శ్రీకాకుళం(ఎచ్చెర్ల): శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండు సబ్జెక్టుల పరీక్షలను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 27న డిగ్రీ రెండో ఏడాది ఫిజిక్స్ పరీక్షను ఇదే కారణంతో రద్దు చేసిన సంగతి విదితమే. ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు ప్రచారం జరగడంతో సోమవారం ఉదయం జరగాల్సిన ఫిజిక్స్ తొలి ఏడాది పరీక్ష రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ వి. కృష్ణమోహన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఇదే కారణంతో మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ రెండో ఏడాది కెమిస్ట్రీ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వర్సిటీ పరిధిలో ఇలా మూడు డిగ్రీ పరీక్షలు రద్దవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
బీఆర్‌ఏయూలో రెండు డిగ్రీ పరీక్షలు రద్దు
Published Mon, Mar 30 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement
Advertisement