Telugu brothers
-
తమ్ముళ్ల తన్నులాట
– ఎస్ఎంసీ ఎన్నికల్లో గొడవ –రామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వర్గీయుల బాహాబాహీ –ఎన్నికలు వాయిదా మంత్రాలయం రూరల్: పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికల్లో తెలుగు తమ్మళ్లు తన్నుకున్నారు. బాహాబాహీకి దిగి మరోమారు విభేదాలను బయటపెట్టుకున్నారు. తమ్ముళ్ల తన్నులాటతో మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలూ వాయిదా పడ్డాయి. మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గతంలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం తిరిగి కమిటీ ఎన్నిక జరిపారు. ఉదయాన్నే టీడీపీ సీనియర్ నేత రామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి వర్గీయులు గుంపులుగా పాఠశాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలోకి అనుమతించారు. ఎన్నికల అధికారి జగదీష్ ఆధ్వర్యంలో 6వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఏడో తరగతి విద్యార్థి తల్లితండ్రుల వివరాలను సేకరించే సమయంలో రాజశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఐ నాగేశ్వర రావు, ఎస్ఐ సునీల్‌కుమార్ ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు. -
నీరు చెట్టు అంతా కనికట్టు
కార్యకర్తలే కాంట్రాక్టర్లు ‘నీరు–చెట్టు’ పథకంతో నిలువుదోపిడీ పనులన్నీ పచ్చ చొక్కాలకే నిబంధనలకు నీళ్లొదిలి మట్టిపనులు నిఘా లోపంతో తూతూ మంత్రంగా ముగింపు వర్షాలొచ్చి నీరు చేరినా ఆగని ‘పచ్చ’ తమ్ముళ్లు రూ.కోట్లలో నిధులు దోచుకుంటున్న వైనం సాక్షి ప్రతినిధి: శ్రీకాకుళం/పీఎన్ కాలనీ: ‘నీరు–చెట్టు’ పథకం పేరు చెబితే ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాదు జిల్లాలో దాదాపు అన్నిచోట్లా ఇంచుమిం చు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెరువుల్లో పూడిక తీయడం, వాటి గట్లు పటిష్టం చేయడం, అవసరమైన చోట చప్టాలు, కాలువలు ఏర్పాటు చేసుకోవడం ఈ పథకం లక్ష్యాలు. కానీ చాలాచోట్ల ఇందుకు విరుద్ధంగా పనులు జరిగా యి. జిల్లాలో ఈ పథకం కింద రూ.349.47 కోట్లు అంచనా వ్యయంతో 5,084 పనులకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిలో 4,997 పనులకు రూ.331.90 కోట్లతో ఆమోదం లభించింది. వాటిలో ఇప్పటివరకూ 2,250 పనులు పూర్తి అయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,263 పనులు జరుగుతున్నాయి. నిబంధనలకు ‘గండి’ వాస్తవానికి ఈ పథకం కింద చెరువుల్లో నిర్ణీత క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తీయాల్సి ఉంటుంది. ఆ మట్టితో గట్లు పటిష్టం చేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు సొమ్ము చేసుకున్నారు. చెరువుల్లో తవ్విన మట్టిని గట్లకు వేయకుండా ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెంచర్లలో స్థలాలను చదును చేయడానికి అమ్ముకొని రూ.కోట్లలోనే లాభం గడించారు. దీనివల్ల చెరువు అభివృద్ధి పనుల ద్వారా వచ్చే నిధుల కన్నా ఈ అక్రమ వ్యవహారం వల్లే ఎక్కువ కావడం గమనార్హం. వర్షాలు ప్రారంభమైన తర్వాత కూడా చాలా పనులు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు తూతూమంత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారు. అరకొర పనులకు తార్కాణాలు టెక్కలి నియోజకవర్గంలో పాత జాతీయ రహదారికి పక్కనే ఉన్న రాచబంద చెరువును అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.7 లక్షల నిధులతో ‘నీరు–చెట్టు’ పథకం కింద పనులు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో చెరువులో నీరు చేరింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని చేపట్టింది అధికార పార్టీ కార్యకర్త కాబట్టి ఎవ్వరూ అడగట్లేదు. ∙పాతపట్నం మండలంలో 34 పంచాయతీల పరిధిలో 98 పనులకు రూ. 6.50 కోట్లు విడుదలయ్యాయి. నామినేటెడ్ విధానంలో మొదటి విడతలో 45 పనులు, రెండో విడతలో మరో 53 పనులు మంజూరయ్యాయి. ఈ రెండు విడతల్లో కలిపి మొత్తం 50 పనులు మాత్రమే జరిగాయి. గుమ్మాగెడ్డలో రూ.50 లక్షలతో చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. బడ్డుమర్రి చెరువు గట్టు పనులు 15 శాతం కూడా చేయలేదు. ఈ మండలం మొత్తం మీద పనులు 20 శాతం మించకపోయినా బిల్లులు మాత్రం 80 శాతం మేర చెల్లించాలని అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కొత్తూరు మండలంలో 68 చెరువుల అభివృద్ధి పనులకు రూ.3.80 కోట్లు మంజూరయ్యా యి. ఇంతవరకు కారిగూడ, ఇరపాడు, కడు ము, మదనాపురం, ఆకులతంపర, మాతల, సిరుసువాడ గ్రామాల్లో నామమాత్రంగా జరిగాయి. ఎల్.ఎన్.పేట మండలంలోని చెరువుల్లో కొన్నేళ్లుగా ఉపాధిహామీ పథకం తవ్విన బంటాల్లోనే ఇప్పుడు నీరు–చెట్టు పథకం కింద కాస్త మెరుగులు దిద్ది బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 19 పంచాయతీల్లో మొదటి విడతలో 80 పనులకు రూ.7.35 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 15 పనులకు రూ.కోటి మంజూరైంది. హిరమండలంలో వంశధార అధికారులు 13 పనుల కోసం రూ.కోటి మంజూరైంది. పనుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దకొల్లివలస ఊర చెరువులో పనులే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆమదాలవలస మండలంలో 134 చెరువులు, 38 కాలువల్లో పనులు చేపట్టారు. సరుబుజ్జిలి మండలంలో 98 చెరువులకు రూ. 5.24 కోట్లతో ప్రతిపాదనలు పెట్టగా ఈ ఏడాది 54 చెరువుల్లో అరకొరగానే పనులు జరిగాయి. యంత్రాలతో తూతూ మంత్రంగానే చేసి గట్టెక్కేశారు. జి.సిగడాంలో స్థానిక ఎమ్మెల్యే బంధువొకరు బినామీల పేరుతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగులవలస, పెంట, సీతంపేట, గేదెలపేట, మర్రివలస ప్రాంతాల్లో జరిగిన పనుల్లో కనీస నాణ్యత లేకున్నా బిల్లులు చెల్లించేశారు. లావేరు మండలంలో మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు తాళ్లవలస, చిగురుకొత్తపల్లి గ్రామాల్లో చేపట్టిన పనుల్లో కనీసం నాణ్యత లేదు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం పెద్దచెరువలో జిల్లా పరిషత్తులో ముఖ్యనేత కుమారుడు, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టిపనుల్లో కనీసం నాణ్యత లేదని ఆరోపణలు ఉన్నాయి. కుప్పిలి, ముద్దాడ గ్రామాల్లోనూ అదే పరిస్థితి. రణస్థలం మండలంలో టీyీ పీ నాయకులు చేసిన పనుల్లో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో అవసరం లేనిచోట నీరు–చెట్టు పనులు చేశారు. రూ.7.40 కోట్లతో తలపెట్టిన 95 పనులు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కేటాయించారు. మిగతా మూడు మండలాల్లోనూ తూతూమంత్రంగానే పనులు చేసి, బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కరువు మండలమైన భామినిలో రూ.4.94 కోట్లతో 61 పనులు మంజూరయ్యాయి. చాలా చెరువుల్లో తూతూమంత్రంగానే పనులు చేసిన అధికార పార్టీ కార్యకర్తలు బిల్లుల మంజూరు కోసం పరుగులు పెడుతున్నారు. పాలకొండ మండలంలో రూ.7 కోట్లతో 92 పనులు మూడు నెలలు క్రితం చేపట్టినా 25 శాతం మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. పనుల్లో నాణ్యతా లోపాలున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పలాస మండలంలో మొత్తం 19 పనులకు రూ. 1.20 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికి 9 మాత్రమే చేపట్టారు. వర్షాలు పడడంతో అసంపూర్తిగా ఉంటుండగానే పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు చేయించుకుంటున్నారు. దీనికి నిదర్శనం పలాస మున్సిపాలిటీ 2వ వార్డులోని జయరామచంద్రపురం కుంకుమసాగరం. మందస మండలంలో మఖరజోల సంకుజోడు చెరువు, బాలిగాం కారిచెరువుల పరిస్థితి అంతే. రాజాం మండలంలో రూ.7 కోట్లతో 135 పనులు కేటాయించారు. వాటిలో చాలాచోట్ల పచ్చతమ్ముళ్లు హడావుడిగా పనులు ముగించేశారు. సంతకవిటి మండలం రామారాయపురం పంచాయతీ చింతలపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న అచ్చెమ్మకోనేరు చెరువుకు ఆయకట్టు లేకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు రూ. 3.93 లక్షలను తూతూ మంత్రంగా పనులు చేసి ఎగనామం పెట్టారు. వంగర మండలం గీతనాపల్లిలో గణపతిరాజు చెరువు ఆయకట్టు భూములు మడ్డువలస రిజర్వాయర్‌లో మునిగిపోగా ఆ చెరువు పేరుతో రూ.4.80 లక్షలు మంజూరు చేయించడం విశేషం. శివ్వాం మంగళవాని, బాగెంపేట కొండోడు చెరువు ఇలా పదుల సంఖ్యలో ఆయకట్టులేని చెరువులకు నిధులు కాజేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రేగిడి మండలంలో చాలాచోట్ల ఉపయోగం లేకున్నా రూ.9 లక్షలు చొప్పున ఖర్చుచేసి చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు. ఉపాధికి గండి వలసలను నివారించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ఇన్నాళ్లూ అమలు చేశారు. దీంతో ప్రతి గ్రామంలో ఏటా చెరువు పనులు చేయడం వల్ల స్థానిక వేతనదారులకు ఉపాధి లభించేంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నీరు–చెట్టు’ పథకం ద్వారా లక్ష్యానికి గండిపడనుంది. ఈ పథకం కింద మట్టిపని చేపట్టిన ఏ చెరువులోనైనా తదుపరి ఐదేళ్ల వరకూ ఉపాధి పథకం కింద పనులు చేపట్టడానికి వీల్లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో చెరువును పంచేసుకొని ‘నీరు–చెట్టు’ పథకం కింద పనులు చేసేస్తున్నారు. తమ స్వలాభం కోసం తూతూమంత్రంగా పనులు చేస్తున్నారు. దీనివల్ల ఇటు చెరువులు బాగుపడక రైతులు... భవిష్యత్తులో ఆ చెరువుల్లో ఉపాధి పనులు లేక వేతనదారులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ జిల్లా నుంచి వలసలు మొదలయ్యాయి. నిద్రపోతున్న నిఘా నీరు–చెట్టు పనులను జలవనరుల శాఖతో పాటు డ్వామా, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే మండలస్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు కూడా చేయవచ్చు. ఇంతమంది పర్యవేక్షణ ఉన్నా టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రం తమకు నచ్చినట్లు పనులు చేసుకుపోతున్నారు. దీనికి కారణం స్థానిక ప్రజలకు ‘నీరు–చెట్టు’ పథకం నిబంధనలపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే... ఇవి తెలిసిన అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొగ్గడం ప్రధాన కారణం. -
ఆహ్వానం దుమారం!
♦ దేవగుడి సోదరుల కరపత్రంపై టీడీపీలో అలజడి ♦ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలుగుతమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కడప: ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు కోపం’అన్న చందంగా దేవగుడి సోదరుల కరపత్రం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. జమ్మలమడుగులో బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమనికి కార్యకర్తలు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఫొటోలు ముద్రించి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ తరుఫున ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈవైనం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి రేపింది. దేవగుడి సోదరులకు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫొటోలు లేకుండా కేవలం వారి ఫొటోలు మాత్రమే ముద్రించి కరపత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ కొందరు నేతలు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని అరువు నేతలను తెచ్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని, అధిష్టానం ఇప్పటికైనా మేల్కోవాలని ఆ ఫిర్యాదులో శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. -
ఆ పొగడ్తలు విన్న తరువాత...
ఆ పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ సీటు మీద ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక నిర్ధారణకు వచ్చారట తెలుగు తమ్ముళ్లు. శాసనమండలి చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.చక్రపాణి వ్యవహరిస్తున్నారు. శాసనసభ, మండలి సమావేశాల చివరి రోజున సీఎం చంద్రబాబు నాయుడు మండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై ప్రసంగించారు. అందులో టీడీపీ నేతలు తమ అధినేతను ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో నాకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అని కోరిన చక్రపాణి సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. మీ అంత పరిపాలనాదక్షుడు లేడు అని మొదలుపెట్టి తాను ఏమేరకు పొగడగలరో ఆ మేరకు పొగిడారు. దీంతో సీఎం సహా టీడీపీ నేతలందరూ బ్రహ్మాండంగా పొగిడారంటూ అభినందించారు. చక్రపాణి పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే చైర్మన్ కుర్చీలో తమలో ఎవరో ఒకరు కూర్చోవచ్చని టీడీపీ ఎమ్మెల్సీలందరూ ఆరాటపడ్డారు. సీఎం వద్ద తమకు చేతనైన రీతిలో పైరవీలు కూడా ప్రారంభించారు. చక్రపాణి పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ కుర్చీ మీద ఆశలు వదులు కోవాల్సిందేనని వారు నిర్ణయించుకున్నారు. తాము పార్టీలో ఉన్నాం కాబట్టి అధినేతను పొగడక తప్పదని, మా చైర్మన్ కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అయినా పార్టీ సిద్ధాంతాలు వైగైరా పక్కన పెట్టి చంద్రబాబును పొగిడిన తీరు చూస్తుంటే ఆయన పదవీకాలం పొడిగింపు ఖాయమని తేలిపోయిందని ఓ టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. గత సభలో కూడా సభ్యుడిగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ మాత్రం చక్రపాణి గారు వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఏ రకంగానైతే పొగడ్తల వర్షం కురిపించారో, ఇపుడు కూడా అదే తీరుగా వ్యవహరించారు. ఆయన పదవి కాపాడుకోవటానికి పొగిడారు, వాటికి ఎవరైనా పడిపోతే మనం ఏమీ చేయలేం అని నిట్టూర్చారు. -
తమ్ముళ్లకు ఝలక్
నెల్లూరు (రవాణా): టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా తమ్ముళ్లకు ఝలకిచ్చారు. ఎమ్మెల్సీల ఎంపికలో జిల్లాకు మొండిచేయి చూపారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పలువురు ఆశావాహులు ఎదురుచూశారు. పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలు పోటీపడ్డారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఇద్దరు నేతలు అధినేత చుట్టూ ప్రదక్షణలు చేశారు. గత ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేదిలేదని పార్టీ తీసుకున్న నిర్ణయంతో బీదాకు ఆశలు మరింత పెరిగాయి. టీడీపీకి దక్కే 3 ఎమ్మెల్సీల్లో బీద రవిచంద్ర పేరు దాదాపు ఖరారైందని జోరుగా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీకి కేటాయించాల్సిందిగా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్య కొంత తర్జనభర్జన జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీ నేతలకు నచ్చజెప్పడంతో చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర పేరు వినిపించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అధినేతను కలిసేందుకు బీద తరఫున పాస్‌లు కూడా జారీచేశారు. అయితే సోమవారం పార్టీ మంత్రులు, సీనియర్ నాయకులు సమావేశం తర్వాత బీద అశలపై అధినేత నీళ్లు చల్లారు. రాయలసీమ, గోదావరి, విజయనగరం జిల్లాలకు చెందిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. దీంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులు కారణంగానే.. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు 3 గ్రూపులుగా ఏర్పడటంతోనే ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సోమిరెడ్డి, మంత్రి నారాయణ, ఆదాల గ్రూపులుగా చెలామణి అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల సైతం గ్రూపుల వారీగానే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా బీసీలకు అవకాశం కల్పిస్తే, రెడ్డి సామాజికవర్గం దూరమవుతుందన్న కారణంతో పార్టీ అధినేత నిర్ణయాన్ని మార్చుకున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొదట నుంచి జిల్లాలో సీనియర్ నాయకుడిగా తనకు అవకాశం కల్పించాలని సోమిరెడ్డి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో పదేళ్లు పార్టీని నెట్టుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. బీద మాత్రం తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామన్న హామీతోనే గత ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న విషయాన్ని తెరపైకి తీసకువస్తున్నారు. అయితే ఇద్దరు నేతల ఆశలపై పార్టీ అధినేత చంద్రబాబు నీళ్లు కుమ్మరించారు. వచ్చే నెలలో మరో 8 ఎమ్మెల్సీ ఖాళీలు రానున్నట్లు తెలిసింది. అయితే టీడీపీకి 5 దక్కే అవకాశం ఉంది. వాటిలో జిల్లాకు రెండు ఎమ్మెల్సీ లు కేటాయిస్తారనే ఆశల్లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఒకే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే అప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. మళ్లీ ఇప్పటి మాదిరి జిల్లాలో తమ్ముళ్లు పోటీపడితే అసలు ఎమ్మెల్సీ పదవి కేటాయించకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. పార్టీ అధినేత వద్ద మంత్రి నారాయణ మాట మాత్రమే చెల్లుబాటవుతుంది. ఆయన మనసులో మాట ఏంటోనన్న విషయం బయటకు రాలేదు. మరో నెలరోజులు తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూడాల్సిందే. -
తమ్ముళ్లే.. ఇక డీలర్లు!
చౌక దుకాణాల డీలర్ షిప్పులు కట్టబెట్టేందుకు యత్నాలు సాక్షి, కర్నూలు : జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు చౌక దుకాణాల డీలర్‌షిప్పులను కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఇన్చార్జీల పాలనలో ఉన్న రేషన్‌షాపులకు నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత డీలర్ల నియామకం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన తమ్ముళ్ల రుణం తీర్చుకునేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా ఎక్కువ షాపుల డీలర్‌షిప్పులను చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,411 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అవకతవలకు పాల్పడిన కొందరు రేషన్ డీలర్లను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరులో పలు చౌకధరల దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేశారు. వీటిని సమీపంలోని కొందరు డీలర్లకు అప్పగించారు. ఇప్పుడు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి శాశ్వత ప్రాతిపదికన డీలర్లకుఅప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి అర్హులను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా గత సెప్టెంబరు నెలలో ఖాళీలుగా ఉన్న రేషన్‌షాపులకు డీలర్లను భర్తీ చేసే ప్రక్రియకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అప్పటి వరకూ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న రేషన్‌షాపులను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ నేతలు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఫలితంగా ఆ నోటిఫికేషన్‌ను ఉన్నతాధికారులు తాత్కాలికంగా నిలిపివేయడం.. వెనువెంటనే కొందరి డీలర్లపై కక్షపూరిత చర్యలకు ఉపక్రమించడం.. మాటవినని వారిపై అక్రమ కేసులు బనాయించడం.. మరు క్షణమే ఆయా డీలర్లను సస్పెండ్ చేయడం వంటి ప్రక్రియలు చకచకా జరిపోయాయి. ఒక్క ఆదోని డివిజన్‌లోనే ఈ విధంగా దాదాపు 100 మంది డీలర్లను సస్పెండ్ చేసి.. సమీపంలోని మరో డీలరుకు ఆ దుకాణాలను అప్పగించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 400 వరకు దుకాణాలు ప్రస్తుతం ఇన్చార్జుల పాలనలో ఉన్నాయి. తాజా మళ్లీ తెరపైకి నోటిఫికేషన్.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన నోటిఫికేషన్‌ను మరోసారి జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు పనిలోపనిగా నోటిఫికేషన్ జారీ అయ్యేలోగా మరికొందరి డీలర్లపై అక్రమ కేసులు నమోదు చేయించి వాటిని కూడా తమ్ముళ్లకే అప్పగించాలని కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ మాట వినని డీలర్ల జాబితాను సిద్ధం చేసి వారిపై కేసులు బనాయించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే సమీప డీలర్లకు అప్పగించి రేషన్ షాపులను తెలుగు తమ్ముళ్లకు అధికారులు తాత్కాలిక కేటాయింపుల కింద అప్పగించారు. అయితే రేషన్ దుకాణాలు తాత్కాలిక కేటాయింపులు చేయకూడదనే ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇటీవల వంద మందికి అక్రమంగా దుకాణాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా చౌకధరల దుకాణాల కేటాయింపు అధికారం ఆర్డీవోలకు ఉంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపులు చేయకూడదు. కానీ కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై జిల్లాలో దూమారం రేగుతోంది. -
టీడీపీలో అంతర్గత పోరు
నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్ళ మధ్య అంతర్గత పోరుకు తెరలేపుతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలం 31 ఉండగా, వైఎస్సార్సీపీ బలం 19 ఉంది. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ తరఫున 17 మంది ఎన్నిక కాగా, ఒక ఇండిపెండెంట్‌తో కలిపి 18 స్థానాలు ఉన్నాయి వైఎస్సార్సీపీ నుంచి 32 మంది ఎన్నికయ్యారు. అయితే మేయర్‌తో సహా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ వెంట వెళ్లిన సభ్యులకు ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపించడం లేదు. టీడీపీ తరఫున ఎన్నికయిన సీనియర్లకు స్టాండింగ్ కమిటీల్లో చాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ వెంట వెళ్లిన 10 మంది మహిళల్లో ఒక్కరికి కూడా స్టాండింగ్ కమిటీలో ఎంపికయ్యే అవకాశాలు లేవు. ఇది మహిళా సభ్యుల్లో అసంతృప్తికి దారితీస్తుంది. దీని ఫలితం ఎన్నిక రోజున (9వ తేదీన) బహిర్గతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ సీనియర్ కార్పొరేటర్లలో నలుగురికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. వారిలో జెడ్ శివప్రసాద్, నూనె మల్లికార్జున్‌యాదవ్, కిన్నెర ప్రసాద్, దాసరి రాజేష్‌కు దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో అంచూరి జానకి, కొత్తూరు శైలజ, బొల్లినేని శ్రీవిద్యలో ఒక్కరికి స్థానం దక్కనున్నట్లు సమాచారం. మేయర్ వర్గం నుంచి బాలకోటేశ్వరరావుకు మాత్రమే స్థానం దక్కనున్నట్లు సమాచారం. రహస్య ఓటింగ్ కావడంతో బలాబలాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. మేయర్ వర్గమైన మహిళా ఓట్లు చీలినట్లయితే వైస్సార్సీపీకి బలం చేకూరుతుంది. రెండు పార్టీల నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిలబడే సభ్యుల పేర్లను నేడు ఖరారు చేయనున్నారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. -
ఆలయ భూములపై తమ్ముళ్ల కన్ను
తెలుగు తమ్ముళ్ల దోపిడీ పర్వానికి అడ్దూఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ మా ఆధిపత్యం అన్నట్లు వారి అధికార దర్పం సాగుతోంది. వంశపారంపర్యంగా అర్చకులు చేసుకుంటున్న ఆలయ భూములపైనా వారి కన్ను పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవాదాయశాఖ అధికారులపైనే ఒత్తిడి చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను కాదని.. అగస్త్యేశ్వరుని ఆలయ భూముల వేలంపాట వేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రాజంపేట: చెయ్యేరు నది ఒడ్డున ఉన్న గుండ్లూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయభూములపై గ్రామానికి చెందిన కొందరు పెద్దలు కన్నేశారు. వాటిని ఎలాగైనా వేలం వేయించాలని దేవదాయశాఖ అధికారులపై తమ్ముళ్లు ఒత్తిడి చేస్తున్నారు. మట్లిరాజుల పాలన నుంచి అర్చకత ్వం చేస్తున్న తంబెళ్ల వంశానికి చెందిన కుటుంబీకులు ఆలయ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. అందుకు ప్రతిగా అగస్త్యేశ్వరస్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వివాదం వ చ్చినప్పుడు, మద్రాసు నుంచి విడిపోయిన సమయంలోనూ ప్రభుత్వం, కోర్టులు కూడా తంబెళ్ల వంశస్తులకే ఆలయ అర్చకత్వం అని చెప్పాయి. భూములు వేలం వేయించాలని తమ్ముళ్ల ఒత్తిడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం.. దేవాలయ భూములకు వేలంపాట పెట్టాలనే ఉత్తర్వులు తీసుకురావడంతో తమ్ముళ్ల కన్ను ఈ ఆలయభూములపై పడింది. ఇంకేముంది ఎలాగైనా తంబెళ్ల వంశస్తులు అనుభవిస్తున్న భూములను వేలంపాట ద్వారా దక్కించుకోవడానికి దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మొదలైంది. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రాదాయాలకు నీళ్లు వదలకూడదని ఓ వైపు గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నా వారి చెవికెక్కడం లేదు. ఆలయానికి భూములు ఇలా.. గుండ్లూరు అగస్తేశ్వరస్వామి ఆలయంతోపాటు విఘ్నేశ్వరాలయం, కుమారుస్వామి, మారెమ్మ, యల్లమ్మ దేవస్ధానాలు ఏటిఒడ్డున ఒకే చోట ఉన్నాయి. ఈ ఆలయాలు అన్నింటిలోనూ తంబెళ్ల వంశస్తులు అర్చకులుగా ఉంటున్నారు. ఏడాదికి రూ.4వేలు ఆలయ ధర్మకర్తకు అందజేస్తుంటారు. ఈ భూముల్లో 1.80 ఎకరాల భూమి స్వామి పూజాది కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు కేటాయించారు. రాజంపేట మండలంలోని గుండ్లూరు గ్రామం పొలంలో సర్వేనెంబరు 48లో 1.05ఎకరా, 126లో 0.48సెంట్లు, 184లో 0.40సెంట్లు, 595లో 0. 83సెంట్లు , 2121లో 0.14 సెంట్లు, 329లో 0. 04 సెంట్లు, 80లో 0.18సెంట్లు, 82లో 0.28సెంట్లు, 331లో 0. 25 సెంట్లు, 171లో 0. 74 సెంట్లు, 172లో 0.33 సెంట్లు భూములు స్వామికి సంబంధించినవి. మొత్తం మీద 7.14ఎకరాలు భూమి తంబెళ్ల వంశస్తుల ఆధీనంలో రాజుల కాలం నుంచి ఉంది. పూర్వం నుంచి భూములనే నమ్ముకున్నాం తాతలకాలం నుంచి అగస్తేశ్వరుని స్వామి భూములనే నమ్ముకుని జీవిస్తున్నాం. ఇప్పుడేమో దేవాదాయశాఖ అధికారులు ఈ భూములకు వేలంపాట పాడతామంటున్నారు. మద్రాసు హైకోర్టు, జిల్లా కోర్టులు కూడా భూములను తామే సాగుచేసుకునే విధంగా తీర్పులు ఇచ్చాయి. వేలంపాటే వస్తే మళ్లీ కోర్టుకెళతాం. - చాపాటి చిన్నవీరయ్య, తంబెళ్ల కులస్తుడు తంబెళ్ల కులస్తులకు లేకుండా చేయాలని చూస్తున్నారు అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములను తంబెళ్ల కులస్తులకు లేకుండా చేయాలని చూస్తున్నారు. గతంలో అనేక మార్లు ప్రయత్నాలు చేశారు. న్యాయస్థానం మా వైపు మొగ్గుచూపింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కౌలుకు చేసుకుంటున్న భూములును లాక్కోవాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. - నరసింహులు, తంబెళ్ల కులస్తుడు -
ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుతమ్ముళ్లు మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రధాన నాయకులు పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. భవిష్యత్‌లో పోటీగా నిలుస్తారనుకున్న నేతల్ని ఇప్పటి నుంచే కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో తొలిసారి ఆరంగేట్రం చేసిన పుట్టాసుధాకర్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తోఎన్నికల ముందు చెలిమి కొనసాగించారు. ప్రస్తుతం తనదైన శైలిలో పుట్టా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నారుు. అందుకు తగినట్లు కొన్ని సంఘటనలు కనిపిస్తుండంతో వాటికి బలం చేకూరుతోంది. మాజీ మంత్రి డిఎల్ మేనల్లుడు మాజీ ఎంపీపీ మధుసూదనరెడ్డి నేతృత్వంలో చేపట్టిన క్రషర్ మిషన్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా తవ్వకాలు చేపట్టిందని అందుకు రూ.3.73కోట్లు జరిమాన విధిస్తూ అధికారులు డిసెంబర్లో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై సవాల్ చేస్తూ మధుసూదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ మంగళవారం మధుసూదన్‌రెడ్డి కంకర మిషన్ సీజ్ చేశారు. మైదుకూరు ప్రాంతంలో ఈచర్య హాట్ టాఫిక్‌గా మారింది. తెరవెనుక పట్టువదలని విక్రమార్కునిలా పుట్టా సుధాకర్ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే భావన కొందరిలో వ్యక్తమౌతోంది. అంతటా అదే పరిస్థితి... బద్వేల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి వర్గాలుగా విడిపోయారు. వారి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. శాసనమండలి డిప్యూటి చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉన్నట్లు తెలుగుతమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పులివెందుల నియోజకవర్గంలో సతీష్‌రెడ్డికి వ్యతిరేకంగా రాంగోపాల్‌రెడ్డి నేతృత్వంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రొద్దుటూరు పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి గ్రూపుల మధ్య రాజకీయ ఎత్తుగడలు తెరవెనుక స్పీడుగా సాగుతున్నారుు. కమలాపురంలో సైతం ఇదే పరిస్థితి ఉండడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూనే తెరవెనుక గ్రూపును పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ముదిరిపోయాయి. ఎంపీపై గరంగరం... ఎంపీ సిఎం రమేష్‌పై పార్టీ శ్రేణులు గరంగరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల హైవే రోడ్డు టెండర్లుల్లో స్థానిక నాయకుల్ని కాదని ఎంపీ శాసించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. బద్వేల్, మైదుకూరు నాయకుల్ని టెండర్లలో పాల్గొనకుండా నియంత్రించడంపై అగ్గిరాజుకుంది. ప్రతి విషయానికి ఆయన టిక్ కొడితేనే పనులు అవుతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. -
కత్తులు, రాడ్లతో దాడులు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు!
బాపట్లటౌన్: టీడీపీలో ఎప్పటి నుంచో రగులుతున్న విభేదాలు పాండురంగాపురంలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తెలుగుతమ్ముళ్ళు రెండు వర్గాలుగా చీలి కత్తులు, రాడ్ల దాడులకు దిగారు. పంచాయతీ సర్పంచ్, మండల ఉపాధ్యక్షుల మధ్య గ్రామంలో ఆదివారం వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. వివాదం చెలరేగిందిలా.. గ్రామంలో పదేళ్ళుగా సుబ్బారెడ్డి, నక్కా వీరారెడ్డి వర్గాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుబ్బారెడ్డి వర్గానికి చెందిన మున్నం అమ్మిరెడ్డి పొలాల్లో నుంచి గ్రామంలోకి వస్తుండగా అదే సమయంలో వీరారెడ్డి వర్గానికి చెందిన పుట్టా అంకమ్మ తన ఇంటిముందు సామాన్లు కడుగుతోంది. ఇంటిముందు ఉన్న తడికను ట్రాక్టర్ డ్రైవర్ గుద్దించడంతో ఇరువురు వాగాదానికి దిగారు. గమనించిన స్థానికులు ఇరువురికి సర్దిచెప్పి పంపించారు. కాసేపటికి సుబ్బారెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వీరారెడ్డి వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాలు కత్తులు, రాడ్డులు, రాళ్ళతో దాడులకు దిగాయి. గాయాలపాలైంది వీరే ... ఘటనలో వీరారెడ్డి వర్గానికి చెందిన కుక్కల శ్రీనివాసరెడ్డి, నక్కా నాగేంద్రరెడ్డి, కుక్కల బాలకృష్ణ, పుట్టా సంజీవరెడ్డి, రాజు లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరమ్మ, కుక్కల స్వాములు, కుక్కల వీరారెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. సుబ్బారెడ్డి వర్గానికి చెందిన గుమ్మడి పోలేరమ్మ, కుక్కల పోలేరమ్మ, కుక్కల పద్మ, మున్నం అంకమ్మ, గుమ్మడి శ్రీనివాసరెడ్డి, కుక్కల శ్రీనివాసరెడ్డి, కుక్కల నాగేశ్వరమ్మ, కుక్కల పెద పోలేరమ్మ గాయాలపాలయ్యారు. వీరంతా ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తాలుకా ఎస్ఐ చెన్నకేశవులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముళ్లకు చెంపపెట్టు!
అధికారమే పెట్టుబడిగా ప్రజాధనం లూఠీకి తెలుగుతమ్ముళ్ల వేసిన ఎత్తులు చిత్తయ్యూరుు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. పోటీదారులను తప్పించి అధిక మొత్తానికి దక్కించుకున్న టెండర్లు రద్దు అయ్యాయి. రూ.26 కోట్లు కొల్లగొట్టాలన్న టీడీపీ నేతల అక్రమ ఆలోచనకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. తమ పార్టీకే చెందిన పోటీ దారులను సైతం ఒత్తిడి చేసి విరమింపజేసిన ఓ ఎంిపీ చర్యలకు తిరుగులేని ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి ప్రతినిధి, కడప: నేషనల్ హైవే 67 రోడ్డు విస్తరణలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో టెండర్లుకు ఆహ్వానించారు. రూ.183 కోట్లు పనులకు ఈ పొక్యూర్మెంట్ ద్వారా టెండర్లును పిలిచారు. ఈ పనుల కోసం ఎస్ఆర్కే, రిత్విక్, బివిఎస్ఆర్, కెసిపిఎల్ కాంట్రాక్టు సంస్థలు పోటీ పడ్డాయి. అందులో మూడు కాంట్రాక్టు సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరో నేతకు అనుకూల మైనవి. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తనయుడి ఆశీస్సులతో నాలుగో సంస్థ టెండర్ దాఖలు చేసింది. ముందుగా అనుకున్నట్లు మూడు సంస్థలు కాకుండా నాలుగో సంస్థ టెండర్ దాఖలు చేయడంతో టీడీపీ నేతలు ఖంగు తిన్నారు. ఆసంస్థ పోటీలో ఉంటే కాంట్రాక్టు పనులు దక్కవని పెద్ద ఎత్తున పైరవీలు చేయించారు. తుదకు బెదిరింపులకు సైతం దిగినట్లు తెలుస్తోంది. ఒత్తిడికి తలొగ్గిన ఆ కాంట్రాక్టు సంస్థ పోటీ నుంచి చివరి నిమిషంలో నిష్ర్కమించింది. దాంతో రిత్విక్, ఎస్ఆర్కే జాయింట్ వెంచర్‌కు 14.5శాతం అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారు. ప్రజాధనం లూఠీకి పన్నాగం... రూ.183 కోట్లు రోడ్డు విస్తరణ పనుల్ని 14.5శాతం అధిక రేట్లుకు ప్రభుత్వం కట్టబెట్టింది. సుమారు రూ.26.5 కోట్లు ప్రజాధనం లూఠీకి పాలకపక్షం అండగా నిలిచింది. తక్కువగా కోట్ చేసిన కేసిపిఎల్ను విత్‌డ్రా చేపించడంతోనే టీడీపీ నేతల ఎత్తుగడలు సఫలం అయ్యాయి. ఆమేరకే 14.5 శాతం అధికంగా కోట్ చేసిన రిత్విక్, ఎస్ఆర్కే జాయింట్ వెంచర్‌కు టెండర్ ఖరారైంది. మరో రెండు సంస్థలు ఒకటి 20, మరొకటి 21 శాతం అధిక రేట్లుకు టెండర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 14.5 శాతం అధిక మొత్తానికి టెండర్లు ఖరారు చేయడం వల్ల సుమారు రూ.26.5 కోట్లు ప్రజాధనం లూఠీకి ఆస్కారం ఏర్పడింది. ఈపరిణామాన్ని ఈనెల 31న సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఆమేరకు కేంద్రప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వెళ్లారుు. వైఎస్సార్ జిల్లాలోనే రూ.26.5 కోట్లు లూఠీ అవుతోందని, మొత్తం పనుల్లో సుమారు రూ.100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఆమేరకు టెండర్లును రద్దు చేస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ హైవే ఎస్ఈ ధ్రువీకరించారు. ఒక్క టెండర్‌తో గట్టేక్కాలని... కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ కాంట్రాక్టర్ గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుమారు రూ.13కోట్లు పార్టీ ఫండ్‌గా ఖర్చు చేసినట్లు సమాచారం. ఒకే ఒక్క పని దక్కించుకుని ఎన్నికల ఖర్చును రాబట్టుకోవాలి అనుకున్నట్లు ఉంది. ముందస్తు వ్యూహం ప్రకారం ఎన్‌హెచ్-67 రోడ్డు టెండర్ పనులు దక్కించుకున్నారు. 14.5 శాతం అధిక రేట్లుకు దక్కించుకున్న ఆ కాంట్రాక్టు పనుల్ని కడప నగరంలో ఉన్న కాంట్రాక్టు సంస్థకు సగం, మరో సంస్థ సగం ప్రభుత్వ రేట్లకు చేసుకునేలా తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధిక రేట్లు మేరకు లభించే మొత్తం టీడీపీ ఎంపి ఒకరు, రాజకీయల్లో చేరిన కాంట్రాక్టర్‌కు సమభాగాలుగా నిర్ణయించుకున్నారు. అంటే ప్రభుత్వం నుంచి అప్పనంగాా లభించే రూ26.5 కోట్లు ప్రజాధనంలో సగం వాటా కాంట్రాక్టర్‌గా ఉండి రాజకీయ నేతగా మారిన వ్యక్తికి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు మొత్తం ఈ ఒక్క కాంట్రాక్టు పనులు దక్కడంతో సాధ్యమైందని పలువురు భావిస్తున్నారు. అరుుతే ఆ ఇరువురి నేతల వ్యూహం బెడిసింది. ఎన్‌హెచ్-67 రోడ్డు పనులు రద్దు అయ్యాయి. మరోమారు టెండర్లుకు పిలవనున్నారు. తాత్కాలికంగా తెలుగుతమ్ముళ్లు అక్రమ సంపాదనకు బ్రేకులు పడ్డాయి. ప్రజాధనం లూఠీకి అడ్డుకట్ట పడింది. -
చట్టం వీరి చుట్టం
ప్రభుత్వం మాది ... ప్రభుత్వ భూమీ మాదే ప్రభుత్వం అంటే ప్రభుత్వ భూములు కూడా తమవే అనుకుంటున్నారేమో తెలుగు తమ్ముళ్లు ... సర్కారు జాగా కనిపిస్తే చాలు పాగా వేయడానికి పరుగులు తీస్తున్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి ... ఓటర్లను ఏమార్చి గద్దెనెక్కిన ఆరు నెలల కాలంలోనే జిల్లాలో నలుదిక్కులా చెలరేగిపోతున్నారు. మంత్రి మద్దతుదారులమంటూ కొంతమంది, ఎమ్మెల్యే అనుచరులంటూ మరికొంతమంది ఏకంగా పొక్లెయిన్లతో భూములను చదును చేసేస్తున్నారు. మరీ ముక్కుసూటిగా పోవద్దు ... మా వాళ్లు ఏమి చేసినా చూసీచూడనట్టుగా వెళ్లిపోండని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే హుకుం జారీ చేయడంతో మనకెందుకులే గొడవనుకున్నారేమో అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కూడా చోద్యం చూస్తూ చర్యలకు ఉపక్రమించడం లేదు. తాళ్లూరు: అధికారమే పరమావధిగా తెలుగు తమ్ముళ్లు రెవెన్యూ భూముల ఆక్రమణలపర్వానికి తెరలేపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రేక్షకపాత్ర పోషించడంతో కబ్జాదారుల కోరల్లో సర్కారు భూములతోపాటు చెరువు, వాగులు సైతం చిక్కుకున్నాయి. సోమవరప్పాడు రెవెన్యూ పరధిలోని సర్వే నెం 336లో 5.25, 337లో 5.90, 339లో 6.72, 322/1లో 23.72 ఎకరాలను తూర్పు గంగవరం గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. కొండలు, వాగులు, చెరువుల కట్టలను సైతం భారీ యంత్రాలతో చదును చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. ఎవరూ పట్టించుకోవడంలేదన్న ధైర్యంతో మరికొందరు బరి తెగించి వరి, బత్తాయి చెట్లను సైతం సాగు చేసుకున్నారు. ప్రభుత్వ భరోసాతో... ఆక్రమణల్లో ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం సమాయత్తమవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు సర్కారు భూమి కనిపిస్తే చాలు కబ్జాకు దిగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నుంచే ప్రభుత్వ భూముల సమాచారం సర్వే నంబర్లతో సహా తెప్పించుకొని కంచెలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు. వీరి స్పీడు చూసిన చోటామోటా నేతలుతోపాటు ఇతరులు కూడా పాగా వేయడానికి పరుగులు తీస్తున్నారు. చట్టం వీరి చుట్టం ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై , ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టేందుకు 1982లో భూ కబ్జా చట్టం రూపొందింది. ఆ చట్టం ద్వారా చర్యలు తీసుకోవల్సిన ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం చట్టంలో ఉంది. సంబంధితాధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ఆక్రమణల జోరు మరింత జోరందుకుంటోంది. పరిశీలిస్తాం: కె. ఇంద్రాదేవి, తహసీల్ధార్ భూ ఆక్రమణలు నా దృష్టికి రాలేదు. సంబంధిత సర్వే నంబర్లలో కబ్జాను పరిశీలించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటాం. -
‘పచ్చ’గా మట్కా
సాక్షి, కడప: మట్కా... రూపాయికి తొంభై రూపాయలు వస్తుందని ఆశ చూపుతూ జనాన్ని మట్కా ఉచ్చులోకి లాగుతున్నారు బీటర్లు. కొన్నేళ్లుగా మట్కా రాస్తున్న వారు తాజాగా సర్దుకోగా... కొత్త వారిని తెరమీదికి తెచ్చి అండగా మేమున్నామంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు లోలోపల సహకారం అందిస్తుండంతో మట్కా మళ్లీ జోరందుకుంది. కొంతమంది బీటర్లు స్థానికంగానే చీటీలను నిలుపుతూ.... ఎవరికైనా మట్కా నెంబరు తగిలినా ఇస్తాంలే.. చేస్తాంలే... అని రాజకీయ పలుకబడితో బెదిరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పైగా అనంతపురం జిల్లాలోని కదిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల మట్కా నిర్వాహకుల సహకారంతో స్థానికంగా ఉన్న బీటర్లు మట్కా విస్తరిస్తున్నారు. ఇదేమని అడిగే పోలీసు అధికారులు లేకపోవడంతో వారికి ఎదురులేకుండా పోరుుంది. ఒకవేళ పట్టుబడినా చిన్నా చితకా కేసులతో బయటపడుతున్నారు. చాలాకాలంగా సాగుతున్న మట్కా విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహారిస్తే ఒక్కస్లిప్పు కూడా బీటర్లు రాయలేరనేది అక్షరసత్యం. అయితే అండగా కొంతమంది ఉన్నారన్న దైర్యమో.... లేక ఇంకేమో తెలియదుగానీ మట్కా మహమ్మారి మాత్రం కోరలు చాస్తూనే ఉంది. పులివెందులలో పెట్రేగుతున్న మట్కా జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వాటిలో పులివెందుల ఒకటి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం పులివెందులకు వచ్చి నివాసాలు ఏర్పరుచుకుని మట్కాలో పాలుపంచుకుంటున్నారన్న ప్రచారం జోరందుకుంది. సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండడంపై కూడా చర్చకు దారి తీస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్యకాలంలో పులివెందులలో మట్కా జోరందుకుంది. ప్రధానంగా మారుతి థియేటర్, బేతల్చర్చి సమీప ప్రాంతాల్లో కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొంతమంది తెలుగు తమ్ముళ్లు మేమున్నామని.. మీకేం కాదని భరోసా ఇవ్వడం వల్లే ఇంతా బాహాటంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నారుు. గతంలో మట్కా స్లిప్పులను కదిరిలో పేరుమోసిన కొన్ని కంపెనీల ప్రతినిధులకు పంపించేవారు. ఈ మధ్య కాలంలో స్లిప్పులను సైతం ఇక్కడే నిలుపుకుని మట్కా కంపెనీల తరహాలో లావాదేవీలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. మారుతిథియేటర్ ప్రాంతంలో కొంతమంది స్థానికేతర విద్యార్థులు కూడా గదులు అద్దెకు తీసుకుని మట్కా స్లిప్పులు రాస్తున్నట్లు సమాచారం. పులివెందులలో రెండు నెలల క్రితం తమ్ముళ్ల మధ్య మట్కా మామూళ్ల వ్యవహారం చిచ్చు రేపగా పోలీసుస్టేషన్ ఆవరణంలో ఓ అధికారి రాజీ కుదిర్చారని చర్చ ఉంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో కూడా మట్కా విస్తరిస్తోంది. జమ్మలమడుగు సమీపంలోనే మట్కాకు అడ్డా అరుున తాడిపత్రి ఉండడంతో వ్యాపారం జోరందుకుంది. కొత్త సీఐలుగా సవాలుగా మారిన మట్కా పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప తదితర ప్రధాన పట్టణాల్లో మట్కాను అడ్డుకోవడం కొత్త సీఐలకు సవాలుగా మారింది. పాత పోలీసు అధికారులు చూసీచూడనట్లు వెళ్లారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపధ్యంతోపాటు ప్రస్తుతం వేళ్లూనుకుంటున్న మట్కాను నిరోధించడం బాధ్యతలు తీసుకున్న సీఐలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రస్తుత ఎస్పీ ఉక్కుపాదం మోపుతున్నా! జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నా పోలీసుశాఖలోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా యధేచ్చగా సాగుతోంది. జూదం నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పడిన ప్రైవేటు క్లబ్బులు కూడా ప్రస్తుత ఎస్పీ కఠినంగా వ్యవహారించడంతో మూతపడ్డాయి. అయితే కొంతమంది తమ్ముళ్ల అండ చూసుకుని పులివెందుల ప్రాంతంలో ఎస్పీ సెలవుపై వెళ్లినపుడు మట్కా దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. -
గోవా సరుకు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : నకిలీ మద్యం వ్యాపారంలో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు దూసుకుపోతున్నారు. గతంలో జిల్లాలో బయటపడ్డ నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన డోన్ ఎంపీపీ కొడుకుతో పాటు ఏకంగా జెడ్పీ చైర్మన్ పేరు కూడా బయటకు వచ్చింది. తాజాగా రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో దొరికిన నకిలీ మద్యం వ్యవహారంలోనూ డోన్ మునిసిపాలిటీకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరి హస్తం ఉందనే ప్రచారమూ జరుగుతోంది. సదరు నేత జిల్లాలోని ముఖ్యనేతను కలిసి రక్షించాలని వేడుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ నకిలీ మద్యం వ్యాపారమంతా జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సిండికేటుగా ఏర్పడి గోవాలోని ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకుని నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం నకిలీ మద్యం వ్యాపారమంతా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చిన్న చిన్న బెల్టు షాపులను కేంద్రంగా చేసుకుని సాగుతోంది. ఎక్కడా తమ పేర్లు బయటకు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారం సాగిస్తున్న తీరును చూసి విచారణ చేస్తున్న ఎక్సైజ్ అధికారులే నివ్వెరపోతున్నారు. బళ్లారి కేంద్రంగా ఏజెంట్లు.. జిల్లాలోకి వస్తున్న నకిలీ మద్యమంతా గోవాలోని డిస్టలరీల నుంచే వస్తోందని విచారణలో అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరుకు తర్వాత బళ్లారి మీదుగా రాష్ర్టంలోకి తరలిస్తున్నారు. గోవా నుంచి వచ్చిన మద్యానికి బళ్లారిలో కొంతమంది బ్రోకర్లు.. రంగు, రుచి కోసం ప్రత్యేకమైన రసాయనాలను కలుపుతున్నారు. అక్కడే అచ్చం మద్యం బాటిళ్లల్లోనే ఈ నకిలీ మద్యాన్ని నింపుతున్నారు. ఈ మొత్తం దందా అంతా ముగ్గురు, నలుగురు ఏజెంట్లు కలిపి నడిపిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇందులో ఒకరి పేరు సురేష్ అని.. మరొకరి పేరు బంటి అని విచారణలో తెలిసింది. అయితే, ఇవి అసలు పేర్లా? లేక నకిలీ పేర్లా? లేదా రెండు పేర్లు ఒక్కరివా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఏజెంట్లతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సంబంధాలు పెట్టుకుని నకిలీ మద్యం తెప్పించుకుంటున్నారు. ఈ నకిలీ మద్యం చేరవేతలో కొత్త పంథాను అవలంభిస్తున్నట్టు విచారణలో ఎక్సైజ్ అధికారులు గ్రహించారు. సరఫరా చేస్తున్నారిలా...! జిల్లాలోని పలువురు తెలుగు తమ్ముళ్లు బళ్లారిలోని ఏజెంట్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అక్కడి నుంచి సరుకు కావాలంటే సదరు ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. ఫలానా ప్రాంతానికి తమకు సరుకు పంపించాలని చెబుతున్నారు. అనంతరం బళ్లారిలోని ప్రధాన ఏజెంట్లు తమ కిందిస్థాయి ఏజెంట్లకు చెప్పి ఫలానా ప్రాంతానికి ఇంత లోడు పంపించాలని ఆదేశిస్తున్నారు. ఈ కిందిస్థాయి ఏజెంట్లు.. డ్రైవర్ల ద్వారా సరుకు చేరవేస్తున్నారు. సదరు డ్రైవరు నెంబరును ఇక్కడి నేతలకు చెబుతున్నారు. ఈ నేతలు డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సరుకు వచ్చిన వెంటనే తీసుకుంటున్నారు. అయితే, లోడ్ ఇవ్వడమే ఆలస్యం... వెంటనే డ్రైవర్లు తమ నెంబరును పడేస్తున్నారు. ఇక్కడి నేతలు కూడా ఇదే పని చేస్తున్నారు. అంటే ఆర్డర్‌కు ఒక ఫోన్ నెంబరు వాడుతున్నారన్నమాట. శివారు బెల్టు షాపులే లక్ష్యంగా...! గోవా నుంచి తెస్తున్న నకిలీ మద్యం విక్రయాలకు కర్ణాటక రాష్ర్ట శివారులోని చిన్న చిన్న బెల్టు షాపులను తెలుగు తమ్ముళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. వాస్తవానికి బెల్టు షాపులకు వైన్ షాపుల నుంచి సరుకు రావడం కొంచెం కష్టమయ్యింది. మరోవైపు అదే బ్లాక్ పేపరు, అదే మందు.. అయితే, కర్ణాటక మద్యం అంటూ చిన్న చిన్న బెల్టు షాపుల నిర్వాహకులకు మొదటగా రెండు బాక్సులు శాంపుల్స్గా ఇచ్చి వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఇక్కడి కంటే తక్కువ ధరకు వస్తుండటంతో బెల్టు షాపు నిర్వాహకులు కూడా దీనినే తీసుకుంటున్నారు. చివరకు ఈ విధంగా నకిలీ మద్యం వ్యాపారం జిల్లా అంతటా భారీగా పాకిపోయింది. ఈ మొత్తం నకిలీ మద్యం వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు భారీగా చేతులు కలిపి సిండికేటుగా ఏర్పడి సాగిస్తున్నారు. మొత్తం మీద గోవా నుంచి వచ్చి బళ్లారి కేంద్రంగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యాపార గుట్టును చేధించాలంటే కర్ణాటక ప్రభుత్వ సహకారం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రభుత్వంతో కలిసి విచారణ సాగిస్తే.. అక్కడి ఏజెంట్లతో పాటు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లందరి వ్యవహారం బయటకు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అధికారం మనదే..తవ్వేద్దాం..
నెల్లూరు (అర్బన్/బారకాసు) : జిల్లాలో ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతూ ఇసుక వ్యాపారంతో రెండు చేతులా ఆర్జిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు చేపడుతున్న చర్యలు నామమాత్రమవుతున్నాయి. పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదులతో పాటు పలు వాగుల్లో ఇసుక తవ్వకాలు, విక్రయ బాధ్యతలను ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అప్పగించిన విషయం తెలిసిందే. మొదట జిల్లా వ్యాప్తంగా 80 రీచ్‌లను గుర్తించగా వాటిలో 50 రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఆరు రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. కానీ టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి 38 రీచ్‌ల్లో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలకు నీళ్లు ఇసుక తవ్వకాల్లో టీడీపీ నేతల జోక్యం అధికమైంది. మహిళా సమాఖ్యలకు బదులు నేతలే తమ అనుచరులతో ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెడతామని అధికారులు మొదట్లో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఇలా జరగలేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యే ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశించారు. అధికార పార్టీ నేతలు ఇవేమీ పట్టనట్లు రాత్రి వేళలోనూ ఇసుకను తవ్వి డంప్ చేస్తున్నారు.ట్రాక్టర్లకు జీపీఎస్ విధానం అమర్చి అవి ఎక్కడ తిరుగుతున్నాయో గుర్తిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ట్రాక్టర్‌కు జీపీఎస్‌ను అమర్చిన దాఖలాలు లేవు. ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుకను రవాణా చేయాలని సూచిం చారు. నేతలు లారీల ద్వారా కూడా రవాణా చేసేస్తున్నారు. అధికారం అండగా.. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా అడిగే వాళ్లు ఉండరనే కోణంలో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాల విషయంలో వ్యవహరిస్తున్నారు. మహిళా సమాఖ్యలకు అప్పగించిన బాధ్యతలను తాము తీసుకుని దర్జాగా తవ్వుకుంటున్నారు. ఒక వే బిల్లుతోనే పది లోడ్లను తోలుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారమై మరీ దుమారం రేగడంతో మంగళవారం కలిగిరి ప్రాంతంలో నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అదే రోజు కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. అంతా గందరగోళం ఇసుక రవాణా విషయంలో గందరగోళం నెలకొంది. ఎడ్లబండ్లకు ఉచితంగా ఇసుక రవాణా చేసుకునే అవకాశం కల్పించాలని వాటి యజమానులు కోరుతున్నారు. వీరు ఒక ట్రిప్పు ఇసుక తోలుకోవాలంటే రూ.650 చెల్లించాలని అధికారులు నిబంధనను పెట్టారు. దీనిపై నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేశారు. కొన్ని చోట్ల గ్రామస్తులు తవ్వకాలు జరపకూడదంటూ నిరసనలు తెలుపుతున్నారు. మంగళవారం చిట్టమూరు మండలంలో ఇసుక విక్రయాలు జరపరాదంటూ రీచ్‌ల వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. మహిళా సమాఖ్యల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న ఇసుక దందాలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో నిత్యం ఇసుక తవ్వకాలలకు సంబంధించి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. -
ఇసుక రీచ్‌లకు తమ్ముళ్ల గండి
స్వపార్టీ విధానాలనే తెలుగు తమ్ముళ్లు తుంగలో తొక్కుతున్నారు. మహిళలకు అప్పగించిన ఇసుక క్వారీలను చేజిక్కించుకుని ఈజీగా మనీ సంపాదిస్తున్నారు. డ్వాక్రా సమాఖ్యల కళ్లకు గంతలు కట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. లారీల లెక్కన ఇసుక రవాణా చేస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇందేమిటని ప్రశ్నిస్తున్న అధికారులకూ ఫలహారాలు పంపుతూ మచ్చిక చేసుకుంటున్నారు. మరో వైపు రీచ్‌ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి బ్యాంకు డిమాండ్ డ్రాఫ్టులు సైతం విక్రయిస్తూ రెండు చేతులా పోగేసుకుంటున్నారు. మంగళగిరి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయడంతోపాటు, డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాలకు ఆ పార్టీ నాయకులే గండికొడుతున్నారు. ఇసుక రీచ్‌లను సొంత చేసుకున్న డ్వాక్రా సంఘాలను పక్కన పెట్టి బోట్స్‌మెన్ సొసైటీల పేరిట టీడీపీ నాయకులే ఇసుక విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో ఇసుక కొనుగోలు భారంగా మారుతోంది. వివరాల్లోకి వెళితే... తాడేపల్లి మండలం ఉండవల్లి, తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక క్వారీ లను ప్రభుత్వం డ్వాక్రా సమాఖ్యలకు అప్పగించింది. పెత్తనం పేరుకు మహిళా సంఘాలదే అయినా వీరి వెనుక ఉంటున్న టీడీపీ నాయకులు అక్రమార్జకు తెరలేపారు. నదిలో నుంచి ఇసుకను పడవల్లో తీసుకొచ్చి యార్డుల్లో డంప్ చేసే దశలోనే అసలు కథ ప్రారంభమవుతోంది. ఇసుక రవాణా, బోట్స్‌మెన్ సొసైటీల నిర్వహణలో మహిళా సమాఖ్యలకు అవగాహన లేకపోవడాన్ని ఆసరా చేసుకునిటీడీపీ నాయకులు రంగప్రవేశం చేస్తున్నారు. సొసైటీల వెనుక ఉండి ఇసుక రవాణ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా నదిలో నుంచి ఇసుకను బయటకు తెచ్చి డంప్ చేసేందుకు సొసైటీకి ఒక్కో యూనిట్‌కు రూ. 250 చెల్లిస్తున్నారు. యూనిట్ ధరను ప్రభుత్వం రూ. 650 గా నిర్ణయించింది. అందులో రూ. 250 పోనూ మిగిలిన రూ. 400 సీనరేజి రూపం లో ప్రభుత్వానికి చేరాలి. ఇలా ట్రాక్టర్(మూడు యూనిట్లు) ఇసుకైతే రూ.1950, లారీ అయితే రూ.3,900కు విక్రయించాలి. దీనికి భిన్నంగా ట్రాక్టర్‌కు రూ. మూడు వేలు, లారీకి రూ.ఆరు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో క్వారీలోనే ఎక్కువ చెల్లిస్తున్న లారీలు, ట్రాక్టర్ల యజమానులు బయట ఇసుక ధర మరింత పెంచి ట్రాక్టర్‌కు రూ.ఐదు నుంచి ఆరు వేలు, లారీ ఇసుక రూ. 9 నుంచి 12 వేలకు విక్రయిస్తున్నారు. క్వారీలను డ్వాక్రా సమాఖ్యలకు అప్పగించినా ఇసుక ధర తగ్గక పోగా మరింతగా పెరగడంతో కొనుగోలు భారంగా మారింది. బ్లాక్‌లో బ్యాంకు డీడీలు.... డ్వాక్రా సంఘాలకు అప్పగించిన రీచ్‌ల్లో ఇసుక కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ట్రాక్టర్ ఇసుక అయితే రూ 1,950 ,లారీ అయితే రూ, 3,900 బ్యాంకులో చెల్లించి డీడీ తీసుకురావాలి. ఈ విషయం తెలియని చాలా మంది నేరుగా క్వారీల వద్దకు వస్తున్నారు. దీంతో తిరిగి బ్యాంకులకు వెళ్లి డీడీ తెచ్చే సరికి ఎన్ని లారీలు ట్రాక్టర్లు క్యూ లో వుంటాయో అనే ఆందోళనతో కొం తమంది అక్కడే బ్లాక్‌లో డీడీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన నిర్వాహకులు డీడీలను తీసి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం : డీఆర్డీఏ పీడీ ప్రశాంతి ఇసుక రీచ్‌ల్లో అక్రమాలపై డీఆర్ డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల మేరకు డ్వాక్రా సమాఖ్యలతో ఇసుక విక్రయాలు నిర్వ హిస్తున్నామన్నారు. ఇసుక విక్రయాల్లో సమాఖ్యలతో పాటు సొసైటీలవారు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
వీధినపడ్డ ‘తెలుగు’ తమ్ముళ్లు
నూజివీడులో ముదురుతున్న రగడ ఎంపీ వ్యాఖ్యలతో ముద్దరబోయిన వర్గం ఆగ్రహం అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన ‘దేశం’ నూజివీడు : నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగు తమ్ముళ్ల అంతర్గత విభేధాలు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిట్టనిలువునా చీలి పోయారు. ముద్దరబోయినను ఇన్చార్జిగా ఎవరు నియమించారని ఆయన వ్యతిరేకవర్గం ప్రశ్నిస్తుండగా, ఓడిపోయిన అభ్యర్థే నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండే ఆచారం తెలుగుదేశంపార్టీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతోందని అనుకూలవర్గం వాదిస్తోంది. ఇప్పటివరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు, సోమవారం నూజివీడు వచ్చిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదని స్పష్టం చేయడంతో ముద్దరబోయిన వర్గానికి పుండుమీద కారం చల్లినట్లయింది. టీడీపీకి నూజివీడు అభ్యర్థిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావును చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలోని ఒక వర్గం నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ వర్గం ఎన్నికల్లో టీడీపీకి పనిచేయలేదనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ముద్దరబోయిన, ఈ వర్గం నాయకులు పలు కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నప్పటికీ ముభావంగానే ఉండేవారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ముద్దరబోయిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడని ఈ వర్గం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా ముద్దరబోయిన ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాల కోసం తనవంతు పనిచేస్తుండడంతో జీర్ణించుకోలేని నాయకులు ఎలాగైనా పొమ్మనకుండానే పొగబెట్టి ఇక్కడి నుంచి పంపించేయాలనే లక్ష్యంతో ఇటీవల కొద్ది రోజుల నుంచి నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు ఎవరినీ నియమించలేదనే ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ స్వయంగా ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పార్టీలోని బీసీ నాయకులు మండిపడుతున్నారు. కావాలనే బీసీ నాయకుడైన ముద్దరబోయినను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని పలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొంతమంది బీసీ నాయకులు ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. గతంలోనూ అప్పటి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యను సైతం ఇలాగే పొమ్మనకుండా పొగబెట్టి పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోయే వరకు నిద్రపోలేదని, అదే తరహాలో ఇప్పుడూ చేయాలని చూస్తున్నారని బీసీనాయకులు అంటున్నారు.రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనంటున్నారు. -
మంత్రి సునీతను నిలదీసిన తెలుగు తమ్ముళ్లు
పేరూరుకే కాదు.. మా చెరువులకూ నీరివ్వండి కళ్యాణదుర్గం : ‘అక్కా... పేరూరు డ్యామ్‌కే కాదు... మొదట మా కళ్యాణదుర్గం చెరువులకూ నీరివ్వండి’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. ఆదివారం సివిల్ సప్లై గోదాముల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరూరు డ్యామ్‌కి నీరు తీసుకొస్తే రైతు సమస్యలు తీరుతాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు. కార్యక్రమం ముగిశాక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాదన్నలు కళ్యాణదుర్గం రైతుల కష్టాలు తీరాలంటే మొదట ఈ ప్రాంత చెరువులకు నీరందించాలని మంత్రిని డిమాండ్ చేశారు. ఇక్కడికి నీరిచ్చిన తర్వాతే పేరూర్ డ్యామ్‌కు తీసుకెళ్లండన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి ఇది వరకే చేయించిన సర్వే ప్రకారం రూ.800కోట్లు ఖర్చు అవుతుందని, కళ్యాణదుర్గం మీదుగా చెరువులకు నీరు నింపి పేరూరుకు తీసుకెళ్లాలంటే నిధులు రెండింతలు కావాలని తెలపగా.. ఇదే ప్రతిపాదనను అమలు చేయాలని నాయకులు కోరారు. -
టీటీడీపీలో పెరుగుతున్న జంప్ జిలానీలు
-
ఈతీరేంది భాయి.... చెప్పేద్దాం గుడ్‌బై!
రాజీనామా బాటలో తెలుగుతమ్ముళ్లు సాక్షి, ఖమ్మం,జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్లు రాజీనామా బాట పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావు ఒంటెత్తు పోకడలే ఈపరిస్థితులకు దారితీస్తున్నాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఆయన తీరుతో విసుగుచెంది కొంతమంది ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొంత మంది అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సీటు రాకుండా అడ్డుకున్నారని ఏకంగా ఆపార్టీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో పొత్తుతో మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి. జిల్లా టీడీపీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఏకస్వామ్య పోకడలతో పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు టికెట్ వచ్చినా బీ-ఫాం ఇవ్వకుండా నామానే అడ్డుకున్నారని బాలసాని ప్రకటించినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. పార్టీలో నామా పెత్తనంపై బాలసాని ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని పాల్వంచలో ఆవర్గం నేతలు నామా పర్యటనకు అడ్డుకున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తును విభేదిస్తూ మైనారిటీ నేతలు రోజుకొకరు రాజీనామాలు ప్రకటిస్తూనే ఉండడం గమనార్హం. ఈ పొత్తును నిరసిస్తూ ఖమ్మం పట్టణంలో నామా వర్గానికి చెందిన మహబూబ్అలీ, ఫయాజ్, రియాజ్, బడే సాహెబ్‌తో పాటు మరికొంత మంది ఇప్పటికే రాజీ నామా చేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అంటేనే మైనారిటీలు మండిపడుతున్నారు. పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన తన వర్గం అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా ఆయన తీరును నిరసిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పాలేరులో సామాజిక వర్గం చిచ్చు.. పాలేరు నియోజకవర్గంలో పార్టీ మండల బాధ్యతలు ఎప్పటి నుంచో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. నాలుగు మండలాల పార్టీ బాధ్యతలతో పాటు అసెంబ్లీ టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ విషయం నియోజకవర్గ పార్టీలో చిచ్చు రేపింది. దీనికి అంతటికి కారణం నామానే అని ఇతర సామాజిక వర్గం నేతల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఈ కీలక సమయంలో నామా తన వర్గానికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీలో బీసీలకు సరైన గుర్తింపు లేదని కూసుమంచి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన బాటలోనే నియోజకవర్గానికి చెందిన మరికొంతమంది నేతలు పయనించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా తిరుమలాయపాలెం మండలంలో పార్టీ పరంగా గుర్తింపు ఉన్న మరోనేత రెండు, మూడు రోజుల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. పాలేరు సీటు తన అనుచరురాలికి ఇప్పించుకోవడం, బాలసాని టికెట్ విషయంలో రచ్చ జరిగాక కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ నేతలను పట్టించుకోకపోవడం ఆగ్రహం తెప్పించి వారంతా పార్టీకి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారు. రాజీనామా యోచనలో నామా శిబిరం విద్యావేత్త..? నామా శిబిరం నేతగా ఉన్న ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త కూడా తనకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. నామా అనుచర నేతగా గతంలో ఆయన గెలుపునకు కృషి చేసినా.. తనను పట్టించుకోకుండా ఆయన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న ఆవేదనలో సదరు విద్యావేత్త ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకు చివరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. సహకారం లేనట్లేనా...? నామా ఎంత బుజ్జగించినా సహకరించేది లేదని బీసీలతో పాటు ఆయనపై వ్యతిరేకత ఉన్న ఇతర సామాజిక వర్గం నేతలు, మైనారిటీలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే గత ఐదేళ్లలో పార్లమెంటరీ నేతగా తమకు చేసింది ఏమీ లేదని, ఒక సామాజిక వర్గానికే అన్ని చేశారని బీసీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని, అదే జరిగితే విదేశాలకు వెళ్లి ఆయన వ్యాపారాలు చూసుకుంటారని, కేడర్‌ను పట్టించుకోరని ప్రస్తుతం పార్టీలోని ఆయన వ్యతిరేక శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇన్ని ప్రతికూల అంశాలతో నామా ఏమేరకు గట్టెక్కుతారో అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘తమ్ముళ్ల’కు దారేది?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ వచ్చిన వేళ తెలుగు తమ్ముళ్లు ఎటు వెళ్లాలో తెలి యక తికమకపడుతున్నారు. తమ వల్లే ప్రత్యేకతెలంగాణ ఏర్పడిందని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని చూస్తున్న టీడీపీ నే తలను అపనమ్మకం ఆవహించింది. పొరుగు జిల్లా రంగారెడ్డి టీ డీపీ ఎమ్మెల్యేలు వలసబాట పడుతుండటంతో జిల్లా నేతల ప్ర స్థానంపైనా అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఆ జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. దీంతో మనజిల్లా నుంచి కూడా త్వరలో ఇతర పార్టీల్లోకి వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి పేర ఎన్నికల బరిలోకి ది గిన టీడీపీ మనజిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సా ధించింది. మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొం దారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, టీడీపీ మధ్య దూరం పెరగడంతో పాటు 2009 నవంబర్ నాటి కేసీఆర్ దీక్ష పరిణామాల నే పథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఏర్పడింది. ఇదే సమయంలో టీడీపీ కీలక నేత నాగం జనార్దన్‌రె డ్డి టీటీడీపీ ఫోరం కమిటీ కన్వీనర్ పదవిని వదలుకుని పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో బీజేపీ గూటికి చేరుకున్న నాగం ప్రస్తుతం మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతలను కమలం గూటికి చేర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. యువనేత దూకుడుపై కినుక జిల్లాకు చెందిన టీడీపీకి చెందిన యువనేతకు ఇటీవలి కాలంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని సదరు యువనేతను ప్రోత్సహిస్తుండటంపై కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఓ ఎమ్మెల్యే మాత్రం టీడీపీలో కొనసాగడమో లేదా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడమో చేస్తానని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. గతంలో టీడీపీ పక్షాన మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న ఓ ముఖ్యనేత ‘తమ్ముళ్ల’తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరి చేరికకు సంకేతాలు ఇచ్చినందున, మీరూ నిర్ణయం తీసుకోండి..అంటూ సదరు నేత ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియని స్థితిలో తెలుగు తమ్ముళ్లు ఎదుటి వారి కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీడీపీ ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయాలపై సొంత పార్టీతో పాటు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు