
సాక్షి, నల్లగొండ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 580 మంది హాజరయ్యారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ నటి హేమ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. అర్హత సాధించిన అ«భ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment