asst professor
-
ఘోరం..
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ యడ్ల రవికుమార్ (68) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వర్సిటీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవికుమార్ గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వర్సిటీ ముందు ఉన్న 16వ నంబర్‌జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు వెనుక నుంచి ఆయన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన రవికుమార్‌ను 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు. అయితే తోటి సిబ్బంది శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటల సమయంలో కన్నుమూశారు. రవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రవికుమార్ గురించి.. రవికుమార్ బీఆర్‌ఏయూలోని విద్యా విభాగంలో ప్రత్యేక బీఈడీ మెంటల్లీరిటార్డ్ ప్రత్యేక బీఈడీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈయన స్వగ్రామం లావేరు మండలం అప్పాపురం. విజయనగరం ఎంఆర్ కళాశాలలో సీనియర్ ఆధ్యాపకునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. 2009లో బీఆర్ఏయూలో ప్రత్యేక బీఎడ్ కోర్సు ప్రారంభించిన సమయంలో ఇక్కడ విధుల్లో చేరారు. ప్రత్యేక బీఎడ్ కోర్సు బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో అమెరికాలో సాప్ట్వేరు ఇంజినీర్లుగా పని చేసిన పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. రవికుమార్ ఆకస్మిక మరణాన్ని వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. 68 ఏళ్ల వయస్సులో కూడా బోధన విషయంలో యువ ఫ్యాకల్టీ సభ్యులతో పోటీ పడేవారు. ఉత్సాహంగా ఉంటూ వర్సిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. రోజూ స్వగ్రామం అప్పాపురం నుంచి రాక పోకలు సాగిస్తూ ఉండేవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. -
నిర్మలాదేవిపై వ్యభిచార నిరోధక కేసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: లైంగిక అవసరాలు తీర్చేలా కళాశాల విద్యార్థినులను తప్పుడు మార్గాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేసిన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవిపై వ్యభిచార నిరోధక చట్టం, ఉమ్మడిగా కుట్ర కేసులను పెట్టారు. విద్యార్థినులను లైంగికంగా ప్రలోభాలకు గురిచేసిన మాట వాస్తవమేనని నిర్మలాదేవి సైతం అంగీకరించినట్లు సీబీసీఐడీ అధికారులు చెప్పారు. నిర్మలాదేవి నోటి ద్వారానే వాంగ్మూలాన్ని నమోదుచేసి కోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేసినట్లు సీబీసీఐడీ అధికారులు శనివారం తెలిపారు. సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టైలోని ఒక ప్రయివేటు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి తన కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులను పలురకాలుగా మభ్యపెట్టి ఉన్నతాధికారుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందిగా ఒత్తిడి చేశారు. సెల్‌ఫోన్ ద్వారా పదేపదే వారిని సంప్రదిస్తూ ఒప్పించే ప్రయత్నం చేయడంతో ఈ విషయాన్ని సదరు విద్యార్థినులు తమ సెల్ఫోన్లలో రికార్డుచేశారు. నిర్మలాదేవి మాటల ఆధారంతో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నిర్మలాదేవికి వ్యతిరేకంగా సీబీసీఐడీ కేసు నమోదుచేసి విచారిస్తోంది. అలాగే మహిళా డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటుచేసి విచారణ జరిగేలా ఆదేశించాలని కోరుతూ పురట్చికర మానవర్ ఇలైంజర్ మున్నని రాష్ట్ర కన్వీనర్ గణేశన్ గతంలో మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై æకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం సీబీసీఐడీ అదనపు ఎస్పీ లావణ్య తరఫున శుక్రవారం ఒక నివేదిక దాఖలైంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘విద్యార్థినులను వక్ర మార్గాలకు నెట్టివేసే ప్రయత్నాలు చేసిన నేరానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి, వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మురుగన్, పీహెచ్డీ విద్యార్థి కరుప్పుస్వామిలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఈ కేసు విచారణలో భాగంగా వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని వాంగ్మూలం నమోదు చేశాం. అలాగే బాధిత విద్యార్థినుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, విద్యార్థినులతో నిర్మలాదేవి జరిపిన సంభాషణలను సీడీల్లో రికార్డు చేశాం. ఈ కేసులో ఇంతవరకు 160 మంది నుంచి సాక్ష్యాలు సేకరించాం. మురుగన్, కుప్పుస్వామి కోసమే విద్యార్థినులపై లైంగిక ఒత్తిళ్లకు పాల్పడినట్లుగా నిర్మలాదేవి తన వాంగ్మూలంలో అంగీకరించారు. నిందితులు ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించి సిమ్‌కార్డులు, మెమొరీ కార్డులు, ల్యాప్‌టాప్ తదితర 123 ముఖ్యమైన ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ విభాగానికి పంపాం. అంతేగాక హైకోర్టు మదురై శాఖ ఆదేశాల ప్రకారం నిర్మలాదేవిమాటలను చెన్నై మైలాపూరులో ఫోరెన్సిక్ కార్యాలయానికి పంపాం’ అని బదులు పిటిషన్లో పేర్కొన్నారు. నిర్మలాదేవి తదితరులు నేరాన్ని అంగీకరించడం, తగిన ఆధారాలు లభించినందున వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టినట్లు తెలిపారు. ఈ బదులు పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కులువాడి జీ రమేష్, కల్యాణ సుందరంలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. మహిళలకు వ్యతిరేకంగా, హక్కులకు భంగకరమైన కేసులను ప్రధాన న్యాయమూర్తి వీకే తహీల్ రమణి, న్యాయమూర్తి ఎమ్ దురైస్వామిలతో కూడిన మొదటి శ్రేణి డివిజన్ బెంచ్ విచారిస్తోందని రమేష్, కల్యాణ సుందరం తెలిపారు. కాబట్టి ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు వారు చెప్పారు. బెయిల్‌కు నోచుకోని నిర్మలాదేవి లైంగిక ఒత్తిడి కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన నిర్మలాదేవి అరెస్టయ్యారు. ఆనాటి నుంచి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 7 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు మంజూరు చేయలేదు. బెయిల్ మంజూరు కాకపోవడంతో 130 రోజులుగా నిర్మలాదేవి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. -
ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరీక్ష
టీ.నగర్: కళాశాల విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఫోరెన్సిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హేమలత సమక్షంలో గురువారం స్వర పరిశోధన (వాయిస్ టెస్ట్) జరిగింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను సెల్ఫోన్లో సంప్రదించి లైంగిక ప్రలోభాలకు గురి చేసినట్లు ఆడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. నిర్మలాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం మదురై సెంట్రల్జైల్లో నిర్బంధించారు. నిర్మలాదేవికి సహకరించిన మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. మదురై జైల్లో ఉన్న ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరిశోధన జరపాలంటూ సీబీసీఐడీ పోలీసులు మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలో ఈ పరీక్షకు తగిన పరికరాలు లేనందున చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిర్మలాదేవిని తీసుకువచ్చి పరీక్షలు జరిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పుళల్ జైలు నుంచి మైలాపూరులో గల పరిశోధన కేంద్రానికి 10.30 గంటలకు ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసు భద్రతతో తీసుకుని వచ్చారు. తరువాత ఆమెను పరిశోధన కేంద్రంలో హాజరు పరచి వాయిస్ టెస్ట్‌తో పాటు వివిధ పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను మదురై హైకోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. -
ఉచ్చులో మరో ఇద్దరు ప్రొఫెసర్లు
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధం ఉన్నట్లు సీబీసీఐడీ విచారణలో తేలింది. విద్యార్థినులను లైంగికంగా ఒత్తిడిచేసిన వ్యవహారంలో ప్రొఫెసర్ నిర్మలాదేవి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమె వద్ద సీబీసీఐడీ పోలీసులు జరిపిన విచారణ ఆధారంగా నిర్మలాదేవితో సంబంధం ఉన్న ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామిలను ఇదివరకే అరెస్టు చేశారు. ఇప్పటివరకు జరిపిన విచారణలు, వాంగ్మూలాలు, పత్రాల ఆధారంగా మధ్యంతర చార్జిషీటును కోర్టులో దాఖలు చేసేందుకు సీబీసీఐడీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధాలు ఉన్నట్లు గురువారం సమాచారం అందింది. వీరికి సమన్లు పంపి అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. -
నిర్మలాదేవి కేసులో మరిన్ని ఆధారాలు ?
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో ముఖ్య నిందితులకు సంబంధించిన మ రిన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. విద్యార్థినులను ప్రొఫెసర్ నిర్మలాదేవి లైంగిక కార్యకలాపాలకు పాల్పడాలని ఒత్తిడి చేసినట్టు వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఈ కేసులో విరుదునగర్ సీబీసీఐడీ కార్యాలయంలో ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామి వద్ద పోలీ సులు శనివారం విచారణ జరిపారు. ముఖ్య నిందితుల వివరాలను వారు వెల్లడించినట్లు తెలిసింది. మురుగన్, కరుప్పస్వామి ఉపయోగించిన సెల్ఫోన్లను సీబీసీఐడీ పోలీసులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. ఇలాఉండగా కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ విజయ శనివారం సీబీసీఐడీ విచారణకు హాజరయ్యారు. నిర్మలాదేవి–విద్యార్థినుల మధ్య సంభాషణల్లో వీఐపీలు, వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధాలున్నట్లు బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ నియమించిన ఐఏఎస్ అధికారి సంతానం శనివారం తన రెండో విడత విచారణను ముగించారు. -
కళంకిత కళాశాల!
విద్యార్థినులను లైంగికఅవసరాలకు వినియోగించుకునే ప్రయత్నంలో కటకటాలపాలైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి విచారణలో సహాయ నిరాకరణ అవలంభించడం అధికారులను అసహనానికి గురిచేస్తోంది. నిర్మలాదేవిపై మరో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిశోధకవిద్యార్థి కోర్టులో బుధవారం లొంగిపోవడం వంటి ఘటనలతో విరుదునగర్ జిల్లాఅరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కాలేజి ‘కళంకాలకళాశాల’గాముద్రవేయించుకుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్మలాదేవి వ్యవహారంలో నిగ్గుతేల్చాలని ఆదేశిస్తూ గవర్నర్ బన్వరిలాల్ నియమించిన విచారణ కమిషన్ బుధవారం తన రెండోదశ విచారణను ప్రారంభించింది. కమిషన్ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించిన తొలిదశ విచారణలో మదురై కామరాజ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్లదురై, రిజిస్ట్రార్ తదితరుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండోదశ విచారణలో భాగంగా బుధవారం మదురైకి వచ్చిన సంతానం మదురై యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులను పిలిపించి మాట్లాడారు. జైలులో ఉన్న నిర్మలాదేవిని సైతం విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. లొంగిపోయిన పరిశోధక విద్యార్థి ఇదే కేసులో అజ్ఞాతంలో ఉన్న పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి బుధవారం మదురై కోర్టులో లొంగిపోయాడు. నిర్మలాదేవి కేసులో సీబీసీఐడీ అధికారులు జరుపుతున్న విచారణలో యూనివర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కర్పుస్వామి పేర్లు బయటకు వచ్చాయి. మురుగన్‌ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రెండురోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి కోసం తీవ్రంగా గాలించినా దొరకలేదు. ఈ దశలో మదురై జిల్లా జూనియర్ మేజిస్ట్రేటు–5 కోర్టులో న్యాయమూర్తి సబీనా సమక్షంలో బుధవారం ఉదయం కరుప్పుస్వామి లొంగిపోయారు. ఇతడిని ఈనెల 26వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. పెద్దలు తప్పించుకునే అవకాశం నిర్మలాదేవి వ్యవహారంలో ఐఏఎస్ తదితర ఉన్నతాధికారులకు సంబంధం ఉందని అయితే కిందిస్థాయి అధికారులపై నేరం మోపి పెద్దలు తప్పించుకునే అవకాశం ఉందని కరుప్పుస్వామి తరఫు న్యాయవాదులు బుధవారం కోర్టుకు చెప్పారు. వాస్తవాలు వెలుగు చూడాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని వారు కోరారు. కాగా, తూత్తుకూడికి చెందిన మహిళాకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సైతం సమన్లు పంపారు. సమన్లు అందుకున్న సదరు ప్రొఫెసర్‌ను అధికారులు విచారించారు. విద్యార్థినులతో పర్యాటకంగా వెళ్లినపుడు తప్పనిసరైన పరిస్థితిలో నిర్మలాదేవితో కలిసి తూత్తుకూడిలోని గదిలో ఉన్నానని, అంతకు మించి సంబంధం లేదని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరింతమంది విద్యార్థినులను ప్రలోభపెట్టారు విచారణకు వచ్చిన ఐఏఎస్ అధికారి సంతానం బృందానికి మదురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్ ఒక వినతిపత్రం సమర్పించారు. దేవాంగర్ కళాశాలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే మరో ఇద్దరు విద్యార్థినులను లైంగిక ప్రయాజనాల కోసం నిర్మలాదేవి ఒత్తిడి చేశారని, దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా చర్యతీసుకోలేదని అందులో పేర్కొన్నారు. సదరు విద్యార్థినుల తరఫున కమిషన్ ముందు హాజరై ఫిర్యాదు చేశారు. వీరిద్దరినే కాదు మరింతమంది విద్యార్థినులను ఆమె ప్రలోభపెట్టారని ముత్తుకుమార్ మీడియాకు తెలిపారు. బాధిత విద్యార్థినుల పేర్లు, విలాసం తదితర వివరాలను కమిషన్‌కు సమర్పించినట్లు ఆయన చెప్పారు. విద్యార్థినులకు నిర్మలాదేవి బ్రెయిన్‌వాష్ చేసినట్లుగా చెబుతున్న ఆడియోను పరిశీలిస్తున్నట్లు సంతానం తెలిపారు. కోర్టుకు నిర్మలా దేవి నిర్మలాదేవికి మంజూరైన ఐదురోజుల పోలీసు కస్టడీ బుధవారంతో ముగియడంతో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఐదురోజుల కాలంలో ఆమె సరైన సమాచారం ఇవ్వకుండా విచారణకు సహకరించలేదని అధికారులు అసంతృప్తితో ఉన్నారు. మరో పదిరోజుల పోలీసు కస్టడీ మంజూరు చేయాలని కోర్టును కోరనున్నారు. ఇదే కేసులో సోమవారం అరెస్టయిన ప్రొఫెసర్ మురుగన్‌ను బుధవారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. -
నేను కూడా మోసపోయాను: నిర్మలాదేవి
టీ.నగర్: మరో ఆరుగురు విద్యార్థినుల ఫిర్యాదుతో నిర్మలాదేవిని సీబీసీఐడీ కస్డడీలోకి తీసుకుని విచారించనున్నారు. విరుదునగర్ జిల్లా, అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మదురై సెంట్రల్ జైలు నిర్బంధంలో ఉన్న ఆమెను సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజుల కస్టడీలో విచారణ జరుపుతూ వచ్చారు. సోమవారంతో నాలుగు రోజుల విచారణ పూర్తికాగా, నిర్మలాదేవి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో సీబీసీఐడీ పోలీసులు నిరాశకు గురయ్యారు. ఆమె విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. మరో ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. సీబీసీఐడీ విచారణ దారి మళ్లించే విధంగా ఉన్నట్లు కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్లలో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీసీఐడీ పోలీసులు విచారణ సక్రమంగా నిర్వహించలేదని వారు ఆరోపిస్తున్నారు. రూ.30లక్షలు మోసపోయిన నిర్మలాదేవి: ప్రొఫెసర్ నిర్మలాదేవి తన కుమార్తెకు మెడికల్ సీటు పొందేందుకు రూ.30లక్షలు నగదు అందజేసి మోసపోయినట్లు విచారణలో తేలింది. ఈ నగదును ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో విద్యార్థినులను ఎరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. కెమెరా ఫుటేజీల పరిశీలన: నిర్మలాదేవి కేసు వ్యవహారంలో కామరాజర్ వర్సిటీ కెమెరా ఫుటేజీలను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఇలా ఉండగా పోలీసులు మరో ఇద్దరు ప్రొఫెసర్ల వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. మదురై కామరాజర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ వద్ద సోమవారం విచారణ జరిపారు. -
నిర్మలాదేవి భర్త కీలక నిర్ణయం..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కీలక వ్యక్తుల్లో ఒకరైన ప్రొఫెసర్ మురుగన్‌ను సీబీసీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాళాల విద్యార్థినులను యూనివర్సిటీ పెద్దల లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టి అరెస్టయిన నిర్మలాదేవి కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మలాదేవిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నిర్మలాదేవి వద్ద జరిపిన విచారణలో పలువురు వీవీఐపీలు, వీఐపీలు పాత్ర ఉన్నట్లు తేలింది. వారిలో మదురై యూనివర్సిటీ మానవవనరుల శాఖ సంచాలకులు కలైసెల్వన్, సహాయక ప్రొఫెసర్లు మురుగన్, కరుప్పుస్వామిలను విచారించాలని నిర్ణయించారు. వారిలో కలైసెల్వన్ ఆదివారం విచారణకు హాజరుకాగా తమ కస్టడీలోనే ఉంచుకుని విచారిస్తున్నారు. కలైసెల్వన్‌ను సైతం అరెస్ట్ చేస్తారనితెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ గత నాలుగురోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు తీవ్రతరం చేశారు. తిరుచ్చిళి సమీపం నాడాకుళం గ్రామంలోని కరప్పుస్వామి ఇంటిలో భార్య, బంధువులను పోలీసులు విచారించారు. మధురై అరుప్పుకోట్టైలోని బంధువుల ఇంటిలో గాలింపు చేపట్టారు. నాలుగురోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మురుగన్ యూనివర్సిటీలోని అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేసేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావడంతో పోలీసు అధికారులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఓపిగ్గా వేచిచూస్తే నిజాలు బయటకు వస్తాయని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్ల దురై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండోసారి భర్త విడాకుల పిటిషన్ నిర్మలాదేవితో తెగదెంపులు చేసుకోవాలని విడాకులకు సిద్ధమైన భర్త గతంలో నోటీసులు పంపారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అప్పట్లో విరమించుకున్నారు. అయితే నిర్మలాదేవి వివాదాల్లో కూరుకుపోవడంతో రెండురోజుల క్రితం విడాకులు కోరుతూ ఆయన మరోసారి దరఖాస్తు చేశారు. కాంట్రాక్టులోనూ అక్రమాలు తన భర్త కోసం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సైతం నిర్మలాదేవి అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో సీబీసీఐడీ అధికారులు ముగ్గురు కాంట్రాక్టర్లును కూడా పిలిచి విచారిస్తున్నారు. అరుప్పుకోట్టై అత్తిపట్టులోని నిర్మలాదేవి ఇంట్లో ఏడుగురితో కూడిన సీబీసీఐడీ అధికారుల బృందం ఆదివారం ఆరుగంటలపాటు తనిఖీలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, సీడీలు మూడు సంచుల నిండా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఇంటికి సీలువేశారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లను కనుగొన్నారు. నిర్మలాదేవి భర్త శరవణపాండియన్ ప్రభుత్వ కాంట్రాక్టరు కావడంతో కాంట్రాక్టులను పొందేందుకు వీరి సిఫార్సులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా సదరు ప్రభుత్వ అధికారులను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
నిర్మలా దేవి ఇంట్లో సోదాలు.. డైరీలో గుట్టు
విద్యార్థినులకు లైంగిక వేధింపుల ప్రేరణ వ్యవహారం ఉచ్చులో తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ను ఇరికించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని తెలిసింది ఆయన మీద అనుమానాలు వ్యక్తంచేస్తూ, రీకాల్‌కు పట్టుబడుతున్నాయి. ఈగవర్నర్ను వెనక్కు తీసుకోండనే నినాదం ఆదివారం సీపీఎం నేతృత్వంలో తెరమీదకు వచ్చింది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆ పార్టీ లేఖాస్త్రం సంధించింది. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ నిర్మలా దేవి ఇంట్లో సాగిన తనిఖీల్లో లభించిన డైరీలో పలువురు పెద్దల గుట్టు ఉన్నట్టు సమాచారం. ఇందుకు బలం చేకూర్చే రీతిలో సీబీసీఐడీ పలువురిని విచారణ వలయంలోకి తీసుకు రావడం గమనార్హం. సాక్షి, చెన్నై : విద్యార్థినులకు లైంగిక ప్రేరణలో చిక్కిన ప్రొఫెసర్ నిర్మలా దేవిని సీబీసీఐడీ తీవ్రంగానే విచారిస్తోంది. ఆమె గుట్టును రట్టు చేసిన విద్యార్థినులను సైతం సీబీసీఐడీ ప్రత్యేక బృందం రహస్య విచారణ చేపట్టింది. వారి నుంచి సేకరించిన సమాచారంతో నిర్మలా దేవి సోదరుడు రవిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడితో కలిసి ఈ ప్రత్యేక బృందం శనివారం రాత్రంతా పుదుకోట్టైలోని నిర్మలా దేవి నివాసంలో సోదాలు చేసింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్‌లతో పాటు బ్యాంక్ ఖాతాలు, కొన్ని డైరీలను సీబీసీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆదివారం ఉదయాన్నే ఆ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. డైరీలో లభించిన సమాచారం మేరకు నిర్మలా దేవి భర్త శరవణతో పాటు నలుగురు కాంట్రాక్టర్లను విచారించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో మదురై కామరాజర్ వర్సిటీకి చెందిన ఓ డైరెక్టర్‌ను గురిపెట్టి, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు సాగాయి. నిర్మలా దేవి డైరీలోని గుట్టు మేరకు ఈ సోదాలు సాగుతుండడంతో, మరెందరు ఈ విచారణ వలయంలోకి వస్తారోఅనే చర్చ బయలు దేరింది. కాగా, సీబీసీఐడీ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో గవర్నర్ బన్వరిలాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ఐఏఎస్ సంతానం కమి టీ ఇరకాటంలో పడింది. నిర్మలాదేవి వద్ద విచారణ సా గించడం ఆ కమిటీకి కష్టతరంగా మారినట్టు తెలు స్తోం ది. ఆమె వద్ద విచారణ లక్ష్యంగా సోమవారం ఆ కమిటీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ రీకాల్‌కు పట్టు నిర్మలా దేవి బండారం, తెర వెనుక ఉన్న శక్తుల్ని తెర మీదకు తెచ్చే దిశలో విచారణ వేగం ఓ వైపు జోరందుకుంది. మరోవైపు ఈ ఉచ్చులో గవర్నర్ బన్వరిలాల్‌ను సైతం ఇరికించే రీతిలో ప్రతిపక్షాలు ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు, తాజా పరిస్థితుల్ని అస్త్రంగా చేసుకుని ఆయన రీకాల్‌కు పట్టుబట్టే పనిలో పడ్డాయి. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖాస్త్రం సంధించారు. అందులో విద్యార్థినులకు లైంగిక ప్రేరణ, నిర్మలా దేవి వ్యవహారాన్ని గుర్తుచేస్తూ, ఇందులో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ దూకుడుగా ముందుకు సాగడం అనుమానాలకు బలాన్ని ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఆయనకు లేదని వివరిస్తూ, ఆగమేఘాలపై గవర్నర్ స్పందించిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం వెనుక కారణాలు ఏమిటో సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గవర్నర్ మీద సైతం ఆరోపణలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆయన నియమించిన కమిటీ ఎలా విచారణను న్యాయబద్ధంగా నిర్వహించగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీ విచారించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ దృష్ట్యా, గవర్నర్‌ను వెనక్కు పిలిపించుకోవాలని, ఆయన మీద విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. లేని పక్షంలో తమిళనాట ఆందోళనలు మరింతగా భగ్గుమంటాయని పేర్కొనడం గమనార్హం. -
ఆమె వాట్సాప్‌లో మంత్రులు, ఐఏఎస్‌లు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అనైతిక కార్యకలాపాల వెనుక ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. వారందరికీ ఆమె తరచూ ఫోన్లు చేయడం, గంటల తరబడి జరిపిన వాట్సాప్ సంభాషణలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలో నిర్మలాదేవి కేసు విచారణ జరుగుతోంది. నిర్మలాదేవిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ విద్యార్థినులను లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టడంపై ఉన్నతవిద్యాశాఖకు గత నెలలోనే ఫిర్యాదులు అందాయి. కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక నివేదిక తయారుచేసి అధికారులకు పంపారు. అయితే వారు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో సదరు నివేదికను గవర్నర్ కార్యదర్శి రాజగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం విచారణకు వచ్చిన కమిషన్ చైర్మన్ ఆర్ సంతానంను అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఒక్క నిర్మలాదేవి విషయమేగాక ఉన్నతవిద్యాశాఖలో చోటుచేసుకున్న అనేక అక్రమాలను ఆయన ముందుంచారు. ఇదిలాఉండగా, నిర్మలాదేవి మొబైల్ ఫోన్లో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అ«ధికారులు, ఉన్నత విద్యాశాఖలో పనిచేసే మరికొందరు అధికారులతో సంభాషణలు, ఫొటోలతో కూడిన ఆధారాలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దల భాగోతం బైటపడడంతో విచారణలో ప్రతిష్టంభన నెలకొంది. నిర్మలాదేవిని సస్పెండ్ చేస్తూ జారీఅయిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆమె ఒత్తిడి మేరకు మదురై కామరాజ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్..రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో పట్టుదొరకని కాలంలో నిర్మలాదేవి పలువురితో సన్నిహితంగా మెలిగిందని, విద్యార్థినులతో ‘విందు’ ఏర్పాట్లు చేసిందని విచారణలో వెలుగుచూసింది. విద్యార్థినులను లైంగికంగా లొంగదీసుకునేందుకు వారికి చుడిదార్లు, చీరలు కొనిచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పలువురు విద్యార్థినులను శుక్రవారం విచారించారు. ఈ రకంగా వచ్చిన అక్రమార్జనతో వీసీ పోస్టు సంపాదించాలని భావించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం కమిషన్ చైర్మన్ సంతానం శుక్రవారం కళాశాలలో విచారణ జరిపారు. నిర్మలాదేవిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సీబీసీఐడీ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం మదురై సాత్తూరు కోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. నిర్మలాదేవిని వెంటపెట్టుకుని పోలీసులు రావడంతో మాదర్ సంఘం కార్యకర్తలు ఆమెను ముట్టడించి నిరసన నినాదాలు చేశారు. ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. -
నిర్మలాదేవి చెంప చెళ్లుమనేలా అనుభవం..
తన స్వప్రయోజనాల కోసం విద్యార్థినులను లైంగికంగా ఎరవేసే ప్రయత్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి చెంప చెళ్లుమనేలా చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పెద్దల వద్దకు తమను పంపడం ఎందుకు మీ ఇద్దరు కుమార్తెలను పంపవచ్చు కదా అని విద్యార్థినులు ప్రశ్నించి ఆమెను నిలదీసినా ‘వారు (తన కుమార్తెలు) వేరే లెవల్ అంటూ నిర్మలా దేవి నింపాదిగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థినులను కొందరు పెద్దల లైంగిక అవసరాలకు ప్రేరేపించి, ప్రలోభపెట్టిన విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్ నియమించిన ఏకసభ్య కమిషన్ గురువారం విచారణ ప్రారంభించింది. ఉదయం చెన్నై నుంచి మదురై వెళ్లిన సంతానం అక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో బసచేసి మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్లదురై, రిజిస్ట్రారు చిన్నయ్య తదితరులను కమిషన్ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం పిలిపించుకుని విచారించారు. విద్యార్థినులతో నిర్మలాదేవి సెల్‌ఫోన్ సంభాషణను పరిశీలించారు. నిర్మలాదేవికి సంబంధించిన సీసీటీవీ కెమెరా పుటేజీలు ఏమైనా ఉంటే అప్పగించా ల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈనెల 21వ తేదీన యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులను , నిర్మలాదేవి పనిచేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని వేర్వేరుగా విచారించనున్నారు. వర్సిటీ వైస్ చాన్సలర్ చెల్లదురై మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ నియమించిన కమిషన్ విచారణ ప్రారంభమైందని, విచారణకు పూర్తి సహకరిస్తున్నామని తెలిపారు. తొలి దశ మూడు రోజులు తొలిదశ విచారణ మూడురోజులు సాగుతుందని కమిషన్ చైర్మన్ సంతానం తెలిపారు. తరువాత రెండో దశ వారంరోజుల చేపడుతామని అన్నారు. ఇదిలా ఉండగా, మద్యం, జల్సా పార్టీలతో మదురై కామరాజ్ యూనివర్సిటీ కేళీవిలాసాల్లో మునిగితేలుతున్నట్లు విచారణ కమిషన్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. పదినెలల్లో 200 ఉత్సవాలు, 60 మెగా పార్టీలు నిర్వహించగా కేవలం జీడిపప్పు కొనుగోలుకే రూ.18 లక్షలు ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణకు భయపడి కళాశాల అధ్యాపకులు ముఖం చాటేశారు. ఈ కేసు విచారణకు ఏడు బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. సైబర్ క్రైం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, నిర్మలాదేవి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. పోలీసుల వద్దకు ఆధారాలు నిర్మలాదేవికి సంబంధించి 26 పేజీలతో కూడిన ఆధారాలను సదరు విద్యార్థినులు అరుప్పుకోట్టై పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. లైంగిక కార్యకలాపాలకు అంగీకరించాల్సిందిగా కోరుతూ ఆమె పంపిన ఎస్ఎమ్ఎస్లను 20 పేజీలపై ముద్రించి అందజేసినట్లు సమాచారం. మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిని పంపవచ్చుకదా అని విద్యార్థినులు ప్రశ్నించగా, వారు వేరే లెవల్ అని నిర్మలాదేవి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తానుగా ముందుకు వచ్చి విచారణ కమిటీని వేయాలని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కోరారు. గవర్నర్ వ్యవహార శైలిపై దృష్టి సారించాలని తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ కేంద్రాన్ని కోరారు. నిర్మలాదేవి ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమెను ప్రత్యేక సెల్‌కు మారుస్తారని తెలుస్తోంది. -
ఆమె ‘సెల్’లో పెద్దల రాతలు
విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారం సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. డీజీపీ రాజేంద్రన్ మంగళవారం ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిర్మలాదేవి విచారణలో నోరు మెదపనట్టు సమాచారం. అయితే, ఆమె సెల్ఫోన్లో పెద్దల తలరాతలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సెల్‌లోని నంబర్లు, ఫోన్ కాల్స్, చాటింగ్స్ ఆధారంగా ఈ తతంగంవెనుక ఉన్న పెద్దల్ని పసిగట్టేందుకు సీబీసీఐడీ ప్రయత్నిస్తోంది. కాగా, గవర్నర్బన్వరిలాల్లతో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. అందరి కన్నా ముందుగా, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ ఆదేశించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సాక్షి, చెన్నై :విద్యార్థినుల్ని లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ విరుదునగర్ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి సాగించిన ఆడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్టుచేసిన అరుప్పు కోట్టై పోలీసులు రాత్రంతా విచారించారు. అయితే, ఆమె ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం, నోరు మెదపకుండా ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల్ని ఎవరి కోసం ప్రేరేపించారో అన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని పలు విధాలుగా సమాధానం రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదని తెలిసింది. అయితే, ఆమె సెల్ఫోన్లో అసలు బండారం ఉన్నట్టు తేల్చినట్టు సమాచారం. మదురై కామరాజర్ వర్సిటీలో ఉన్నఉన్నతాధికారులతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆయా అధికారులకు తరచూ కాల్స్ చేయడం, వారితో సాగిన చాటింగ్ తదితర అంశాల్ని పోలీసులు పరిగణించి ఉన్నారు. ఆయా నంబర్ల ఆధారంగా ఆ అధికారులెవరో విచారించే పనిలో పడ్డారు. ఆ వర్సిటీలో ఉన్న అధికారుల నంబర్లును గుర్తించినా, ఆ ఉన్నతాధికారులు ఎవరో అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో అరుప్పు కోట్టై పోలీసులు ఉన్న సమయంలో డీజీపీ రాజేంద్రన్ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నేడు అరుప్పుకోట్టైకి సీబీసీఐడీ నిర్మలాదేవి వ్యవహారంపై ఇప్పటికే దేవాంగర్ ఆర్స్ కళాశాల, కామరాజర్ వర్సిటీ వేర్వేరుగా విచారణ చేపట్టే పనిలో నిమగ్నం అయ్యాయి. అలాగే, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశించారు. మాజీ ఐఏఎస్ సంతానం నేతృత్వంలో ఆ కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ పరిస్థితుల్లో కేసు తీవ్రతను పరిగణించిన డీజీపీ రాజేంద్రన్ విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆ విభాగం అదనపు డీజీపీ, ఎస్సీల నేతృత్వంలో విచారణ ముమ్మరం కానుంది. సీబీసీఐడీ బృందం బుధవారం అరుప్పుకోట్టై చేరుకుని, నిర్మలా దేవిని విచారించేందుకు, తమ కస్టడీకి తీసుకునే విధంగా కోర్టును ఆశ్రయించనుంది. గవర్నర్‌పై విమర్శలు నిర్మలా దేవి ప్రేరణ వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌పై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని పీఎంకే నేత రాందాసు ఆరోపించారు. నిర్మల దేవికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడం, ఈ వ్యవహారం వెనుక పెద్దలు సైతం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తంచేశారు. దీనిపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ఆగమేఘాలపై గవర్నర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడాన్ని బట్టి చూస్తే, ఎవరినైనా రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయా..? అని అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదన్నారు. అయితే, గవర్నర్‌కు అన్ని అధికారులు ఉన్నాయని, విచారణకు ఆదేశించవచ్చంటూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ వెనకేసుకొచ్చారు. కాగా, గవర్నర్ బన్వరి లాల్ పురోహిత్‌తో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో తనకు తెలిసిన వివరాలను చెల్లదురై వివరించారు. కఠిన చర్యలు తప్పదు తాజా వ్యవహారాలపై గవర్నర్ బన్వరిలాల్ స్పందించారు. ప్రథమంగా రాజ్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆయన వ్యాఖ్యలు చేశారు. చట్ట నిబంధనలకు లోబడే సంతానం నేతృత్వంలో కమిషన్‌ను రంగంలోకి దించినట్టు తెలిపారు. వర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నియమనిబంధనల మేరకు వర్సిటీ చాన్స్‌లర్‌గా తనకే అధికారం ఉన్నట్టు తెలిపారు. అందుకే ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశానన్నారు. కామరాజర్ వర్సిటీ తన ప్రమేయం లేకుండా విచారణకు ఆదేశించిందని, ఇందుకు నా వర్సిటీ వీసీ వివరణ ఇచ్చారన్నారు. ఆ కమిటీని వెనక్కు తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా, ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్సిటీల వ్యవహారాలు అందరికీ తెలియజేయడం, బహిర్గతంగా ఉంచేందుకు తాను చర్యలు తీసుకుంటూ వస్తున్నట్టు వివరించారు. ఆగని ఆందోళనలు ప్రొఫెసర్ వెనుక ఉన్న వాళ్లను త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలనే నినాదంతో ఆందోళనలు మంగళవారం కూడా సాగాయి. అనేక కళాశాలల విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించి ఆందోళన చేశారు. చెన్నై గిండిలోని రాజ్ భవన్‌ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నాలు చేస్తున్న సమాచారంలో అక్కడ భద్రతను పెంచారు. ఇక, మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో చెన్నై చేపాక్కం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆ విభాగం అధ్యక్షురాలు ఝాన్సీ రాణి, అధికార ప్రతినిధి కుష్భు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనను అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించడంతో వారిపై తీవ్ర స్థాయిలో కుష్భు విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, వర్సిటీల్లో విద్యార్థినులపై లైంగిక ప్రేరణ, ఒత్తిళ్లు మరీ ఎక్కువేనని పలువురు మాజీ ప్రొఫెసర్లు పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. రిమాండ్‌కు నిర్మలా దేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని 12రోజుల రిమాండ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ఆమెను విరుదునగర్ కోర్టు న్యాయమూర్తి ముంతాజ్ ఎదుట హాజరు పరిచారు. రిమాండ్‌కు ఆదేశించడంతో మదురై కేంద్ర కారాగారానికి తరలించారు. -
లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించిన మహిళా ప్రొఫెసర్?
-
ఇదేం పాఠం!
విద్యార్థుల పోరాటాలు, సంఘసేవకులఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. కళాశాల విద్యార్థునులను లైంగిక కార్యకలాపాలకుప్రేరేపించిన ఆరోపణలపై కళాశాల అసిస్టెంట్‌ప్రొఫెసర్ నిర్మలాదేవిని సోమవారం రాత్రి విరుదునగర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాలవిద్యార్థినులను లైంగిక చర్యలకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు, చెలరేగిన వివాదం విశ్వరూపందాల్చడంతో ఈ ఘటనపై మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ ఆదేశించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై:విద్యా బుద్ధులు నేర్పించాల్సిన మహిళా ప్రొఫెసర్ విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించారని మహిళా సంఘాల నేతలు నిప్పులు కక్కుతున్నారు. అటువంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టైలోని దేవాంగర్ ఆర్ట్స్ కళాశాలలో మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలో అదే ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మదురై యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులకు ‘సన్నిహితంగా’ మెలగాల్సిందిగా నలుగురు విద్యార్థినులపై ఈనెల 13వ తేదీన సెల్‌ఫోన్ ద్వారా ఆమె ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘ఇప్పటివరకూ మనమధ్య ప్రొఫెసర్, విద్యార్థినుల సంబంధాలు, ఇక తరువాత లెవల్‌కు పోదాం, నలుగురూ ఒక్కచోటనే ఉన్నారు కదా, నాకు తెలుసు, నేను చెప్పినట్లు నడుచుకుంటే వర్సిటీ అధికారులతో చెప్పి మంచి మార్కులు వేయిస్తాను, ఆర్థికంగా కూడా మీకు లాభం ఉంటుంది, కళాశాలకు క్రమం తప్పకుండా రాకున్నా అటెండెన్స్ వచ్చేలా చేస్తాను’ అని ఆమె విద్యార్థినులతో అన్నారు. ‘వద్దు మేడం.. మా కలాంటివి వద్దు’ అని విద్యార్థినులు నిరాకరించినా, ‘తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, ఒకటిన్నర నెలలో ప్రాక్టికల్స్ వస్తాయి, అందుకే ఈరోజు ఫోన్‌చేశాను, రెండు రోజుల్లో ఆలోచించుకుని చెప్పండి, మనం మాట్లాడుకున్న విషయాలు గోప్యంగా ఉంచండి..’ అంటూ మరీ ఒత్తిడిచేసినట్లు సమాచారం. విద్యార్థినులు, నిర్మలాదేవి మధ్య సాగిన సంభాషణలు ఆదివారం వాట్సాప్‌లో వైరలయ్యాయి. ఈ క్రమంలో పలువురు సంఘ సేవకులు, మహిళా సంఘాలు నిర్మలాదేవిపై నిప్పులుగక్కాయి. అలాగే బాధిత విద్యార్థినులు కళాశాల కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో నిర్మలాదేవిని సోమవారంఉదయం సస్పెండ్ చేశారు. చట్టపరమైన చర్యలకు సిఫారసు నిర్మలాదేవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సిఫార్సు చేసినట్లు మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ చెల్లదురై, ఉన్నత విద్యశాఖ కార్యదర్శి సునీల్ బాలివాల్, కళాశాల నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారంలో నిర్మలాదేవితోపాటు ఇంకా ఎవరికి సంబంధాలు ఉన్నాయో విచారణలో తేలుతుందని అన్నారు. నిర్మలాదేవిని అరెస్ట్ చేయాలని ధర్మపురి లోక్‌సభ సభ్యులు, పీఎంకే అగ్రనేత అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డీఎంకే అగ్రనేత స్టాలిన్ కోరారు. సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో భర్త, సోదరుని సమక్షంలో పోలీసులు నిర్మలాదేవి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి అరెస్ట్‌చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ ఆదేశించారు. ఎన్కౌంటర్ చేయాలి విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించడం క్షమించరాని నేరమని, ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ తెలిపారు. దురుద్దేశం లేదు :నిర్మలాదేవి విద్యార్థినులతో మాట్లాడింది నిజమేనని, వాట్సాప్‌లో వైరలైనది తన గొంతుకనే అని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అంగీకరించారు. అయితే తన మాటల్లో దురుద్దేశం లేదని, కొన్ని మాటలను కత్తిరించి తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు. కళాశాలలో విచారణ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి తీరుపై విచారణ చేపడుతున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. అరుప్పుకోట్టై ఆర్డీఓ చెల్లప్ప, తహసీల్దారు కార్తికేయని, టౌన్ ఇన్స్పెక్టర్ బాలమురుగన్ తదితరులు సోమవారం సదరు కళాశాలకు వెళ్లి కార్యదర్శి వద్ద తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. నిర్మలాదేవిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని, విద్యార్థునులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు, మహిళా సంఘాలు నేతలు కళాశాల ప్రవేశద్వారం వద్ద బైఠాయించారు. ఆ తరువాత కళాశాల ముట్టడి యత్నం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి ఆందోళకారులను అడ్డుకున్నారు. ఆందోళనలు మిన్నంటడంతో నిర్మలాదేవి ఉదయం నుంచి తన ఇంటిలో తాళం వేసుకుని గడిపారు. ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసులు వచ్చినా తలుపులు తీయలేదు. -
దరఖాస్తుల వెల్లువ
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 32 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 అసో షియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఒక్క రోజు గడువు ఉండటంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల సంఖ్య ఒక్కసారి పెరి గింది. సోమవారం ఒక్క రోజు 1500 దరఖాస్తులు రాగా, మంగళవారం 800 వరకు వచ్చాయి. ఇప్పటివరకుసుమారు 3000దరఖాస్తులు చేరాయి. మొత్తం 3500 వరకు దరఖాస్తులు రావచ్చునని వర్సిటీ అధి కారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో అంబేడ్కర్ వర్సిటీ అధికారులు న్యాయపరమైన సమస్యలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్యాక్లాగ్, రిజర్వేషన్, రోస్టర్ వంటి అంశాలపై నిపుణులను సంప్రదించి ముందుకు సాగుతున్నారు. -
ఆశలు ఆవిరి..
వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైన ప్రొఫెసర్ భారంగా మారిన వైద్యం సాయం కోసం ఎదురుచూపులు బొబ్బిలి : తండ్రి రిక్షా కార్మికుడైనా ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని కాపాడుకోవాలనుకున్నాడు కొడుకు. కుమారుడి తాపత్రయం చూసి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని నిరంతరం శ్రమించి ఎంటెక్ వరకూ చదివించాడు. దీంతో కుమారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఒకవైపు అండగా ఉంటూ మరో వైపు తమ్ముడిని కూడా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. తండ్రి అకాల మరణం చెందినా కుటుంబానికి అండగా ఉన్నాడు. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆటో ప్రమాదం రూపంలో మెడ వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమయ్యూడు. కుటంబాన్ని ఆదుకోవాల్సిన కొడుకు మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యూయి. చదివించే అన్న లేకపోవడంతో తమ్ముడు చదువు మానేశాడు. మరో అన్న పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నారు. పట్టణంలోని ఆకుల రెల్లివీధికి చెందిన సురపల్లి శేఖర్ తండ్రి రాము రిక్షా కార్మికుడు. ఇతని పెద్దకొడుకు విజయ్‌చందర్ పెయింటింగ్ పనులు చేస్తుండగా, శేఖర్ మాత్రం ఎంతో కష్టపడి తాండ్రపాపారాయ కాలేజీలో బీటెక్, విజయనగరం ఎంవీజీఆర్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. 2012లో చదువు పూర్తయిన తర్వాత బొబ్బిలిలో గోకుల్, తాండ్రపాపారాయ, అనకాపల్లిలోని ఇండో అమెరికన్ ఇనిస్టిట్యూట్‌ల్లో ఈసీఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ తమ్ముడు రాకేష్‌ను లెండి కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో శేఖర్ బ్యాంకు ఉద్యోగాల కోసం శిక్షణ కోసం కర్నూల్ వెళ్లాడు. తిరిగి ఏప్రిల్‌లో బొబ్బిలి వచ్చాడు. సమీప బంధువుల ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం వెళ్లి తిరగొస్తుండగా, రావివలస వద్ద ఆటో బోల్తాపడిన సంఘటనలో శేఖర్ మెడ వెన్నుపూస దెబ్బతింది. దీంతో శేఖర్‌ను విశాఖలోని ఓ గదిని అద్దెకుతీసుకుని వైద్యం చేయిస్తున్నారు. ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించడానికే రోజుకు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతోంది. అలాగే వైద్యం చేయించడానికి శేఖర్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. విజయ్‌చందర్ కూడా పనులకు వెళ్లకుండా తమ్ముడు శేఖర్ వద్దే ఉంటున్నాడు. ప్రస్తుతం విశాఖలోని రూమ్ అద్దెను కొంతమంది ఉపాధ్యాయులు చెల్లిస్తున్నారు. దయగల దాతలు సహకరించాలని శేఖర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వివరాలకు 73370 19927, 81215 38355 నంబర్లను సంప్రదించాలని కోరారు. దాతలు కరుణించాలి మా తమ్ముడు పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్నత చదువులు చదివాడు. కుటుం బాన్ని పోషిస్తాడనుకుంటే ఇలా జరిగింది. వైద్యం చేయించడం చాలా కష్టంగా ఉంది. దాతలు ఆదుకోవాలి. - విజయచందర్, శేఖర్ సోదరుడు, బొబ్బిలి -
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు విద్యార్థి వేధింపులు
హైదరాబాద్ : మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం వివరాల ప్రకారం... ఎల్బీనగర్ సాగర్ఎన్క్లేవ్లో నివసిస్తున్న యువతి (26) మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అదే కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రవితేజ అనే విద్యార్థి గత కొన్ని రోజులుగా ఆమె వెంట పడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె శనివారం ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.