ప్రవేశాలపై దృష్టి సారించారు! | BR Ambedkar Universit in pg | Sakshi
Sakshi News home page

ప్రవేశాలపై దృష్టి సారించారు!

Published Sat, Jul 2 2016 8:19 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

BR Ambedkar Universit in pg

 బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది పీజీ ప్రవేశాలు తగ్గడంతో అధికారులు మేల్కొన్నారు. విద్యార్థులు ఎక్కువ మంది చేరేలా దృష్టిసారించారు. శుక్రవారం నుంచి అంతర్గత కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. విద్యార్థుల ప్రవేశాలు తగ్గితే పీజీ విద్య బలహీన పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రకటిస్తున్న గ్రేడింగ్‌లో వెనుక బాటు తప్పదు. ప్రస్తుతం వర్సిటీ సీ గ్రేడ్‌లో ఉంది. ఇదే పరిస్థితి ఉంటే.. బోధకుల నియామకం, ప్రత్యేక నిధుల మంజూరు విషయంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు జాగ్రత్తపడుతున్నారు.
 
 ఎచ్చెర్ల: యూనివర్సిటీలో ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఈ సమస్య లేకుండా ముందుగానే దీన్ని గట్టెక్కాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 80 శాతం దాటి ప్రవేశాలు సాధించాలని ఆలోచన చేస్తున్నారు. నిబంధనలను సైతం అవసరం మేరకు సడలిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది  డిగ్రీ తృతీయ ఏడాది 3,300 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు.
 
  ఇన్‌స్టెంట్ పరీక్షల్లో 630 మంది పాసయ్యూరు. వీరందరూ పీజీలో చేరేందుకు అర్హులు. అయితే అడ్మిషన్లు మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదు. ప్రస్తుతం రెండో విడత ఆసెట్ కౌన్సెలింగ్ తరువాత 14 కోర్సుల్లో 500 సీట్లకు 122 సీట్లు నిండాయి. మరో పక్క గతనెల 28, 29, 30 తేదీల్లో ఏయూలో నిర్వహించిన మూడో విడత కౌన్సెలింగ్‌లో మాత్రం కొన్ని కోర్సుల్లో ఎలాట్‌మెంట్లు మెరుగ్గా లభించాయి. విద్యార్థులు ఎంత మేరకు రిపోర్టు చేస్తారో చూడాలి.
 
  మొదటి, రెండో విడతల్లో విద్యార్థులు కళాశాలల్లో సీట్లు వచ్చి చేరక పోయినా, ప్రవేశాలు కోల్పోరు. తుది విడత కౌన్సెలింగ్‌లో చేరకపోతే మాత్రం సీటు కోల్పోవాల్సి వస్తుంది.
  మూడు విడత కౌన్సెలింగ్‌లో ఇంగ్లిష్, తెలుగ, గణితం, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 40 కి 40, బయోటెక్నాలజీ 30 కి 30 , ఎంకామ్‌లో 40 కి 39 ఎలాట్‌మెంట్లు లభించాయి. విద్యార్థులు ఇంకా రిపోర్టు చేయూల్సి ఉంది. అయితో ఈ కోర్సుల్లో సీట్ల కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న అంతర్గత కోర్సులకు విద్యార్థులు వస్తున్నారు. ఈ నే పణ్యంలో ప్రస్తుతం ఎంకామ్‌లో 20, గణితంలో 10, తెలుగులో ఐదు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐదు సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
 
  మరో పక్క ఎంఎడ్ ప్రస్తుత ఫీజు స్ట్రక్చర్ రూ.21,900 ఉంది. గతంలో ఈ కోర్సుకు డిమాండ్ ఉండేది. ప్రస్తుతం రెండేళ్లు కోర్సు చేశాక, ఒక్కసారి డిమాండ్ తగ్గింది. విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపించటం లేదు. ఈ నేపథ్యంలో ఫీజు స్ట్రక్చర్ 7,500 రూపాయలకు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో అంతంత మాత్రం స్పందన లభించిన 40 సీట్లతో పాటు..
 
 నూతనంగా ప్రవేశం పెగుతున్న 40 సీట్లు ఉన్న పోస్టు గ్రాడ్యూయేషన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులో 26 మంది విద్యార్థులు డీడీలు చెల్లించి అడ్మిషన్లు పొందారు. ఎకనామిక్స్, రూరల్ డెవలఫ్‌మెంట్, సోషల్‌వర్కు, లైబ్రరీ సైన్స్, ఎంఎడ్, జియోలజీ, జియో ఫిజక్స్ కోర్సుల్లో 50 శాతం అడ్మిషన్లకు తక్కువ కాకుండా ప్రవేశాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు బోధకులు సైతం విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
 
  వర్సిటీలో మిగతా కోర్సులు పరిశీలిస్తే ఐసెట్ ద్వారా ప్రవేశాలు నిర్వహించే ఎంబీఏలో ఎప్పుడూ దాదాపుగా సీట్లు నిండుతున్నాయి. ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో సీట్లు ఎక్కువగా నిండాయి. ఈ నేపథ్యంలో ఎంసీఏలో పూర్తిగా సీట్లు నిండుతాయని భావిస్తున్నారు. స్పెషల్ బీఎడ్  రెండేళ్ల కోర్సులో ప్రవేశాలు ఏమాత్రం జరగుతాయో వేచి చూడాలి. మరో పక్క లా సెట్ కౌన్సెలింగ్ ద్వారా ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం స్వీట్లకు ప్రవేశాలు క ల్పిస్తున్నారు.
 
 మెరుగైన ప్రవేశాలే లక్ష్యం
 వర్సిటీలో మెరుగైన ప్రవేశాలే లక్ష్యం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుతున్నాం. అవసరం మేరకు ఫీజు స్ట్రక్చర్‌లో మార్పులు చేస్తున్నాం. అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నాం. వర్సిటీ విద్య బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం లక్ష్యం.
 - మిర్యాల చంద్రయ్య, ఇన్‌చార్జి వీసీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement