యాయం - రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానాన్ని సొంతం చేసుకున్న శిరీష సిద్దిపేట టౌన్: ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం ఓ పేద విద్యార్థినికి రాష్ట్ర స్థాయి స్థానాన్ని దూరం చేసింది. అయినా ఆ విద్యార్థిని పోరాడి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జవాబు పత్రాలు పునర్ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుని విజయం సాధించింది. రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. మెదక్ జిల్లా సిద్దిపేటలోని మాస్టర్ మైండ్స్ కళాశాలకు చెందిన శిరీష.. ఇటీవల వెలువడిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో బైపీసీలో 433 మార్కులు సాధించింది. తనకు తక్కువ మార్కులు వచ్చాయని భావించిన ఆమె రీ వెరిఫికేషన్ కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. స్పందించిన అధికారులు శిరీష జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేయగా అదనంగా రెండు మార్కులు వచ్చాయి. దీంతో మొత్తం 435 మార్కులు సాధించిన ఆమె రాష్ట్ర స్థాయిలో రెండోస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరింది. రాష్ట్రంలో రెండోస్థానాన్ని సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది. కళాశాల కరస్పాండెంట్, అధ్యాపకులు ఆమెను అభినందించారు. -
ఎస్సై ప్రిలిమ్స్ రీవాల్యుయేషన్ గడువు పెంపు
హైదరాబాద్: సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్ష జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గడువు పెంచింది. ప్రిలిమినరీ పరీక్ష జవాబు పత్రాలలో అభ్యంతరాలు ఉన్న వారు రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 12 వరకు గడువు పెంచుతూ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష తుది ఫలితాలను ఏప్రిల్ 28న రిక్రూట్‌మెంట్‌బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా బోర్డు వెబ్సైట్లో ఉంచింది. వీటిపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరోసారి రీవాల్యుయేషన్ చేసుకోవడానికి బోర్డు అవకాశం కల్పించింది. వాస్తవానికి మే 5తో గడువు ముగియడంతో తాజాగా 12వరకు పెంచింది. రీవాల్యుయేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంఏ, ఎంఎస్డబ్ల్యు( మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) , ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ కోర్సుల పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేశామని దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సి రమేష్‌బాబు తెలిపారు. ఫలితాలను http://www.anucde.info/www.anucde.com వెబ్సైట్ల ద్వారా పొందవచ్చు. -
ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు
శ్రీనగర్: పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, క్లాస్ టాపర్ అని తేలడం విషాదాన్ని నింపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో టెక్నికల్ బోర్డు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ తెలివైన విద్యార్థి ఉసురు తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే శ్రీనగర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మొహమ్మద్ అద్నాన్ (17) చాలా తెలివైన విద్యార్థి. ఫిజిక్స్ అంటే అతనికి ప్రాణం. కానీ తనకెంతో ఇష్టమైన ఫిజిక్స్ పరీక్షలో ఫెయిల్ అయినట్టు, కేవలం 28 మార్కులు మాత్రమే వచ్చినట్టుగా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అద్నాన్ అవమాన భారంతో కుంగిపోయాడు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తరువాత అతని శవం నదిలో తేలడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన కొడుకు ఫిజిక్స్ పరీక్ష చాలా బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో... తండ్రి హిలాల్ అహ్మద్ గిల్కర్ ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేయలేదు. పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎంతో ప్రతిభావంతుడైన తన కొడుకు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదని, ఎక్కడో తప్పు దొర్లిందని భావించారు. రీవాల్యుయేషన్ కోసం టెక్నికల్ బోర్డుకు లేఖ రాశారు. అయితే ఆ వాల్యుయేషన్‌లో అద్నాన్ పాస్ అవ్వడమే కాదు...48 అత్యధిక మార్కులు సాధించాడు. ఫస్ట్ సెమిస్టర్ లో 70 శాతం మార్కులతో క్లాస్‌లో టాపర్‌గా నిలిచాడు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నాలుగు నెలల తరువాత రాష్ట్ర టెక్నికల్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. తప్పయిందంటూ నాలిక్కరచుకుంది. అయితే పొరపాటు జరిగిందంటూనే మరోవైపు యూనివర్శిటీలలో ఇలాంటి తప్పులు జరగడం మామూలే అని బోర్డు వ్యాఖ్యానించడంపై హిలాల్ అహ్మద్ గిల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులే తన కొడుకును హత్య చేశారని అద్నాన్ తండ్రి ఆరోపిస్తూ, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. -
మార్కుల తగ్గుదలపై విద్యార్థుల ఆగ్రహం
అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షల రీవాల్యుయేషన్లో మార్కులు తగ్గడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆనంద్‌ను ఘెరావ్ చేశారు. సంఘటన వివరాల ప్రకారం.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు సంబంధిత సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు రావడంతో 70 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఫలితాల్లో అందరినీ ఫెయిల్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన మార్కుల కంటే తక్కువ మార్కులు నమోదు చేసి చూపించారని ఆరోపించారు. రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోమారు రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు కావడంతో దరఖాస్తు గడువు పెంచాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్యను కోరారు. రీవాల్యుయేషనలో అక్రమాలు జరిగాయని రిజిస్ట్రార్‌తో వాగ్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, కె.మల్లిఖార్జున, చిన్న శంకర్‌నాయక్, బంగారప్ప, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ రీవాల్యుయేషన్‌కు వెల్లువెత్తిన దరఖాస్తులు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతేడాది ఇందుకోసం దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఆ సంఖ్య 53,835కు చేరుకుంది. రీవాల్యుయేషన్ కోసం మొత్తం 45,414 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్క కెమిస్ట్రీలోనే ఎక్కువ మంది (13,767) దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత ఫిజిక్స్, మ్యాథ్స్ 2బీలో ఎక్కువ మంది ఉన్నారు. రీ కౌంటింగ్ కోసం 8,421 మంది దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉండటం, ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్కులు కీలకం కానుండటం, ఎంసెట్‌లోనూ ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న నేపథ్యంలో ఈసారి రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. కాగా, ఈనెల 25 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఆలోగా ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారా? లేదా? అనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. పధాన సబ్జెక్టుల వారీగా వచ్చిన దరఖాస్తులు (ఫస్టియర్) సబ్జెక్టు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఇంగ్లిష్ 1,715 357 మ్యాథ్స్1ఎ 1,436 320 మ్యాథ్స్1బి 1,281 267 బోటనీ 464 103 జువాలజీ 454 89 ఫిజిక్స్ 1,298 302 కెమిస్ట్రీ 1,929 372 కామర్స్ 121 60 మొత్తం 8,698 1,870 సెకండియర్‌లో.. రీవాల్యుయేషన్ రీ కౌంటింగ్ ఇంగ్లిష్ 5,838 1,204 మ్యాథ్స్2ఎ 1,331 342 మ్యాథ్స్2బి 3,916 747 బోటనీ 752 146 జువాలజీ 1,238 199 ఫిజిక్స్ 6,156 1,119 కెమిస్ట్రీ 13,767 1,719 కామర్స్ 342 94 మొత్తం 33,340 5,570