PG Diploma
-
ఏడాది పీజీ కోర్సులు
సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా ఏడాది పీజీ కోర్సును పీజీ డిప్లొమా పేరుతో అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్, కరిక్యులమ్‌తో కూడిన కొత్త నిబంధనల ముసాయిదాను రూపొందించింది. ఇందులో పీజీ కోర్సులను మూడు విధాలుగా డిజైన్ చేసింది. ఏడాది, రెండేళ్ల పీజీ, సమీకృత ఐదేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లను తీసుకొస్తోంది. ఆనర్స్–రీసెర్చ్ కాంపోనెంట్‌తో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ చేసిన విద్యార్థులు రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌ను కొనసాగించవచ్చు. ఇక్కడ పీజీలో రెండో సంవత్సరం పూర్తిగా పరిశోధనపై దృష్టి సారించేలా కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. పీజీ మొదటి సంవత్సరం తర్వాత ప్రోగ్రామ్ నుంచి విద్యార్థులు వైదొలగాలి అనుకుంటే వారికి పీజీ డిప్లొమా అందిస్తుంది. ఇక సమీకృత ఐదేళ్ల బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రామ్ పెట్టాలని యూడా యూజీసీ సూచించింది. నచ్చిన సబ్జెక్ట్‌లో పీజీ నాలుగేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లో ఒక విద్యార్థి భౌతికశాస్త్రం మేజర్‌గా, ఆర్థిక శాస్త్రం మైనర్ సబ్జెక్టుగా తీసుకుంటే.. కొత్త విధానం ప్రకారం ఈ విద్యార్థి మేజర్, మైనర్లో దేనిలోనైనా పీజీలో చేరవచ్చు. మరోవైపు ఒకేసారి రెండు పీజీ కోర్సులు అభ్యసించే సౌలభ్యాన్ని కూడా యూజీసీ కలి్పస్తోంది. ఇందు కోసం ఆన్లైన్/ఆఫ్‌లైన్/దూరవిద్య లేదా ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్లతో ఏర్పడిన హైబ్రీడ్ విధానాల్లో చదువుకునేలా ప్రతిపాదించింది. మెషిన్ లెర్నింగ్, మల్టిడిసిప్లినరీ ఫీల్డ్ వంటి కోర్ ఏరియాలలో కృత్రిమ మేధ కాంబినేషన్లో వ్యవసాయం, వైద్యం, న్యాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందించాలని సిఫార్సు చేసింది. ఇక స్టెమ్ సబ్జెక్టులు అభ్యసించిన విద్యార్థులు సైతం ఎంఈ, ఎంటెక్ వంటి సాంకేతిక డిగ్రీల్లో ‘ఏడాది పీజీ’లో చేరేందుకు అర్హులని ప్రకటించింది. ఈ అంశాలపై వివిధ వర్గాలు, పౌరుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నట్టు యూజీసీ తెలిపింది. -
పీజీ వైద్యురాలి కలలు భగ్నం
కోలారు: చదువుల ఒత్తిడి, వేధింపులను తట్టుకోలేక మెడిసిన్ పీజీ విద్యార్థిని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కోలారు తాలూకాలోని నరసాపురం వద్ద ఉన్న క్వారీ నీటి గుంతలో పడి ఆత్మహత్య చేసుకుంది. బళ్లారి నగరానికి చెందిన దర్శిని (25) మృతురాలు. వివరాలు.. దర్శిని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోట వద్ద ఉన్న ఎంవిజి మెడికల్ కళాశాలలో పీడియాట్రిక్ (పిల్లల వైద్యం)లో ఎండీ కోర్సు చదువుతోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కళాశాల నుంచి బయలుదేరి కోలారు తాలూకా కెందట్టి వద్ద ఉన్న క్వారీ నీటి గుంత వద్దకు చేరుకుంది. చివరిసారిగా తన స్నేహితుడు మణి అనే వ్యక్తికి ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడింది. తాను చనిపోతున్నట్లు అతనికి చెప్పింది. తరువాత చెప్పులు, ఫోన్‌ను గట్టున పెట్టి క్వారీ నీటి గుంతలో దూకింది. మరోవైపు మణి ఈ విషయాన్ని అందరికి చెప్పి అక్కడికి వెళ్లాలని చెప్పాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి శవమై తేలింది. విపరీతమైన పని ఒత్తిడి? చదువులో ప్రతిభావంతురాలైన దర్శిని ప్రభుత్వ కోటాలోనే ఎండీ సీట్ దక్కించుకుంది. ఏడాది కిందట తండ్రిని కోల్పోయిన దర్శినికి తల్లి ఉంది. ఊళ్లో ఆస్పత్రి పెట్టి ప్రజలకు సేవ చేయాలని తలచేది. కానీ మెడికల్ కళాశాలలో రోజులో 24 గంటలూ తమతో పని చేయించుకుంటున్నారని, విశ్రాంతి అనేదే లేదని తన స్నేహితుని వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాలలోని సీనియర్ వైద్యుడు మహేష్ దర్శినిని వేధించేవాడని ఆమె బంధువులు శ్రీనివాస్, హనుమంతప్పలు ఆరోపించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి మృతదేహాన్ని వెలికితీసి సోమవారం ఎంవీజీ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేధించడం వల్లనే: చిన్నాన్న మృతురాలి చిన్నాన్న శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల డాక్టర్ కావాలని మా అన్న కూతురు దర్శిని పీడియట్రిక్ ఎండీ చేస్తోంది. దర్శినిది చిన్న పిల్లల మనసత్త్వం. సీనియర్ వైద్యుల వేధింపుల వల్లనే దర్శిని నీటిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీనికి మెడికల్ కళాశాలనే బాధ్యత వహించాలి, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరాడు. -
పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను శనివారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. సీతారామారావు ఆవిష్కరించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయని డీన్ ఆనంద్ పవార్ పేర్కొన్నారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 10 అని వెల్లడించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇ. సుధారాణి, షకీలా ఖానం, వడ్డాణం శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు. -
హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు
న్యూఢిల్లీ: ఆన్సర్ షీట్లను సమర్పించాల్సిందిగా, పునర్మూల్యాంకనం చేయాల్సిందిగా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో ఆ మేరకు నిబంధనలుంటే తప్ప అలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని పేర్కొంది. విచక్షణాధికారంతో నిర్దిష్ట ఆదేశాలిచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 హైకోర్టులకు కల్పించిన అధికారాలను ఈ విషయంలో ఉపయోగించరాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు పీజీ డిప్లొమా విద్యార్థుల ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనానికి ఆదేశిస్తూ 2019లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పులను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది. -
న్యాయశాస్త్రంలో పీజీ డిప్లొమా నోటిఫికేషన్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 6 పీజీ డిప్లొమా సాయంకాలం (6 నుంచి 8 గం. వరకు) కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాల వ్యవధితో 2సెమిస్టర్ పరీక్షలు గల ఈ పీజీ డిప్లొమా ప్రవేశాలకు 2022, జనవరి 2న ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికోసం ఈనెల 11 నుంచి నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీ క్యాంపస్‌లో కాలేజీతోపాటు బషీర్‌బాగ్ పీజీ న్యాయ కళాశాలలో సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్), మోడ్రన్ కార్పొరేట్ లా, అప్లైడ్ హ్యూమన్ రైట్స్ పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కన్వీనర్ అపర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు 81066 78887కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. -
ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం.. 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు ► పీజీ ప్లొమా ఇన్ జర్నలిజం(పీజీడీజే)– కోర్సు కాల వ్యవధి 12 నెలలు. ► డిప్లొమా ఇన్ జర్నలిజం(డీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ► డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(డీటీవీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ► సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం(సీజే)–కోర్సు కాల వ్యవధి మూడు నెలలు. ► విద్యార్హత: సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం కోర్సుకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా కోర్సులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ► ప్రవేశ విధానం: ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్ గాను, కరస్పాండెన్స్ (దూర విద్య) విధానంలోనూ చేయొచ్చు. ఆన్లైన్ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినొచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో కళాశాల వెబ్సైట్ (www.apcj.in) ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ► దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021 ► అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 14.08.2021 ► వెబ్సైట్: www.apcj.in -
మళ్లీ రెండేళ్ల పీజీ డిప్లొమా
న్యూఢిల్లీ: జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పీజీ డిప్లొమాను పునరుద్ధరించింది. నీట్–పీజీ పరీక్ష పాస్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థులను ఈ కోర్సుల్లో చేర్చుకుంటారు. ఈ డిప్లొమా కోర్సులు ప్రారంభించాలంటే, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) నుంచి అక్రెడిటేషన్ తీసుకొన్న, కనీసం 100 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆరోగ్య శాఖ కింద పనిచేసే ఎన్బీఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎనిమిది ప్రధాన విభాగాల్లో రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించనుంది. అనస్తీషియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫ్యామిలీ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, ఈఎన్టీ, టీబీ, హృద్రోగ సంబంధిత కోర్సుల్లో పీజీ డిప్లొమా ప్రవేశ పెట్టనున్నారు. 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దేశంలో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ డిప్లొమా కోర్సులను డిగ్రీ కోర్సులుగా మార్చింది. ఎంసీఐ ఈ కోర్సులను రద్దు చేయడంతో ఏర్పడిన లోటును పూడ్చడానికి ఆరోగ్య శాఖ ఎన్‌బీఈని వారి పరిధిలో, డిప్లొమా కోర్సులను ప్రారంభించే అవకాశా లను పరిశీలించాల్సిందిగా కోరింది. గ్రామీణ, చిన్న పట్టణాలలో ప్రజలకు వైద్యమందిస్తోన్న ఆసుపత్రులకు వైద్య సిబ్బందిని అందించే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఎన్బీఈ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పవనేంద్ర లాల్ చెప్పారు. నీతి ఆయోగ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య శాఖతో వివిధ దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ పీజీ డిప్లొమా కోర్సులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. -
జర్నలిజంలో పీజీ డిప్లొమాకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుకు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులై, 2016 ఏప్రిల్ 6 నాటికి 30 ఏళ్ల వయసు మించని వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫిబ్రవరి 22 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 దరఖాస్తు ఫీజును కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి ప్రచురణ కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హతలు, శిక్షణ, శిక్షణ భృతి తదితర వివరాల కోసం www.sakshischoolofjournal sim.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 040-23386957 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. -
ఓయూసెట్‌లో 93.98 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పీజీ, పీజీడిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2015 ఫలితాలు వెల్లడయ్యాయి. ఉస్మానియా వర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ సోమవారం వీటిని విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 16 వరకు నిర్వహించిన ఓయూసెట్‌కు 88,417 మంది హాజరుకాగా.. ఇందులో 83,098 మంది (93.98 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 52 సజ్టెక్టులకు గాను 44 సబ్జెక్టులకు మాత్రమే పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. కాగా ఎంపీఈడీ కోర్సు ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కన్నడ, పర్షియన్, తమిళ్, మరాఠి తదితర సబ్జెక్టుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో రావడంతో పరీక్ష నిర్వహించలేదు. ఆ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న అందరికీ నేరుగా అడ్మిషన్లు కల్పించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో భాగంగా వచ్చే నెల 8 లేదా 9 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హత పత్రాలతోపాటు తప్పనిసరిగా ర్యాంకు కార్డు తీసుకెళ్లాలని, లేకుంటే అనుమతించబోమని స్పష్టం చేశారు. -
జర్నలిజంలో పీజీ డిప్లొమా
జర్నలిజంలో ఉజ్వల భవిత కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహిక యువతకు ‘సాక్షి’ స్వాగతం పలుకుతోంది. పాత్రికేయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి సదవకాశం కల్పిస్తోంది. జర్నలిజంలో పీజీ డిప్లొమా ప్రవేశాలకు తాజాగా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్జే) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు.. అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత 01-08-2015 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్‌సపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు; రెండో పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, కరెంట్ అఫైర్‌సపై వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ: అర్హత సాధించిన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణ ఇస్తా రు. ఇందులో పత్రికలో పనిచేయడానికి అవసరమైన తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎడిటింగ్, రిపోర్టింగ్, అనువాదం, వర్తమాన వ్యవహారాలు నేర్పిస్తారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు : www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు: 10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఫలితాలు: 11-05-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి తరగతులు ప్రారంభం: 01-06-2015 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం. నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా) ఏప్రిల్ 12న సాక్షి మాక్ ఎంసెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో.. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ టాప్ -10 ర్యాంకర్స్‌కు నగదు బహుమతులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సాక్షి మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) - చిత్తూరు.. ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్ కాగా, సెంట్రల్ ఆంధ్రా రీజినల్ స్పాన్సర్‌గా నలందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గుంటూరు) వ్యవహరిస్తోంది. మే నెలలో జరుగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజుల ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా.. తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు. ప్రశ్నపత్రాలను విశేష అనుభవం కలిగిన నిపుణుల బృందం రూపొందిస్తున్నందున విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలవుతుంది. దీంతోపాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్స్‌కు నగదు బహుమతులుంటాయి. దరఖాస్తులను మార్చి 12 నుంచి అన్ని సాక్షి ఆఫీసుల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని వస్తే వెంటనే హాల్ టికెట్ పొందొచ్చు. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మాక్ ఎంసెట్ గురించి ఏవైనా సందేహాలుంటే.. 040 -23256138కు ఫోన్ చేయొచ్చు. -
చక్కని కెరీర్‌కు ఆలంబన
దేశ ప్రగతిలో ఆర్థిక రంగానిది కీలకపాత్ర.. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో విస్తరిస్తున్న వాణిజ్యం, వ్యాపారం ఎన్నో అవకాశాలకు కేంద్ర స్థానంగా నిలుస్తోంది.. అదే సమయంలో సుశిక్షితులైన మానవ వనరుల కొరతను ఈ రంగం ఎదుర్కొంటుంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సంబంధిత రంగాలకు కావల్సిన నిపుణులు అందించే ఉద్దేశంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తదితర సంస్థలు సర్టిఫికెట్ నుంచి పీజీ డిప్లొమా స్థాయి కోర్సులకు రూపకల్పన చేశాయి.. చక్కని కెరీర్‌కు ఆలంబనగా నిలుస్తున్న ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్ ఉద్యోగాలు అందుకోవచ్చు.. వాటి వివరాలు.. బాంబే స్టాక్ ఎక్సే ఛంజ్ (బీఎస్ఈ) కోర్సులు: గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కాల వ్యవధి: 29 నెలలు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్స్ కాల వ్యవధి: 12 నెలలు (డిస్టెన్స్ విధానంలో) పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ జర్నలిజం సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ క్యాపిటల్ మార్కెట్స్ (జమన్‌లాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సహకారంతో) కాల వ్యవధి: 10 వారాలు. బోధించే అంశాలు: ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిమ్యాట్, డిపాజిటర్స్, ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్స్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీస్ లా, ఫైనాన్స్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అవకాశాలు: కోర్సు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, రీసెర్చ్ ఫర్మ్స్, బ్రోకింగ్ ఫర్మ్స్, సంబంధిత సంస్థల్లో బిజినెస్ ఎనలిస్ట్, ఇన్వెస్ట్మెం ట్ బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, క్యాపిటల్ మా ర్కెట్ మేనేజర్, రిస్క్ మేనేజర్, రెగ్యులేషన్ మేనేజ ర్ తదితర హోదాలతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. వెబ్సైట్: www.bseindia.com క్రిసిల్ (CRISIL) క్రిసిల్ సర్టిఫైడ్ ఎనలిస్ట్ ప్రోగ్రామ్ (సీసీఏపీ) కాల వ్యవధి: రెండేళ్లు బోధించే అంశాలు: ఇది ఎంట్రీ లెవల్, వర్క్ కమ్ స్టడీ ప్రోగ్రామ్. ఇందులో ఫైనాన్స్‌కు సంబంధించి 24 రకాల సబ్జెక్టులను బోధిస్తారు. తద్వారా ఫైనాన్షియల్ రంగాన్ని సమగ్రంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్/ ఎక్స్‌ఏటీ లేదా క్రిసిల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవకాశాలు: కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు క్రిసిల్ సంస్థ మేనేజ్మెంట్ ట్రైనీలుగా నియమించుకుంటుంది. ఈ సమయంలో వీరికి రూ. 6 లక్షల వార్షిక వేతనాన్ని చెల్లిస్తారు. అంతేకాకుండా కోర్సు చేస్తున్న సమయంలో.. మొదటి సంవత్సరం రూ. 1.25 లక్షలు, రెండో సంవత్సరం 2.25 లక్షల వార్షిక వేతనం ఇస్తారు. వెబ్సైట్: www.crisil.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్సు ప్రత్యేకత: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులో సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తిచేయలేను అని అనుకుంటే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. అవకాశాలు: ఈ సర్టిఫికెట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలలో అకౌంటెంట్‌గా చేరి నెలకు రూ. 25,000 వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత పొంది తర్వాత ఫైనల్ రాసి చార్టర్డ్ అకౌంటెంట్ హోదాను పొందొచ్చు. వెబ్సైట్: www.icai.org ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సులు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ బ్యాంకింగ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సేల్స్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ సేల్స్ మేనేజ్మెంట్ ఎన్ఎస్ఈ సర్టిఫైడ్ క్యాపిటల్ మార్కెట్ ప్రొఫెషనల్ కాశాలు: ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, జెన్‌ప్యాక్ట్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటి సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీరికి ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, కస్టమర్ ఆక్విజషన్స్, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, వెల్త్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్,ఫోన్ బ్యాంకింగ్, క్లైమ్స్ ఎగ్జామినర్స్, ఆడిటర్స్ వంటి హోదాలతో కెరీర్ ప్రారంభించవచ్చు. వెబ్సైట్: www.ifbi.com నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం)ను స్థాపించింది. వ్యవధి: 12 నెలలు అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ బోధించే అంశాలు: సెక్యూరిటీ మార్కెట్లలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి సరిపోయే కోర్సు. ఇందులో ఫండ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్, సేల్స్/ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ తదితర అంశాలను బోధిస్తారు.అవకాశాలు: ఫండ్ మేనేజర్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, సేల్స్ మేనేజర్స్, బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి హోదాల్లో సెక్యూరిటీ మార్కెట్లు, సంబంధిత సంస్థల్లో కెరీర్ ప్రారంభించవచ్చు. సర్టిఫికెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సెక్యూరిటీస్ రీసెర్చ్ ఫర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫెన్షన్ ఫండ్ తదితరాల్లో అవకాశాలు ఉంటాయి.సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సెక్యూరిటీ లా తోపాటు కరెన్సీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ తదితరాల్లో షార్ట్ టర్మ్ కోర్సులను కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అందిస్తోంది. వెబ్సైట్: www.nism.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) కోర్సులు: ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా రిస్క్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్ అర్హత: గ్రాడ్యుయేషన్. ఎంచుకున్న కోర్సును అనుసరించి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ), రిజర్వ్ బ్యాంక్, స్టాక్ ఎక్స్ఛేంజ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకింగ్ హౌసెస్లలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అవకాశాలు: ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకింగ్ హౌసెస్, స్టాక్ ఎక్స్ఛేంజ్, రేటింగ్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్షన్స్ తదితరాలు అవకాశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. వెబ్సైట్: www.iirmworld.org.in నేషనల్ స్టాక్ ఎక్సే ్ఛంజ్ (ఎన్ఎస్ఈ) కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. కాల వ్యవధి: 12 నెలలు.ఈ కోర్సును నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్ఎం) సహకారంతో నిర్వహిస్తుంది. థియరీతోపాటు సంబంధిత నైపుణ్యాలపై ప్రాక్టికల్ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, ఫైనాన్షియల్ సెంటర్స్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత సాఫ్ట్‌వేర్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్/ మ్యాట్/ ఎక్స్‌ఏటీ స్కోర్ ఉండాలి. లేదా ఎన్ఐఎఫ్ఎం-ఎన్ఎస్ఈ నిర్వహించే అన్లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ దశల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వెబ్సైట్: www.nseindia.com -
ప్రవేశాలు
రచన జర్నలిజం కళాశాల హైదరాబాద్‌లోని రచన జర్నలిజం కళాశాల దూర విద్య విధానంలో నిర్వహిస్తున్న జర్నలిజం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సులు:పీజీ డిప్లొమా అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సర్టిఫికెట్ కోర్సు అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. దరఖాస్తు: దరఖాస్తు కోసం రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్‌ను ‘రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్’ పేరిట తీసి కింది చిరునామాకు పంపాలి. చిరునామా: రచన జర్నలిజం కళాశాల, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ క్యాంపస్, దీపక్ థియేటర్ పక్క వీధి, నారాయణగూడ, హైదరాబాద్ - 500 029 ఫోన్: 040-23261335, మొబైల్: 99596 40797 చివరి తేది: ఆగస్టు 20 విదేశీ విద్య తెలంగాణ షెడ్యూల్డ్ కులాలఅభివృద్ధి శాఖ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్లలోని విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్/ ఇంజనీరింగ్/ ఫార్మసీ/ నర్సింగ్/ ప్యూర్ సెన్సైస్/ హ్యుమానిటీస్/ సోషల్ స్టడీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ కులాలవారే దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల రూపాయలకు మించకూడదు. విదేశాల్లో పీజీ కోర్సులను కొనసాగించడానికి గ్రాడ్యుయేషన్‌లో, పీహెచ్డీ కొనసాగించడానికి పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5 వెబ్సైట్:www.epass.cgg.gov.in