'మన కుటుంబానికి నువ్వు హృదయంలాంటిదానివి. నీ ప్రేమ, కరుణ వల్లే అంతా కలిసుండగలుగుతున్నాం' అంటూ మంచు మనోజ్ తల్లి నిర్మలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మ. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్ చేస్తుంది. నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసున్నాం.
నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేనూ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment