పక్కాగా పది పరీక్షలు | rules and regulations for 10th exams | Sakshi
Sakshi News home page

పక్కాగా పది పరీక్షలు

Published Sat, Mar 11 2017 6:39 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

పక్కాగా పది పరీక్షలు - Sakshi

పక్కాగా పది పరీక్షలు

మార్గదర్శకాలు విడుదల చేసిన డీఈవో 
నిడమర్రు:  పదో తరగతి పరీక్షలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈనెల 17 నుంచి పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని 246 పరీక్ష కేంద్రాల్లో. 46,682 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
కాపీయింగ్‌కు బ్రేక్‌
పరీక్షల నిర్వహణ ఏపీ పబ్లిక్‌ పరీక్షల యాక్ట్‌1997, ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికా ఆర్‌ఎస్‌ గంగాభవానీ తెలిపారు. అలానే చూచీరాత నిరోధక చట్టం1997ను సమర్థవంతంగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. టెన్త్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా వారిని దోషులుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని వ్యవహరించాలని, లేకపోతే చట్టప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. 
 
చీఫ్, డీవో చేయాల్సినవి 
పరీక్ష కేంద్రాన్ని ముందుగా సందర్శించి ఫర్నీచర్, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు, పరిశుభ్రత పరిశీలించాలి. 
తహసీల్దార్, ఎస్‌పీహెచ్‌లకు పరీక్షల విషయం తెలియజెప్పాలి. వారి ఫోన్‌ నంబర్లు తీసుకోవాలి.
పరీక్షల నిర్వహణకు అన్ని ఫారాలు సిద్ధం చేసుకోవాలి. 
డిఫార్, ఓఎంఆర్‌ షీట్స్, పేపర్‌ సీల్, అంటెండెన్స్‌ షీట్స్‌ సరిపడా అందాయో లేదో చూసుకోవాలి. 
ట్రక్‌ పెట్టెలు, క్లాత్‌ బ్యాగ్స్‌ వంటి కంటిజెన్స్‌ సామగ్రి సిద్ధం చేసుకోవాలి.
ఽఈనెల 16న పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందితో సమావేశం నిర్వహించాలి.
సిబ్బంది నుంచి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేషన్‌ సర్టిఫికెట్స్‌  తీసుకోవాలి.
సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
బాలికలను చెక్‌ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలి. 
 
పరీక్ష జరుగుతున్న రోజుల్లో ఇలా..
రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్‌ కాన్ఫెరెన్స్‌కు హాజరుకావాలి. 
నిర్దేశించిన సమాయాని కన్నా ముందు సీఎస్, డీవో, ఇద్దరు సంతకాలతో పరీక్ష కట్టల సీల్‌ తెరవాలి.
లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్‌కు తరగతి గదులు కేటాయించాలి.
 
ఇన్విజిలేటర్లకు సూచనలు 
ఇన్విజిలేటర్లు పరీక్షల ప్రారంభానికి ముందురోజున చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌) నిర్వహించు శిక్షణ సమావేశానికి విధిగా హాజరుకావాలి. ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. 
పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబినేషన్‌ గురించి విధిగా తెలుసుకోవాలి. 
పరీక్ష రోజు ఉదయం 8 గంటలకు కేంద్రం వద్దకు హాజరుకావాలి. 9 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 10 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు. 
ప్రతి విద్యార్థిని సోదా చేసి, ఎటుంవటి ఫర్‌బిడెన్‌ మెటీరియల్‌ లేదని నిర్ధారించాలి. విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి. 
పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో జరుగుతాయి. అందువల్ల సీఎస్‌ నిర్ధారించిన సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ను గాని, విద్యార్థులను గదులు మార్చడం గాని చేయరాదు. 
విద్యార్థులకు, ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్‌టికెట్‌ అందిస్తారు. విద్యార్థిని హాల్‌ టికెట్, అటెండెన్స్‌ షీట్‌లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి, అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్‌ దృష్టికి తీసుకురావాలి. 
అన్ని పరీక్షలు బార్‌ కోడింగ్‌ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్‌ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్‌ నుంచి పొందాలి. 
ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్‌ షీట్‌ వెసుక భాగంలో విద్యార్థులకు వివరించాలి. 
ఓఎంఆర్‌ షీట్‌ మినహా ఏ పేపర్‌పైనా కూడా హాల్‌టికెట్‌ నంబర్, పేరు రాయించకూడదు. 
ఓఎంఆర్‌ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్‌ దృష్టికి తీసుకువెళ్లి, నాన్‌ స్టాండర్డ్‌ ఓఎంఆర్‌ షీట్‌ పొందాలి.
ఓఎంఆర్‌ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. 
9.25 గంటలలోపు ఇన్విజిలేటర్‌ అన్ని పనులు ముగించుకుని 9.30 గంటలకు కచ్చితంగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి. 
ప్రశ్నపత్రాలు తీసుకొన్న వెంటనే చాలినన్ని ఉన్నాయో/ ఆరోజుకు సంబంధించిన సబ్జెక్‌/ పేపర్‌కోడ్‌ / మీడియం సరిచూసుకోవాలి. పేపరు ఏమాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. 
అన్ని ద్వితీయ భాష పేపర్లకు, అన్ని భాషేతర పేపర్లకు పార్ట్‌బి బిట్‌ పేపర్‌ పరీక్ష చివరి అరగంట ముందుగా ఇవ్వవలెను. మిగిలిన పేపర్లకు పార్టీఎ తోపాటే పార్ట్‌బి ఇవ్వాలి. ఇంగ్లిష్‌ మీడియం ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌కు పేపర్‌బి ఉండదు.
గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్‌ను ఎర్ర సిరా పెన్‌తో క్యాన్సిల్‌ చేస్తారు. 
పరీక్ష ముగిసాక సమాధాన పత్రాలు, అడిషనల్‌ షీట్స్‌ అన్ని సరిచూసుకున్నాకే విద్యార్థులను బయటకు పంపాలి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement