జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి | Contributed to the development of the district | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Published Tue, Dec 2 2014 3:41 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి - Sakshi

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

నెల్లూరు (సెంట్రల్) : జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు సంబంధించిన ఎంపీ నిధులు ఒక్క పైసా కూడా వృథా కాకుండా జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా నెల్లూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులను జిల్లాకు తెచ్చేందుకు తన వంతు కృషి  చేస్తున్నట్లు తెలిపారు.

మొదటివిడతగా రూ.2.45 కోట్లు జిల్లా కలెక్టర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.2.06 కోట్లు తాగునీటి సరఫరా పనులకు, మిగిలిన మొత్తం నెల్లూరులోని పడారుపల్లిలోని శ్మశానం అభివృద్ధి పనులకు , నెల్లూరు కేంద్ర కారాగారంలోని అనారోగ్య ఖైదీల ఉపయోగార్థం అంబులెన్సుల కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు సత్వరమే పూర్తి చేయాలని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎంపీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement