హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు | SC disapproves practice of High Courts calling for answer Sheets | Sakshi
Sakshi News home page

హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు

Published Sat, Nov 5 2022 5:29 AM | Last Updated on Sat, Nov 5 2022 5:29 AM

SC disapproves practice of High Courts calling for answer Sheets - Sakshi

న్యూఢిల్లీ: ఆన్సర్‌ షీట్లను సమర్పించాల్సిందిగా, పునర్మూల్యాంకనం చేయాల్సిందిగా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో ఆ మేరకు నిబంధనలుంటే తప్ప అలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని పేర్కొంది.

విచక్షణాధికారంతో నిర్దిష్ట ఆదేశాలిచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 హైకోర్టులకు కల్పించిన అధికారాలను ఈ విషయంలో ఉపయోగించరాదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు పీజీ డిప్లొమా విద్యార్థుల ఆన్సర్‌ షీట్ల పునర్మూల్యాంకనానికి ఆదేశిస్తూ 2019లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పులను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement