ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 32 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 అసో షియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఒక్క రోజు గడువు ఉండటంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల సంఖ్య ఒక్కసారి పెరి గింది. సోమవారం ఒక్క రోజు 1500 దరఖాస్తులు రాగా, మంగళవారం 800 వరకు వచ్చాయి. ఇప్పటివరకుసుమారు 3000దరఖాస్తులు చేరాయి. మొత్తం 3500 వరకు దరఖాస్తులు రావచ్చునని వర్సిటీ అధి కారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో అంబేడ్కర్ వర్సిటీ అధికారులు న్యాయపరమైన సమస్యలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్యాక్‌లాగ్, రిజర్వేషన్, రోస్టర్ వంటి అంశాలపై నిపుణులను సంప్రదించి ముందుకు సాగుతున్నారు.