CB CID
-
నిర్మలాదేవి కేసులో మరిన్ని ఆధారాలు ?
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో ముఖ్య నిందితులకు సంబంధించిన మ రిన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. విద్యార్థినులను ప్రొఫెసర్ నిర్మలాదేవి లైంగిక కార్యకలాపాలకు పాల్పడాలని ఒత్తిడి చేసినట్టు వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఈ కేసులో విరుదునగర్ సీబీసీఐడీ కార్యాలయంలో ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామి వద్ద పోలీ సులు శనివారం విచారణ జరిపారు. ముఖ్య నిందితుల వివరాలను వారు వెల్లడించినట్లు తెలిసింది. మురుగన్, కరుప్పస్వామి ఉపయోగించిన సెల్ఫోన్లను సీబీసీఐడీ పోలీసులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. ఇలాఉండగా కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ విజయ శనివారం సీబీసీఐడీ విచారణకు హాజరయ్యారు. నిర్మలాదేవి–విద్యార్థినుల మధ్య సంభాషణల్లో వీఐపీలు, వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధాలున్నట్లు బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ నియమించిన ఐఏఎస్ అధికారి సంతానం శనివారం తన రెండో విడత విచారణను ముగించారు. -
నేను కూడా మోసపోయాను: నిర్మలాదేవి
టీ.నగర్: మరో ఆరుగురు విద్యార్థినుల ఫిర్యాదుతో నిర్మలాదేవిని సీబీసీఐడీ కస్డడీలోకి తీసుకుని విచారించనున్నారు. విరుదునగర్ జిల్లా, అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మదురై సెంట్రల్ జైలు నిర్బంధంలో ఉన్న ఆమెను సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజుల కస్టడీలో విచారణ జరుపుతూ వచ్చారు. సోమవారంతో నాలుగు రోజుల విచారణ పూర్తికాగా, నిర్మలాదేవి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో సీబీసీఐడీ పోలీసులు నిరాశకు గురయ్యారు. ఆమె విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. మరో ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. సీబీసీఐడీ విచారణ దారి మళ్లించే విధంగా ఉన్నట్లు కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్లలో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీసీఐడీ పోలీసులు విచారణ సక్రమంగా నిర్వహించలేదని వారు ఆరోపిస్తున్నారు. రూ.30లక్షలు మోసపోయిన నిర్మలాదేవి: ప్రొఫెసర్ నిర్మలాదేవి తన కుమార్తెకు మెడికల్ సీటు పొందేందుకు రూ.30లక్షలు నగదు అందజేసి మోసపోయినట్లు విచారణలో తేలింది. ఈ నగదును ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో విద్యార్థినులను ఎరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. కెమెరా ఫుటేజీల పరిశీలన: నిర్మలాదేవి కేసు వ్యవహారంలో కామరాజర్ వర్సిటీ కెమెరా ఫుటేజీలను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఇలా ఉండగా పోలీసులు మరో ఇద్దరు ప్రొఫెసర్ల వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. మదురై కామరాజర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ వద్ద సోమవారం విచారణ జరిపారు. -
నిర్మలాదేవి భర్త కీలక నిర్ణయం..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కీలక వ్యక్తుల్లో ఒకరైన ప్రొఫెసర్ మురుగన్‌ను సీబీసీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాళాల విద్యార్థినులను యూనివర్సిటీ పెద్దల లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టి అరెస్టయిన నిర్మలాదేవి కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మలాదేవిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నిర్మలాదేవి వద్ద జరిపిన విచారణలో పలువురు వీవీఐపీలు, వీఐపీలు పాత్ర ఉన్నట్లు తేలింది. వారిలో మదురై యూనివర్సిటీ మానవవనరుల శాఖ సంచాలకులు కలైసెల్వన్, సహాయక ప్రొఫెసర్లు మురుగన్, కరుప్పుస్వామిలను విచారించాలని నిర్ణయించారు. వారిలో కలైసెల్వన్ ఆదివారం విచారణకు హాజరుకాగా తమ కస్టడీలోనే ఉంచుకుని విచారిస్తున్నారు. కలైసెల్వన్‌ను సైతం అరెస్ట్ చేస్తారనితెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ గత నాలుగురోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు తీవ్రతరం చేశారు. తిరుచ్చిళి సమీపం నాడాకుళం గ్రామంలోని కరప్పుస్వామి ఇంటిలో భార్య, బంధువులను పోలీసులు విచారించారు. మధురై అరుప్పుకోట్టైలోని బంధువుల ఇంటిలో గాలింపు చేపట్టారు. నాలుగురోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మురుగన్ యూనివర్సిటీలోని అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేసేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావడంతో పోలీసు అధికారులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఓపిగ్గా వేచిచూస్తే నిజాలు బయటకు వస్తాయని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్ల దురై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండోసారి భర్త విడాకుల పిటిషన్ నిర్మలాదేవితో తెగదెంపులు చేసుకోవాలని విడాకులకు సిద్ధమైన భర్త గతంలో నోటీసులు పంపారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అప్పట్లో విరమించుకున్నారు. అయితే నిర్మలాదేవి వివాదాల్లో కూరుకుపోవడంతో రెండురోజుల క్రితం విడాకులు కోరుతూ ఆయన మరోసారి దరఖాస్తు చేశారు. కాంట్రాక్టులోనూ అక్రమాలు తన భర్త కోసం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సైతం నిర్మలాదేవి అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో సీబీసీఐడీ అధికారులు ముగ్గురు కాంట్రాక్టర్లును కూడా పిలిచి విచారిస్తున్నారు. అరుప్పుకోట్టై అత్తిపట్టులోని నిర్మలాదేవి ఇంట్లో ఏడుగురితో కూడిన సీబీసీఐడీ అధికారుల బృందం ఆదివారం ఆరుగంటలపాటు తనిఖీలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, సీడీలు మూడు సంచుల నిండా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఇంటికి సీలువేశారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లను కనుగొన్నారు. నిర్మలాదేవి భర్త శరవణపాండియన్ ప్రభుత్వ కాంట్రాక్టరు కావడంతో కాంట్రాక్టులను పొందేందుకు వీరి సిఫార్సులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా సదరు ప్రభుత్వ అధికారులను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
‘తుని’ ఘటనపై సీబీసీఐడీ విచారణ
అమలాపురం టౌన్ : తుని విధ్వంసకర ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించేపనిలో భాగంగా సీబీ సీఐడీ అధికారులు అమలాపురంలో గత రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. నాటి తుని ఘటనలో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలల్లో ఉన్న అమలాపురం, కొత్తపేట, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన 43 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తునిలోని సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా కూడా ఆ రోజు అల్లర్లలో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ సీబీ సీఐడీ డీఎస్పీ, ఇద్దరు సీఐలు అమలాపురంలో పట్టణ పోలీసు స్టేషన్లో గుర్తించిన 43 మందిని విచారిస్తున్నారు. ఆ 43 మందిలో అమలాపురానికి చెందిన కొందరు రౌడీషీటర్లు కూడా ఉండటంతో వారిని సీఐడీ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరికొందరు రౌడీషీటర్లను కూడా స్టేషన్‌కు రప్పించి ఆ రోజు అల్లర్లలో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు తుని సభకు ఎలా వెళ్లారు... ఎవరి వాహనంపై వెళ్లారు..? వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. తుని విధ్వంసకర ఘటన సమయంలో వీడియోల్లో లభ్యమైన దృశ్యాలను సీఐడీ నిశితంగా పరిశీలించినప్పుడు ముగ్గురు కాపు నేతల పేర్లతో ఉన్న జెండాలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ ముగ్గురు నేతలను కూడా అధికారులు పిలిచి విచారించారు. ఇప్పటికే అంబాజీపేటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు పోలీసు జీపులు తగలబెడుతున్నప్పుడు ఆ యువకుడి ఉనికి ఎక్కువ కనిపించడంతో అతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నా వారి నుంచి స్పష్టమైన...ఆధారాలతో కూడిన సమాచారం రాకపోవటంతో రౌడీ షీటర్లందరినీ పిలిపించుకుని ఏదో కోణంలో ఏదో సమాచారం వస్తుందన్న దిశగా విచారణ చేస్తున్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల కాన్ఫిరెన్స్ హాలులో డివిజన్లోని వీఆర్వోలకు తుని ఘటన వీడియోలు, ఫొటోలు చూపించినా వారు ఓ ఒక్క నిందితుడినీ గుర్తించకపోవడంతో సీబీ సీఐడీ అధికారులు అమలాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ తరహా దర్యాప్తు, విచారణలు చేస్తున్నారని తెలిసింది. -
పైరసీని అరికట్టండి
పైరసీని అరికట్టాలని, అందుకు పాల్పడిన వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని సినీ సంఘాల నేతలు సీబీసీఐడీని కోరారు. సోమవారం ఉదయం స్థానిక ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ కార్యాలయానికి వెళ్లిన సినీ సంఘాల నేతలు డిజిపి అశతోస్ శుక్లాకు వినతి పత్రాన్ని అందించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, విజయ్‌కుమార్, తమిళ నిర్మాతల సం ఘం అధ్యక్షులు కేఆర్, బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షురాలు నళిని, తమిళ దర్శకుల సంఘాల తరపున రమేష్ ఖన్నా తదితరులు సోమవారం ఉదయం డీజీపీ అశుతోష్ శుక్లను కలిసి వినతి పత్రాన్ని అందించారు. పైరసి కారణంగా తమిళ సినిమా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందన్నారు. ప్రజల ముఖ్యమంత్రి జయలలిత సినీ పరిశ్రమ వర్గాల వేడుకోలు మేరకు 2001-2006 ప్రాంతంలో పైరసీదారులపై గూండా చట్టం విధించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడే పైరసీ మహమ్మారి విజృంభించిందన్నారు. కాబట్టి మళ్లీ గూండా చట్టం ప్రయోగించి పైరసీని రూపుమాపాలన్నారు. నూతన చిత్రం విడుదలైన రోజునే కొన్ని థియేటర్లు పైరసీకి పాల్పడుతున్నాయన్నారు. అలాంటి థియేటర్ల అనుమతులను రద్దు చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని సీడీల విక్రయ దుకాణాలపై పోలీసులు తరచు సోదాలు జరిపి పైరసీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోకల్ కేబుల్ టీవీల్లో కొత్త చిత్రాలను అనుమతి లేకుండా ప్రసారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కేబుల్ చానెళ్లు సుమారు 300కు పైగా ఉన్నాయన్నారు. వాటి అనుమతులను కూడా రద్దు చేయాలన్నారు. అదే విధంగా తమిళనాడులో తిరుగుతున్న అని ప్రైవేటు ఆమ్నీ బస్సుల్లోనూ, అనుమతి లేకుండా కొత్త చిత్రాలను ప్రసారం చేస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.