తెలుగు తమ్ముళ్ల దోపిడీ పర్వానికి అడ్దూఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ మా ఆధిపత్యం అన్నట్లు వారి అధికార దర్పం సాగుతోంది. వంశపారంపర్యంగా అర్చకులు చేసుకుంటున్న ఆలయ భూములపైనా వారి కన్ను పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవాదాయశాఖ అధికారులపైనే ఒత్తిడి చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను కాదని.. అగస్త్యేశ్వరుని ఆలయ భూముల వేలంపాట వేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.
రాజంపేట: చెయ్యేరు నది ఒడ్డున ఉన్న గుండ్లూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయభూములపై గ్రామానికి చెందిన కొందరు పెద్దలు కన్నేశారు. వాటిని ఎలాగైనా వేలం వేయించాలని దేవదాయశాఖ అధికారులపై తమ్ముళ్లు ఒత్తిడి చేస్తున్నారు. మట్లిరాజుల పాలన నుంచి అర్చకత ్వం చేస్తున్న తంబెళ్ల వంశానికి చెందిన కుటుంబీకులు ఆలయ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. అందుకు ప్రతిగా అగస్త్యేశ్వరస్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వివాదం వ చ్చినప్పుడు, మద్రాసు నుంచి విడిపోయిన సమయంలోనూ ప్రభుత్వం, కోర్టులు కూడా తంబెళ్ల వంశస్తులకే ఆలయ అర్చకత్వం అని చెప్పాయి.
భూములు వేలం వేయించాలని తమ్ముళ్ల ఒత్తిడి
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం.. దేవాలయ భూములకు వేలంపాట పెట్టాలనే ఉత్తర్వులు తీసుకురావడంతో తమ్ముళ్ల కన్ను ఈ ఆలయభూములపై పడింది. ఇంకేముంది ఎలాగైనా తంబెళ్ల వంశస్తులు అనుభవిస్తున్న భూములను వేలంపాట ద్వారా దక్కించుకోవడానికి దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మొదలైంది. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రాదాయాలకు నీళ్లు వదలకూడదని ఓ వైపు గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నా వారి చెవికెక్కడం లేదు.
ఆలయానికి భూములు ఇలా..
గుండ్లూరు అగస్తేశ్వరస్వామి ఆలయంతోపాటు విఘ్నేశ్వరాలయం, కుమారుస్వామి, మారెమ్మ, యల్లమ్మ దేవస్ధానాలు ఏటిఒడ్డున ఒకే చోట ఉన్నాయి. ఈ ఆలయాలు అన్నింటిలోనూ తంబెళ్ల వంశస్తులు అర్చకులుగా ఉంటున్నారు. ఏడాదికి రూ.4వేలు ఆలయ ధర్మకర్తకు అందజేస్తుంటారు. ఈ భూముల్లో 1.80 ఎకరాల భూమి స్వామి పూజాది కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు కేటాయించారు. రాజంపేట మండలంలోని గుండ్లూరు గ్రామం పొలంలో సర్వేనెంబరు 48లో 1.05ఎకరా, 126లో 0.48సెంట్లు, 184లో 0.40సెంట్లు, 595లో 0. 83సెంట్లు , 2121లో 0.14 సెంట్లు, 329లో 0. 04 సెంట్లు, 80లో 0.18సెంట్లు, 82లో 0.28సెంట్లు, 331లో 0. 25 సెంట్లు, 171లో 0. 74 సెంట్లు, 172లో 0.33 సెంట్లు భూములు స్వామికి సంబంధించినవి. మొత్తం మీద 7.14ఎకరాలు భూమి తంబెళ్ల వంశస్తుల ఆధీనంలో రాజుల కాలం నుంచి ఉంది.
పూర్వం నుంచి భూములనే
నమ్ముకున్నాం
తాతలకాలం నుంచి అగస్తేశ్వరుని స్వామి భూములనే నమ్ముకుని జీవిస్తున్నాం. ఇప్పుడేమో దేవాదాయశాఖ అధికారులు ఈ భూములకు వేలంపాట పాడతామంటున్నారు. మద్రాసు హైకోర్టు, జిల్లా కోర్టులు కూడా భూములను తామే సాగుచేసుకునే విధంగా తీర్పులు ఇచ్చాయి. వేలంపాటే వస్తే మళ్లీ కోర్టుకెళతాం.
- చాపాటి చిన్నవీరయ్య,
తంబెళ్ల కులస్తుడు
తంబెళ్ల కులస్తులకు లేకుండా
చేయాలని చూస్తున్నారు
అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములను తంబెళ్ల కులస్తులకు లేకుండా చేయాలని చూస్తున్నారు. గతంలో అనేక మార్లు ప్రయత్నాలు చేశారు. న్యాయస్థానం మా వైపు మొగ్గుచూపింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కౌలుకు చేసుకుంటున్న భూములును లాక్కోవాలని చూస్తున్నారు. ఇది అన్యాయం.
- నరసింహులు, తంబెళ్ల కులస్తుడు
ఆలయ భూములపై తమ్ముళ్ల కన్ను
Published Sat, Feb 14 2015 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement
Advertisement