
గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు
రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీని మర్చిపోయారని.. ఇప్పుడు దాన్ని తాము గుర్తుచేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వదిలేస్తున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. ఆమె ఏమన్నారంటే...
- హక్కును పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.
- రాష్ట్రాన్ని విడగొట్టిన రోజు అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కూడా హామీలిచ్చారు.
- ఆ హామీలను పక్కనబెట్టి ఈ రోజు మన పరిస్థితిని వాళ్ల ముందు గోడు పెట్టుకున్నా వినిపించుకోని హీన స్థితిలో వదిలిపెట్టేశారు.
- ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు వస్తాయని అంటున్నారు.
- కానీ, ఏ రాష్ట్రాన్నీ ఇంత దారుణంగా విడగొట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎందుకు గ్రహించలేకపోతున్నారో ప్రశ్నార్థకమే.
- ఎంపీలంతా గత వారం రోజుల నుంచి పార్లమెంటులో మా గోడు వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదు.
- మాకు ఏదో సర్దిచెప్పాలని.. మీకు అన్యాయం చేయబోమని చెబుతున్నారు తప్ప న్యాయం ఎలా చేస్తారన్న స్పష్టత ఇవ్వడం లేదు.
- ఇంకా ఎన్ని రోజులు ఇలా కాలాన్ని గడిపేస్తూ మభ్యపెడతారో. వాళ్లలో చలనాన్ని తీసుకురావాలి.
- వాళ్లిచ్చిన హామీలను గుర్తు చేయాలన్న బాధ్యతతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పోరాటం ప్రారంభించారు.
- మనకు ప్రత్యేక హోదా వచ్చేవరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి. ఇదే నమ్మకంతో ముందుకెళ్దాం.