Rail Coach Factory
-
రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్
పండగ రద్దీ భారతీయ రైల్వేకు నిత్యం పెద్ద సవాలుగా మారుతోంది. పండగ నేపథ్యంలో లక్షలాది మంది స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. రైల్వేశాఖ అందుకు అనుగుణంగా సాధారణ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఎప్పటిలాగే పండగ రోజుల్లో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో అదే తంతు కొనసాగింది. కొంతమంది ప్రయాణికులు అందుకు సంబంధించిన వీడియోలు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. Bihar govt should now run special trains for their native migrant labors . There are people who paid for AC 2 n 3 tickets but couldn't board cause these chalu ticket climbed overcrowded the train n shut the door. and as usual Indian Railway management was clueless https://t.co/hLuRWQyz3d — Romeo Sierra (@sierraromeo98) November 11, 2023 PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 Why should I pay extra reservation charges if this is how I have to travel after paying extra charge for reservation. I m not demanding Tejas Coach Services, i demand my reserved seat #IndianRailways #resign https://t.co/sOjTgPdo9v — yogita chulet (@YogitaChulet) November 9, 2023 -
చెన్నైలోని ఐసీఎఫ్.. ప్రపంచ దేశాల్లో మారుమోగుతున్న పేరు.. ఎందుకో తెలుసా!
కొరుక్కుపేట(చెన్నై): చెన్నై పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మారుమ్రోగుతున్న పేరు. అత్యాధునిక, భద్రతతో కూడిన రైలు కోచ్‌లను తయారు చేయటంలో ఐసీఎఫ్‌కు మరొకటి సాటిలేనంతగా ఎదిగింది. రైల్వే ఉద్యోగులు, కార్మికులు అహర్నిశలు నిబద్ధతతో పనిచేయటం వల్లే ప్రపంచ దేశాలు ఐసీఎఫ్ వైపు చూస్తున్నాయి. తెలుగు ఉద్యోగులు, కార్మికులు ఇక్కడ అధిక సంఖ్యలో ఐసీఎఫ్‌లో పనిచేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత, మెరుగైన, సౌకర్యవంతమైన సేవలనే ప్రధానంగా చేసుకుని కోచ్‌ల తయారీలో నూతన ఒరవడిని సృష్టిస్తుంది ఐసీఎఫ్. తొలి దేశీయ ఉత్పత్తి యూనిట్ 1955 అక్టోబర్‌లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన స్వతంత్ర భారతదేశంలోని తొలి దేశీయ ఉత్పత్తి యూనిట్లలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి. సంవత్సరానికి 350 రైలు కోచ్‌ల సామర్థ్యంతో ఆల్–స్టీల్, ఆల్–వెల్డెడ్ షెల్ల తయారీ నుంచి, ఉత్పత్తి యూనిట్ ఆరంభమైంది. మొత్తం 511 ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారంలో సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంచలంచెలుగా ఐసీఎఫ్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇప్పుడు ఏటా 4,000 కోచ్‌లకు పైగా విడుదల చేస్తూ సరికొత్త ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. దేశీయ డిమాండ్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ రైల్వే ఆపరేటర్లకు కూడా ప్రత్యేక భూమిక పోషిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కోచ్ తయారీ.. ఐసీఎఫ్ ఫర్నిషింగ్ విభాగం అక్టోబర్ 1962లో ప్రారంభమైంది. అప్పటి నుంచి రైలు కోచ్‌ల తయారీలో వేగంగా అడుగులు వేసింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ –19 మహమ్మారి సమయంలో కూడా తగిన పరిమితులు ఉన్నప్పటికీ, ఐసీఎఫ్ 2021–22లో 3,100 కోచ్‌లను తయారు చేసి అరుదైన ఘనతను సాధించింది. ఇందులో మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ 31 ర్యాక్‌లు (248 కోచ్‌లు), 15 విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌లు, 2,639 లింకే హాఫ్ మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు, కోల్‌కతా మెట్రో రైలు కోసం 4 ఎయిర్ కండిషన్ కొత్త తరం ర్యాక్‌లు, అలాగే 50 డీజిల్ కార్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. 2019–20 సంవత్సరంలో 4,166 కోచ్‌ల ఆల్–టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుత ఉత్పత్తి సంవత్సరమైన 2022–23కి దాదాపు 50 వేరియంట్లలో 4,275 కోచ్‌ల ఆల్ టైమ్ హై టార్గెట్‌ను చేరుకునేందుకు కోచ్‌ల తయారీలో వేగం పెంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్యాసింజర్ కోచ్ తయారీదారుగా ఐసీఎఫ్ అవతరించి అందరినీ మన్ననలు పొందుతుంది. హరిత కార్యక్రమాల దిశగా.. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ఐసీఎఫ్ ప్రత్యేక దష్టి సారించింది. రిశ్రామిక కార్యకలాపాల కారణంగా గ్రీన్ హౌస్ వాయు ఉద్ఘారాలను పూర్తిగా తటస్థీకరించి, కార్బన్ ప్రతికూల స్థితిని సాధించిన భారతీయ రైల్వేలలో ఐసీఎఫ్ మాత్రమే అని చాలామందికి తెలియదు. ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకమైన పర్యావరణ కోసం చెట్లను విరివిగా పెంచటం, విద్యుత్ ఉత్పత్తి కోసం గాలిమరలు, సౌర ఫలకాలను ఏర్పాటు చేయడంలో ఐసీఎఫ్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ తయారీ ఇక్కడే మేకిన్ ఇండియా చొరవతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూపుదిద్దుకున్నది ఐసీఎఫ్‌లోనే. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ట్రైయిన్– 18’కు ఇక్కడే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ – వారణాసి మధ్య తిరగనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తయారీ కోసం రూ.97 కోట్ల వ్యయం చేశారు. దాదాపు 18 నెలల్లో సిద్ధమైన ఈ రైలు దేశంలోనే తొలి లోకో మోటివ్– లెస్ రైలు కావటం విశేషం. కొన్ని డజన్ల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రేక్‌లు ఐసీఎఫ్ రైల్వేకు చెందిన ఇతర కోచ్ ల తయారీ కర్మాగారాల్లో ఉత్పత్తిలో ఉన్నాయి. -
స్టాడ్లర్ రైల్.. త్వరలో తెలంగాణకు ! రూ. 1000 కోట్లతో..
రైల్ కోచ్ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్లో వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్లర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈవీపీ ఆన్స్‌గర్ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్ దావోస్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగియడంతో త్వరలో తెలంగాణలో రైలు కోచ్‌ల తయారీ రంగంలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు స్టాడ్లర్ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో నెలకొల్పబోయే రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్టాడ్లర్ సంస్థ రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2500ల మంది యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ప్రైవేటు రంగంలో మేధా సంస్థ రైల్ కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. తాజాగా స్టాడ్లర్ సంస్థ రైల్ కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులకు రెడీ అయ్యింది. మేధా సంస్థతో కలిసి స్టాడ్లర్ తెలంగాణలో పని చేయనుంది. Delighted to announce that ‘Stadler Rail’ will be setting up their Rail Coach Manufacturing unit in Telangana This investment will be a joint venture b/w Medha Servo Drives & Stadler Rail with an investment of ₹ 1,000 Cr. which will create 2,500 jobs for our youngsters pic.twitter.com/Ntnxs1oU6x — KTR (@KTRTRS) May 25, 2022 షిండ్లర్ సైతం తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు షిండ్లర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. షిండ్లర్ ఈవీపీ లుక్‌రెమ్‌నాంట్‌తో దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో రెండో స్టేట్ ఆఫ్ ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు షిండ్లర్ గ్రీన్ సిగ్నల్ ఇచఇచ్చింది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో గ్లోబల్ లీడర్‌గా షిండ్లర్ ఉంది. వందకు పైగా దేశాల్లో షిండర్ల్ విస్తరించి ఉంది. Extremely happy to announce that @SchneiderElec will be expanding its operations in Telangana by setting up their 2nd state-of-the-art manufacturing facility in Hyd. Thanks to Luc Remont, EVP, @SchneiderElec for the fruitful meeting at Telangana Pavilion @wef #TelanganaAtDavos pic.twitter.com/n5DRuuQ8J9 — KTR (@KTRTRS) May 25, 2022 చదవండి: KTR: ‘మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్’! -
ప్రారంభానికి ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రెడీ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేధా గ్రూప్ నెలకొల్పిన ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటని తెలిపారు. త్వరలో రైల్ కోచ్‌ల తయారీ, రవాణాకు సిద్ధమవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్ కోచ్‌ల తయారీని సుసాధ్యం చేసిన మేధా బృందాన్ని అభినందిస్తూ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పంచుకున్నారు. ఈ ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీకి కొండకల్లో మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. వేయికోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన ఫ్యాక్టరీలో స్థానికంగా 2,200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ లోకోమోటివ్ డిజైనింగ్‌లో పేరొందిన మేధా సర్వో గ్రూప్ భారతీయ రైల్వేకు అతిపెద్ద ప్రొపల్షన్ సరఫరాదారుగా ఉంది. కొండకల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో కోచ్‌లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ తదితరాల తయారవుతాయి. ఏటా 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్ల తయారీ సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంది. -
తెలంగాణలో త్వరలో దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ ప్రారంభం..!
హైదరాబాద్: లోకోమోటివ్స్ కోసం హైటెక్ ఎలక్ట్రానిక్స్'ను డిజైన్ చేసి తయారు చేసే మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని కొండకల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. అయితే, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు కాబోతుందని మంత్రి కె.టి.రామారావు నేడు(ఫిబ్రవరి 6) ట్వీట్ చేశారు. మేధా గ్రూప్‌చే ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ త్వరలో రైలు కోచ్‌లను తయారు చేసి రవాణా చేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇది జరిగేలా చేసిన యుగంధర్ రెడ్డికి, అతని టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మేథా సర్వో డ్రైవ్స్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్లో కేటీఆర్ షేర్ చేశారు. ఈ రైలు కోచ్ ఫ్యాక్టరీ వల్ల 2200 మందికి ఉపాధి అవకాశాన్ని లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో కోచ్‌లు, లోకోమోటివ్స్, ఇంటర్ సిటీ రైలుసెట్లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ వంటి వాటికి సంబంధించినవి తయారు చేయనున్నారు. ప్రస్తుత ఇన్ స్టాల్ చేసిన ప్రొడక్షన్ కెపాసిటీ సంవత్సరానికి 500 కోచ్‌లు(వివిధ రకాల), 50 లోకోమోటివ్స్ తయారు చేయనున్నారు. One of India’s largest private rail coach factories, set up by Medha Group is ready for inauguration soon at Kondakal Proud that Telangana will soon be manufacturing & shipping out rail coaches 😊 My sincere thanks to Yugandhar Reddy Garu & his able team on making this happen👍 pic.twitter.com/dsNRKnfHol — KTR (@KTRTRS) February 6, 2022 (చదవండి: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..!) -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్
* మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం * చివరి సర్వే కోసం లక్నో నుంచి వచ్చిన నిపుణుల బృందం * బృందంతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అలంపూర్ రూరల్: తెలంగాణ, ఏపీ సరిహద్దు అలంపూర్‌లో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. దీని నిర్మాణానికి ఏపీ, తెలంగాణ ప్రాంతంలో 123 ఎకరాల భూములను గుర్తించారు. ఈ మేరకు గురువారం ఈ పనులకు సంబంధించి లక్నో నుంచి సీఏవో దినేష్‌కుమార్, సీఎంఈ సునీల్‌కుమార్, సీఈ సహాయకులు ఏకే సింగ్, కోచ్ ఫ్యాక్టరీ ఇన్చార్జ్, డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఏకే శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్కే సింగ్, సీనియర్ ఇంజనీర్ ఆఫ్ మెకానికల్ శర్మ అలంపూర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. రైల్వే లైన్ స్థలంలో ఓ పారిశ్రామికవేత్త రోడ్డు వేసుకున్నారని.. ఆ రోడ్డును తొలగిస్తామని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక చొరవ... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెండింగ్‌లో ఉండడంతో ఆదిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కేంద్రంతో సంప్రదింపు లు జరిపిన అనంతరం ఈ పనులకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో అలంపూర్ వచ్చిన అధికారులతో ఎంపీ రేణుక కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడి, ప్లాన్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని 123 ఎకరాల భూములు గుర్తించినట్లు చెప్పారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లా దగ్గర గల పంచలింగాలలో 100 ఎకరాలు, తెలంగాణ అలంపూర్ రైల్వేస్టేషన్ వరకు మరో 23 ఎకరాలను గుర్తించినట్టు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. ఈ విషయమై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ విషయాలను కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని.. మాట్లాడుతున్నారని ఎంపీకి వారు వివరించారు. తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. మరో పది రోజుల్లో అంతా ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ పనులు ఇక వేగవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్
మహబూబ్‌నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఎట్టకేలకు లైన్క్లియిర్ అయింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన భూమిని రైల్వే శాఖ ఉన్నతాధికారులు దినేష్‌కుమార్, సునీల్‌కుమార్ తదితరులు గురువారం అలంపూర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. గతంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం 123 ఏకరాల స్థలాన్ని గుర్తించారు. ఎంపీ బుట్టా రేణుక చొరవ.. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ తదితర అంశాలు పెండింగ్‌లో ఉండడంతో మొదటిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కర్నూల్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుకా కేంద్రప్రభుత్వంలో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన సమాచారాన్ని ఎంపీ బుట్టా రేణుకా తెలుసుకున్నారు. అనంతరం ఆమె కూడా అలంపూర్ చేరుకుని... కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత మాస్టర్ ప్లానింగ్‌ను పరిశీలించారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుక విలేకరులతో మాట్లాడుతూ... కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని సుమారు 123 ఎకరాల భూములను గుర్తించినట్టు తెలిపారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లాలో పంచలింగాలలో 100 ఎకరాలను గుర్తించామని... అలాగే తెలంగాణలో అలంపూర్ రైల్వేస్టేషన్ వద్ద మరో 23 ఎకరాలను గుర్తించినట్టు వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు బుట్టా రేణుక పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. అయితే కొంతమంది రైతులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆ అంశాన్ని కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని..మాట్లాడుతున్నారని ఎంపీకి ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ బుట్టారేణుక తెలిపారు. ప్రస్తుతం మరో పది రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని బుట్టారేణుక ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఖర్గే కానిచ్చేశాడు.. మనవి అటకెక్కించారు
♦ కర్ణాటకకు మంజూరైన రైలు బోగీ ఫ్యాక్టరీ ఉత్పత్తికి సిద్ధం ♦ ఆరేళ్లు దాటినా పునాదిరాయి పడని కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ♦ కర్నూలుకు రెండు వర్క్‌షాపులు మంజూరైనా ఫలితం శూన్యం ♦ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్న తెలుగు రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టు ప్రకటన... చకచకా నిధుల విడుదల.. సకాలంలో పనులు పూర్తి.. ఉత్పత్తి ప్రారంభం.. కేవలం రెండేళ్ల పరిణామక్రమమిది.పోరాటం ఫలితంగా ఓ ప్రాజెక్టు మంజూరు.. ఆరేళ్లు గడిచినా అతీగతీ లేని పనులు.. అసలు ఆ ప్రాజెక్టు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం. మొదటిది కర్ణాటకలోని యాద్గిర్ వద్ద బడియాల్ గ్రామంలో రైలు బోగీ ఫ్రేములు తయారయ్యే ఫియెట్ బోగీ యూనిట్ పరిస్థితి. రెండోది వరంగల్ జిల్లా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీ దుస్థితి. రెంటికి ఎంత తేడా... ‘వడ్డించేవాడు మనవాడైతే’ తరహాలో కర్ణాటక ఆ ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటే... తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి లేకపోవడంతో చేతికందిన ప్రాజెక్టును కోల్పోయే పరిస్థితి. మరో రైల్వే బడ్జెట్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనూ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నాయి. మంజూరైన ప్రాజెక్టుల ఊసే లేని సమయంలో కొత్త ప్రాజెక్టుల రాక దాదాపు అసాధ్యమే. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉండగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి భారీ రైల్వే ప్రాజెక్టు సాధించాలని భావించారు. వెంటనే 2014 రైల్వే బడ్జెట్లో యాద్గిర్ ప్రాంతానికి రైల్వే ఫియెట్ బోగీ తయారీ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. రూ.750 కోట్లతో పనులు మొదలుపెట్టారు. ఇప్పుడవి పూర్తికావచ్చాయి. జూన్‌లో ఉత్పత్తి మొదలుకానుంది. ఆ యూని ట్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు పేర్లు ఇవ్వాలంటూ రైల్వే బోర్డు నుంచి అన్ని జోన్లకు సర్క్యులర్ వెళ్లింది. ఏడాదికి 600 బోగీ ఫ్రేములు ఇక్కడ తయారు కానున్నాయి. వేలమందికి ఉపాధి దొరకనుంది. అంతా డోలాయమానం కాజీపేటకు మూడు దశాబ్దాల క్రితమే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాజకీయ పరిణామాలతో దాన్ని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా పంజాబ్‌లోని కపుర్తలాకు మార్చారు. దాని స్థానంలో ఆరేళ్ల క్రితం కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. దానికి సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదనే కారణంతో పనులకు శ్రీకారమే చుట్టలేదు. ఇటీవల దాన్ని కూడా రద్దు చేసి వ్యాగన్ మరమ్మతు వర్క్‌షాపుగా మార్చాలనే నిర్ణయానికి రైల్వే బోర్డు వచ్చినట్టు తెలిసింది. తుదకు అది కూడా మంజూరవుతుందనే నమ్మకం లేకుండాపోయింది. సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న 300 పడకల రైల్వే ఆసుపత్రికి అనుబంధంగా మౌలాలీలో మెడికల్ కళాశాల మంజూరై నాలుగేళ్ల క్రితం బడ్జెట్లో చోటు దక్కించుకున్నా ఇప్పటి వరకు దాని ఊసేలేదు. ఇప్పుడు దాని అవసరం లేదని రైల్వే బోర్డు భావిస్తోందట. దీంతోపాటు సికింద్రాబాద్‌లో ‘సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్’ పేరుతో అధికారుల శిక్షణ కేంద్రం మంజూరైనా అది కూడా అతీగతీ లేదు. ‘సహాయ మంత్రి’కి మొండిచేయి రైల్వే మంత్రిగానో, సహాయ మంత్రిగానో ఉన్నవారు వారి ప్రాంతానికి ప్రాజెక్టులు మంజూరు చేయించుకోవటం సహజం. ఇదే పంథాలో కర్నూలుకు రైల్వే సహాయమంత్రి హోదాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రెండు ప్రాజెక్టులు మంజూరు చేయించారు. జీవితకాలం పూర్తి కాకుండా పాడయ్యే కోచులను బాగు చేసే ‘కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాపు’, డెమూ రైలు బోగీలను మరమ్మతు చేసే మరో వర్క్‌షాపును 2013లో మంజూరు చేయించారు. వీటికి భూమినీ సిద్ధం చేశారు. కానీ వెంటనే పనులు మొదలు పెట్టించలేకపోయారు. యూపీయే స్థానంలో ఎన్డీయే అధికారంరోకి రావటంతో అవి కాస్తా అటకెక్కాయి. రైల్ నీరు తయారయ్యే ఫ్యాక్టరీ విజయవాడకు మంజూరై మూడేళ్లవుతున్నా అది కూడా అంతే. -
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్
హైదరాబాద్: విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, రైలు కనెక్టివిటీపై గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుతో రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దేవేందర్ సింగ్, బోర్డుకు చెందిన ఏడుగురు సభ్యుల బృం దం సమావేశమైంది. దేవేందర్ సింగ్‌తో పాటు సభ్యులు అశోక్‌కుమార్, విజయ్ కుమార్, కె. గుప్త, ఎ.సి.రే, ఎస్.పి. సమంత రే సీఎస్‌తో భేటీ అయ్యారు. విశాఖను జోనల్ కేంద్రంగా చేసి విజ యవాడ, గుంటూరు, గుంతకల్ డివిజ న్లను ఒకే జోన్‌గా చేసి ఈస్ట్-కోస్టల్ రైల్వేను ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. ఏపీలో ఓ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రైల్వే బోర్డుకు వినతి చేయడంతో బోర్డు సా నుకూలంగా స్పందించింది. విజయవాడలో కో చ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించనున్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో ఉండే రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. విశాఖపట్టణం, విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైలు ఏర్పాటుపైన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని బోర్డు తెలిపింది. -
కాజీపేటలో ‘రైల్వే కోచ్’అనుమానమే!
సర్వే కమిటీ విముఖత ఠ కమిటీ గడువు పొడిగించిన కేంద్రం హైదరాబాద్: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దీనిపై పెదవి విరుస్తున్నట్టు సమాచారం. గత నెల 15తో ఈ కమిటీ గడువు పూర్తికాగా, మరో మూడు నెలలు గడువు పెంచుతూ ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నాలుగేళ్ల క్రితం కాజీపేటకు రైల్వే వ్యాగన్ వీల్ యూనిట్‌ను మంజూరు చేసింది. తాజాగా దానికి సంబంధించి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు అందజేసింది. దీంతో ఈ యూనిట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్‌లో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. దీంతో మరో కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ భారతానికి ఇవ్వటం సరికాదని సభ్యులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు కమిటీపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలిసింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనప్పటికీ, దాన్ని పంజాబ్‌లోని కపుర్తలాకు మళ్లించారు. ఏపీకి ప్రత్యేక జోన్‌పై ఓకే దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటుపై ఈ కమిటీ పచ్చజెండా ఊపనుందని సవూచారం. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు కానుంది. -
ఊరడింపు వరాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కర్నూలులో రాజధాని ఏర్పాటు లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలను వల్లె వేస్తూ.. కొత్తదనం లేని హామీలతో సరిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి వేడుకకు కర్నూలు నగరం వేదిక కాగా.. శుక్రవారం జెండా పండుగ కనుల పండువగా సాగింది. త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ ప్రసంగంలో కర్నూలు జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలపై టీడీపీ శ్రేణులే విస్తుపోయి చూడగా.. ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోయింది. అధిక శాతం హామీలు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అందజేసిన నివేదికలోనివే కావడం గమనార్హం. చంద్రబాబు వల్లె వేసిన వైఎస్ మానస పుత్రికలు సాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్రేవుల రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్ల నిర్మాణం. హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలకు నీరివ్వడం. టెక్స్టైల్, అపెరల్ పార్కు ఏర్పాటు. ఓర్వకల్లు సమీపంలో విమానాశ్రయ నిర్మాణం. ఈ హామీలు ఎప్పటికి అమలయ్యేనో... కర్నూలు ప్రభుత్వాసుపత్రి స్థాయి పెంచి నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్‌గా తీర్చిదిద్దడం. నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దడం. దేశంలోనే సీడ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయడం. జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు. ఖనిజ సంపద విస్తారంగా ఉన్న డోన్‌లో ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ తరహా ప్రతిష్టాత్మక సంస్థను స్థాపించడం. సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కర్నూలు జిల్లా అనుకూలంగా ఉండటంతో సాంప్రదాయేత ఇంధన వనరుల వినియోగానికి చర్యలు. బనవాసిలో గొర్రెలు, మేకలు, ఒంగోలు గిత్తల పరిశోధన కేంద్రం ఏర్పాటు. కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్‌సిటీల్లో తొలి నగరంగా కర్నూలు అభివృద్ధి. ఓర్వకల్లు వద్దనున్న 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామిక నగరం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను కల్పించడం. మ్యానుఫ్యాక్చరింగ్, హార్డ్‌వేర్, ఐటీ పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు. జొహరాపురం వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం. ఆలూరు వద్ద జింకల పార్కు. శ్రీశైలం, నందికొట్కూరులో అదే తరహా పార్కులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను సంరక్షించడం. శ్రీశైలం, మంత్రాలయం, యాగంటి, మహానంది తదితర పుణ్యక్షేత్రాలను అనుసంధానించి అభివృద్ధి చేయడం. -
దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి
కర్నూలు(కలెక్టరేట్) : దశలవారీగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిసి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ, కోడుమూరు-మంత్రాలయం రైల్వేలైన్ సర్వే వివరాలు తీసుకుని రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. కేంద్ర విద్యా సంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలు నెలకొల్పవచ్చు అనే దానిపై జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రలో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఇక్కడ పరిశ్రమలతో పాటు విద్యా సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి సమస్య పరిష్కారంపై తన వంతు కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జిల్లాకు 24 టీఎంసీల నీటిని కేటాయిస్తే 16 టీఎంసీలు మాత్రమే వస్తుందని, కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌తో చర్చించినట్లు అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, వీటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఒప్పంద పత్రాలపై సంతకాలు
కోలారు, న్యూస్‌లైన్ : జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకాలో కేంద్ర ప్రభుత్వం స్థాపించనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతకాలు చేసింది. బెంగళూరులోని విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రభుత్వం తరుఫున ప్రిన్సిపల్ సెక్రటరీ వందితాశర్మ, కేంద్ర రైల్వే శాఖ తరుఫున రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్, ఇంజినీరింగ్ బోర్డు) కె.స్వామినాథన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రి కె.హెచ్.మునియప్ప, జిల్లా ఇన్చార్జి మంత్రి యు.టి.ఖాదర్ పాల్గొన్నారు. కాగా, రూ. 1460 కోట్ల వ్యయంతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 1100 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. -
రానుందోచ్...రైల్ కోచ్!
సాక్షి, హన్మకొండ: రైలు బోగీల తయారీ కర్మాగారం జిల్లాకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013లో ‘తెలంగాణలో కోచ్ కర్మాగారం నిర్మాణానికి భారతీయ రైల్వే సర్వే చేపట్టాలి’ అని పేర్కొంది. ఈ ప్రతిపాదన.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఆశలు రేకెత్తించింది. 25 ఏళ్ల క్రితం రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం వరకు వచ్చి.. పంజాబ్ రాష్ట్రానికి తర లిపోయింది. రైల్ కోచ్ తెలంగాణలో అని పేర్కొన్నప్పటికీ... గత పరిణామాల నేపథ్యంలో అది కాజీపేటకు మంజూరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు మన ఎంపీలు సమష్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక భారమంతా వారిదే. రైలు పెట్టెలకు తీవ్ర కొరత.. ప్రస్తుతం భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రైలు కోచ్‌ల లభ్యత ముఖ్యమైనది. ప్రస్తు తం కపుర్తలా, చెన్నై, రాయ్‌బరేలీలలో రైలు పెట్టెల తయారీ కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి 3,500 వరకు రైలు పెట్టెల తయారీ, పునర్ నిర్మాణం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త రైళ్ల డిమాండ్‌కు తగ్గరీతిలో రైలు పెట్టెల తయారీ లేదు. దీంతో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం కష్టంగా మారింది. అరతేకాకుం డా ప్రస్తుతం మన దగ్గర వినియోగంలో ఉన్న రైలు పెట్టెల్లో 95 శాతానికి పైగా పాత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందినవే. భవిష్యత్అవసరాలు, భద్రతా ప్రమాణాలు, నాణ్యత, వేగం వంటి కీలక అంశాల్లో సాంకేతికంగా వెనుకబడి ఉన్నాయి. అందుకే రైల్వేశా ఖ దేశంలో వివిధ ప్రాంతాల్లో కొత్తగా రైలు కోచ్ తయారీకర్మాగారాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే పశ్చిమబెం గాల్, కేరళలో రెండు పరిశ్రమలకు పచ్చజెండా ఊ పింది. వీటితోపాటు దేశంలో పలు కీలక ప్రాంతాల్లో కర్మాగారాలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. కాజీపేటకే అవకాశం.. భారతీయ రైల్వేశాఖ కొత్తగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో నిర్మించాలని తలపెడితే అందులో మొ దటి ప్రాధాన్యం కాజీపేటకే దక్కుతుంది. కాజీపేట స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండడం వల్ల.. ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మిస్తే ఉత్తర, దక్షిణ ప్రాంతాల మ ద్య సమతుల్యత సాధించే అవకాశం ఉంది. కాజీపేట మీదుగా వెళ్తున్న న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్ర టంక్ మా ర్గాన్ని డబ్లింగ్ నుంచి ట్రిప్లింగ్కి అప్‌గ్రేడ్ చేయనున్నా రు. దీంతోపాటు జాతీయ రహదారి 202, ఎయిర్‌డ్రోమ్ వంటి మౌలిక వసతులు ఉన్నాయి. అంతేకాకుండా తుపాను వచ్చే అవకాశం లేకపోవడం, భూ కంపం తీవ్రత తక్కువగా ఉండే జోన్లో ఉండడం వంటి ప్రకృతి అంశాలు కాజీపేటకు కలిసొచ్చే అంశాలు. రెండు వేల ఎకరాల రైల్వే స్థలం కాజీపేటలో రైల్వేకు సంబంధించి రెండు వేల ఎకరాల స్థలం ఉంది. స్టీమ్ ఇంజిన్ల కాలంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఇప్పుడు స్టేషన్ ఉన్న స్థలం నుంచి బోడగుట్ట వరకు విస్తరించి ఉండేది. ఆ రోజుల్లో స్టీమ్ ఇంజిన్లతో నడపడం వల్ల మధ్యలో మెయింటనెన్స్ కోసం రైళ్లు, గూడ్సు బండ్లు కాజీపేట స్టేషన్లో రోజుల తరబడి నిలిచి ఉండేవి. వీటికి ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంబడి దర్గా కాజీపేట నుంచి మొదలు పెడితే రాంపూర్ వరకు రైల్వేట్రాక్, లూప్లైన్లు ఉండేవి. బోడగుట్ట వద్ద క్యారేజ్, వ్యాగన్స్ మెయింటనెన్స్ డిపార్ట్మెంట్ (సీ అండ్ డబ్ల్యూ) ఉండేది. అయితే స్టీమ్ ఇంజిన్ల కాలం ముగిసిన తర్వాత సీ అండ్ డబ్ల్యూ, లూప్లైన్లు వినియోగించడం లేదు. అంతా కలిపి దాదాపు దర్గా కాజీపేట నుంచి నష్కల్ వరకు ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంబడి దాదాపుగా రెండు వేల ఎకరాలకు పైగా రైల్వే స్థలం అందుబాటులో ఉంది. పాతికేళ్ల క్రితం చేజారిన అవకాశం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1980లో హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరాగాంధీ కేబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన కాజీపేటకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయించారు. ఇందిరాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇందిరాగాంధీ హత్యకు గురికావడం... సిక్కుల ఊచకోత వంటి సంఘటనలు చోటుచేసుకున్నారుు. ఆ తర్వా త ప్రధానిగా ఎన్నికైన రాజీవ్‌గాంధీ సిక్కులను శాంతపరిచేందుకు కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అక్కడ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఐదువేల మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా రైల్ కోచ్ కర్మాగారం కాజీపేటకు మంజూరైతే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.