nirmala devi
-
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ: మనోజ్ ఎమోషనల్
'మన కుటుంబానికి నువ్వు హృదయంలాంటిదానివి. నీ ప్రేమ, కరుణ వల్లే అంతా కలిసుండగలుగుతున్నాం' అంటూ మంచు మనోజ్ తల్లి నిర్మలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మ. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేనూ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) చదవండి: బిగ్‌బాస్ 8: ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్! -
రిజిస్ట్రార్ కుర్చీ కోసం ఎత్తుకుపైఎత్తులు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ నియామకంలో బుధవారం హై డ్రామా నెలకొంది. వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ హైకోర్టు మధ్యంతర రద్దు ఉత్తర్వుల ఆధారంగా ఈసీ నియమించిన ప్రొఫెసర్ యాదగిరి స్థానంలో వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవిని నియమించారు. ఆమె బుధవారం ఉదయం ఓయూ నుంచి ఏడాది కాలానికి లీన్ తీసుకుని తెయూ రిజిస్ట్రార్‌గా సా యంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే పాలనాపరమైన కారణాల వల్ల లీన్‌ను రద్దు చేస్తూ బు ధవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆమెను యథాస్థానంలో తిరిగి చేరాలని కోరుతూ ఉత్తర్వులు జారీచేయడం కలకలం రేపింది. రిజిస్ట్రార్‌గా నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె లీన్ రద్దు చేస్తున్నట్లు ఓయూ జారీ చేసిన ఉత్తర్వులు అందినప్పటికీ వీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మల రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించగానే వీసీ కార్యాలయం ద్వారా ఆగమేఘాలపై రిజిస్ట్రార్ సిగ్నేచర్‌ను బ్యాంక్ ఆథరైజేషన్ కోసం పంపించడం గమనార్హం. అయితే అప్పటికే బ్యాంకు పని వేళలు ముగియడంతో బ్యాంక్ అధికారులు సిగ్నేచర్ అథరైజేషన్ చేయలేకపోవడం కొసమెరుపు. వీసీ వర్సెస్ నవీన్ మిట్టల్ వ్యవహారం తెలంగాణ యూనివర్సిటీని మరింత వివాదంలోకి నెట్టేసింది. గత నెల 19న హైదరాబాద్‌లో జరిగిన 55వ తెయూ పాలకమండలి సమావేశాన్ని వీసీ వాకౌట్ చేయడం సంచనలం రేపింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటీ కరుణ, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, పాలకమండలి సభ్యులు రెండేళ్ల కాలానికి తెయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగిస్తూ, పాలకమండలి ప్రమేయం లేకుండా వీసీ రవీందర్ హయాంలో జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, విచ్చలవిడి కొనుగోళ్తు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. వీసీ అధికారాలకు కత్తెర వేసి రిజిస్ట్రార్‌కు హక్కులు కట్టబెట్టారు. దీంతో ఈసీ నిర్ణయాలను వీసీ హైకోర్టులో సవాల్ చేశారు. తుది తీర్పు వచ్చే వరకు ఈసీ నిర్ణయాలను రద్దు చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం వీసీ రవీందర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకంగా నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్‌గా యాదగిరి నియామకం చెల్లదని, వారం రోజుల్లో ఓయూ నుంచి ఒకరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. చెప్పినట్టే బుధవారం ఓయూ ఈసీఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్ నిర్మల దేవిని తెయూ రిజిస్ట్రార్‌గా నియమించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఓయూ నుంచి లీన్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మల దేవిని వెనక్కు తిరిగి రావాని కొత్త ఉత్తర్వులు జారీ కావడం సంచనలం కలిగించింది. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నిర్మల దేవి తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎల్.నిర్మల దేవి నియామకమయ్యా రు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వీసీ డి.రవీందర్ ఆమెకు ఉత్తర్వులు అందజేశారు. వెంటనే ఆమె రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నిర్మ ల దేవి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. నిర్మలదేవి 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రిజిస్ట్రార్‌గా బాధ్య తలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీచింగ్, నాన్–టీచింగ్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరి సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. మీడియా నిజమైన వార్తలు ప్రచురించాలని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసీ రవీందర్ మాట్లాడుతూ.. త్వరలోనే తెయూలో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత నిచ్చే నిర్మల దేవిని రిజిస్ట్రార్‌గా నియమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ నిర్మలదేవిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ విషయమై నిర్మల దేవిని సంప్రదించగా ఓయూ నుంచి లీన్ అనుమతి ఇస్తేనే తాను తెయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించానని, రద్దు ఉత్తర్వులు తనకు తెలియవన్నారు. తెయూ రిజిస్ట్రార్‌గా కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు. అయితే లీన్ రద్దు చేసినా నిర్మల దేవి తిరిగి వెళ్లకపోతే ఓయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం.. ఈసీ నిర్ణయాలను రద్దుచేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పై గురువారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. వీసీ తెచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తే (స్టే వెకేట్) మళ్లీ అప్పుడు రిజిస్ట్రార్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారనుంది. దీనికి తోడు శుక్రవారం తెయూ ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. ముందు గా ఆన్లైన్లో వర్చువల్‌గా ఈసీ సమావేశం ని ర్వహించాలని భావించినా వర్సిటీలో జరుగుతు న్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న ఈసీ స భ్యులు ప్రత్యక్షంగా సమావేశం జరపాలని భావి స్తున్నట్లు తెలుస్తోంది. వీసీ దుందుడుకు చర్య లు, నవీన్ మిట్టల్‌పై ఆరోపణలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వీసీపై మరి న్ని చర్యలకు తీర్మానం చేసే అవకాశాలున్నాయి. రెండేళ్ల పదవీ కాలంలో వీసీ రవీందర్ ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు. దీంతో వర్సిటీలో పాలన, టీచింగ్, పరిశోధన అటకెక్కాయి. తెయూ పాలకమండలి సభ్యుడు గంగాధర్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వీసీ రవీందర్ తన చర్యలతో వర్సిటీ పరువును గంగలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆమోదం లేకుండా నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేవి వర్సిటీ నిధుల్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసక్తికర పరిణామాల మధ్య తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి నిర్ణయాన్ని కాదని యాదగిరి స్థానంలో ఆమెను వీసీ రవీందర్ నియమించారు. నిర్మల లీన్‌ను రద్దు చేస్తూ ఓయూ నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ తెయూ వర్సిటీగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కొసమెరుపు. ఈ పరిణామాలతో పాలక మండలి, వీసీ మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లయ్యింది. -
సూపర్ మామ్ ముందు.. కాప్ ఎంత?
సీబీఐలో పెద్ద ఆఫీసర్ నిర్మల. డిపార్ట్మెంట్లో సూపర్ కాప్. ‘కావచ్చు కానీ.. నేనైతే డాటర్ ఆఫ్ లక్ష్మీ సుందరం’ అంటారు ఆమె. అదే ఆమె కోరుకునే పెద్ద హోదా.. గౌరవం, గుర్తింపు.. అన్నీ! ‘‘మా అమ్మే నన్నింత చేసింది. ఆ సూపర్ మామ్ ముందు..ఈ సూపర్ కాప్ ఎంత? అని.. నవ్వుతూ అంటున్నారు నిర్మల. ‘‘మా అమ్మ సూపర్ మామ్. అంతేకాదు సూపర్ ఉమన్ కూడా. నా ఈ యూనిఫామ్ వెనుక మా అమ్మ పోరాటం ఉంది. నన్ను ఇలా తీర్చిదిద్దే క్రమంలో ఆమె ఎన్నో సామాజిక అడ్డంకులను ఛేదించింది. తనకోసం తను కూడా అమ్మమ్మ తాతయ్యలతో పోరాడింది. ఉన్నత చదువులు చదవాలని ఎంతో ఆశ పడింది. కానీ అప్పట్లో మా అమ్మమ్మ, తాతయ్య సామాజిక ఒత్తిడికి తలొగ్గి అమ్మకు పదిహేడేళ్లకే పెళ్లి చేశారు. మా నాన్న రైతు. నేను పుట్టిన తర్వాత ఏడాదిన్నరకే నాన్న ఈ లోకాన్ని వదిలాడు. ఊహ తెలిసేటప్పటికి నాకు తెలిసిన మా కుటుంబం... అమ్మ, అన్నయ్య, నేను. అమ్మ తన గురించి తాను ఎలా కలలు కన్నదో అలా నన్ను తీర్చిదిద్దింది. యూపీఎస్సీ పరీక్షను నేను ఒకటి, రెండు కాదు... నాలుగో ప్రయత్నంలో పూర్తి చేశాను. యూనిఫామ్ నా ఒంటిమీదకు వచ్చి పద్నాలుగేళ్లయింది’’ అని తల్లి లక్ష్మీ సుందరంను గుర్తు చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్ నిర్మలాదేవి. రాత్రిళ్లలో పొలానికి నీరు నిర్మలాదేవిది కోయంబత్తూరులోని అలందురై గ్రామం. ఇప్పుడామె నాగపూర్‌లో సీబీఐ విభాగంలో ఎస్పీ. ‘‘తల్లిని తలుచుకోవడానికి మదర్స్‌డే వంటి ఏడాదికి ఒక రోజు కాదు, మా అమ్మ మాకు రోజూ తలుచుకోవాల్సినన్ని జ్ఞాపకాలను మిగిల్చింది’’ అన్నారామె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. ‘‘అమ్మ తెల్లవారు జామునే నిద్రలేచి ఇంటి పనులు, వంట పూర్తి చేసి అన్నయ్యను, నన్ను స్కూల్‌కి సిద్ధం చేసేది. ఆ తర్వాత తాను చెరకు పొలానికి వెళ్లి పని చేసేది. హోమ్‌వర్క్ చేయడంలో మాకు సహాయం చేసేది. రాత్రి ఎప్పుడు పడుకునేదో తెలియదు. మళ్లీ మేము నిద్రలేచేటప్పటికి పనుల్లో కనిపించేది. మాకు గ్రామాల్లో రోజంతా కరెంటు కష్టం. మోటార్లు పని చేయడానికి అనువుగా మూడు ఫేజ్‌ల సప్లయ్ రోజులో కొద్ది గంటలు మాత్రమే ఉండేది. కొద్ది రోజులు త్రీ ఫేజ్ కరెంటు రాత్రిళ్లు ఇచ్చేవారు. అలాంటప్పుడు పొలానికి నీరు పెట్టడానికి రాత్రి పూట వెళ్లాల్సి వచ్చేది. ఇవన్నీ చేస్తూనే మా ఊరి మహిళలకు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయడంలో మార్గదర్శనం చేసేది. దరఖాస్తు ఫారాలు నింపి పెట్టేది. తొంబైలలో ట్రాక్టర్ నడిపిన సూపర్ ఉమన్ మా అమ్మ. అప్పట్లో మాకు అ పనులన్నీ అవసరమై చేసినవే. సరదాగా ప్రతి సంఘటనను ఫొటో తీసి పెట్టుకోవడం తెలియదు. ఇప్పట్లాగ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న రోజులు కావవి. పది మందికి న్యాయం నాకు డిగ్రీ పూర్తవగానే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అమ్మకు ఆర్థికంగా సహాయంగా నిలవగలిగాను. అన్నయ్య డిగ్రీ చేశాడు, కానీ అమ్మకు సహాయంగా వ్యవసాయంలోనే స్థిరపడ్డాడు. అమ్మ మాకు చిన్నప్పటి నుంచి పదిమందికి సహాయం చేసే ఉద్యోగం చేయమని చెప్తుండేది. అన్యాయానికి గురయ్యి పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవాళ్లు, ఇంటి స్థలం ఇప్పించమని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసేవాళ్లు కొల్లలు. ఆ సర్వీసులు ప్రజలకు నేరుగా సహాయం చేయగలిగిన రంగాలనేది అమ్మ. నా బ్యాంకు ఉద్యోగం అమ్మకు సంతృప్తినివ్వలేదు. దాంతో యూపీఎస్సీ మీద దృష్టి పెట్టాను. ఉద్యోగం చేస్తూ రాసిన పరీక్ష ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత సొంతంగా లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకుని ప్రిపేరవుతున్న సమయంలో... కోయంబత్తూరులో ఉచితంగా సివిల్స్‌కి కోచింగ్ ఇస్తున్న విద్యాసంస్థ వివరాలను వార్తా పత్రికలో గమనించింది అమ్మ. ఆ విద్యాసంస్థలో చేరాను. పుస్తకాలన్నీ కొనడం కష్టమయ్యేది. దాంతో మా బ్యాచ్‌మేట్ కొన్న పుస్తకాలను ఫొటోకాపీలు తీసుకుని చదువుకున్నాను. నాలుగో ప్రయత్నంలో 272వ ర్యాంకు వచ్చింది. అలా 2008లో ఈ యూనిఫామ్‌కు అర్హత సాధించగలిగాను. నన్నిలా చూడాలని అమ్మ పాతికేళ్ల పాటు ఎదురు చూసింది. ఎనిమిదేళ్లు చూడగలిగింది. 2016లో మాకు దూరమైంది. ఆమె వరకు ఆమె ఎటువంటి అసంతృప్తి లేకుండా సంతృప్తిగానే మాకు దూరమైంది. కానీ అప్పటి నుంచే అన్నయ్యకు, నాకు వెలితి మొదలైంది. అమ్మను రోజూ తలుచుకుంటాం. మన సమాజంలో ఉండే అనేక అర్థం లేని నియమాలను ఎదుర్కొంటూ, ఏ దశలోనూ అధైర్యపడకుండా, సింగిల్ ఉమన్‌గా అనేక కష్టనష్టాలకోర్చి మరీ మమ్మల్ని తన కలల ప్రతిరూపాలుగా తీర్చిదిద్దుకుంది. ‘నీకు సివిల్స్ ప్రిపరేషన్‌కి పుస్తకాలు షేర్ చేసిన అర్జున్... తన జీవితాన్ని కూడా నీకు షేర్ చేశాడు..’ అంటుండేది అమ్మ. అర్జున్ అప్పుడప్పుడూ ఆ మాటను గుర్తు చేస్తుంటాడు. తనిప్పుడు నాగపూర్‌లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు’’ అని చిరునవ్వుతో చెప్పారు ఎస్పీ నిర్మలాదేవి. -
‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’
సాక్షి, చెన్నై : ప్రొఫెసర్ నిర్మలా దేవి మానసిక క్షోభకు గురైనట్టున్నారు. పూనకం వచ్చినట్టుగా పిచ్చి చేష్టలతో అందర్నీ హడలెత్తించారు. కోర్టు ఆవరణలో ధ్యానం చేస్తూ, ఉన్నట్టుండి తనలోకి కామాక్షి దేవి ప్రవేశించినట్టు, తన మీద అక్రమ కేసులు పెట్టిన వారందరికి మరణం తప్పదని హెచ్చరించారు. మసీదు వద్ద బైటాయించి ప్రవక్త మహ్మద్ నబి తనను ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పినట్టుగా వీరంగం సృష్టించారు. మాయ మాటలతో విద్యార్థినులను తప్పుడు మార్గంలో పయనింప చేసే ప్రయత్నంలో అరుప్పు కోట్టై ప్రొఫెసర్ నిర్మలాదేవి అడ్డంగా బు క్కైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిర్మలాదేవికి బెయిల్ రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. నిర్మలాదేవి నోరు విప్పకుండా చేయడం లక్ష్యంగా అనేక మంది పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు, అందుకే బెయిల్ కూడా రానివ్వకుండా అడ్డుకున్నట్టుగా ఆమె తరపు న్యాయవాది పేర్కొంటూ వచ్చారు. ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉన్నారు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబీకులు చీదరించుకోవడంతో పాటు జైలు జీవితం ఆమెను మానసికంగా కృంగదీసినట్టుంది. ప్రస్తుతం మానసిక క్షోభకు గురైన ఆమె పిచ్చి చేష్టలు చేస్తూ, తనలోకి కామాక్షి అమ్మ వారు వచ్చారని పేర్కొనడమే కాదు, కేసులు పెట్టిన వాళ్లు, అక్రమంగా ఇరికించిన వాళ్లు వారికి వారే ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రకటించడం అందర్నీ హడలెత్తించారు. పూనకంతో.... శ్రీవిళ్లిపుత్తూరు కోర్టుకు హాజరైన నిర్మలాదేవి అందర్నీ హడలెత్తించారు. మొన్నటి వరకు ఓ విచారణ ఖైదీగా కోర్టుకు వచ్చిన ఆమె, ప్రస్తుతం బెయిల్ రావడంతో నగలు ధరించి, లెగ్గింగ్ ధరించి, దాని మీద చక్కటి చీర కట్టి, నెత్తిన కుంకుమ పెట్టి అబ్బో..కాస్త అలంకరణతో కోర్టుకు వచ్చారు. సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణలో కూర్చుని కాసేపు ధ్యానం చేశారు. కాసేపటికి అక్కడి ఓ చోట కూర్చుని తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండగా, హఠాత్తుగా పూనకం వచ్చినట్టుగా ఊగి పోయారు. కామాక్షి దేవిని వచ్చానంటూ అరుపులు కేకలతో అందర్నీ హడలెత్తించారు. ఏ కామాక్షి దేవి అని అక్కడున్న వాళ్లు ప్రశ్నించగా, రాజపాళయం దేవానం పట్టి కామాక్షి అమ్మవారుగా పేర్కొంటూ దైవ వాక్కు ఇస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. తన భర్త, కుమారుడు కుటుంబీకులు మళ్లీ తన వద్దకు వచ్చేశారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టిన వాళ్లు, అక్రమంగా ఇరికించిన వాళ్లే కాదు, ఆ నలుగురు అమ్మాయిలు వారంతకు వారే ఉరిపోసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది జరుగుతుందంటూ అందర్నీ హడలెత్తించే రీతిలో హెచ్చరికలు చేశారు. కోర్టు ఆవరణ నుంచి బయటకు వచ్చిన నిర్మలాదేవి కారులో వెళ్తూ, రాత్రి ఏడున్నర గంటల సమయంలో బస్టాండ్ సమీపంలో ఉన్న మసీదు వద్ద ఆగారు. మసీదు లోపలకు వెళ్లే యత్నం చేయగా, అక్కడున్న వాళ్లు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అక్కడే బైఠాయించిన ఆమె తనను ప్రవక్త మహ్మద్ నబి రమ్మని చెప్పారని , ఇక్కడ ప్రార్థన చేయమన్నారంటూ కాసేపు వీరంగం సృష్టించారు. జుట్టు విరబోసుకుని ఆమె చేస్తున్న చేష్టలతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను బలవంతంగా మసీదు ఆవరణ నుంచి బయటకు రప్పించి కారులో ఎక్కించి పంపించారు. కాగా, నిర్మలాదేవి చేష్టలను చూసిన వాళ్లు కుటుంబం అంతా దూరం కావడం, అందరూ ఆమెను చీదరించుకుంటున్న దృష్ట్యా, మానసికంగా కృంగినట్టుందని, అయ్యో పాపం ప్రొఫెసర్ అంటూ కొందరు సానుభూతి తెలియజేశారు.మరి కొందరు అయితే, కేసు నుంచి బయట పడేందుకు కొత్త నాటకం ఆడుతున్నట్టుందని మండిపడుతున్నారు. -
గవర్నర్ ఎక్కడ.. న్యాయవాది ఫైర్
సాక్షి, చెన్నై: ప్రొఫెసర్ నిర్మలాదేవి ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. 11 నెలల అనంతరం ఆమె జైలు జీవితాన్ని విడి జనంలోకి వచ్చారు. రాజకీయ కారణాలతోనే ఇన్నాళ్లు జైల్లో నిర్మలాదేవి మగ్గాల్సి వచ్చిందని, గవర్నర్ ఎక్కడ, ఢిల్లీనా...గిండినా అంటూ ఆమె తరఫు న్యాయవాది పసుం పొన్ పాండి ప్రశ్నించారు. వందలాది మంది యువతులతో చెలాగాటం ఆడిన పొల్లాచ్చి వ్యవహారం గవర్నర్‌కు కనిపించనట్టుందని మండిపడ్డారు. మాయమాటలతో నలుగురు విద్యార్థినులను తప్పుడు మార్గంలో పయనింపచేసే ప్రయత్నంలో అరుప్పుకోట్టై ప్రొఫెసర్ నిర్మలాదేవి అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ నలుగురు విద్యార్థినులను ఎవరి కోసమో లొంగదీసుకుని ఉచ్చులో దించే ప్రయత్నాన్ని ఆమె చేసినట్టుగా ఆడియో బయటకు రావడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో నిర్మలాదేవితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి అరెస్టు అయ్యారు. విచారణ శరవేగంగా సాగడం అనేక అనుమానాలు, ఆరోపణలకు సైతం దారి తీశాయి. ప్రధానంగా గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు చేయడం, ఆ తదుపరి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించడం వంటి పరిణామాలు దుమారాన్ని రేపాయి. అదే సమయంలో నిందితులకు బెయిల్ కూడారానివ్వకుండా ప్రయత్నాలు సాగడంతో తెర వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే, కేసు సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరడం, ఆగమేఘాలపై చార్జ్షీట్లు దాఖలు కావడం వంటి పరిణామాలు అనుమానాలకు బలాన్ని చేకూర్చే పరిస్థితుల్ని కల్పించాయి. నిందితులు పలుమార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా, ఫలితం శూన్యం. ఎట్టకేలకు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించి మురుగన్, కరుప్పు బయటకు వచ్చారు. అయితే, నిర్మలాదేవి జైలుకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో ఆమె మీడియా వద్దకు పరుగులు తీసి ఏదో చెప్పాలని ప్రయత్నించడం, అలాగే, ఆమె తరఫు న్యాయవాది తీవ్రంగా స్పందించడం వంటి పరిణామాలు ఉత్కంఠను రేపాయి. చివరకు ఈనెల మొదటి వారంలో నిర్మలాదేవి వ్యవహారంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం దృష్టి పెట్టింది. పిటిషన్ దాఖలుతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎట్టకేలకు బయటకు: ఈనెల 12న న్యాయమూర్తులు కృపాకరణ్, సుందర్ నేతృత్వంలోని బెంచ్ ఎదుట నిర్మలాదేవిని సీబీసీఐడీ వర్గాలు హాజరు పరిచాయి. విచారణ, వాదనల అనంతరం నిర్మలాదేవికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. 11 నెలల అనంతరం నిర్మలాదేవికి బెయిల్ లభించించినా, జైలు నుంచి బయటకు వచ్చేందుకు అడ్డంకులు తప్పలేదు. ఇందుకు కారణం పూచీకత్తు ఇచ్చేందుకు కుటుంబీకులు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే. దీంతో బెయిల్ లభించినా వారం రోజులుగా ఆమె బయటకు రాలేని పరిస్థితి. ఎట్టకేలకు ఆమె సోదరుడు రవి, బంధువు మాయాండి స్పందించారు. నిర్మలాదేవికి తమ పూచీకత్తును ఇవ్వడంతో మదురై కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం మధ్యాహ్నం ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. సోదరుడు, బంధువు, న్యాయవాదితో కలిసి ఆమె కారులో బయలుదేరి వెళ్లారు. కోర్టు ఆంక్షల దృష్ట్యా, ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆమె తరఫున న్యాయవాది పసుం పొన్‌పాండి మాట్లాడుతూ గవర్నర్‌ను టార్గెట్ చేశారు. గవర్నర్ ఎక్కడ: న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసులో నిర్మలాదేవిని అన్యాయంగా ఇరికించారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలు ఈ వ్యవహారం వెనుక ఉన్నాయని, బెయిల్ లభించకుండా అడ్డుకున్న వాళ్లు, తాజాగా పూచీకత్తు ఇవ్వకుండా ఆమె కుటుంబీకులకు బెదిరింపులు సైతం ఇచ్చారని ఆరోపించారు. అందుకే బెయిల్ వచ్చినా వారం రోజుల అనంతరం జైలు నుంచి బయటకు రావాల్సిన పరిస్థితిగా పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ ఢిల్లీలో ఉన్నారా..గిండిలో ఉన్నారా అని ప్రశ్నించారు. నిర్మలాదేవి వ్యవహారంలో దూకుడు ప్రదర్శించిన వాళ్లకు పొల్లాచ్చి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పొల్లాచ్చిలో వందలాది మంది యువతుల జీవితాలతో చెలాగాటం ఆడిన మృగాళ్ల వ్యవహారం గవర్నర్‌కు కనిపించ లేదా అని ప్రశ్నించారు. నిర్మలాదేవి వ్యవహారంలో ఆగమేఘాలపై ప్రకటనతో పాటు సంతానం కమిటీని రంగంలోకి దించిన గవర్నర్, పొల్లాచ్చి వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎందుకంటే, అక్కడ చిక్కిన వాళ్లంతా, రాజకీయ ప్రబద్ధులకు చెందిన వారే అని మండి పడ్డారు. ఈ కేసులో నిర్మలాదేవి నిర్ధోషిగా బయటకు రావడం ఖాయం అని ఈసందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
నిర్మలాదేవికి బెయిల్
సాక్షి, చెన్నై: ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం మంగళవారం ఆదేశించింది.నలుగురు విద్యార్థినులను మాయమాటలతో తప్పుడు మార్గంలో పయనింపచేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైన అరుప్పు కోట్టై ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారం గురించి తెలిసిందే. ఎవరి కోసమో ఆమె ఆ విద్యార్థుల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆడియో స్పష్టం చేయడం దుమారం రేపింది. ఈ కేసులో నిర్మలాదేవితో పాటుగా మురుగన్, కరుప్పు స్వామిలు అరెస్టయ్యారు. పది నెలలుగా విచారణ శరవేగంగా సాగడంతో అనేక అనుమానాలు, ఆరోపణలు గుప్పించే వాళ్లు ఎక్కువే. వీరికి బెయిల్ కూడా రానివ్వకుండా ప్రయత్నాలు సాగుతుండటంతో తెర వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో సిబీసీఐడీ తన విచారణను వేగవంతం చేసి, ఆగమేఘాల మీద చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాంగ్ములం సేకరించింది. సాక్షులను కోర్టు ముందు ఉంచే యత్నం చేసింది. పలుమార్లు ఈ నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా, చివరకు నిరాశే. ఎట్టకేలకు మురుగన్, కరుప్పులు సుప్రీంకోర్టు తలుపు తట్టి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే, నిర్మలాదేవికి మాత్రం బెయిల్ లభించలేదు. ఇక, విచారణకు హాజరైన సమయంలో భద్రతా వలయాన్ని ఛేదిస్తూ నిర్మలాదేవి మీడియా వద్దకు పరుగులు తీయడం, తాను ఏ తప్పు చేయలేదని, బలవంతంగా కేసులో ఇరికించారని, సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతం కావడం ఆ ప్రచారాలకు బలం చేకూరినట్టు అయ్యాయి. అలాగే, ఎవర్నో రక్షించే ప్రయత్నంలో నిర్మలాదేవి బలి పశువు అయ్యారని, త్వరలో ఆధారాలు బయట పెడుతానంటూ ఆమె న్యాయవాది పసుం పొన్ పాండియన్ ప్రకటించారు. అలాగే, జైలులో నిర్మలాదేవికి ప్రాణహాని సైతం ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మలాదేవికి బెయిల్ మంజూరు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అలాగే, సీబీసీఐడీని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడమే కాకుండా, నిర్మలాదేవిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం న్యాయమూర్తులు కృపాకరణ్, సుందర్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు నిర్మలాదేవిని సీబీసీఐడీ వర్గాలు హాజరు పరిచాయి. విచారణ, వాదనల అనంతరం నిర్మలాదేవికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆమె తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, 11 నెలల అనంతరం నిర్మలాదేవికి బెయిల్ లభించడం ఆనందంగా ఉందన్నారు. -
జైలులో నిర్మలాదేవి ఆత్మహత్యాయత్నం!
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమ తరఫు న్యాయవాది గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్ జిల్లా, అరుప్పుకోట్టైకు చెందిన ప్రొఫెసర్ నిర్మలాదేవి. ఈమె అక్కడే ఉన్న కళాశాల విద్యార్థినులకు లైంగిక ఎరవేసిన నేపథ్యంలో ఏప్రిల్‌లో అరెస్టయి మదురై సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా శ్రీవిల్లిపుత్తూరులో గురువారం కేసు విచారణకు నిర్మలాదేవి హాజరుకావాల్సి ఉండగా ఆమె హాజరుకాలేదు. బెయిలుపై విడుదలైన ప్రొఫెసర్ మురుగన్, కరుప్పసామి కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఈ కేసు మార్చి నెల 20వ తేదీకి వాయిదా పడింది. సాయంత్రం మూడు గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్మలాదేవిని హాజరుపరిచి కేసు వాయిదా వివరాలను తెలిపారు. దీనికి సంబంధించి ఆమె న్యాయవాది పసుంపొన్ పాండియన్ మాట్లాడుతూ నిర్మలాదేవి అధికార పక్ష నేతల బెదిరింపులకు గురవుతున్నారన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరిస్తున్నట్లు తెలిపారు. గతంలో కోర్టులో విచారణకు హాజరుపరిచి మదురైకు వస్తున్న మార్గంలో కృష్ణన్కోవిల్కు, టి.కల్లుపట్టికి మధ్య పోలీసు వ్యాను నిలిపి నిర్మలాదేవిపై పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో ఆమెకు గాయాలు ఏర్పడ్డాయని, దీంతో ఆమె మదురై సెంట్రల్ జైలులో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆమెను సిబ్బంది అడ్డుకున్నట్లు వెల్లడించారు. -
ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు
అనంతపురం అర్బన్: ‘ధర్మవరం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పులతడకగా సిద్ధం చేశారు. బోగస్, వివాహం చేసుకుని వెళ్లిన వారు, రెండు ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు జాబితాలో 6,073 ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. రెవెన్యూ అధికారులు ఏళ్లగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వారిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. వీటన్నింటిపైన ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అ«ధికారికి 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’ అని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్మాలిక్కు ధర్మవరం మాజీ ఎమ్మల్యే, వైఎస్సార్సీపీ నియోజవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాలపై విచారణ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్మాలిక్, సెక్షన్ ఆఫీసర్ రవి శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో చేపట్టిన విచారణకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరై... ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను ఆధారాలతో సహా అందజేశారు. అధికారులను అధికారపార్టీ ఏవిధంగా ప్రలోభపెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెట్టి తప్పుడు ఓట్లను నమోదు చేయిస్తోంది వివరించారు. కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ధర్మవరం, అనంతపురం ఆర్డీఓలు తిప్పేనాయక్, కూర్మనాథ్ ఉన్నారు. వెంకటరామిరెడ్డి ఫిర్యాదు ఇలా.. ♦ ఓటర్ల నమోదుకు 2018, సెప్టెంబరు నుంచి అక్టోబరు 31 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ వ్యవధిలో ఓటరు నమోదుకు 18,429 దరఖాస్తులు వచ్చాయి. సరైన విచారణ నిర్వహించకుండా 5,988 దరఖాస్తులు ఆమోదించారు. ♦ స్థానిక ఎమ్మెల్యే సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. పోలింగ్ బూత్ 134లో (సీరియల్ నంబర్ 620) ఒక ఓటు, బూత్ 230లో (సీరియల్ నంబరు 552) మరో ఓటు ఉంది. ♦ ఎం.పి.సుబ్బారావు అనే వ్యక్తికి 108 బూత్‌లో (491), 218 బూత్ నంబర్లో (771) మరో ఓటు ఉంది. రమేశ్‌బాబు అనే వ్యక్తికి బూత్ నంబర్ 1లో (34) ఒక ఓటు, అదే బూత్‌లో(443) మరో ఓటు ఉంది. జి.నరసింహులుకు బూత్ నంబర్ 1లో (373) ఒక ఓటు, అదే బూత్‌లో (605) మరో ఓటు ఉంది. ఇలా బోగస్ ఓట్లు 6 వేల వరకు ఉన్నాయి. ♦ బోగస్ ఓట్ల తొలగింపునకు బీఎల్ఓలు సిఫారసు చేసినా ఏఈఆర్ఓలు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వాటిపై 9,495 దరఖాస్తులు దాఖలు చేస్తే కేవలం 5,328 ఆమోదించారు. ♦ తొలగింపులకు సంబంధించి ఫారం–7లో దరఖాస్తు చేస్తే వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇవ్వకపోగా కనీసం విచారణ చేయలేదు. పైపెచ్చు దరఖాస్తులు తిరస్కరించారు. ♦ అధికారపార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక మునిసిపల్ కమిషనర్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దారు సెలవుపై వెళ్లారు. బోగస్ ఓటర్లను నమోదు చేయాలని బీఎల్ఓలు, ఏఈఆర్ఓలపై ఒత్తిడి చేస్తున్నారు. అలా చేయని పక్షంలో సెలవుపై వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ♦ ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్ ఓట్ల విషయంపై సీఈఓ, డీఈఓకు 20 సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. ఈ ఏడాది జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. అయినా వేల సంఖ్యలో బోగస్, డూప్లికేట్ ఓట్లు అలాగే ఉన్నాయి. ♦ ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్ ఓట్ల చేర్చడంపై బీఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారిని విచారణ చేయాలి. ఇందులో బాధ్యులైన వారందరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ♦ కొందరు రెవెన్యూ అధికారులు దీర్ఘకాలికంగా జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోæ వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వారిని యథావిధిగా జిల్లాలోనే కొనసాగిస్తూ ఎన్నికల విధులు అప్పగించారు. ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు ఈమె పేరు జి.నిర్మలాదేవి. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సతీమణి. పట్టణంలో డబ్ల్యూఏయూ 316364, ఇంటి నెంబర్ 2–1, డబ్ల్యూఏయూ 1222975, ఇంటి నెంబర్ 25–585 పేరిట రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఈ ఉదాహరణను పరిశీలిస్తే.. స్థానికంగా దొంగ ఓట్ల నమోదు ఏ స్థాయిలో సాగిందో అర్థమవుతోంది. -
‘నిర్మల’కు ప్రాణ హాని?
సాక్షి, చెన్నై: ప్రొఫెసర్ నిర్మలా దేవికి జైలులో ప్రాణహాని ఉందని, ఆమె మరణంతో కేసును ముగించేందుకు వ్యూహరచన సాగిందని న్యాయవాది పసుం పొన్ పాండియన్ ఆరోపించారు. శనివారం రాత్రి నిర్మలా దేవి గుండెపోటు వచ్చినంత వేదనకు గురికావడంతో మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం మళ్లీ జైలుకు తరలించారు. నలుగురు విద్యార్థినులను మాయమాటలతో తప్పుడు మార్గంలో పయనింప చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన అరుప్పు కోట్టై ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారం గురించి తెలిసిందే. ఎవరి కోసమో ఆమె ఆ విద్యార్థుల్ని లొంగ దీసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆడియో స్పష్టంచేయడం దుమారం రేపింది. ఈ కేసులో నిర్మలా దేవితో పాటు మురుగన్, కరుప్పు స్వామిలను అరెస్టుచేశారు. వీరు పది నెలలుగా కటకటాలకే పరిమితమయ్యారు. కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొచ్చే సమయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ సీబీసీఐడీ వర్గాలు వీరిని హాజరుపరిచే వారు. వీరికి ఇంతవరకు బెయిల్ కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో గత వారం విచారణ సమయంలో సీబీసీఐడీ భద్రతా వలయాన్ని ఛేదిస్తూ నిర్మలాదేవి మీడియా వద్దకు పరుగులు తీశారు. తాను ఏ తప్పు చేయలేదని, బలవంతంగా ఇరికిస్తున్నారని, సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెను మాట్లాడనివ్వకుండా మహిళా భద్రతా సిబ్బంది బలవంతంగా జైలుకు తరలించారు. అదే సమయంలో నిర్మలా దేవిని కేసులో బలవంతంగా ఇరికించిచారని, ఎవర్నో రక్షించే ప్రయత్నంలో ఆమెను బలి పశువు చేశారని, త్వరలో ఆధారాలు బయటపెడుతానంటూ న్యాయవాది పసుం పొన్ పాండియన్ ఆ సమయంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మలా దేవి హఠాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో అనుమానాలు బయలుదేరాయి. ఆసుపత్రికి తరలింపు కోర్టుకు వెళ్లొచ్చిన అనంతరం నిర్మలా దేవి అనారోగ్యం బారిన పడ్డట్టు సమాచారం. అయితే, ఆమెకు జైలు వర్గాలు ఎలాంటి చికిత్స అందించడం లేదన్న ఆరోపణలు కూడా బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి గుండె పోటు వచ్చినంతగా వేదన, శ్వాస ఆడకపోవడంతో నిర్మలా దేవి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీంతో ఆమెను రాత్రికి రాత్రే మదురై రాజాజీ ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులుఆమెకు కొన్ని రకాల మందుల్ని అందించారు. ఓపీ విభాగంలోనే చికిత్స అందించి ఆదివారం మధ్యాహ్నం మళ్లీ జైలుకు తరలించారు. అయితే, ఆమెకు ప్రాణ హాని ఉందని , జైలులోనే ఆమె మరణించే విధంగా వ్యూహరచన చేసినట్టు న్యాయవాది పసుం పొన్ పాండియన్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఇప్పటికే పలుమార్లు కోర్టుకు వివరించి ఉన్నట్టు, అయితే, అందుకు తగ్గ వైద్య పరీక్షలు అందించడం లేదన్నారు. శని, ఆదివారం చోటు చేసుకున్న పరిస్థితిని బట్టి చూస్తే, ఆమె జైలులోనే మరణించే విధంగా ప్రయత్నాలు చేసి ఉన్నట్టుందని, ఈ కేసు వెనుక ఉన్న పెద్దల్ని రక్షించి, కేసును ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుందని ఆరోపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణించి తక్షణం బెయిల్ మంజూరుతోపాటు ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో నిర్మలా దేవి జీవితం జైలులోనే ముగిసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తంచేశారు. -
పెద్దల కోసమే విద్యార్ధినుల్ని ప్రేరేపించి..
సాక్షి, చెన్నై : విద్యార్ధినుల్ని ప్రేరేపించి, ఒత్తిడి తెచ్చి మరీ తప్పుడు మార్గంలో పయనింపచేయడానికి ప్రొఫెసర్ నిర్మలాదేవి చేసిన ప్రయత్నానికి సంబంధించి రోజుకో రూపంలో వెలువుడుతున్న వాంగ్మూలం అంతా కట్టు కథ అని మురుగన్ న్యాయవాది సురేష్ స్పష్టంచేశారు. సీబీసీఐడీ ఓ కట్టుకథను సృష్టించి, దానిని చార్జ్ షీట్‌గా పేర్కొంటూ, మీడియాను తప్పుదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము నిర్ధోషులం అని, తమను ఈ కేసు నుంచి విడుదల చేయాలని కోరుతూ నిర్మలాదేవి అండ్ బృందం విరుదునగర్ కోర్టును గురువారం ఆశ్రయించింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగుర్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినుల్ని లైంగిక ప్రేరణకు గురిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి సాగించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎవరో పెద్దల కోసమే ఆమె విద్యార్థినుల మీద ఒత్తిడి తెచ్చినట్టు తొలుత ప్రచారం సాగింది. ఈ వ్యవహారంలో పెద్దలు అనేకమంది ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈ కేసులో నిర్మలాదేవితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్ప స్వామిలను అరెస్టుచేశారు. ఈకేసును విచారిస్తున్న సీబీసీఐడీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చార్జ్‌షీట్, విచారణలో వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు వివరాలు అంటూ సరికొత్త తరహా కథనాలు మీడియాల్లో వెలువడుతున్నాయి. ఈ కథనాలన్నీ సీబీసీఐడీ సృష్టిగా పేర్కొంటూ, మురుగన్ తరపు న్యాయవాది సురేష్ మీడియా ముందుకు వచ్చారు. బలి పశువులుగా.. కోర్టు విచారణకు హాజరవుతూ వస్తున్న నిర్మలాదేవి, మురుగన్, కరుప్పస్వామి తాము వాంగ్మూలం ఇచ్చినట్టు ఏ సందర్భంలోనూ పేర్కొనలేదని వివరించారు. ఈ కేసులో ఎవర్నో పెద్దల్ని రక్షించే ప్రయత్నంలో ఇద్దర్ని బలి పశువులు చేయడానికి సీబీసీఐడీ సిద్ధం అయిందని ఆరోపించారు. ఆ ఇద్దరే మురుగన్, కరుప్పు స్వామిలగా పేర్కొన్నారు. ఈ ఇద్దర్నీ కేసులో ఇరికించేందుకు రోజుకో కథనం మీడియాల్లోకి ఎక్కుతోందని ఆరోపించారు. ఇది సీబీసీఐడీ సృష్టించిన కట్టు కథ అని, ఇది తమ కేసుకు ఉపయోగపడే రీతిలో మీడియాను సీబీసీఐడీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ కట్టు కథను నమ్మవద్దు అని సూచించారు. కాగా, ఈ కేసులో తాము నిర్ధోషులం అని, తాము తప్పుచేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, అయితే, తమను బలవంతంగా మదురై కారాగారంలో బంధించారని, తమ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని, లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిర్మలాదేవి, మురుగన్, కరుప్పుస్వామి విరుదునగర్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. -
నిర్మలాదేవిపై వ్యభిచార నిరోధక కేసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: లైంగిక అవసరాలు తీర్చేలా కళాశాల విద్యార్థినులను తప్పుడు మార్గాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేసిన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవిపై వ్యభిచార నిరోధక చట్టం, ఉమ్మడిగా కుట్ర కేసులను పెట్టారు. విద్యార్థినులను లైంగికంగా ప్రలోభాలకు గురిచేసిన మాట వాస్తవమేనని నిర్మలాదేవి సైతం అంగీకరించినట్లు సీబీసీఐడీ అధికారులు చెప్పారు. నిర్మలాదేవి నోటి ద్వారానే వాంగ్మూలాన్ని నమోదుచేసి కోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేసినట్లు సీబీసీఐడీ అధికారులు శనివారం తెలిపారు. సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టైలోని ఒక ప్రయివేటు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి తన కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులను పలురకాలుగా మభ్యపెట్టి ఉన్నతాధికారుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందిగా ఒత్తిడి చేశారు. సెల్‌ఫోన్ ద్వారా పదేపదే వారిని సంప్రదిస్తూ ఒప్పించే ప్రయత్నం చేయడంతో ఈ విషయాన్ని సదరు విద్యార్థినులు తమ సెల్ఫోన్లలో రికార్డుచేశారు. నిర్మలాదేవి మాటల ఆధారంతో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నిర్మలాదేవికి వ్యతిరేకంగా సీబీసీఐడీ కేసు నమోదుచేసి విచారిస్తోంది. అలాగే మహిళా డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటుచేసి విచారణ జరిగేలా ఆదేశించాలని కోరుతూ పురట్చికర మానవర్ ఇలైంజర్ మున్నని రాష్ట్ర కన్వీనర్ గణేశన్ గతంలో మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై æకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం సీబీసీఐడీ అదనపు ఎస్పీ లావణ్య తరఫున శుక్రవారం ఒక నివేదిక దాఖలైంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘విద్యార్థినులను వక్ర మార్గాలకు నెట్టివేసే ప్రయత్నాలు చేసిన నేరానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి, వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మురుగన్, పీహెచ్డీ విద్యార్థి కరుప్పుస్వామిలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఈ కేసు విచారణలో భాగంగా వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని వాంగ్మూలం నమోదు చేశాం. అలాగే బాధిత విద్యార్థినుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, విద్యార్థినులతో నిర్మలాదేవి జరిపిన సంభాషణలను సీడీల్లో రికార్డు చేశాం. ఈ కేసులో ఇంతవరకు 160 మంది నుంచి సాక్ష్యాలు సేకరించాం. మురుగన్, కుప్పుస్వామి కోసమే విద్యార్థినులపై లైంగిక ఒత్తిళ్లకు పాల్పడినట్లుగా నిర్మలాదేవి తన వాంగ్మూలంలో అంగీకరించారు. నిందితులు ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించి సిమ్‌కార్డులు, మెమొరీ కార్డులు, ల్యాప్‌టాప్ తదితర 123 ముఖ్యమైన ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ విభాగానికి పంపాం. అంతేగాక హైకోర్టు మదురై శాఖ ఆదేశాల ప్రకారం నిర్మలాదేవిమాటలను చెన్నై మైలాపూరులో ఫోరెన్సిక్ కార్యాలయానికి పంపాం’ అని బదులు పిటిషన్లో పేర్కొన్నారు. నిర్మలాదేవి తదితరులు నేరాన్ని అంగీకరించడం, తగిన ఆధారాలు లభించినందున వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టినట్లు తెలిపారు. ఈ బదులు పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కులువాడి జీ రమేష్, కల్యాణ సుందరంలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. మహిళలకు వ్యతిరేకంగా, హక్కులకు భంగకరమైన కేసులను ప్రధాన న్యాయమూర్తి వీకే తహీల్ రమణి, న్యాయమూర్తి ఎమ్ దురైస్వామిలతో కూడిన మొదటి శ్రేణి డివిజన్ బెంచ్ విచారిస్తోందని రమేష్, కల్యాణ సుందరం తెలిపారు. కాబట్టి ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు వారు చెప్పారు. బెయిల్‌కు నోచుకోని నిర్మలాదేవి లైంగిక ఒత్తిడి కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన నిర్మలాదేవి అరెస్టయ్యారు. ఆనాటి నుంచి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 7 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు మంజూరు చేయలేదు. బెయిల్ మంజూరు కాకపోవడంతో 130 రోజులుగా నిర్మలాదేవి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. -
ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరీక్ష
టీ.నగర్: కళాశాల విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఫోరెన్సిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హేమలత సమక్షంలో గురువారం స్వర పరిశోధన (వాయిస్ టెస్ట్) జరిగింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను సెల్ఫోన్లో సంప్రదించి లైంగిక ప్రలోభాలకు గురి చేసినట్లు ఆడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. నిర్మలాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం మదురై సెంట్రల్జైల్లో నిర్బంధించారు. నిర్మలాదేవికి సహకరించిన మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. మదురై జైల్లో ఉన్న ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరిశోధన జరపాలంటూ సీబీసీఐడీ పోలీసులు మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలో ఈ పరీక్షకు తగిన పరికరాలు లేనందున చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిర్మలాదేవిని తీసుకువచ్చి పరీక్షలు జరిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పుళల్ జైలు నుంచి మైలాపూరులో గల పరిశోధన కేంద్రానికి 10.30 గంటలకు ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసు భద్రతతో తీసుకుని వచ్చారు. తరువాత ఆమెను పరిశోధన కేంద్రంలో హాజరు పరచి వాయిస్ టెస్ట్‌తో పాటు వివిధ పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను మదురై హైకోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. -
అందులోని అంశాలను బహిర్గతం చేయరాదు
సాక్షి, చెన్నై : విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు ప్రయత్నించిన ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారంపై విచారణ ముగిసింది. సీల్డ్ కవర్లో నివేదిక రాజ్ భవన్‌కు చేరింది. వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా రాజ్‌భవన్ వర్గాలు ఆ నివేదికలోని అంశాలను బయటపెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. విరుదునగర్ జిల్లా అర్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల గణితం ప్రొఫెసర్ నిర్మలా దేవి లీల ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నలుగురు విద్యార్థినులను ఎంపిక చేసి, ఎవరి కోసమో లైంగిక ప్రేరణకు ప్రయత్నిస్తూ ఆమె సాగించిన ఆడియో బయటపడడం రాష్ట్రంలో వివాదాన్ని రేపింది. విద్యార్థినులకు కళాశాలల్లో భద్రత కరువైందని ఆందోళనలు బయలు దేరాయి. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సైతం తానే స్వయంగా ఓ కమిటీని రంగంలోకి దించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం నేతృత్వంలో విచారణ కమిషన్ రంగంలోకి దిగడం వివాదానికి సైతం దారితీసింది. రాజ్ భవన్ చేరిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన సమయంలో గవర్నర్ ప్రత్యేక విచారణ కమిషన్‌ను రంగంలోకి దించడంతో ప్రతిపక్షాలు పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. అయితే, గవర్నర్ ఏ మాత్రం తగ్గలేదు. తాను నియమించిన కమిటీ ద్వారా విచారణకు చర్యలు తీసుకున్నారు. సంతానం నేతృత్వంలోని కమిషన్ మదురై చెరలో ఉన్న నిర్మలా దేవితో పాటు, ఆమెకు సహకారంగా ఉన్న మురుగన్, కరుప్ప స్వామిలను సైతం విచారించింది. అన్ని ప్రక్రియలు వీడియో చిత్రీకరణగా సాగాయి. పలు కోణాల్లో ఈ కమిటీ విచారణ చేసి నివేదికను సిద్ధంచేసి రాజ్ భవన్‌కు చేర్చింది. మంగళవారం నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి రాష్ట్ర గవర్నర్‌కు సంతానం అందజేశారు. అన్ని కోణాల్లో విచారణ నిర్మలాదేవి వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని విచారణ కమిషన్ చైర్మన్ సంతానం తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన విచారణ ముగిసిందని, నివేదిక రాజ్ భవన్‌కు చేరిందని వివరించారు. అన్ని కోణాల్లో విచారణ సాగిందని, ప్రధానంగా 60మంది వద్ద సాగిన విచారణలో పలు అంశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఈ విచారణ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్న దృష్ట్యా, ఇతర వివరాలు వెల్లడించేందుకు వీలు లేదన్నారు. కాగా, రాజ్ భవన్‌కు సీల్డ్ కవర్లో నివేదిక చేరినా, ఎన్ని పేజీలు ఉన్నాయో, అందులోని వివరాలు ఏమిటీ అనేది గవర్నర్ సైతం తెలుసుకోలేని పరిస్థితి. ఇందుకు కారణం ఈ వ్యవహారం కోర్టులో ఉండడమే. ఈ విచారణ కమిషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కోర్టు సైతం స్పందించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్లో ఉంచాలని, అందులోని అంశాలను, వివరాలను బయటపెట్టేందుకు వీలు లేదని కోర్టు ఆదేశాలు ఇచ్చి ఉండడం గమనార్హం. -
ఉచ్చులో మరో ఇద్దరు ప్రొఫెసర్లు
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధం ఉన్నట్లు సీబీసీఐడీ విచారణలో తేలింది. విద్యార్థినులను లైంగికంగా ఒత్తిడిచేసిన వ్యవహారంలో ప్రొఫెసర్ నిర్మలాదేవి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమె వద్ద సీబీసీఐడీ పోలీసులు జరిపిన విచారణ ఆధారంగా నిర్మలాదేవితో సంబంధం ఉన్న ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామిలను ఇదివరకే అరెస్టు చేశారు. ఇప్పటివరకు జరిపిన విచారణలు, వాంగ్మూలాలు, పత్రాల ఆధారంగా మధ్యంతర చార్జిషీటును కోర్టులో దాఖలు చేసేందుకు సీబీసీఐడీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధాలు ఉన్నట్లు గురువారం సమాచారం అందింది. వీరికి సమన్లు పంపి అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. -
నిర్మలాదేవి కేసులో మరిన్ని ఆధారాలు ?
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో ముఖ్య నిందితులకు సంబంధించిన మ రిన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. విద్యార్థినులను ప్రొఫెసర్ నిర్మలాదేవి లైంగిక కార్యకలాపాలకు పాల్పడాలని ఒత్తిడి చేసినట్టు వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఈ కేసులో విరుదునగర్ సీబీసీఐడీ కార్యాలయంలో ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామి వద్ద పోలీ సులు శనివారం విచారణ జరిపారు. ముఖ్య నిందితుల వివరాలను వారు వెల్లడించినట్లు తెలిసింది. మురుగన్, కరుప్పస్వామి ఉపయోగించిన సెల్ఫోన్లను సీబీసీఐడీ పోలీసులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. ఇలాఉండగా కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ విజయ శనివారం సీబీసీఐడీ విచారణకు హాజరయ్యారు. నిర్మలాదేవి–విద్యార్థినుల మధ్య సంభాషణల్లో వీఐపీలు, వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధాలున్నట్లు బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ నియమించిన ఐఏఎస్ అధికారి సంతానం శనివారం తన రెండో విడత విచారణను ముగించారు. -
నిర్మలాదేవిని విచారించిన సంతానం
టీ.నగర్: లైంగిక ఆరోపణలకు గురైన ప్రొఫెసర్ నిర్మలాదేవి వద్ద ప్రత్యేక విచారణ అధికారి సంతానం గురువారం విచారణ జరిపారు. అరుప్పుకోటై దేవాంగ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయిత్నంచినట్టు వచ్చిన ఆరోపణలు తెలిసిందే. దీనికి సంబంధించి ఆడియో టేపులు విడుదల కావడంతో నిర్మలాదేవిని అరెస్టు చేసి ఆమె వద్ద సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజులుగా విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించి మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఏకసభ్య విచారణ అధికారి సంతానం ఇది వరకే మదురై అరుప్పుకోటై ప్రాంతాల్లో ప్రాథమిక విచారణ జరిపారు. బుధవారం ఆయన రెండవ విడత విచారణను ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా పేర్కొనబడుతున్న నిర్మలాదేవి వద్ద సమగ్ర విచారణ జరిపేందుకు సంతానం నిర్ణయించారు. ఇందుకోసం మదురై సెంట్రల్ జైల్లో ఉన్న నిర్మలాదేవిని నేరుగా కలుసుకునేందుకు జైలు అధికారుల అనుమతి కోరారు. దీంతో అనుమతి లభించడంతో గురువారం ఉదయం సంతానం మదురై సెంట్రల్‌జైలుకు నేరుగా వెళ్లి నిర్మలాదేవి వద్ద విచారణ జరిపారు. ఆయనతో పాటు ప్రొఫెసర్లు కమలి, త్యాగేశ్వరి వెంట వెళ్లారు. శుక్రవారం సంతానం అరుప్పుకోటై కళాశాల నిర్వాహకులు, విద్యార్థినుల వద్ద విచారణ జరపనున్నారు. -
కళంకిత కళాశాల!
విద్యార్థినులను లైంగికఅవసరాలకు వినియోగించుకునే ప్రయత్నంలో కటకటాలపాలైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి విచారణలో సహాయ నిరాకరణ అవలంభించడం అధికారులను అసహనానికి గురిచేస్తోంది. నిర్మలాదేవిపై మరో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిశోధకవిద్యార్థి కోర్టులో బుధవారం లొంగిపోవడం వంటి ఘటనలతో విరుదునగర్ జిల్లాఅరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కాలేజి ‘కళంకాలకళాశాల’గాముద్రవేయించుకుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్మలాదేవి వ్యవహారంలో నిగ్గుతేల్చాలని ఆదేశిస్తూ గవర్నర్ బన్వరిలాల్ నియమించిన విచారణ కమిషన్ బుధవారం తన రెండోదశ విచారణను ప్రారంభించింది. కమిషన్ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించిన తొలిదశ విచారణలో మదురై కామరాజ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్లదురై, రిజిస్ట్రార్ తదితరుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండోదశ విచారణలో భాగంగా బుధవారం మదురైకి వచ్చిన సంతానం మదురై యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులను పిలిపించి మాట్లాడారు. జైలులో ఉన్న నిర్మలాదేవిని సైతం విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. లొంగిపోయిన పరిశోధక విద్యార్థి ఇదే కేసులో అజ్ఞాతంలో ఉన్న పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి బుధవారం మదురై కోర్టులో లొంగిపోయాడు. నిర్మలాదేవి కేసులో సీబీసీఐడీ అధికారులు జరుపుతున్న విచారణలో యూనివర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కర్పుస్వామి పేర్లు బయటకు వచ్చాయి. మురుగన్‌ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రెండురోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి కోసం తీవ్రంగా గాలించినా దొరకలేదు. ఈ దశలో మదురై జిల్లా జూనియర్ మేజిస్ట్రేటు–5 కోర్టులో న్యాయమూర్తి సబీనా సమక్షంలో బుధవారం ఉదయం కరుప్పుస్వామి లొంగిపోయారు. ఇతడిని ఈనెల 26వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. పెద్దలు తప్పించుకునే అవకాశం నిర్మలాదేవి వ్యవహారంలో ఐఏఎస్ తదితర ఉన్నతాధికారులకు సంబంధం ఉందని అయితే కిందిస్థాయి అధికారులపై నేరం మోపి పెద్దలు తప్పించుకునే అవకాశం ఉందని కరుప్పుస్వామి తరఫు న్యాయవాదులు బుధవారం కోర్టుకు చెప్పారు. వాస్తవాలు వెలుగు చూడాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని వారు కోరారు. కాగా, తూత్తుకూడికి చెందిన మహిళాకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సైతం సమన్లు పంపారు. సమన్లు అందుకున్న సదరు ప్రొఫెసర్‌ను అధికారులు విచారించారు. విద్యార్థినులతో పర్యాటకంగా వెళ్లినపుడు తప్పనిసరైన పరిస్థితిలో నిర్మలాదేవితో కలిసి తూత్తుకూడిలోని గదిలో ఉన్నానని, అంతకు మించి సంబంధం లేదని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరింతమంది విద్యార్థినులను ప్రలోభపెట్టారు విచారణకు వచ్చిన ఐఏఎస్ అధికారి సంతానం బృందానికి మదురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్ ఒక వినతిపత్రం సమర్పించారు. దేవాంగర్ కళాశాలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే మరో ఇద్దరు విద్యార్థినులను లైంగిక ప్రయాజనాల కోసం నిర్మలాదేవి ఒత్తిడి చేశారని, దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా చర్యతీసుకోలేదని అందులో పేర్కొన్నారు. సదరు విద్యార్థినుల తరఫున కమిషన్ ముందు హాజరై ఫిర్యాదు చేశారు. వీరిద్దరినే కాదు మరింతమంది విద్యార్థినులను ఆమె ప్రలోభపెట్టారని ముత్తుకుమార్ మీడియాకు తెలిపారు. బాధిత విద్యార్థినుల పేర్లు, విలాసం తదితర వివరాలను కమిషన్‌కు సమర్పించినట్లు ఆయన చెప్పారు. విద్యార్థినులకు నిర్మలాదేవి బ్రెయిన్‌వాష్ చేసినట్లుగా చెబుతున్న ఆడియోను పరిశీలిస్తున్నట్లు సంతానం తెలిపారు. కోర్టుకు నిర్మలా దేవి నిర్మలాదేవికి మంజూరైన ఐదురోజుల పోలీసు కస్టడీ బుధవారంతో ముగియడంతో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఐదురోజుల కాలంలో ఆమె సరైన సమాచారం ఇవ్వకుండా విచారణకు సహకరించలేదని అధికారులు అసంతృప్తితో ఉన్నారు. మరో పదిరోజుల పోలీసు కస్టడీ మంజూరు చేయాలని కోర్టును కోరనున్నారు. ఇదే కేసులో సోమవారం అరెస్టయిన ప్రొఫెసర్ మురుగన్‌ను బుధవారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. -
నేను కూడా మోసపోయాను: నిర్మలాదేవి
టీ.నగర్: మరో ఆరుగురు విద్యార్థినుల ఫిర్యాదుతో నిర్మలాదేవిని సీబీసీఐడీ కస్డడీలోకి తీసుకుని విచారించనున్నారు. విరుదునగర్ జిల్లా, అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మదురై సెంట్రల్ జైలు నిర్బంధంలో ఉన్న ఆమెను సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజుల కస్టడీలో విచారణ జరుపుతూ వచ్చారు. సోమవారంతో నాలుగు రోజుల విచారణ పూర్తికాగా, నిర్మలాదేవి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో సీబీసీఐడీ పోలీసులు నిరాశకు గురయ్యారు. ఆమె విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. మరో ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. సీబీసీఐడీ విచారణ దారి మళ్లించే విధంగా ఉన్నట్లు కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్లలో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీసీఐడీ పోలీసులు విచారణ సక్రమంగా నిర్వహించలేదని వారు ఆరోపిస్తున్నారు. రూ.30లక్షలు మోసపోయిన నిర్మలాదేవి: ప్రొఫెసర్ నిర్మలాదేవి తన కుమార్తెకు మెడికల్ సీటు పొందేందుకు రూ.30లక్షలు నగదు అందజేసి మోసపోయినట్లు విచారణలో తేలింది. ఈ నగదును ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో విద్యార్థినులను ఎరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. కెమెరా ఫుటేజీల పరిశీలన: నిర్మలాదేవి కేసు వ్యవహారంలో కామరాజర్ వర్సిటీ కెమెరా ఫుటేజీలను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఇలా ఉండగా పోలీసులు మరో ఇద్దరు ప్రొఫెసర్ల వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. మదురై కామరాజర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ వద్ద సోమవారం విచారణ జరిపారు. -
నిర్మలాదేవి భర్త కీలక నిర్ణయం..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కీలక వ్యక్తుల్లో ఒకరైన ప్రొఫెసర్ మురుగన్‌ను సీబీసీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాళాల విద్యార్థినులను యూనివర్సిటీ పెద్దల లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టి అరెస్టయిన నిర్మలాదేవి కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మలాదేవిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నిర్మలాదేవి వద్ద జరిపిన విచారణలో పలువురు వీవీఐపీలు, వీఐపీలు పాత్ర ఉన్నట్లు తేలింది. వారిలో మదురై యూనివర్సిటీ మానవవనరుల శాఖ సంచాలకులు కలైసెల్వన్, సహాయక ప్రొఫెసర్లు మురుగన్, కరుప్పుస్వామిలను విచారించాలని నిర్ణయించారు. వారిలో కలైసెల్వన్ ఆదివారం విచారణకు హాజరుకాగా తమ కస్టడీలోనే ఉంచుకుని విచారిస్తున్నారు. కలైసెల్వన్‌ను సైతం అరెస్ట్ చేస్తారనితెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ గత నాలుగురోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు తీవ్రతరం చేశారు. తిరుచ్చిళి సమీపం నాడాకుళం గ్రామంలోని కరప్పుస్వామి ఇంటిలో భార్య, బంధువులను పోలీసులు విచారించారు. మధురై అరుప్పుకోట్టైలోని బంధువుల ఇంటిలో గాలింపు చేపట్టారు. నాలుగురోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మురుగన్ యూనివర్సిటీలోని అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేసేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావడంతో పోలీసు అధికారులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఓపిగ్గా వేచిచూస్తే నిజాలు బయటకు వస్తాయని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్ల దురై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండోసారి భర్త విడాకుల పిటిషన్ నిర్మలాదేవితో తెగదెంపులు చేసుకోవాలని విడాకులకు సిద్ధమైన భర్త గతంలో నోటీసులు పంపారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అప్పట్లో విరమించుకున్నారు. అయితే నిర్మలాదేవి వివాదాల్లో కూరుకుపోవడంతో రెండురోజుల క్రితం విడాకులు కోరుతూ ఆయన మరోసారి దరఖాస్తు చేశారు. కాంట్రాక్టులోనూ అక్రమాలు తన భర్త కోసం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సైతం నిర్మలాదేవి అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో సీబీసీఐడీ అధికారులు ముగ్గురు కాంట్రాక్టర్లును కూడా పిలిచి విచారిస్తున్నారు. అరుప్పుకోట్టై అత్తిపట్టులోని నిర్మలాదేవి ఇంట్లో ఏడుగురితో కూడిన సీబీసీఐడీ అధికారుల బృందం ఆదివారం ఆరుగంటలపాటు తనిఖీలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, సీడీలు మూడు సంచుల నిండా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఇంటికి సీలువేశారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లను కనుగొన్నారు. నిర్మలాదేవి భర్త శరవణపాండియన్ ప్రభుత్వ కాంట్రాక్టరు కావడంతో కాంట్రాక్టులను పొందేందుకు వీరి సిఫార్సులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా సదరు ప్రభుత్వ అధికారులను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
నిర్మలా దేవి ఇంట్లో సోదాలు.. డైరీలో గుట్టు
విద్యార్థినులకు లైంగిక వేధింపుల ప్రేరణ వ్యవహారం ఉచ్చులో తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ను ఇరికించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని తెలిసింది ఆయన మీద అనుమానాలు వ్యక్తంచేస్తూ, రీకాల్‌కు పట్టుబడుతున్నాయి. ఈగవర్నర్ను వెనక్కు తీసుకోండనే నినాదం ఆదివారం సీపీఎం నేతృత్వంలో తెరమీదకు వచ్చింది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆ పార్టీ లేఖాస్త్రం సంధించింది. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ నిర్మలా దేవి ఇంట్లో సాగిన తనిఖీల్లో లభించిన డైరీలో పలువురు పెద్దల గుట్టు ఉన్నట్టు సమాచారం. ఇందుకు బలం చేకూర్చే రీతిలో సీబీసీఐడీ పలువురిని విచారణ వలయంలోకి తీసుకు రావడం గమనార్హం. సాక్షి, చెన్నై : విద్యార్థినులకు లైంగిక ప్రేరణలో చిక్కిన ప్రొఫెసర్ నిర్మలా దేవిని సీబీసీఐడీ తీవ్రంగానే విచారిస్తోంది. ఆమె గుట్టును రట్టు చేసిన విద్యార్థినులను సైతం సీబీసీఐడీ ప్రత్యేక బృందం రహస్య విచారణ చేపట్టింది. వారి నుంచి సేకరించిన సమాచారంతో నిర్మలా దేవి సోదరుడు రవిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడితో కలిసి ఈ ప్రత్యేక బృందం శనివారం రాత్రంతా పుదుకోట్టైలోని నిర్మలా దేవి నివాసంలో సోదాలు చేసింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్‌లతో పాటు బ్యాంక్ ఖాతాలు, కొన్ని డైరీలను సీబీసీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆదివారం ఉదయాన్నే ఆ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. డైరీలో లభించిన సమాచారం మేరకు నిర్మలా దేవి భర్త శరవణతో పాటు నలుగురు కాంట్రాక్టర్లను విచారించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో మదురై కామరాజర్ వర్సిటీకి చెందిన ఓ డైరెక్టర్‌ను గురిపెట్టి, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు సాగాయి. నిర్మలా దేవి డైరీలోని గుట్టు మేరకు ఈ సోదాలు సాగుతుండడంతో, మరెందరు ఈ విచారణ వలయంలోకి వస్తారోఅనే చర్చ బయలు దేరింది. కాగా, సీబీసీఐడీ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో గవర్నర్ బన్వరిలాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ఐఏఎస్ సంతానం కమి టీ ఇరకాటంలో పడింది. నిర్మలాదేవి వద్ద విచారణ సా గించడం ఆ కమిటీకి కష్టతరంగా మారినట్టు తెలు స్తోం ది. ఆమె వద్ద విచారణ లక్ష్యంగా సోమవారం ఆ కమిటీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ రీకాల్‌కు పట్టు నిర్మలా దేవి బండారం, తెర వెనుక ఉన్న శక్తుల్ని తెర మీదకు తెచ్చే దిశలో విచారణ వేగం ఓ వైపు జోరందుకుంది. మరోవైపు ఈ ఉచ్చులో గవర్నర్ బన్వరిలాల్‌ను సైతం ఇరికించే రీతిలో ప్రతిపక్షాలు ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు, తాజా పరిస్థితుల్ని అస్త్రంగా చేసుకుని ఆయన రీకాల్‌కు పట్టుబట్టే పనిలో పడ్డాయి. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖాస్త్రం సంధించారు. అందులో విద్యార్థినులకు లైంగిక ప్రేరణ, నిర్మలా దేవి వ్యవహారాన్ని గుర్తుచేస్తూ, ఇందులో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ దూకుడుగా ముందుకు సాగడం అనుమానాలకు బలాన్ని ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఆయనకు లేదని వివరిస్తూ, ఆగమేఘాలపై గవర్నర్ స్పందించిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం వెనుక కారణాలు ఏమిటో సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గవర్నర్ మీద సైతం ఆరోపణలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆయన నియమించిన కమిటీ ఎలా విచారణను న్యాయబద్ధంగా నిర్వహించగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీ విచారించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ దృష్ట్యా, గవర్నర్‌ను వెనక్కు పిలిపించుకోవాలని, ఆయన మీద విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. లేని పక్షంలో తమిళనాట ఆందోళనలు మరింతగా భగ్గుమంటాయని పేర్కొనడం గమనార్హం. -
ఆమె వాట్సాప్‌లో మంత్రులు, ఐఏఎస్‌లు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అనైతిక కార్యకలాపాల వెనుక ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. వారందరికీ ఆమె తరచూ ఫోన్లు చేయడం, గంటల తరబడి జరిపిన వాట్సాప్ సంభాషణలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలో నిర్మలాదేవి కేసు విచారణ జరుగుతోంది. నిర్మలాదేవిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ విద్యార్థినులను లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టడంపై ఉన్నతవిద్యాశాఖకు గత నెలలోనే ఫిర్యాదులు అందాయి. కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక నివేదిక తయారుచేసి అధికారులకు పంపారు. అయితే వారు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో సదరు నివేదికను గవర్నర్ కార్యదర్శి రాజగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం విచారణకు వచ్చిన కమిషన్ చైర్మన్ ఆర్ సంతానంను అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఒక్క నిర్మలాదేవి విషయమేగాక ఉన్నతవిద్యాశాఖలో చోటుచేసుకున్న అనేక అక్రమాలను ఆయన ముందుంచారు. ఇదిలాఉండగా, నిర్మలాదేవి మొబైల్ ఫోన్లో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అ«ధికారులు, ఉన్నత విద్యాశాఖలో పనిచేసే మరికొందరు అధికారులతో సంభాషణలు, ఫొటోలతో కూడిన ఆధారాలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దల భాగోతం బైటపడడంతో విచారణలో ప్రతిష్టంభన నెలకొంది. నిర్మలాదేవిని సస్పెండ్ చేస్తూ జారీఅయిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆమె ఒత్తిడి మేరకు మదురై కామరాజ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్..రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో పట్టుదొరకని కాలంలో నిర్మలాదేవి పలువురితో సన్నిహితంగా మెలిగిందని, విద్యార్థినులతో ‘విందు’ ఏర్పాట్లు చేసిందని విచారణలో వెలుగుచూసింది. విద్యార్థినులను లైంగికంగా లొంగదీసుకునేందుకు వారికి చుడిదార్లు, చీరలు కొనిచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పలువురు విద్యార్థినులను శుక్రవారం విచారించారు. ఈ రకంగా వచ్చిన అక్రమార్జనతో వీసీ పోస్టు సంపాదించాలని భావించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం కమిషన్ చైర్మన్ సంతానం శుక్రవారం కళాశాలలో విచారణ జరిపారు. నిర్మలాదేవిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సీబీసీఐడీ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం మదురై సాత్తూరు కోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. నిర్మలాదేవిని వెంటపెట్టుకుని పోలీసులు రావడంతో మాదర్ సంఘం కార్యకర్తలు ఆమెను ముట్టడించి నిరసన నినాదాలు చేశారు. ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. -
నిర్మలాదేవి చెంప చెళ్లుమనేలా అనుభవం..
తన స్వప్రయోజనాల కోసం విద్యార్థినులను లైంగికంగా ఎరవేసే ప్రయత్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి చెంప చెళ్లుమనేలా చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పెద్దల వద్దకు తమను పంపడం ఎందుకు మీ ఇద్దరు కుమార్తెలను పంపవచ్చు కదా అని విద్యార్థినులు ప్రశ్నించి ఆమెను నిలదీసినా ‘వారు (తన కుమార్తెలు) వేరే లెవల్ అంటూ నిర్మలా దేవి నింపాదిగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థినులను కొందరు పెద్దల లైంగిక అవసరాలకు ప్రేరేపించి, ప్రలోభపెట్టిన విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్ నియమించిన ఏకసభ్య కమిషన్ గురువారం విచారణ ప్రారంభించింది. ఉదయం చెన్నై నుంచి మదురై వెళ్లిన సంతానం అక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో బసచేసి మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్లదురై, రిజిస్ట్రారు చిన్నయ్య తదితరులను కమిషన్ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం పిలిపించుకుని విచారించారు. విద్యార్థినులతో నిర్మలాదేవి సెల్‌ఫోన్ సంభాషణను పరిశీలించారు. నిర్మలాదేవికి సంబంధించిన సీసీటీవీ కెమెరా పుటేజీలు ఏమైనా ఉంటే అప్పగించా ల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈనెల 21వ తేదీన యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులను , నిర్మలాదేవి పనిచేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని వేర్వేరుగా విచారించనున్నారు. వర్సిటీ వైస్ చాన్సలర్ చెల్లదురై మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ నియమించిన కమిషన్ విచారణ ప్రారంభమైందని, విచారణకు పూర్తి సహకరిస్తున్నామని తెలిపారు. తొలి దశ మూడు రోజులు తొలిదశ విచారణ మూడురోజులు సాగుతుందని కమిషన్ చైర్మన్ సంతానం తెలిపారు. తరువాత రెండో దశ వారంరోజుల చేపడుతామని అన్నారు. ఇదిలా ఉండగా, మద్యం, జల్సా పార్టీలతో మదురై కామరాజ్ యూనివర్సిటీ కేళీవిలాసాల్లో మునిగితేలుతున్నట్లు విచారణ కమిషన్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. పదినెలల్లో 200 ఉత్సవాలు, 60 మెగా పార్టీలు నిర్వహించగా కేవలం జీడిపప్పు కొనుగోలుకే రూ.18 లక్షలు ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణకు భయపడి కళాశాల అధ్యాపకులు ముఖం చాటేశారు. ఈ కేసు విచారణకు ఏడు బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. సైబర్ క్రైం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, నిర్మలాదేవి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. పోలీసుల వద్దకు ఆధారాలు నిర్మలాదేవికి సంబంధించి 26 పేజీలతో కూడిన ఆధారాలను సదరు విద్యార్థినులు అరుప్పుకోట్టై పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. లైంగిక కార్యకలాపాలకు అంగీకరించాల్సిందిగా కోరుతూ ఆమె పంపిన ఎస్ఎమ్ఎస్లను 20 పేజీలపై ముద్రించి అందజేసినట్లు సమాచారం. మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిని పంపవచ్చుకదా అని విద్యార్థినులు ప్రశ్నించగా, వారు వేరే లెవల్ అని నిర్మలాదేవి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తానుగా ముందుకు వచ్చి విచారణ కమిటీని వేయాలని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కోరారు. గవర్నర్ వ్యవహార శైలిపై దృష్టి సారించాలని తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ కేంద్రాన్ని కోరారు. నిర్మలాదేవి ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమెను ప్రత్యేక సెల్‌కు మారుస్తారని తెలుస్తోంది. -
ఆమె ‘సెల్’లో పెద్దల రాతలు
విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారం సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. డీజీపీ రాజేంద్రన్ మంగళవారం ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిర్మలాదేవి విచారణలో నోరు మెదపనట్టు సమాచారం. అయితే, ఆమె సెల్ఫోన్లో పెద్దల తలరాతలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సెల్‌లోని నంబర్లు, ఫోన్ కాల్స్, చాటింగ్స్ ఆధారంగా ఈ తతంగంవెనుక ఉన్న పెద్దల్ని పసిగట్టేందుకు సీబీసీఐడీ ప్రయత్నిస్తోంది. కాగా, గవర్నర్బన్వరిలాల్లతో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. అందరి కన్నా ముందుగా, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ ఆదేశించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సాక్షి, చెన్నై :విద్యార్థినుల్ని లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ విరుదునగర్ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి సాగించిన ఆడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్టుచేసిన అరుప్పు కోట్టై పోలీసులు రాత్రంతా విచారించారు. అయితే, ఆమె ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం, నోరు మెదపకుండా ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల్ని ఎవరి కోసం ప్రేరేపించారో అన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని పలు విధాలుగా సమాధానం రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదని తెలిసింది. అయితే, ఆమె సెల్ఫోన్లో అసలు బండారం ఉన్నట్టు తేల్చినట్టు సమాచారం. మదురై కామరాజర్ వర్సిటీలో ఉన్నఉన్నతాధికారులతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆయా అధికారులకు తరచూ కాల్స్ చేయడం, వారితో సాగిన చాటింగ్ తదితర అంశాల్ని పోలీసులు పరిగణించి ఉన్నారు. ఆయా నంబర్ల ఆధారంగా ఆ అధికారులెవరో విచారించే పనిలో పడ్డారు. ఆ వర్సిటీలో ఉన్న అధికారుల నంబర్లును గుర్తించినా, ఆ ఉన్నతాధికారులు ఎవరో అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో అరుప్పు కోట్టై పోలీసులు ఉన్న సమయంలో డీజీపీ రాజేంద్రన్ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నేడు అరుప్పుకోట్టైకి సీబీసీఐడీ నిర్మలాదేవి వ్యవహారంపై ఇప్పటికే దేవాంగర్ ఆర్స్ కళాశాల, కామరాజర్ వర్సిటీ వేర్వేరుగా విచారణ చేపట్టే పనిలో నిమగ్నం అయ్యాయి. అలాగే, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశించారు. మాజీ ఐఏఎస్ సంతానం నేతృత్వంలో ఆ కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ పరిస్థితుల్లో కేసు తీవ్రతను పరిగణించిన డీజీపీ రాజేంద్రన్ విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆ విభాగం అదనపు డీజీపీ, ఎస్సీల నేతృత్వంలో విచారణ ముమ్మరం కానుంది. సీబీసీఐడీ బృందం బుధవారం అరుప్పుకోట్టై చేరుకుని, నిర్మలా దేవిని విచారించేందుకు, తమ కస్టడీకి తీసుకునే విధంగా కోర్టును ఆశ్రయించనుంది. గవర్నర్‌పై విమర్శలు నిర్మలా దేవి ప్రేరణ వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌పై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని పీఎంకే నేత రాందాసు ఆరోపించారు. నిర్మల దేవికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడం, ఈ వ్యవహారం వెనుక పెద్దలు సైతం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తంచేశారు. దీనిపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ఆగమేఘాలపై గవర్నర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడాన్ని బట్టి చూస్తే, ఎవరినైనా రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయా..? అని అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదన్నారు. అయితే, గవర్నర్‌కు అన్ని అధికారులు ఉన్నాయని, విచారణకు ఆదేశించవచ్చంటూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ వెనకేసుకొచ్చారు. కాగా, గవర్నర్ బన్వరి లాల్ పురోహిత్‌తో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో తనకు తెలిసిన వివరాలను చెల్లదురై వివరించారు. కఠిన చర్యలు తప్పదు తాజా వ్యవహారాలపై గవర్నర్ బన్వరిలాల్ స్పందించారు. ప్రథమంగా రాజ్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆయన వ్యాఖ్యలు చేశారు. చట్ట నిబంధనలకు లోబడే సంతానం నేతృత్వంలో కమిషన్‌ను రంగంలోకి దించినట్టు తెలిపారు. వర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నియమనిబంధనల మేరకు వర్సిటీ చాన్స్‌లర్‌గా తనకే అధికారం ఉన్నట్టు తెలిపారు. అందుకే ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశానన్నారు. కామరాజర్ వర్సిటీ తన ప్రమేయం లేకుండా విచారణకు ఆదేశించిందని, ఇందుకు నా వర్సిటీ వీసీ వివరణ ఇచ్చారన్నారు. ఆ కమిటీని వెనక్కు తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా, ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్సిటీల వ్యవహారాలు అందరికీ తెలియజేయడం, బహిర్గతంగా ఉంచేందుకు తాను చర్యలు తీసుకుంటూ వస్తున్నట్టు వివరించారు. ఆగని ఆందోళనలు ప్రొఫెసర్ వెనుక ఉన్న వాళ్లను త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలనే నినాదంతో ఆందోళనలు మంగళవారం కూడా సాగాయి. అనేక కళాశాలల విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించి ఆందోళన చేశారు. చెన్నై గిండిలోని రాజ్ భవన్‌ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నాలు చేస్తున్న సమాచారంలో అక్కడ భద్రతను పెంచారు. ఇక, మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో చెన్నై చేపాక్కం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆ విభాగం అధ్యక్షురాలు ఝాన్సీ రాణి, అధికార ప్రతినిధి కుష్భు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనను అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించడంతో వారిపై తీవ్ర స్థాయిలో కుష్భు విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, వర్సిటీల్లో విద్యార్థినులపై లైంగిక ప్రేరణ, ఒత్తిళ్లు మరీ ఎక్కువేనని పలువురు మాజీ ప్రొఫెసర్లు పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. రిమాండ్‌కు నిర్మలా దేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని 12రోజుల రిమాండ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ఆమెను విరుదునగర్ కోర్టు న్యాయమూర్తి ముంతాజ్ ఎదుట హాజరు పరిచారు. రిమాండ్‌కు ఆదేశించడంతో మదురై కేంద్ర కారాగారానికి తరలించారు. -
లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించిన మహిళా ప్రొఫెసర్?