
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో ముఖ్య నిందితులకు సంబంధించిన మ రిన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. విద్యార్థినులను ప్రొఫెసర్ నిర్మలాదేవి లైంగిక కార్యకలాపాలకు పాల్పడాలని ఒత్తిడి చేసినట్టు వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఈ కేసులో విరుదునగర్ సీబీసీఐడీ కార్యాలయంలో ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామి వద్ద పోలీ సులు శనివారం విచారణ జరిపారు. ముఖ్య నిందితుల వివరాలను వారు వెల్లడించినట్లు తెలిసింది.
మురుగన్, కరుప్పస్వామి ఉపయోగించిన సెల్‌ఫోన్లను సీబీసీఐడీ పోలీసులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. ఇలాఉండగా కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ విజయ శనివారం సీబీసీఐడీ విచారణకు హాజరయ్యారు. నిర్మలాదేవి–విద్యార్థినుల మధ్య సంభాషణల్లో వీఐపీలు, వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధాలున్నట్లు బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ నియమించిన ఐఏఎస్ అధికారి సంతానం శనివారం తన రెండో విడత విచారణను ముగించారు.