MP funds
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీ ల్యాండ్స్) నిధుల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగం కోసం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కేంద సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగానికి ఈ పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని పేర్కొన్నారు. చదవండి: ఏ సీఎంకి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికే: కేంద్రానికి లేఖ దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున ఒకే విడుదలో అందనున్నాయని పేర్కొన్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రూ. 5 కోట్లు.. రెండు విడతలుగా రూ. 2.5 కోట్ల చొప్పునమంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే గతేడాది ఏప్రిల్‌లో కేంద్రం ఎంపీ ల్యాండ్స్‌ను కరోనా మహమ్మారి కారణంగా నిలిపి వేసింది. ఈ నిధులను కోవిడ్ ఆరోగ్య సేవలకు వినియోగిస్తామని పేర్కొంది. చదవండి: లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే... అలాగే పత్తి కొనుగోలు కోసం కాటన్ కార్పొరేషన్‌కు భారీగా నిధులు విడుదల చేసింది. పత్తి మద్దతు ధర కోసం రూ. 17,408 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా గిరిజన నాయకుడు, స్వతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను జరుపుకోవడానికి నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు వారం రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
ఎంపీ వేతనం రూ. లక్ష..!
సాక్షి, జహీరాబాద్: ప్రస్తుతం ఎంపీ ఎన్నికల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్ మెట్లు ఎక్కేందుకు అభ్యర్థులు మండుటెండలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తుంది. ఉచిత వైద్యం, రవాణా, జీతభత్యాలు అందజేస్తుంది. పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు, వార్షిక నిధులు కేటాయిస్తుందో ఒకసారి చూద్దాం.. ప్రయాణం పార్లమెంట్ సభ్యులు ఏడాదికి 34 సార్లు ఉచితంగా విమాన ప్రయాణం చేయవచ్చు. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం కూడా ఉచితమే. ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలు సాగించవచ్చు. భార్యకు కూడా ఈ వసతి ఉంటుంది. రహదారుల మీదుగా ప్రయాణిస్తే కిలోమీటర్‌కు రూ. 16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. బస్సులలో ఎంపీలకు ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారు. వైద్యం కేంద్ర పౌర సేవల కింద ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా ఉచితంగా వైద్యారోగ్య సేవలను అందిస్తుంది. ఎక్స్‌రే, అల్ట్రాసాండ్ స్కానింగ్, ఈసీజీ, హృద్రోగ, దంత, కంటి, చర్మ తదితర వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. వేతనం లోక్‌సభ సభ్యులకు నెలకు రూ.లక్ష వేతనం ఇస్తారు. పదవీ కాలం అయిపోయాక నెలకు రూ.25 వేల పింఛన్ లభిస్తుంది. పదవీ కాలంలో వేతనంతో పాటు అలవెన్స్‌ల కింద నెలకు రూ.45 వేలు అందుతుంది. నిధులు పార్లమెంట్ సభ్యులకు ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 5 కోట్ల ని«ధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు జిల్లా కలెక్టర్‌కు వస్తాయి. ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో గుర్తించిన పనులకు ఈ నిధులు వెచ్చిస్తారు. ఎంపీ సిఫారసు మేరకు జిల్లా అధికారులు ఈ నిధులను మంజూరు చేస్తారు. కార్యాలయ అలవెన్స్‌లు పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్ కింద ఎంపీలకు నెలకు రూ. 45 వేలను కేంద్రం అందిస్తోంది. స్టేషనరీ కోసం రూ. 15 వేలు, సహాయ సిబ్బంది, ఇతర ఖర్చుల కోసం రూ. 30 వేలు కేటాయిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ. 2 వేల చొప్పున అదనంగా అందజేస్తారు. -
బుట్టా రేణుకకు చేదు అనుభవం!
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఓ వైపు పార్టీ మారడంతో ప్రజా మద్దతు కోల్పోయిన బుట్టా రేణుకకు టీడీపీ నేతల నుంచీ అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. టీడీపీలో చేరిన ఆమెకు పార్టీ నేతలు సహకారం అందడం లేదన్నట్లు కనిపిస్తోంది. ఎంపీ నిధుల కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్క టీడీపీ నేత కూడా హాజరు కాకపోవడంతో షాకవ్వడం ఆమె వంతు అయింది. దీంతో కేవలం బుట్టా రేణుక ఒక్కరే కార్యక్రమంలో పాల్గొని.. త్వరత్వరగా తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. -
దివ్యాంగులకు నా నిధులిస్తా
సాక్షి, యాదాద్రి : దివ్యాంగులు మానసికంగా కృం గిపోకుండా నైపుణ్యం పెంపొందించుకుని పట్టుదలతో పైకి ఎదగాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ ఉపకరణాల తయారీ సంస్థ (అలిమ్కో), జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల కోసం తన పార్లమెంట్ నిధులను కేటాయిస్తానన్నారు. పా ర్లమెంట్‌లో చర్చించి ఎలక్ట్రిక్, మోటరైట్ వాహనా లు వికలాంగులకు అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక పరికరాలు సమకూర్చుకోలేని వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు అందించడం పట్ల అభినందించారు. వికలాంగులు ఉపకరణాలను సద్వి నియోగపర్చుకోవాలన్నారు. కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ తన సర్వీసు కాలంలో సదరమ్ క్యాంపులకు రూపకల్పన చేసే అవకాశం తన కు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నా రు. ఎంపీ ప్రత్యేక చొరవతో 467 మంది లబ్ధిదారులకు అలిమ్కో సంస్థ ద్వారా రూ. 32లక్షల ఖర్చుతో ఉపకరణాలు ఉచితంగా అందించడం పట్ల కలెక్టర్ అభినందించారు.డీఆర్డీఓ వెంకట్రావ్ మా ట్లాడుతూ జిల్లాలో 12,874 మంది వికలాంగులకు ప్రతినెలా రూ.2.27కోట్లు పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 32 సదరం క్యాంప్‌లు నిర్వహించి 3,043 మంది వికలాంగులకు ధృవపత్రాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసిన కార్యక్ర మంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, డీఆర్డీఓ వెంకట్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, ఏపీఎం రమణ తదితరులు ఉన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
నెల్లూరు (సెంట్రల్) : జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు సంబంధించిన ఎంపీ నిధులు ఒక్క పైసా కూడా వృథా కాకుండా జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా నెల్లూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులను జిల్లాకు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొదటివిడతగా రూ.2.45 కోట్లు జిల్లా కలెక్టర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.2.06 కోట్లు తాగునీటి సరఫరా పనులకు, మిగిలిన మొత్తం నెల్లూరులోని పడారుపల్లిలోని శ్మశానం అభివృద్ధి పనులకు , నెల్లూరు కేంద్ర కారాగారంలోని అనారోగ్య ఖైదీల ఉపయోగార్థం అంబులెన్సుల కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు సత్వరమే పూర్తి చేయాలని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎంపీ కోరారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక
నీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులు కేటాయింపు త్వరలో నియోజక వర్గాలవారీగా సమీక్షలు తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ నిధులను ఎక్కువగా కేటాయిస్తానని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మదనపల్లెకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించనున్నట్టు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించనున్నట్టు చెప్పారు.ముఖ్యంగా కండలేరు నదీజలాలను తీసుకురావడానికి నిధులు కొరత ఉందన్నారు. జిల్లాలో అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. రాజంపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మదనపల్లె, పుంగనూరు పట్టణాల్లో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దొంగదార్లలో కౌన్సిలర్లను కొనుగోలుచేస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వారు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి కౌన్సిలర్లను కొనుగోలుచేస్తే ఆ డబ్బును సంపాదించేందుకు అవినీతికి పాల్పడతారే తప్ప అభివృద్ధి ఏంచేస్తారని ప్రశ్నించారు. ఎంపీ వెంట మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి షమీమ్ అస్లాం, మైనారిటీల నాయకుడు బాబ్జాన్, కౌన్సిలర్ జింకా వెంకటా చలపతి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, రాష్ర్ట బీసీ నాయకులు పాల్ బాలజీ, నాయకులు బాలకృష్ణారెడ్డి, కోటూరి ఈశ్వర్, భువనేశ్వరి సత్య, కత్తి కృష్ణమూర్తి, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సచిన్, రేఖ.. దొందూ దొందే
-
సచిన్, రేఖ.. దొందూ దొందే
న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో, నియోజకవర్గ సంక్షేమం విషయంలో మన నేతల తీరు ప్రజలకు బాగా ఎరుక. కానీ, తమ తమ రంగాల్లో విశేష సేవలతో పెద్దల సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టిన విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ కూడా అచ్చమైన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తారని ఎవరూ అనుకొని ఉండరు. కానీ, తామూ ఆ తానులోని వారమే అన్నట్లు సచిన్, రేఖ పార్లమెంటు స్థానిక అభివృద్ధి నిధులను మురగబెడుతున్నారు. ప్రతీ రాజ్యసభ సభ్యుడు లేదా సభ్యురాలు దేశంలో ఏదేనీ ఒక జిల్లాను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుని స్థానిక అభివృద్ధి నిధులను ఆ ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చిస్తుంటారు. ఇందుకోసం ప్రతీ సభ్యుడికి ఏటా రూ.5కోట్ల నిధుల కేటాయింపు ఉంటుంది. సచిన్ ముంబై సబర్బన్ జిల్లాను సచిన్ దత్తత తీసుకున్నారు. కానీ, ఒక్క రూపాయి ఖర్చు చేసింది లేదు. ఇక రేఖ అయితే ఏ జిల్లాను దత్తత తీసుకోలేదు. ఇద్దరి ఖాత్లాలోనూ చెరో రూ.10కోట్లు మూలుగుతున్నాయి. -
ఎంపీ నిధులిచ్చా.. అభివృద్ధి చేయలేదా?
నంగునూరు, న్యూస్‌లైన్: ‘అభివృద్ధి పనుల గురించి మీ ఎమ్మెల్యేకు ఎంపీ ఫండ్ నుంచి డబ్బులిచ్చా.. మీ ఊరిని అభివృద్ధి చేయలేదా?.. మీ దొర సిద్దిపేట నియోజకవర్గంలో అద్భుతాలు చేశానని గొప్పలు చెబుతున్నారే మరి’ అంటూ హరీష్‌రావుపై మెదక్ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం మండలంలోని ఖానాపూర్, నంగునూరులో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. రెండు గ్రామాల్లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ ‘తెలంగాణ’ను ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను సిద్దిపేటలో ఎగురవేయాలన్నారు. అభివృద్ధి చేసిన వారిని తిరిగి గెలిపించాలని, ఇంతకు మీ ఊరిలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ‘మా ఊరిలో అభివృద్ధి జరగలేదని స్థానికులు సమాధానం ఇచ్చారు. ‘నేనే కదయ్యా మీ ఎమ్మెల్యేకు అభివృద్ధి పనులు చేస్తానంటే ఎంపీ నిధులిచ్చాను. ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు, ఏమీ చేయలేదా’ అని ప్రశ్నించారు. ‘అలాంటి ఎమ్మెల్యేను వరుసగా ఎలా గెలిపిస్తున్నారు ఈసారి బుద్ధి చెప్పండి’ అంటూ విజయశాంతి ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణతో పాటు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి వంద కోట్లు నిధులు అడిగానని అవి రాగానే ఈ ప్రాంతానికే ఖర్చు చేస్తామన్నారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ.. వచ్చే శీతాకాల సమావేశంలోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి నంగునూరులో బీసీ, శాలివాహణ భవనం, ఎస్సీ,బీసీ కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు, ఖానాపూర్‌లో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నంగునూరు, ఖానాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వానరాశి నర్సయ్య, హన్మంతు, రాజు, సతీష్రెడితో పాటు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గంప మహేందర్‌రావు, నాయకులు సాకి ఆనంద్, సికిందర్, పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, సర్పంచ్ మరియమ్మ పాల్గొన్నారు.