
సాక్షి, ఎమ్మిగనూరు రూరల్: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడేకల్ గ్రామంలో బుధవారం.. యువకులు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బుర పరిచాయి. వీపుకు కడ్డీగుచ్చుకొని గ్యాస్ సిలిండర్లు ఎత్తడం, బండలను లాగటం, చిన్న తాడుకట్టుకొని బండరాయిని లాగటం, గొంతుకు కడ్డీలు గుచ్చుకొని ట్రాక్టర్లు లాగటం, ఫల్టీలు కొడుతు ట్యూబ్‌లైట్లను పగలగొట్టడం, ఇనుప మేకులపై నడుస్తూ బండలు లాగటం, కుస్తీలు.. వంటి విన్యాసాలు వీక్షకులకు ఒళ్లు జలదరింపజేశాయి. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు పెద్దలు, యువకులు విన్యాసాలు చేయడం ఆనవాయితీ. యువకుల సాహస విన్యాసాలు వీక్షకుల ఒళ్లను జలదరింపజేశాయి.