
విద్యార్థులకు మార్గదర్శనం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తెలుగు మంచ్ (ఎంటీఎం), ‘రత్నమాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలాజీ’ (ఎఆర్‌ఎంఐఈటీ) సంయుక్త ఆధ్వర్యంలో షాహాపూర్‌లో ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం ‘కెరీర్ గెడైన్స్’ సదస్సు నిర్వహిస్తున్నారు. ఏఆర్‌ఎంఐఈటీ కాలేజీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తొలిరోజు సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. మొదటిరోజు సదస్సులో వర్లిలోని ఎస్‌వీ క్లాసెస్ విద్యార్థులతోపాటు సైన్, దాదర్ తదితర ప్రాంతాల విద్యార్థులు పాల్గొన్నారు. వీరితోపాటు భివండీ, ముంబైకి చెందిన 15 ఎన్‌జీఓ సంస్థల సభ్యులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎంటీఎం అధ్యక్షుడు జగన్‌బాబు, సుభాష్ మచ్చ, ఎఆర్‌ఎంఐఈటీ ైచె ర్మన్ ఏవీ గుప్తా, బోగ సహదేవ్, వడ్లకొండ రాము, బోగ సుదర్శన్, ప్రదీప్ సుంకా, వాసం రాజేంద్ర, గాజెంగి రాజు తదితరులు పాల్గొన్నారు.