హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతేడాది ఇందుకోసం దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఆ సంఖ్య 53,835కు చేరుకుంది. రీవాల్యుయేషన్ కోసం మొత్తం 45,414 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్క కెమిస్ట్రీలోనే ఎక్కువ మంది (13,767) దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత ఫిజిక్స్, మ్యాథ్స్ 2బీలో ఎక్కువ మంది ఉన్నారు. రీ కౌంటింగ్ కోసం 8,421 మంది దరఖాస్తు చేసుకున్నారు.
జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉండటం, ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్కులు కీలకం కానుండటం, ఎంసెట్‌లోనూ ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న నేపథ్యంలో ఈసారి రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. కాగా, ఈనెల 25 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఆలోగా ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారా? లేదా? అనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది.
పధాన సబ్జెక్టుల వారీగా వచ్చిన దరఖాస్తులు (ఫస్టియర్)
సబ్జెక్టు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్
ఇంగ్లిష్ 1,715 357
మ్యాథ్స్1ఎ 1,436 320
మ్యాథ్స్1బి 1,281 267
బోటనీ 464 103
జువాలజీ 454 89
ఫిజిక్స్ 1,298 302
కెమిస్ట్రీ 1,929 372
కామర్స్ 121 60
మొత్తం 8,698 1,870
సెకండియర్‌లో.. రీవాల్యుయేషన్ రీ కౌంటింగ్
ఇంగ్లిష్ 5,838 1,204
మ్యాథ్స్2ఎ 1,331 342
మ్యాథ్స్2బి 3,916 747
బోటనీ 752 146
జువాలజీ 1,238 199
ఫిజిక్స్ 6,156 1,119
కెమిస్ట్రీ 13,767 1,719
కామర్స్ 342 94
మొత్తం 33,340 5,570
ఇంటర్ రీవాల్యుయేషన్‌కు వెల్లువెత్తిన దరఖాస్తులు
Published Wed, May 14 2014 1:02 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement