న్యాయశాస్త్రంలో పీజీ డిప్లొమా నోటిఫికేషన్‌ | Osmania University: Osmania Has Been Issued PG Diploma Notification | Sakshi
Sakshi News home page

న్యాయశాస్త్రంలో పీజీ డిప్లొమా నోటిఫికేషన్‌

Published Tue, Oct 12 2021 2:27 AM | Last Updated on Tue, Oct 12 2021 2:27 AM

Osmania University: Osmania Has Been Issued PG Diploma Notification - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా వర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 6 పీజీ డిప్లొమా సాయంకాలం (6 నుంచి 8 గం. వరకు) కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏడాది కాల వ్యవధితో 2సెమిస్టర్‌ పరీక్షలు గల ఈ పీజీ డిప్లొమా ప్రవేశాలకు 2022, జనవరి 2న ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికోసం ఈనెల 11 నుంచి నవంబర్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వర్సిటీ క్యాంపస్‌లో కాలేజీతోపాటు బషీర్‌బాగ్‌ పీజీ న్యాయ కళాశాలలో సైబర్‌ లా, టాక్సేషన్‌ అండ్‌ ఇన్సూరెన్స్, ఇన్‌సాల్‌వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (ఐపీఆర్‌), మోడ్రన్‌ కార్పొరేట్‌ లా, అప్లైడ్‌ హ్యూమన్‌ రైట్స్‌ పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ అపర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు 81066 78887కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement