
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను శనివారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. సీతారామారావు ఆవిష్కరించారు.
కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉన్నాయని డీన్ ఆనంద్ పవార్ పేర్కొన్నారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 10 అని వెల్లడించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇ. సుధారాణి, షకీలా ఖానం, వడ్డాణం శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment