ఆహ్వానం దుమారం! | dont look cm and lokesh photos in tdp devagudi brothers broucher | Sakshi
Sakshi News home page

ఆహ్వానం దుమారం!

Published Wed, Jun 22 2016 2:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఆహ్వానం దుమారం! - Sakshi

ఆహ్వానం దుమారం!

దేవగుడి సోదరుల కరపత్రంపై టీడీపీలో అలజడి
అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలుగుతమ్ముళ్లు

 సాక్షి ప్రతినిధి, కడప: ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు కోపం’అన్న చందంగా దేవగుడి సోదరుల కరపత్రం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. జమ్మలమడుగులో బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి  ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమనికి కార్యకర్తలు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఫొటోలు ముద్రించి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ తరుఫున ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు.

ఈవైనం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి రేపింది. దేవగుడి సోదరులకు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫొటోలు లేకుండా కేవలం వారి ఫొటోలు మాత్రమే ముద్రించి కరపత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ కొందరు నేతలు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని అరువు నేతలను తెచ్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని, అధిష్టానం ఇప్పటికైనా మేల్కోవాలని ఆ ఫిర్యాదులో శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement