హైదరాబాద్: సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్ష జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గడువు పెంచింది. ప్రిలిమినరీ పరీక్ష జవాబు పత్రాలలో అభ్యంతరాలు ఉన్న వారు రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 12 వరకు గడువు పెంచుతూ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పరీక్ష తుది ఫలితాలను ఏప్రిల్ 28న రిక్రూట్‌మెంట్‌బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. వీటిపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరోసారి రీవాల్యుయేషన్ చేసుకోవడానికి బోర్డు అవకాశం కల్పించింది. వాస్తవానికి మే 5తో గడువు ముగియడంతో తాజాగా 12వరకు పెంచింది. రీవాల్యుయేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సై ప్రిలిమ్స్ రీవాల్యుయేషన్ గడువు పెంపు
Published Fri, May 6 2016 8:56 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement