చక్కని కెరీర్‌కు ఆలంబన | National Stock Exchange course | Sakshi
Sakshi News home page

చక్కని కెరీర్‌కు ఆలంబన

Published Thu, Jan 22 2015 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

చక్కని కెరీర్‌కు ఆలంబన

చక్కని కెరీర్‌కు ఆలంబన

 దేశ ప్రగతిలో ఆర్థిక రంగానిది కీలకపాత్ర.. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో విస్తరిస్తున్న వాణిజ్యం, వ్యాపారం ఎన్నో అవకాశాలకు కేంద్ర స్థానంగా నిలుస్తోంది.. అదే సమయంలో సుశిక్షితులైన మానవ వనరుల  కొరతను ఈ రంగం ఎదుర్కొంటుంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సంబంధిత రంగాలకు కావల్సిన నిపుణులు అందించే ఉద్దేశంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), సెక్యూరిటీస్ అండ్  ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తదితర సంస్థలు సర్టిఫికెట్ నుంచి పీజీ డిప్లొమా స్థాయి కోర్సులకు రూపకల్పన చేశాయి.. చక్కని కెరీర్‌కు ఆలంబనగా నిలుస్తున్న ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్ ఉద్యోగాలు అందుకోవచ్చు.. వాటి వివరాలు..
 
  బాంబే స్టాక్ ఎక్సే ఛంజ్ (బీఎస్‌ఈ)
  కోర్సులు:
 గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్
 కాల వ్యవధి: 29 నెలలు
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్స్
 కాల వ్యవధి: 12 నెలలు (డిస్టెన్స్ విధానంలో)
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ జర్నలిజం
 సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ క్యాపిటల్ మార్కెట్స్
 (జమన్‌లాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సహకారంతో)
 
 కాల వ్యవధి: 10 వారాలు.
 బోధించే అంశాలు: ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిమ్యాట్, డిపాజిటర్స్, ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీస్ లా, ఫైనాన్స్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అవకాశాలు: కోర్సు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, రీసెర్చ్ ఫర్మ్స్, బ్రోకింగ్ ఫర్మ్స్, సంబంధిత సంస్థల్లో బిజినెస్ ఎనలిస్ట్, ఇన్వెస్ట్‌మెం ట్ బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, క్యాపిటల్ మా ర్కెట్ మేనేజర్, రిస్క్ మేనేజర్, రెగ్యులేషన్ మేనేజ ర్ తదితర హోదాలతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
 వెబ్‌సైట్: www.bseindia.com
 
 క్రిసిల్ (CRISIL)
 క్రిసిల్ సర్టిఫైడ్ ఎనలిస్ట్ ప్రోగ్రామ్ (సీసీఏపీ)
 కాల వ్యవధి: రెండేళ్లు
 బోధించే అంశాలు: ఇది ఎంట్రీ లెవల్, వర్క్ కమ్ స్టడీ ప్రోగ్రామ్. ఇందులో ఫైనాన్స్‌కు సంబంధించి 24 రకాల సబ్జెక్టులను బోధిస్తారు. తద్వారా ఫైనాన్షియల్ రంగాన్ని సమగ్రంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్/ ఎక్స్‌ఏటీ లేదా క్రిసిల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవకాశాలు: కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు క్రిసిల్ సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా నియమించుకుంటుంది. ఈ సమయంలో వీరికి రూ. 6 లక్షల వార్షిక వేతనాన్ని చెల్లిస్తారు. అంతేకాకుండా కోర్సు చేస్తున్న సమయంలో.. మొదటి సంవత్సరం రూ. 1.25 లక్షలు, రెండో సంవత్సరం 2.25 లక్షల వార్షిక వేతనం ఇస్తారు.
 వెబ్‌సైట్: www.crisil.com
 
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)
 అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్సు ప్రత్యేకత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులో సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తిచేయలేను అని అనుకుంటే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది.
 
 అవకాశాలు: ఈ సర్టిఫికెట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలలో అకౌంటెంట్‌గా చేరి నెలకు రూ. 25,000 వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత పొంది తర్వాత ఫైనల్ రాసి చార్టర్డ్ అకౌంటెంట్ హోదాను పొందొచ్చు.
 వెబ్‌సైట్: www.icai.org
 
 ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్
  కోర్సులు:
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ బ్యాంకింగ్
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్
 డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సేల్స్
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ సేల్స్ మేనేజ్‌మెంట్
 ఎన్‌ఎస్‌ఈ సర్టిఫైడ్ క్యాపిటల్ మార్కెట్ ప్రొఫెషనల్
 కాశాలు: ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఐసీఐసీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, జెన్‌ప్యాక్ట్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటి సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీరికి ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, కస్టమర్ ఆక్విజషన్స్, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్,ఫోన్ బ్యాంకింగ్, క్లైమ్స్ ఎగ్జామినర్స్, ఆడిటర్స్ వంటి హోదాలతో కెరీర్ ప్రారంభించవచ్చు.
 వెబ్‌సైట్: www.ifbi.com
 
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం)
 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం)ను స్థాపించింది.
 
  వ్యవధి: 12 నెలలు
 అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్
 బోధించే అంశాలు: సెక్యూరిటీ మార్కెట్‌లలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి సరిపోయే కోర్సు. ఇందులో ఫండ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్, సేల్స్/ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండ్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ తదితర అంశాలను బోధిస్తారు.అవకాశాలు: ఫండ్ మేనేజర్స్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, సేల్స్ మేనేజర్స్, బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి హోదాల్లో సెక్యూరిటీ మార్కెట్లు, సంబంధిత సంస్థల్లో కెరీర్ ప్రారంభించవచ్చు.
 
 సర్టిఫికెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సెక్యూరిటీస్ రీసెర్చ్ ఫర్మ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫెన్షన్ ఫండ్ తదితరాల్లో అవకాశాలు ఉంటాయి.సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సెక్యూరిటీ లా తోపాటు కరెన్సీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ తదితరాల్లో షార్ట్ టర్మ్ కోర్సులను కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.nism.ac.in
 
 ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్  రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం)
 కోర్సులు:
 ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా రిస్క్ మేనేజ్‌మెంట్
 ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్
 ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్
 ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్
 
 అర్హత: గ్రాడ్యుయేషన్.
 ఎంచుకున్న కోర్సును అనుసరించి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏ), రిజర్వ్ బ్యాంక్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకింగ్ హౌసెస్‌లలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
 అవకాశాలు: ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకింగ్ హౌసెస్, స్టాక్ ఎక్స్ఛేంజ్, రేటింగ్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌షన్స్ తదితరాలు అవకాశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
 వెబ్‌సైట్: www.iirmworld.org.in
 
 నేషనల్ స్టాక్ ఎక్సే ్ఛంజ్ (ఎన్‌ఎస్‌ఈ)
 కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. కాల వ్యవధి: 12 నెలలు.ఈ కోర్సును నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎం) సహకారంతో నిర్వహిస్తుంది. థియరీతోపాటు సంబంధిత నైపుణ్యాలపై ప్రాక్టికల్ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, ఫైనాన్షియల్ సెంటర్స్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత సాఫ్ట్‌వేర్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్/ మ్యాట్/ ఎక్స్‌ఏటీ స్కోర్ ఉండాలి. లేదా ఎన్‌ఐఎఫ్‌ఎం-ఎన్‌ఎస్‌ఈ నిర్వహించే అన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ దశల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
 వెబ్‌సైట్: www.nseindia.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement