వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
Published Thu, Nov 17 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
–డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి
పాములపాడు: 10వ తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ఏఎన్‌ఆర్ జిల్లా పరిషత్ హైస్కూలు, తుమ్మలూరు జెడ్పీ హైస్కూలును తనిఖీ చేశారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. ఓ విద్యార్థిని తెలుగు చదవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల తరువాత మళ్లీ వస్తానని, పిల్లలు చదవకపోతే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం మ«ధ్యాహ్న భోజనంలో 3 గుడ్లు ఇవ్వాలన్నారు. ఇందుకు బిల్లులు సైతం పెంచినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. మార్చి 7నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పెంచేందుకు çప్రతి మండలం నుంచి తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారిగా 7గురిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వీరి పర్యవేక్షణలో విద్యార్థులను తీర్చి దిద్ది అధిక చి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో 279 సక్సెస్ స్కూళ్లు, 35 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. విద్యార్థి తల్లితండ్రులు కోరితే ఆ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ సుమతి, ఎంఈఓ బాలాజీనాయక్, హెచ్‌ఎం పుల్లారెడ్డి ఉన్నారు.
Advertisement