
ఎంపీ బుట్టా రేణుక (ఫైల్ ఫొటో)
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఓ వైపు పార్టీ మారడంతో ప్రజా మద్దతు కోల్పోయిన బుట్టా రేణుకకు టీడీపీ నేతల నుంచీ అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. టీడీపీలో చేరిన ఆమెకు పార్టీ నేతలు సహకారం అందడం లేదన్నట్లు కనిపిస్తోంది. ఎంపీ నిధుల కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్క టీడీపీ నేత కూడా హాజరు కాకపోవడంతో షాకవ్వడం ఆమె వంతు అయింది. దీంతో కేవలం బుట్టా రేణుక ఒక్కరే కార్యక్రమంలో పాల్గొని.. త్వరత్వరగా తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment