తమ్ముళ్లకు చెంపపెట్టు! | Cempapettu brothers! | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు చెంపపెట్టు!

Published Tue, Jan 6 2015 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

తమ్ముళ్లకు చెంపపెట్టు!

తమ్ముళ్లకు చెంపపెట్టు!

అధికారమే పెట్టుబడిగా ప్రజాధనం లూఠీకి తెలుగుతమ్ముళ్ల వేసిన ఎత్తులు చిత్తయ్యూరుు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. పోటీదారులను తప్పించి అధిక మొత్తానికి దక్కించుకున్న టెండర్లు రద్దు అయ్యాయి. రూ.26 కోట్లు కొల్లగొట్టాలన్న టీడీపీ నేతల అక్రమ ఆలోచనకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. తమ పార్టీకే చెందిన పోటీ దారులను సైతం ఒత్తిడి చేసి విరమింపజేసిన ఓ ఎంిపీ చర్యలకు తిరుగులేని ఎదురుదెబ్బ తగిలింది.
 
సాక్షి ప్రతినిధి, కడప: నేషనల్ హైవే 67 రోడ్డు విస్తరణలో భాగంగా వైఎస్‌ఆర్ జిల్లాలోని బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో టెండర్లుకు ఆహ్వానించారు. రూ.183 కోట్లు పనులకు ఈ పొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లును పిలిచారు. ఈ పనుల కోసం ఎస్‌ఆర్కే, రిత్విక్, బివిఎస్‌ఆర్, కెసిపిఎల్ కాంట్రాక్టు సంస్థలు పోటీ పడ్డాయి. అందులో మూడు కాంట్రాక్టు సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరో నేతకు అనుకూల మైనవి.

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తనయుడి ఆశీస్సులతో నాలుగో సంస్థ టెండర్ దాఖలు చేసింది. ముందుగా అనుకున్నట్లు మూడు సంస్థలు కాకుండా నాలుగో సంస్థ టెండర్ దాఖలు చేయడంతో టీడీపీ నేతలు ఖంగు తిన్నారు. ఆసంస్థ పోటీలో ఉంటే కాంట్రాక్టు పనులు దక్కవని పెద్ద ఎత్తున పైరవీలు చేయించారు. తుదకు బెదిరింపులకు సైతం దిగినట్లు తెలుస్తోంది. ఒత్తిడికి తలొగ్గిన ఆ కాంట్రాక్టు సంస్థ పోటీ నుంచి చివరి నిమిషంలో నిష్ర్కమించింది. దాంతో రిత్విక్, ఎస్‌ఆర్కే జాయింట్ వెంచర్‌కు 14.5శాతం అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారు.
 
ప్రజాధనం లూఠీకి పన్నాగం...
రూ.183 కోట్లు రోడ్డు విస్తరణ పనుల్ని 14.5శాతం అధిక రేట్లుకు ప్రభుత్వం కట్టబెట్టింది. సుమారు రూ.26.5 కోట్లు ప్రజాధనం లూఠీకి పాలకపక్షం అండగా నిలిచింది. తక్కువగా కోట్ చేసిన కేసిపిఎల్‌ను విత్‌డ్రా చేపించడంతోనే టీడీపీ నేతల ఎత్తుగడలు సఫలం అయ్యాయి. ఆమేరకే 14.5 శాతం అధికంగా కోట్ చేసిన రిత్విక్, ఎస్‌ఆర్కే జాయింట్ వెంచర్‌కు టెండర్ ఖరారైంది. మరో రెండు సంస్థలు ఒకటి 20, మరొకటి 21 శాతం అధిక రేట్లుకు టెండర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

14.5 శాతం అధిక మొత్తానికి టెండర్లు ఖరారు చేయడం వల్ల సుమారు రూ.26.5 కోట్లు ప్రజాధనం లూఠీకి ఆస్కారం ఏర్పడింది. ఈపరిణామాన్ని ఈనెల 31న సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఆమేరకు కేంద్రప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వెళ్లారుు. వైఎస్సార్ జిల్లాలోనే రూ.26.5 కోట్లు లూఠీ అవుతోందని, మొత్తం పనుల్లో సుమారు రూ.100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఆమేరకు టెండర్లును రద్దు చేస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ హైవే ఎస్‌ఈ ధ్రువీకరించారు.
 
 ఒక్క టెండర్‌తో గట్టేక్కాలని...
 కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ కాంట్రాక్టర్ గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుమారు రూ.13కోట్లు పార్టీ ఫండ్‌గా ఖర్చు చేసినట్లు సమాచారం. ఒకే ఒక్క పని దక్కించుకుని ఎన్నికల ఖర్చును రాబట్టుకోవాలి అనుకున్నట్లు ఉంది. ముందస్తు వ్యూహం ప్రకారం ఎన్‌హెచ్-67 రోడ్డు టెండర్ పనులు దక్కించుకున్నారు.

14.5 శాతం అధిక రేట్లుకు దక్కించుకున్న ఆ కాంట్రాక్టు పనుల్ని కడప నగరంలో ఉన్న కాంట్రాక్టు సంస్థకు సగం, మరో సంస్థ సగం ప్రభుత్వ రేట్లకు చేసుకునేలా తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధిక రేట్లు మేరకు లభించే మొత్తం టీడీపీ ఎంపి ఒకరు, రాజకీయల్లో చేరిన కాంట్రాక్టర్‌కు సమభాగాలుగా నిర్ణయించుకున్నారు.

అంటే ప్రభుత్వం నుంచి అప్పనంగాా లభించే రూ26.5 కోట్లు ప్రజాధనంలో సగం వాటా కాంట్రాక్టర్‌గా ఉండి రాజకీయ నేతగా మారిన వ్యక్తికి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు మొత్తం ఈ ఒక్క కాంట్రాక్టు పనులు దక్కడంతో సాధ్యమైందని పలువురు భావిస్తున్నారు. అరుుతే ఆ ఇరువురి నేతల వ్యూహం బెడిసింది. ఎన్‌హెచ్-67 రోడ్డు పనులు రద్దు అయ్యాయి. మరోమారు టెండర్లుకు పిలవనున్నారు. తాత్కాలికంగా తెలుగుతమ్ముళ్లు అక్రమ సంపాదనకు బ్రేకులు పడ్డాయి. ప్రజాధనం లూఠీకి అడ్డుకట్ట పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement