తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ | rail coach factory in telugu state | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్

Published Thu, Jul 7 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్

మహబూబ్‌నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఎట్టకేలకు లైన్క్లియిర్ అయింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన భూమిని రైల్వే శాఖ ఉన్నతాధికారులు దినేష్‌కుమార్, సునీల్‌కుమార్ తదితరులు గురువారం అలంపూర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు.

ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. గతంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం 123 ఏకరాల స్థలాన్ని గుర్తించారు.

ఎంపీ బుట్టా రేణుక చొరవ..
రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ తదితర అంశాలు పెండింగ్‌లో ఉండడంతో మొదటిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కర్నూల్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుకా కేంద్రప్రభుత్వంలో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు క్లియరెన్స్ వచ్చింది.

దీంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన సమాచారాన్ని ఎంపీ బుట్టా రేణుకా తెలుసుకున్నారు. అనంతరం ఆమె కూడా అలంపూర్ చేరుకుని... కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత మాస్టర్ ప్లానింగ్‌ను పరిశీలించారు.

అనంతరం ఎంపీ బుట్టా రేణుక విలేకరులతో మాట్లాడుతూ... కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని సుమారు 123 ఎకరాల భూములను గుర్తించినట్టు తెలిపారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లాలో పంచలింగాలలో 100 ఎకరాలను గుర్తించామని...  అలాగే తెలంగాణలో అలంపూర్ రైల్వేస్టేషన్ వద్ద మరో 23 ఎకరాలను గుర్తించినట్టు వెల్లడించారు.

రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు బుట్టా రేణుక పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. అయితే కొంతమంది రైతులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆ అంశాన్ని కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని..మాట్లాడుతున్నారని ఎంపీకి ఉన్నతాధికారులు వివరించారు.

తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన
రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ బుట్టారేణుక తెలిపారు. ప్రస్తుతం మరో పది రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని బుట్టారేణుక ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement