Brochure
-
పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను శనివారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. సీతారామారావు ఆవిష్కరించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయని డీన్ ఆనంద్ పవార్ పేర్కొన్నారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 10 అని వెల్లడించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇ. సుధారాణి, షకీలా ఖానం, వడ్డాణం శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు. -
నైట్వుడ్స్ బ్రోచర్ లాంచింగ్
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ విల్లాల నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్.. మరొక అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం జూబ్లీ్లహిల్స్లోని ప్రణీత్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో నైట్వుడ్స్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. జీహెచ్ఎంసీ అనుమతి పొందిన గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ నైట్వుడ్స్. బీరంగూడలో 30 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 459 ప్రీమియం విల్లాలుంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు తెలిపారు. 150 నుంచి 213 గజాలలో, 1,800–2,441 చ.అ. బిల్టప్ ఏరియాలో విల్లా విస్తీర్ణాలు ఉంటాయి. ధర చ.అ.కు రూ.7,500. నైట్వుడ్స్ ప్రణీత్ గ్రూప్ నుంచి వస్తున్న 25వ ప్రాజెక్ట్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కేవీఎస్ నర్సింగరావు, పీ రామాంజనేయ రాజు, చంద్రశేఖర్ రెడ్డి బక్కిరెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి సప్పిడి, సందీప్‌రావ్ మాధవరంలు పాల్గొన్నారు. -
నవరాత్రుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : దుర్గ గుడి ఉత్సవాలపై కలెక్టర్ ఇంతియాజ్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరాత్రులకు సంబంధించిన బ్రోచర్‌ని మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవాలకు సంబంధించి జాబ్ కార్డులు తయారుచేసి ఆయా డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రతకు సంబంధించి ఎన్సీసీ నుంచి 2వేల మందిని నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేశ్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యపై జాతీయ సెమినార్
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్‌సెల్ (ఐక్యూఏసీ) ఆధ్వర్యంలో ‘క్వాలిటీ ఎడ్యుకేషన్– ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై ఈనెల 18, 19వ తేదీల్లో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ ఎం.అరుణ తెలిపారు. సెమినార్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(నాక్) ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన సెమినార్ బ్రోచర్‌ను శుక్రవారం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సెమినార్లో అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించారు. ఉన్నత విద్య, నాణ్యత ప్రమాణాలు, 21వ శతాబ్దపు అవసరాలు లాంటి అంశాలపై చర్చలు విస్తృతంగా జరగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ కె.రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్వానం దుమారం!
♦ దేవగుడి సోదరుల కరపత్రంపై టీడీపీలో అలజడి ♦ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలుగుతమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కడప: ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు కోపం’అన్న చందంగా దేవగుడి సోదరుల కరపత్రం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. జమ్మలమడుగులో బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమనికి కార్యకర్తలు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఫొటోలు ముద్రించి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ తరుఫున ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈవైనం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి రేపింది. దేవగుడి సోదరులకు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫొటోలు లేకుండా కేవలం వారి ఫొటోలు మాత్రమే ముద్రించి కరపత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ కొందరు నేతలు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని అరువు నేతలను తెచ్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని, అధిష్టానం ఇప్పటికైనా మేల్కోవాలని ఆ ఫిర్యాదులో శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. -
సీఎస్బీఎఫ్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఐసీఎస్ఐ
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) తాజాగా ‘కంపెనీ సెక్రటరీస్ బెనవలెంట్ ఫండ్ (సీఎస్బీఎఫ్) బ్రోచర్‌ను ఆవిష్కరించింది. ఫండ్ కార్పస్ పెరుగుదల కోసం సభ్యులు ముందుకు రావడానికి, కార్పొరేట్ల విరాళాలకు ఈ బ్రోచర్‌ను విడుదల చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ మమతా బినాని ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి కుటుంబ ఆర్థిక భద్రతకు, వైద్య ఖర్చులకు, పిల్లల చదువుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని వివరించారు.