br ambedkar university
-
ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
ఎచ్చెర్ల క్యాంపస్: ‘రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు. తక్షణమే రాజీనామా చేయండి..’ అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ ఆచార్య కేఆర్ రజిని, రిజిస్ట్రార్ పి.సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్ ఎదుట గురువారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు.ముందుగా వీసీ వద్దకు వెళ్లి ‘ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అది మీకు అనవసరం..’ అని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ చాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు.అనంతరం ‘మీరు రాజీనామా ఎలా చెయ్యరో చూస్తాం..’ అంటూ వీసీని హెచ్చరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి రాజీనామా చేయాలని వీసీకి పలుమార్లు హెచ్చరికలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఏకంగా వీసీ రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీసీని అవమానించడం అన్యాయందళిత వీసీని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అవమానించడం, బెదిరించడం అన్యాయమని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత, రెక్టార్ అడ్డయ్య, ఓఎస్డీ కావ్య జ్యోత్స్న తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పడిన 16 ఏళ్ల తర్వాత దళిత మహిళకు వీసీగా అవకాశం వస్తే అడ్డగోలుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై జాతీయ మహిళా కమిషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.వైస్ చాన్సలర్ రజిని జనవరి 18న బాధ్యతలు చేపట్టారని, మూడేళ్లు కొనసాగుతారని స్పష్టంచేశారు. బలవంతపు రాజీనామాలు అన్యాయమని ఖండించారు. వీసీ చాంబర్ ఎదుట ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టపరంగా వర్సిటీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యూనివర్సిటీలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణకు సైతం ఆటంకం కలిగించారన్నారు. -
పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను శనివారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. సీతారామారావు ఆవిష్కరించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయని డీన్ ఆనంద్ పవార్ పేర్కొన్నారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 10 అని వెల్లడించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇ. సుధారాణి, షకీలా ఖానం, వడ్డాణం శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు. -
పరీక్షకు హాజరైన సినీ నటి హేమ
సాక్షి, నల్లగొండ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 580 మంది హాజరయ్యారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ నటి హేమ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్లైన్లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. అర్హత సాధించిన అ«భ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. -
వైఎస్ మాట..విశ్వవిద్యాలయానికి బాట
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 1980వ సంవత్సరం నుంచి జిల్లా ప్రజలు ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక కమిటీలు వేశాయి. అయినా విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2008వ సంవత్సరం జూన్ 25న జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని మంజూరు చేసి ఏర్పాటు చేశారు. గార మండలం కళింగపట్నానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏయూ ప్రొఫెసర్ చోడిపల్లి వెంకట సుధాకర్‌ను తొలి వైస్‌చాన్స్‌లర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో కీలకంగా మారింది. వర్సిటీలో ఎల్ఎల్బీ, గణితం, జియోఫిజిక్స్, ఫిజిక్స్, జియాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంసీఏ, ఎఈడీ, యోగా డిప్లమో, ఎంఎల్ఐఎస్సీ, బీఈడీ మెంటల్లీ రి టార్డ్, బయోటెక్నాలజీ, తెలుగు, సోషల్ వర్క్, ఎల్ఎల్ఎం, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎంకాం, ఎంజేఎంసీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సులు ఉన్నాయి. కోర్సులు విస్తరిస్తూ విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. ప్రత్యేక దృష్టి పెడితే ఈ వర్సిటీ రాష్ట్రంలోనే ఉత్తమ వర్సిటీగా రూపొందే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. విద్యా ప్రగతితోనే ప్రాంతీయ అభివృద్ధి విద్యా ప్రగతితేనే ప్రాంతీయ అభివృద్థి సాధ్యమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. అందుకే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం విద్యార్థులు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకునేవారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని రానున్న ప్రభుత్వాలు ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన సంస్థగా తీర్చి దిద్దాలి. -మిర్యాల చంద్రయ్య,మాజీ ఇన్చార్జ్ వైస్‌చాన్సలర్ -
స్టూడెంట్లకు వల..!
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయంలో పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్‌లో రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సెమిస్టర్ పరీక్షలు కీలకం. 2019 సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ కన్సల్టెన్సీలు విద్యార్థులను సర్వేల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ సమయంలో తాయిళాలకు ఆశ పడితే విద్యార్థుల భవిష్యత్ దారుణంగా దెబ్బ తింటుంది. రోజుకు రూ.700 సైతం ఇచ్చేందుకు కన్సల్టెన్సీలు సిద్ధమవుతుండడంపై చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి తోడు ఇదివరకు ఎప్పుడూ ఇంత ఉద్ధృతంగా విద్యార్థులతో సర్వేలు ఎవరూ జరిపించలేదు. దీంతో ఈ కన్సల్టెన్సీల వెనుక అధికార పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నివేదిక ఆధారంగా ఎన్నికలకు సిద్ధం కావచ్చన్నది రాజకీయ పార్టీల ప్రధాన వ్యూహం. వర్సిటీలో సర్వే సామర్థ్యం, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న ఎంబీఏ, ఎంకాం, ఎకనామిక్స్, సోషల్ వర్క్ వంటి విభాగాల విద్యార్థులపై ఎక్కువగా సర్వే కన్సల్టెన్సీలు దృష్టి పెడుతున్నాయి. అధ్యాపకులు కూడా ఈ సర్వేలకు వ్యతిరేకంగానే ఉన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో సామాజిక అనుసంధాన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శనివారం సర్వేలు నిర్వహిస్తుంటారు. వర్సిటీ బోధన సిబ్బంది సమక్షంలో ఈ సర్వేలు జరగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ అధికారులు మాత్రం ప్రైవేటు సర్వేలకు విద్యార్థులకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. అధికారులకు సంబంధం లేకుండా సర్వేలకు వెళితే మాత్రం నియంత్రించటం కష్టం. ప్రస్తుతం గ్రామాల్లో సర్వే బృందాలకు, అధికార పార్టీ అనుకుల సర్వేలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర కేసుల్లో ఇరుక్కుంటారు సర్వేలకు వెళ్లటం వల్ల విద్యార్థులు అనవసర కేసుల్లో ఇరుక్కుం టారు. అధికార పార్టీ యువతను ఎక్కువగా సర్వేలు పేరుతో వాడుకుంటుంది. ప్రైవేట్ సంస్థలకు సర్వేలు అప్పగిస్తుంది. విద్యార్థులు అప్రమతంగా ఉండాలి. గ్రామాల్లో సమస్యలు ఎదురు కావచ్చు. పోలీస్ కేసులు నమోదు కావచ్చు. భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని సర్వేలకు విద్యార్థులు దూరంగా ఉండాలి.– మొదలవలస చిరంజీవి, హైకోర్టు న్యాయ వాధి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థులను పిలుస్తున్నారు విద్యార్థులను ప్రెవేట్ కన్సల్టెన్సీ లు సర్వేల కోసం పిలుస్తున్నాయి. అయితే విద్యార్థులు మాత్రం ఆసక్తి చూపించటం లేదు. విద్యార్థి యూనియన్‌గా విద్యార్థులకు సర్వేలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నాం. విద్యాసంస్థల్లో విద్యార్థులను సర్వేలకు ఆహ్వానించటం మంచి పద్ధతి కాదు.– బి.నరేంద్ర చక్రవర్తి, ఏబీవీపీ యూనియన్ నాయకులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. చదువు పై దృష్టిపెట్టాలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. విద్యార్థులు వారి వద్దకు వెళ్లవద్దు. తరగతులకు హాజరై చదువు ప్రాధాన్యమివ్వాలి. విలువైన సమయం దుర్వినియోగం అవుతుంది. సర్వేల కోసం ప్రైవేట్ సంస్థలు విద్యార్థులను నేరుగా కలిస్తే సమస్య మా దృష్టికి తీసుకురావాలి.– ప్రొఫెసర్ కె.రఘుబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం -
తర'గతి' ఇలా!
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వర్సిటీ పునఃప్రారంభమైంది. అయితే తరగతులు నిర్వహించాల్సిన పనిదినాల్లో బోధన సిబ్బందికి వర్సిటీ అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఇంజినీరింగ్ మినహాయించి 22 విభాగాల పీజీ బోధన సిబ్బందికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాం కింద శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహాత్మా గాంధీ గ్రామీణ విద్యా మండలి ఈ శిక్షణ నిర్వహిస్తుంది. శిక్షణలో 90 మంది పైబడి బోధన సిబ్బంది పాల్గొంటున్నారు. ఇంజినీరింగ్‌కు మాత్రం వర్సిటీలో ఉన్న ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ మూడు బ్రాంచ్‌ల్లో ఒక్క విద్యార్థి వచ్చినా తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 40 శాతం పైబడి విద్యార్థులు ప్రస్తుతం హాజరవుతున్నారు. పీజీ కోర్సుకు సంబంధించి విద్యార్థులు వచ్చి వెనుదిరుగుతున్నారు. ఎంసీఏ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితం, బయోటెక్నాలజీ వంటి కోర్సులకు సంబంధించి 40 శాతం పైబడి విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. అధ్యాపకులు రాకపోవడంతో ఒక పూట ఉండి వెనుదిరుగుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా సెలవు తీసుకుంటున్నారు. మరో పక్క శిక్షణకు సైతం పూర్తిస్థాయి బోధన సిబ్బంది హాజరు కావటం లేదు. చాలా మంది వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. శిక్షణకు హాజరై వెళ్లి పోతున్న బోధన సిబ్బంది సైతం ఉన్నారు. కనీసం తరగతులుకు ఇబ్బంది లేకుండా షిప్టులు వారీగా శిక్షణ ఇచ్చినా సరిపోయేది. సెలవులు ఇవ్వాల్సింది క్లాస్ వర్క్‌కు సెలవు ప్రకటించాల్సింది. లేదంటే తరగతులు అయినా నిర్వహించాలి. తరగతులు జరిగే సమయంలో బోధన సిబ్బందికి శిక్షణ ఇస్తుండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. – వి.అనిల్, జర్నలిజం మొదటి ఏడాది విద్యార్థి విద్యార్థులు పూర్తిస్థాయిలో రావటం లేదు విద్యార్థులు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల అనంతరం పూర్తిస్థాయిలో రావటం లేదు. క్లాస్ వర్కు గాడిన పడేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో బోధన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బోధకులకు శిక్షణ, బోధనా నైపుణ్యాలు అవసరం.– రిజస్ట్రార్, ప్రొఫెసర్ కె.రఘుబాబు. -
నేడే నరసింహన్ రాక
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర గవర్నర్ ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ సోమవారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పర్యటనకు చాన్సలర్ హోదా లో ఆయన వస్తున్నారు. విశ్వ విద్యాలయం ఏర్పాటయ్యాక ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. గవర్నర్ పర్యటన నేపథ్యంలో వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను పక్కాగా రూపొందించారు. వర్సిటీలో జాతీయ రహదారి నుంచి పరిపాలన కార్యాలయం వరకు తారు రోడ్డు నిర్మాణం, భవనాలు మరమ్మతులు, రంగులు వేయటం, మొక్కలు ఆకర్షణీయంగా నాటటం వంటివి పూర్తి చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు గవర్నర్ వర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.1.70 కోట్లతో నిర్మించిన మహిళా వసతి గృభ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ భవనంలోనే ఆయనకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. 11 గంటలకు వర్సిటీకి గవర్నర్ చేరుకుంటారు. అనంతరం వరుసగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయటం, పాలక మండలి సభ్యులతో సమావేశం, అధికారులతో సమీక్ష సమావేశం, వీసీ నివేదిక ప్రకటన, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత సేపు మాట్లాడనున్నారు. జాతీయ సేవాపథకం, సామాజిక అనుసంధాన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టకేలకు.. బీఆర్‌ఏయూను మొదటిసారి వర్సిటీ చాన్సలర్, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సందర్శిస్తున్నా రు. వాస్తవంగా వర్సిటీలో ఏటా స్నాతకోత్సవం నిర్వహించాలి. ఈ స్నాతకోత్సవంలో వర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొనాలి. అయితే ఇక్కడ వర్సిటీ ఏర్పాటై పదేళ్లవుతున్నా ఒక్కసారి కూడా గవర్నర్ రాలేదు. స్నాతకోత్సవం సైతం ఒక్కసారి మాత్రమే జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 23న స్నాతకోత్సవం జరిగింది. అప్పుడు కూడా గవర్నర్ వస్తారనే అంతా భావించారు. కానీ చివరి క్షణంలో ఆయన పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో అన్ని వర్సిటీలను గవర్నర్లు సందర్శించాలని, ప్రగతి తెలుసుకోవాలని రాష్ట్రపతి సూచనలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మొదటిసారి బీఆర్‌ఏయూ పర్యటనకు వస్తున్నారు. వేధిస్తున్న సమస్యలు.. ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం 2008 జూన్ 25న ఏర్పాటు చేశారు. ఆంధ్రావిశ్వవిద్యాలయం పీజీ కేంద్రాన్ని వర్సిటీగా ఉన్న తి కల్పించారు. అయితే వర్సిటీ ఏర్పాటు తర్వాత ప్రగతిపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం మాత్రం డిమాండ్ కోర్సులు, ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం వర్సిటీలో 22 కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించారు. సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లు ప్రారంభించారు. 180 సీట్లకు 178 ప్రవేశాలు జరిగాయి. వచ్చే ఏడాది సివిల్, కెమికల్ ఇంజినీరింగ్‌లు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో వర్సిటీ కోర్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటేనే ఇంజినీరింగ్ కళాశాల బలోపేతం సాధ్యమవుతుంది. వర్సిటీ ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ 12(బి), నాక్, ఎన్బీఏ వంటి గుర్తింపులు లేవు. ఎల్ఎల్బీ కోర్సుకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు. ఈ ఏడాది వర్సిటీలో ప్రవేశానికి సొంతంగా బీఆర్‌ఏయూ ఎస్కేఎల్ఎం సెట్ నిర్వహించారు. సోషల్ వర్కు, ఎంఎల్ఐఎస్సీ, ఎంసీఏ, ఎల్ఎల్ఎం, రూరల్ డెవలఫ్ మెంట్, ఎంఈడీ, జియోలజీ, ఎంజేఎంసీ, ఇంగ్లీష్ వంటి కోర్సుల్లో కనీస ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ కోర్సుల మనుగడ సైతం కష్టంగా మారుతుంది. ప్రస్తుతం వర్సిటీకి ఐదు ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్, 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరయ్యాయి. అవి భర్తీ దశలో ఉన్నాయి. గత నెల 27 నుంచి 29 వరకు ఐదు ప్రొఫెసర్, 8 అసోసియేట్ ప్రొఫెసర్, రెండో బ్యాక్ లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. కోర్టు వివాదం నేపథ్యంలో నియామకాలు ప్రస్తుతం నిలిచిపో యాయి. వర్సిటీ ప్రగతి సాధించాలంటే బడ్జెట్ పెంచటం, సిబ్బం దిని పెంచడం, పరీక్షల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేయడం చాలా అవసరం. -
అంబేడ్కర్ వర్సిటీకి కొత్త రిజిస్ట్రార్
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కొత్త రిజిస్ట్రార్‌గా ఏయూ ఇంజినీరింగ్ కెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం జరిగిన బీఆర్‌ఏయూ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ తులసీరావు పదవీకాల ఏప్రిల్ ఒకటితో ముగియనుంది. ఈయన రెండేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. టెర్మ్ పెంచుకునే అవకాశమున్నా... వైస్ చాన్సలర్ సిఫారసుతో పాటు పాలక మండలి, ఉన్నత విద్యా మండలి అనుమతితో ఏటా పదవీ కాలన్నీ పెంచుకునే సౌలభ్యం ఉంది. 1991 విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏటా రెన్యువల్ చేస్తూ ఆరేళ్ల వరకు కొనసాగించవచ్చు. ఇదే వర్సిటీలో ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ ఆరేళ్లు దాటి పనిచేశారు. టెర్మ్‌లు పెంచడం, అన్టిల్ ఫర్దర్ ఆర్డర్ (తాత్కాలిక ఉత్తర్వులు)తో సుదీర్ఘంగా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. 2009 సెప్టెంబర్ 16 నుంచి 2016 మార్చి 31 వరకు ఆయన కొనసాగారు. 2016 మార్చి 31న తులసీరావు నియమించగా ఏప్రిల్1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు వర్సిటీలో ముగ్గురు రెగ్యులర్ రిజిస్ట్రార్లు పనిచేశారు. నాలుగో రిజిస్ట్రార్‌గా ఏయూ సీనియర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్(హెచ్ఓడీ) కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. వర్సిటీలో మొదటి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ జి.జ్ఞానమణి 2008 ఆగస్టు 25 నుంచి 2009 ఆగస్టు 25 వరకు కొనసాగారు. వీసీ ఎస్వీ సుధాకర్‌తో పొసగకపోవటంతో ఏడాదికే పరిమితం చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అనంతరం 2009 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలం ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫె సర్ బిడ్డిక అడ్డయ్య కొనసాగారు. 2017 డిసెంబర్ 8న బాధ్యతలు స్వీకరించిన వీసీ కూన రామ్‌జీ రిజిస్ట్రార్ మార్పునకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పాలక మండలి సభ్యులు విభేదించడంతో టెర్మ్ కోసం ఎదురు చూశారు. మరోవైపు వీసీ ప్యానల్లో రామ్‌జీ, తులసీరావు పేర్లు చివరి వరకు కొనసాగాయి. తులసీరావు స్థానిక ప్రొఫెసర్. రామ్‌జీ కంటే సీనియర్. మరోవైపు జిల్లా నుంచి రిజిస్ట్రార్‌గా పనిచేసింది ప్రొఫెసర్ తులసీరావు ఒక్కరే కావడం గమనార్హం. మిగిలిన వారంతా ఏయూకు చెందిన వారే. ఏయూ వీసీగా నాగేశ్వరరావు కొనసాగి న సమయంలో రిజిస్ట్రార్‌గా తులసీరావు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత వీసీ తనకు అనుకూలమైన పాలనా సౌలభ్యం కోసం పలు మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనకు అనుకూలమైన వ్యక్తిని రిజిస్ట్రార్‌గా తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 1న బాధ్యతల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నాలుగో రెగ్యులర్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన వీసీ రామ్‌జీకి సన్నిహితుడు. మరోవైపు స్థానిక ప్రొఫెసర్లు సైతం రిజిస్ట్రార్ పదవిని ఆశించినా వీసీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇద్దరూ ఏయూ వారే... అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.రాంజే ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యులు కాగా, రఘుబాబు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆచార్యులు. వీరిద్దరికీ శ్రీకాకుళంతో అనుబంధం కలిగి ఉండటం విశేషం. వర్సిటీలో పలు కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. రఘుబాబు గతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా ఏడాదికాలం పనిచేశారు. తాజాగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. రెండు విశ్వవిద్యాలయాలకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఘనత రఘుబాబుకు దక్కుతుంది. ఈయన ప్రస్తుతం ఏయూ గెస్ట్‌హౌస్‌ల డీన్‌గా వ్యవహరిస్తున్నారు. రూ. 91 కోట్లతో బడ్జెట్ ఆమోదం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో రూ.91 కోట్లతో బడ్జెట్ ఆమోదించారు. ప్రధానంగా వర్సిటీ బడ్జెట్, రిజస్ట్రార్ మార్పుపైనే సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్యానాథ్, ఉన్నత విద్యా మండలి అధికారులు, వర్శిటీ అధికారులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, కె.బాబూరావు, కె.వి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి నిర్ణయాలివే.. ♦ వర్సిటీకి రూ. 91.70 కోట్లు నిధులు కేటాయించాలని తీర్మానం. ♦ రూ.60 కోట్లు పనులను కేంద్ర ప్రజా పనుల ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించాలని నిర్ణయం. ♦ రిజిస్ట్రార్‌గా ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కొరుపోలు రఘుబాబు నియామకం. ♦ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావును ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ల బాధ్యతలు అప్పగింత. ♦ అకడిమిక్ అఫైర్స్ డీన్‌గా ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నియామకం. ♦ డాక్టర్ యు.కావ్యజ్యోత్స్నకు మహిళా వసతి గృహం చీఫ్ వార్డెన్, రీ వేల్యుయేషన్ డీన్‌గా బాధ్యతలు అప్పగింత. ♦ డాక్టర్ కె.స్వప్నవాహినికి బయోటెక్నాలజీ హెచ్ఓడీగా, పేపర్ సెట్టింగ్స్ డీన్‌గా, పీజీ ప్రవేశాల సెట్ సహాయ కన్వీనర్లగా నియామకం. ♦ కామర్స్ విభాగం బలోపేతానికి రూ.13 లక్షల కేటాయింపు. ♦ నిపుణులు, ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలని తీర్మానం. -
సెమిస్టర్ ఫలితాలపై పెల్లుబికిన ఆగ్రహం
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 26న విడుదలైన డిగ్రీ మొదటి, మూడు, ఐదు సెమిస్టర్ ఫలితాలపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య మూల్యాంకనం, పరీక్షల నిర్వహణే కారణమని మండిపడ్డారు. మొదటి సెమిస్టర్లో 22,145 మంది పరీక్ష రాయగా, 7,439 మంది(39.59 శాతం), మూడో సెమిస్టర్లో 16,320 మందిగాను 5,660 మంది(34.68శాతం), ఐదవ సెమిస్టర్లో 10,112 మందికిగాను 4,625 మంది(45.74 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ వీసీ కార్యాలయం ముందు గురువారం ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని నిరసన తెలిపారు. వీసీ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అదే సమయంలో పరీక్ష నిర్వహణ వాహనం వెళుతుండగా.. దానిని అడ్డుకున్నారు. వీసీ బయటకు రావాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నా వద్దకు వీసీ కూన రామ్‌జీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు చేరుకుని విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరైనా కానట్లు చూపుతున్నారు మొదటి, రెండు సెమిస్టర్లలో పాస్ అయిన వారు ప్రస్తుతం ఫెయిల్ అయ్యారని, తొలి రెండు సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారు పాస్ అయ్యారని విద్యార్థులు వివరించారు. అన్ని పరీక్షలకు హాజరైనా హాజరు కానట్లు కొందరు విద్యార్థులకు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికి ఐదు సెమిస్టర్లు పూర్తయిన విద్యార్థులకు మార్కుల జాబితా హార్డు కాపీలు అందలేదని తెలిపారు. ఫెయిల్ అయినట్లు చూపిస్తున్న విద్యార్థులకు.. తామకు ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం తెలియడం లేదని పేర్కొన్నారు. కెమిస్ట్రీ, గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్, జువాలజీ పరీక్షలు మెరుగ్గా రాసినా ఫెయిల్ అయ్యామని వాపోయారు. మొత్తం జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యార్థులు, అధికారులతో వీసీ చర్చించారు. అకడమిక్ ఆడిట్ కమిటీ ఏర్పాటు విద్యార్థుల జవాబు పత్రాల పరిశీలనకు అకడమిక్ ఆడిట్ వేస్తామని వెల్లడించారు. పరీక్ష మెరుగ్గా రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రిన్సిపాళ్లకు జాబితా ఇవ్వాలని సూచించారు. ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో లోపాలు బయటపడితే.. అన్ని పశ్నపత్రాలు మూల్యాంకనం చేస్తామని తెలిపారు. ఇన్స్టెంట్, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ ఉన్నత విద్యామండలిపై అ«ధారపడిఉంటుందని, వారి దృష్టికి సమస్య తీసుకువెళతామన్నారు. విద్యార్థుల మార్కుల జాబితాల హార్డ్ కాపీలు పరీక్షలు పూర్తయిన వెంటనే కళాశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. దీంతో విద్యార్థులు శాంతించి వెనుదిరిగారు. విద్యార్థులకు అఖిల భారత విద్యార్థిపరిషత్ జిల్లా సంఘటనా కార్యదర్శి తురకా ప్రసాద్ మద్దతు తెలిపారు. -
దరఖాస్తుల వెల్లువ
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 32 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 అసో షియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఒక్క రోజు గడువు ఉండటంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల సంఖ్య ఒక్కసారి పెరి గింది. సోమవారం ఒక్క రోజు 1500 దరఖాస్తులు రాగా, మంగళవారం 800 వరకు వచ్చాయి. ఇప్పటివరకుసుమారు 3000దరఖాస్తులు చేరాయి. మొత్తం 3500 వరకు దరఖాస్తులు రావచ్చునని వర్సిటీ అధి కారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో అంబేడ్కర్ వర్సిటీ అధికారులు న్యాయపరమైన సమస్యలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్యాక్లాగ్, రిజర్వేషన్, రోస్టర్ వంటి అంశాలపై నిపుణులను సంప్రదించి ముందుకు సాగుతున్నారు. -
కళా x చౌదరి!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అధికారికంగా ఖరారు కానప్పటికీ.. జనవరి మెుదటి వారంలో పర్యటన ఉండే అవకాశం ఉంది. ఎస్ఎంపురం పరిధిలో ట్రిఫుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో రూ.18 కోట్లుతో నిర్మించిన అకడిమిక్ బ్లాక్ ప్రారంభోత్సవం, ఎస్.ఎం.పురం గ్రామంలో జన్మభూమి గ్రామ సభ నిర్వహించేలా కార్యక్రమాలను అధికారులు రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం స్థలాల పరిశీలన, అధికారులకు పలు సూచనలు సైతం చేశారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన చౌదరి ధనలక్ష్మి సొంతఊరు, దత్తత గ్రామమైన ఎస్.ఎం.పురంలో జన్మభూమి–మన ఊరు కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహానికి ఫోన్ చేసి కోరడంతోపాటు.. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా గ్రామ సభ ఎలా నిర్వహిస్తారని నిలదీయడంతో రద్దు చేసినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తమ సొంత గ్రామంలో జన్మభూమి–మన ఊరు గ్రామ సభ రాజకీయంగా బలపడాలని, తమవర్గాన్ని బలోపేతం చేసుకోవాలన్న జెడ్పీ చైర్పర్సన్ వ్యూహం బెడిసి కొట్టింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి సైతం ఈ విషయాన్ని చైర్పర్సన్ భర్త, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నారాయణమూర్తి (బాబ్జీ) తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకోలేదని సమాచారం. మరోపక్క జెడ్పీ చైర్పర్సన్ వర్గాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎమ్మెల్యే కళావెంకటరావు కసరత్తులు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ఎంపురంలో గ్రామ సభను పెట్టకుండా అడ్డుకోవటం ఎంత వరకు న్యాయమనే అంశంపై చైర్పర్సన్ భర్త బాబ్జీ ఎచ్చెర్ల మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కొంతమంది వాట్సాఫ్‌లో సమాచారాన్ని ఎమ్మెల్యే కళావెంకటరావుకు చేరవేశారు. కళా, చౌదరి వర్గాల మధ్య వర్గపోరుకు ఈ సంఘటన ఉదాహరణగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. సొంత సామాజిక వర్గం దూరం! సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే చౌదరి దంపతులకు దూరమవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొయ్యాం గ్రామానికి చెందిన ఓ నాయకుడుని జెడ్పీచైర్‌పర్సన్ వర్గం పార్టీలో చేర్చుకోవడానికి అనుమతులు ఇవ్వగా..దాన్ని కళా వర్గం అడ్డుకుంది. తరువాత ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశాక ఎట్టకేలకు అతన్ని చేర్చుకున్నారు. ఎచ్చెర్ల మండలంలో చైర్పర్సన్ సొంత సామాజిక వర్గం నాయకులే ఆమెకు అండగా నిలబడే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుత చైర్పర్సన్ భర్త బాబ్జీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైర్మన్ పేనల్గా ఉన్న ఆయన భార్య ధనలక్ష్మికి జెడ్పీటీసీ టిక్కెట్ రాకుండా సైతం కళావర్గం అడ్డుకుంది. దీనికి చౌదరి బాబ్జీ సొంత సామాజక వర్గానికి చెందిన కొత్తపేట నాయకులే వ్యూహాన్ని ముందుండి నడిపారు. ప్రస్తుతం 28 పంచాయతీల్లో ఫరీదుపేట, కేశవరావుపేట, కుశాలపురం గ్రామాల నాయకులు మాత్రమే బాబ్జీకి అండగా ఉంటున్నారు. మిగతా వారందరు కళా వర్గానికి చేరువవుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన కొ య్యాం, అజ్జరాం నాయకులు సైతం ఎమ్మెల్యే వర్గంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ హోదా, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు మద్దతు చౌదరి దంపతులకు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వర్గాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపించటం లేదు. చాపకింద నీరులా చౌదరి బాబ్జీ కుటుంబాన్ని రాజకీయంగా అణగ తొక్కాలన్న ప్రయతాన్ని కళావెంకటరావు ప్రారంభించారు. రాజాం నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే కళా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా.. స్థానిక నాయకుడైన బాబ్జీ వర్గం దాన్ని తిప్పికొట్టలేక పోతుంది. మరో పక్క సొంత మండలమైన ఎచ్చెర్లలో బాబ్జీ దంపతులకు క్రమేపీ బలం తగ్గుతోంది. భవిష్యత్తులో కళావెంకటరావు మంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పంచన చేరేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు ఆయనకు దగ్గరయ్యేకు ప్రయత్నిస్తున్నారు. -
రెండేళ్ల కోర్సుతో కళాశాలలు మూతపడుతున్నాయి
► వర్సిటీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి సమస్య తీసుకువెళ్లాలి ► ఇన్చార్జి వీసీకి బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్ల వినతి ఎచ్చెర్ల క్యాంపస్ : జిల్లాలోని 17 బీఈడీ కళాశాలల ప్రధానాచార్యులు, కార్యదర్శులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిపాలన కార్యాలయంలో ఇన్చార్జి వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యతో బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు తమ సమస్యలు వివరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో బీఈడీ కళాశాలలు మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీఈడీ కళాశాలల పరిస్థితిపై సమీక్షించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి ( ఎస్సీ టీఈ) సంస్థ 2015-16 విద్యా సంవత్సం నుంచి రెండేళ్లు బీఈడీ కోర్సు పరిమితిగా మార్పు చేసిందని, ఏడాది నుంచి రెండేళ్లు కోర్సు చేయటం వల్ల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. 90 శాతం ప్రవేశాలు జరిగే బీఈడీలో ప్రస్తుతం 20 శాతం జరుగుతున్నాయని, మరో పక్క కన్వీనర్ కోటాల్లో సీట్లుకే ప్రవేశాలు పరిమితం అవుతున్నాయని, మేనేజ్మెంట్ కోటాలో కనీసం ప్రవేశాలు జరగటం లేదని వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తే ప్రవేశాలు 10 శాతం సైతం జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి, నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు కళాశాలలు నిర్వహిస్తే నష్టాల్లో కళాశాలల నిర్వహణ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేవారు. వర్సిటీ ద్వారా ఉన్నత విద్యా మండలికి సమస్యలు తెలియజేయాలని, ఉన్నత విద్యా మండలి బీఈడీ కళాశాలల పరిస్థితి జాతీయ ఉపాధ్యాయ మండలి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. సమస్యలు వివరించిన వారిలో బీఆర్‌ఏయూ పాలక మండలి సభ్యులు బరాటం లక్షణరావు, ప్రిన్సిపాళ్లు అంబటి రంగారావు, బమ్మిడి సన్యాసిరావు, నర్సింహమూర్తి ఉన్నారు. -
యోగా కోర్సులో 70 మందికి ప్రవేశాలు
ఎచ్చెర్ల: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో యోగా కోర్సులో చేరేందుకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ జరిపారు. 53 మందికి ఏడాది యోగా పీజీ డిప్లమా, 17 మందికి ఆరు నెలల యోగా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశ పత్రాలను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అందజేశారు. యోగాకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని వీసీ చెప్పారు. కౌన్సెలింగ్‌లో యోగా కోర్సు కో ఆర్డినేటర్ డాక్టర్ తారక రామారావు, ప్రిన్సిపాల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
యోగా కోర్సులో 70 మందికి ప్రవేశాలు
ఎచ్చెర్ల: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో యోగా కోర్సులో చేరేందుకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ జరిపారు. 53 మందికి ఏడాది యోగా పీజీ డిప్లమా, 17 మందికి ఆరు నెలల యోగా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశ పత్రాలను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అందజేశారు. యోగాకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని వీసీ చెప్పారు. కౌన్సెలింగ్‌లో యోగా కోర్సు కో ఆర్డినేటర్ డాక్టర్ తారక రామారావు, ప్రిన్సిపాల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రవేశాలపై దృష్టి సారించారు!
బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది పీజీ ప్రవేశాలు తగ్గడంతో అధికారులు మేల్కొన్నారు. విద్యార్థులు ఎక్కువ మంది చేరేలా దృష్టిసారించారు. శుక్రవారం నుంచి అంతర్గత కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. విద్యార్థుల ప్రవేశాలు తగ్గితే పీజీ విద్య బలహీన పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రకటిస్తున్న గ్రేడింగ్‌లో వెనుక బాటు తప్పదు. ప్రస్తుతం వర్సిటీ సీ గ్రేడ్‌లో ఉంది. ఇదే పరిస్థితి ఉంటే.. బోధకుల నియామకం, ప్రత్యేక నిధుల మంజూరు విషయంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు జాగ్రత్తపడుతున్నారు. ఎచ్చెర్ల: యూనివర్సిటీలో ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఈ సమస్య లేకుండా ముందుగానే దీన్ని గట్టెక్కాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 80 శాతం దాటి ప్రవేశాలు సాధించాలని ఆలోచన చేస్తున్నారు. నిబంధనలను సైతం అవసరం మేరకు సడలిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది డిగ్రీ తృతీయ ఏడాది 3,300 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు. ఇన్స్టెంట్ పరీక్షల్లో 630 మంది పాసయ్యూరు. వీరందరూ పీజీలో చేరేందుకు అర్హులు. అయితే అడ్మిషన్లు మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదు. ప్రస్తుతం రెండో విడత ఆసెట్ కౌన్సెలింగ్ తరువాత 14 కోర్సుల్లో 500 సీట్లకు 122 సీట్లు నిండాయి. మరో పక్క గతనెల 28, 29, 30 తేదీల్లో ఏయూలో నిర్వహించిన మూడో విడత కౌన్సెలింగ్‌లో మాత్రం కొన్ని కోర్సుల్లో ఎలాట్మెంట్లు మెరుగ్గా లభించాయి. విద్యార్థులు ఎంత మేరకు రిపోర్టు చేస్తారో చూడాలి. మొదటి, రెండో విడతల్లో విద్యార్థులు కళాశాలల్లో సీట్లు వచ్చి చేరక పోయినా, ప్రవేశాలు కోల్పోరు. తుది విడత కౌన్సెలింగ్‌లో చేరకపోతే మాత్రం సీటు కోల్పోవాల్సి వస్తుంది. మూడు విడత కౌన్సెలింగ్‌లో ఇంగ్లిష్, తెలుగ, గణితం, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 40 కి 40, బయోటెక్నాలజీ 30 కి 30 , ఎంకామ్‌లో 40 కి 39 ఎలాట్మెంట్లు లభించాయి. విద్యార్థులు ఇంకా రిపోర్టు చేయూల్సి ఉంది. అయితో ఈ కోర్సుల్లో సీట్ల కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న అంతర్గత కోర్సులకు విద్యార్థులు వస్తున్నారు. ఈ నే పణ్యంలో ప్రస్తుతం ఎంకామ్‌లో 20, గణితంలో 10, తెలుగులో ఐదు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐదు సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఎంఎడ్ ప్రస్తుత ఫీజు స్ట్రక్చర్ రూ.21,900 ఉంది. గతంలో ఈ కోర్సుకు డిమాండ్ ఉండేది. ప్రస్తుతం రెండేళ్లు కోర్సు చేశాక, ఒక్కసారి డిమాండ్ తగ్గింది. విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపించటం లేదు. ఈ నేపథ్యంలో ఫీజు స్ట్రక్చర్ 7,500 రూపాయలకు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో అంతంత మాత్రం స్పందన లభించిన 40 సీట్లతో పాటు.. నూతనంగా ప్రవేశం పెగుతున్న 40 సీట్లు ఉన్న పోస్టు గ్రాడ్యూయేషన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులో 26 మంది విద్యార్థులు డీడీలు చెల్లించి అడ్మిషన్లు పొందారు. ఎకనామిక్స్, రూరల్ డెవలఫ్‌మెంట్, సోషల్‌వర్కు, లైబ్రరీ సైన్స్, ఎంఎడ్, జియోలజీ, జియో ఫిజక్స్ కోర్సుల్లో 50 శాతం అడ్మిషన్లకు తక్కువ కాకుండా ప్రవేశాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు బోధకులు సైతం విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వర్సిటీలో మిగతా కోర్సులు పరిశీలిస్తే ఐసెట్ ద్వారా ప్రవేశాలు నిర్వహించే ఎంబీఏలో ఎప్పుడూ దాదాపుగా సీట్లు నిండుతున్నాయి. ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో సీట్లు ఎక్కువగా నిండాయి. ఈ నేపథ్యంలో ఎంసీఏలో పూర్తిగా సీట్లు నిండుతాయని భావిస్తున్నారు. స్పెషల్ బీఎడ్ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలు ఏమాత్రం జరగుతాయో వేచి చూడాలి. మరో పక్క లా సెట్ కౌన్సెలింగ్ ద్వారా ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం స్వీట్లకు ప్రవేశాలు క ల్పిస్తున్నారు. మెరుగైన ప్రవేశాలే లక్ష్యం వర్సిటీలో మెరుగైన ప్రవేశాలే లక్ష్యం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుతున్నాం. అవసరం మేరకు ఫీజు స్ట్రక్చర్‌లో మార్పులు చేస్తున్నాం. అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నాం. వర్సిటీ విద్య బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం లక్ష్యం. - మిర్యాల చంద్రయ్య, ఇన్చార్జి వీసీ -
ప్రత్యేక ప్యాకేజీ కోసం విద్యార్థుల ధర్నా
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీకీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు గురువారం ధర్నాకు దిగారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మండలంలోని అంబేద్కర్ వర్సిటీకీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనకు సీపీఎం, సీఐటీయూసీలు మద్దతు తెలిపాయి. వర్సిటీకి ప్యాకేజీ ప్రకటించే వరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. -
బీఆర్ఏయూలో రెండు డిగ్రీ పరీక్షలు రద్దు
శ్రీకాకుళం(ఎచ్చెర్ల): శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండు సబ్జెక్టుల పరీక్షలను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 27న డిగ్రీ రెండో ఏడాది ఫిజిక్స్ పరీక్షను ఇదే కారణంతో రద్దు చేసిన సంగతి విదితమే. ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు ప్రచారం జరగడంతో సోమవారం ఉదయం జరగాల్సిన ఫిజిక్స్ తొలి ఏడాది పరీక్ష రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ వి. కృష్ణమోహన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఇదే కారణంతో మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ రెండో ఏడాది కెమిస్ట్రీ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వర్సిటీ పరిధిలో ఇలా మూడు డిగ్రీ పరీక్షలు రద్దవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
ఎచ్చెర్ల:డిగ్రీ పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బుధవారం నుంచి జరగనున్న పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 93 ఎఫిలియేటెడ్ కళాశాలల నుంచి రెగ్యులర్, సప్లిమెంటరీతో కలిపి 50,440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణపై వీసీ హనుమంతు లజపతిరాయ్ రెక్టార్ మిర్యాల చంద్రయ్య, రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్, పరీక్షల నిర్వహణాధికారి పెద్దకోట చిరంజీవులతో సోమవారం సమావేశమయ్యారు. గత ఏడాది తలెత్తిన సమస్యలు, ఈసారి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించారు. 43 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ చెప్పారు. అన్ని కేంద్రాల్లో ప్రత్యేక అబ్జర్వర్లు, స్క్వాడ్‌ను నియమిస్తామన్నారు. పరిశీలకుల సమక్షంలో గంట ముందు ప్రశ్న పత్రాల కట్టలు తెరవనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక సీల్ చేసిన ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూంల్లో భద్ర పరిచామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రశ్నపత్రాలు ముందుగా తెరిచినట్టు తెలిస్తే ఆ కళాశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఆరోపణలు ఉన్న కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. తృతీయ ఏడాది పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరుగుతాయని వివరించారు. అలాగే మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ ఏడాది పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్న తీరును వర్సిటీ అధికారులు కూడా ఆకస్మికంగా పరిశీలిస్తారన్నారు. డిగ్రీ మూడేళ్లకు సంబంధించి సుమారు మూడు వేల మంది విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌కు దరాఖాస్తులు చేసుకున్నారని, వీరికి వారం రోజుల్లో మార్కుల జాబితాలు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ
VIP రిపోర్టర్ హనుమంతు లజపతిరాయ్ వీసీ, బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ లజపతిరాయ్ (వీసీ) : మేడమ్ ఈ పాఠశాలకు చాలా ప్రత్యేకత ఉంది.. నేనూ ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రస్తుతం పాఠశాల పరిస్థితి ఏంటి. సదుపాయాలు ఎలా ఉన్నాయి? వి.పద్మావతి (హెచ్ఎం) : నేనూ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాను. ఇక్కడే ఏడేళ్లుగా హెచ్ఎంగా పని చేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థాయిల్లో ఉన్నారు. అయితే పాఠశాలలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని భవనాలు పడిపోయాయి. వీసీ : అధికారులకు ఫిర్యాదు చేశారా? హెచ్ఎం : సమస్యలపై ఇప్పటికే కలెక్టర్‌కు, మున్సిపల్ కమిషనర్‌గా వినతులు అందజేశాం. ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. వీసీ : హుద్‌హుద్ తుపానుకు కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు ఉన్నాయి.. నిజమేనా? హెచ్ఎం : నిజమే. తుపానుకు తిలక్ హాల్‌తోపాటు రెండు భవనాలు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ రోజు సమీపంలో పిల్లలు ఎవరూ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. వీసీ : ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాల సమస్యలు, విద్యార్థుల చదువుల గురించి వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారా? హెచ్ఎం : 200 మంది వరకు చదువుతున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నాం సార్. ఓల్డ్ స్టూడెంట్స్ అందజేసిన విరాళాలతో కొన్ని అభివృద్ధి పనులు జరిపించాం. తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తరగతి గదిలో.. వీసీ : వెనుకబడిన పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? టి.ఉమాదేవి (తెలుగు టీచర్) : ప్రత్యేకంగా వెనుకబడిన పిల్లలను దృష్టిలో ఉంచుకునే పాఠ్యాంశాలను చెబుతున్నాం. అలాంటి వారిని గుర్తించి సాయంత్రం 4.30 తర్వాత ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. వీసీ : ఆడిపిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా? తె.టీచర్ : దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కట్టు, బొట్టు, వస్త్రధారణ వంటి అంశాల గురించి వారితో తరచూ చర్చిస్తుంటాం. కుటుంబ వ్యవస్థ తీరు, మానవతా విలువలు, తల్లిదండ్రులు, పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి వివరిస్తుంటాం. వీసీ (ఓ విద్యార్థితో) : బాబు.. నువ్వు ఏ సబ్జెక్టులోనైనా వెనుకబడి ఉన్నావా? కె.రాజు (టెన్త్ విద్యార్థి) : గణితంలో బాగా డౌట్లు ఉన్నాయి సార్.. సిలబస్ మారిపోవడంతో మాకు పూర్తిగా అర్థం కావడంలేదు. వీసీ (మరో క్లాస్ రూమ్‌లో) : సార్.. మీరు ఉపాధ్యాయుడిగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సీహెచ్ దేవదత్తానంద్ (గణితం టీచర్) : మా ఇబ్బందులంటే ఏం చెబుతాం సార్.. ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఉపాధ్యాయులుగానే గుర్తించడంలేదు. పీఎఫ్‌ను జీపీఎఫ్‌లోకి కన్వర్ట్ చేయలేదు. జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. హెల్త్‌కార్డులు కూడా ఇవ్వమంటున్నారు. ఎల్టీసీ, సర్వస్ రూల్స్‌ను ఇంకా అమలు చేయలేదు. చాలా మధనపడుతున్నాం. ప్రభుతం వీటిపై దృష్టిసారించాలి సార్.. వీసీ : బాధ్యతాయుతమైన బోధన వృత్తి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? గ.టీచర్ : ఎంతసేపూ చదువూ చదువూ అని పిల్లలపై ఒత్తిడి పెంచడం కాసేపు పక్కనపెట్టి వారితో అనుబంధాన్ని పెంచుకోవాలి. టీచర్ అనేవాడు పిల్లలతో స్నేహితుడిగా మెలగాలి. వారి కుటంబ పరిస్థితి, మనోభావాలు గురించి తెలుసుకోవాలి. అలా చేస్తే విజయం సాధించినట్లే. వీసీ : ఈ ఏడాది సిలబస్‌లు మారాయని చెబుతున్నారు. కొత్త సిలబస్ ఎలా ఉంది? పి.రాజు (ఇంగ్లిష్ టీచర్) : సిలబస్ మార్చారు గానీ పేపర్-1, పేపర్-2లకు ఏ ప్రశ్నలు ఇస్తారో.. ఏంటో ఇంతవరకు స్పష్టం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిషు ఉపాధ్యాయులు, విద్యార్థులందరిదీ ఇదే సమస్య. దీనిపై త్వరగా వర్కషాప్‌లు నిర్వహిస్తే మేలు జరుగుతుంది. వీసీ : పిల్లలూ...మధ్యాహ్న భోజనం ఎలా ఉంది.. బాగా వండుతున్నారా? పిల్లలు : మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుంటుంది సార్.. ఆయా(వంటమనిషి) బాగా వండుతుంది. వీసీ (మధ్యాహ్న భోజనశాలకు వెళ్లి..) : ఏమ్మా.. మీకు నెలనెల బిల్లులు అందుతున్నాయా? జరీనాబీ (వంట మనిషి) : మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేనే పని చేస్తున్నాను సార్. బిల్లులు మాత్రం సక్రమంగా అందడంలేదు సారు. గ్యాస్ ఇవ్వడంలేదు. కట్టెల పొయ్యితోనే పాట్లు పడుతున్నాం. -
వద్దనుకున్నవారే.. ముద్దయ్యారు!
విద్యార్థులు వద్దన్నవారే.. వర్సిటీ పెద్దలకు ముద్దవుతున్నారు. అర్హతలు లేకపోయినా.. నిబంధనలు అంగీకరించకపోయినా వారినే చంకనెక్కించుకుంటున్నారు. తమ అంతేవాసులైతే చాలు పోస్టులు కట్టబెడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వారినే తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఇదేమిటని అడిగిన విద్యార్థులను ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. గతంలో పనికిరారని తొలగించిన వారినే.. ఇప్పుడు మళ్లీ తీసుకొని తమ పక్షపాత ధోరణిని మరోమారు బట్టబయలు చేసుకున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి ఆ విద్యాసంస్థ ఉన్నతాధికారి సొంత వర్గం సేవకు ఉపయోగపడుతోంది. వర్సిటీ, విద్యార్థుల భవిష్యత్తు కంటే తన బంధుగణానికి, సామాజక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన దీన్ని వినియోగిస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను కాలరాస్తూ విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ మండలికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ మండలి కూడా వర్సిటీ పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా మొక్కుబడిగా హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీలో జరుగుతున్న కొన్ని నియామకాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. గత నవంబర్‌లో గణితం విద్యార్థులు తమకు బగాది శ్రీనివాసరావు అనే టీచింగ్ అసోసియేట్ చెప్పే పాఠాలు అర్థం కావటం లేదని, ఆయన తమకొద్దని వైస్ చాన్సలర్ లజపతిరాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఆ శ్రీనివాసరావు వీసీకి దగ్గరి బంధువన్న విషయం అప్పట్లో విద్యార్థులకు తెలియదు. వీసీ సైతం అలాగే వ్యవహరించి ఆయన్ను తక్షణం తొలగిస్తున్నట్లు విద్యార్థులకు చెప్పారు. రెండో సెమిస్టర్నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని అప్పటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య(ప్రస్తత రెక్టార్)ను సైతం ఆదేశించారు. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. పీహెచ్డీ, నెట్, స్లెట్‌లలో ఏదో ఒక అర్హత ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి డాక్టరేట్ చేసిన జి.కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని తీసుకున్నారు. అప్పటి వరకు కోర్సు కో ఆర్డినేటర్‌గా ఉన్న రవికిశోర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించి కిరణ్ కుమార్‌కు అప్పగించారు. మిగతా డిపార్ట్మెంట్లలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా వీసీ బంధువైన బగాది శ్రీనివాసరావును తొలగించినట్లే తొలగించి మళ్లీ అదే ఉద్యోగం కట్టబెట్టారు. డాక్టరేట్ చేసిన అభ్యర్థులు రానందువల్లే ఆయన్ను మళ్లీ నియమించినట్లు సమర్థించుకుంటున్నారు. ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ)లో పని చేస్తున్న డాక్టర్ చింతాడ రామ్మోహన్రావు(ప్రస్తుతం అక్కడ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు)ను యూనిసెఫ్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సర్వే ముగిసినా, ఆయన్ను ఇక్కడే కొనసాగిస్తూ న్యాయశాస్త్ర విభాగంలో అతిధి బోధకునిగా నియమించారు. ప్రస్తుతం అక్కడ ఏడుగురు టీచింగ్ అసోసియేట్లు ఉన్నారు. పోస్టుల ఖాళీలు కూడా లేవు. దాంతో రామ్మోహనరావును కొనసాగించడానికి తమలో ఎవరిని తొలగిస్తారోనన్న భయం ఆ ఏడుగురిలో నెలకొంది. అయితే ఈ అతిధి బోధకునికి జీతం చెల్లిస్తున్నట్టు గానీ, అధికారికంగా నియమించినట్లు గానీ సమాచారం లేదు. ఇక్కడి కోర్సు కో ఆర్డినేటర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేయటంతో ప్రారంభంలో కొన్ని క్లాసులు ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని సబ్జెక్టులను పూర్తిగా అతనికే అప్పగించారు. జియోసైన్స్ విభాగంలో ఉన్న ఇద్దరు బోధకులు చెప్పింది తమకు అర్థం కావడం లేదని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ కోర్సు చేస్తున్న విద్యార్థులు వీసీకి నేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఇద్దరు టీఏలను తొలగించి డాక్టరేట్ చేసిన ముగ్గురిని నియమించారు. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రజా ప్రతినిధులు సిపార్సుతో తొలగించిన ఎ.ఎ. జయరాజ్‌కు సబ్జెక్టు కాంట్రాక్టరుగా, వై.పెంటమ్మ(పద్మిని)ను ల్యాబ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఒక రాష్ట్ర మంత్రి సిఫార్సు మేరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పీడీకి అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హోదా కట్టబెట్టడంతోపాటు ఆయనకు ఒక అసిస్టెంట్‌ను కూడా నియమించారు. ఇలా ఉన్నతాధికారి బంధువులు, రాజకీయ నాయకుల సిఫా ర్సులతో అడ్డగోలు నియామకాలు జరిగిపోతున్నాయి. ఫీడ్ బ్యాక్‌తో పని లేదు! వాస్తవానికి బోధన సిబ్బంది నియామకాలు, తొలగింపుల్లో విద్యార్థుల అభిప్రాయాల(ఫీడ్‌బ్యాక్)ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది. పేరుకు విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటున్నా.. ఆచరణలో వాటిని తుంగలో తొక్కి ఇష్టానుసారం నియామకాలు జరుపుతున్నారు. ఇదేమిటని అధికారులను నిలదీస్తే డిగ్రీ పట్టాలు తీసుకొని ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదని విద్యార్థులు భయపడుతున్నారు. గతంలో వీసీని ఎదిరించిన లా విద్యార్థి లోకేష్ చౌదిరిని పరీక్షల్లో ఫెయిల్ చేశారు. ఆయన పోరాడి ఫలితాన్ని మార్పించుకున్నారు. ఇదే డిపార్టమెంట్‌కు ఒక విద్యార్థినికి ఇంటర్నల్ మార్కులు తగ్గించేశారు. విధేయతను బట్టే ఇంటర్నల్ మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాల్యుయేషన్లోనూ ఇదే విధానం అనుసరిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ నిబంధనల మేరకే..:రిజిస్ట్రార్ అయితే ఈ ఆరోపణలను వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ కొట్టిపారేస్తున్నారు. నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామన్నారు. ఎల్ఎల్బీలో అతిధి బోధకుని నియామకం గురించి మాత్రం తనకు తెలియదని చెప్పారు. అతనికి జీతం కూడా చెల్లించటం లేదన్నారు. జీయో సైన్సు బోధకుల విషయంలో కమిటీ వేసి తీసుకున్నామని చెప్పారు. తక్కువ మార్కులతో భవిష్యత్తుకు దెబ్బ ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో తమకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని, దీనివల్ల తమ భవి ష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ గణితం విద్యార్థులు రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎక్కువమందికి ఈ గ్రేడ్ మార్కులు వచ్చాయని.. దీనివల్ల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. బోధకులు చెప్పిన పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు పరీక్షల్లో రాలేదని వైస్‌చాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం చేయలేదన్నారు. దీనివల్ల కనీసం 60 శాతం మార్కులు కూడా రాని పరిస్థితి ఎదురైందని చెప్పారు. అర్హత గల బోధకులు లేకపోవటం, సిలబస్‌లో లేని ప్రశ్నలు రావటం, మూల్యాం కన సక్రమంగా లేకపోవటం వంటి కారణాల వల్లే మార్కులు తగ్గాయని వివరించారు. రెక్టార్ చంద్రయ్య స్పందిస్తూ.. బోధకుల నియామకానికి పీహెచ్డీ, నెట్, స్లెట్ అర్హుల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, ఆ అర్హతలున్న అభ్యర్థులు రాకపోవటంతో నిబంధనలు సడలించి నియామకాలు చేపట్టామని వివరించారు. పరీక్షలు మెరుగ్గా రాసినా కూడా మార్కులు రాలేదని భావిస్తున్న విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం మూడు సబ్జెక్టుల మార్కులపై తమకు అనుమానం ఉందని, అయితే సబ్జెక్టుకు రూ.500 చొప్పున రీవాల్యూయేషన్ ఫీజు చెల్లించటం భారం అవుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. రుసుం తగ్గించాలని డిమాండ్ చేశారు. రుసుం తగ్గించటం సాధ్యం కాదని, అయినా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని రెక్టార్ చెప్పారు. దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ(గణితం) చేసినవారికి 80 శాతం వరకు మార్కులు వస్తున్నాయని, రెగ్యులర్ విద్యార్థులమైన తమకు ఇంత తక్కువ మార్కులు వేయటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పీజీ చేస్తున్న 42 మందిలో నలుగురు ఫెయిల్ కూడా అయ్యారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.