టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధం ఉన్నట్లు సీబీసీఐడీ విచారణలో తేలింది. విద్యార్థినులను లైంగికంగా ఒత్తిడిచేసిన వ్యవహారంలో ప్రొఫెసర్ నిర్మలాదేవి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమె వద్ద సీబీసీఐడీ పోలీసులు జరిపిన విచారణ ఆధారంగా నిర్మలాదేవితో సంబంధం ఉన్న ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామిలను ఇదివరకే అరెస్టు చేశారు.
ఇప్పటివరకు జరిపిన విచారణలు, వాంగ్మూలాలు, పత్రాల ఆధారంగా మధ్యంతర చార్జిషీటును కోర్టులో దాఖలు చేసేందుకు సీబీసీఐడీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధాలు ఉన్నట్లు గురువారం సమాచారం అందింది. వీరికి సమన్లు పంపి అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment