సర్వే కమిటీ విముఖత ఠ కమిటీ గడువు పొడిగించిన కేంద్రం
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దీనిపై పెదవి విరుస్తున్నట్టు సమాచారం. గత నెల 15తో ఈ కమిటీ గడువు పూర్తికాగా, మరో మూడు నెలలు గడువు పెంచుతూ ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నాలుగేళ్ల క్రితం కాజీపేటకు రైల్వే వ్యాగన్ వీల్ యూనిట్‌ను మంజూరు చేసింది. తాజాగా దానికి సంబంధించి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు అందజేసింది.
దీంతో ఈ యూనిట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్‌లో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. దీంతో మరో కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ భారతానికి ఇవ్వటం సరికాదని సభ్యులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీలు కమిటీపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలిసింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనప్పటికీ, దాన్ని పంజాబ్‌లోని కపుర్తలాకు మళ్లించారు.
ఏపీకి ప్రత్యేక జోన్‌పై ఓకే
దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటుపై ఈ కమిటీ పచ్చజెండా ఊపనుందని సవూచారం. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు కానుంది.
కాజీపేటలో ‘రైల్వే కోచ్’అనుమానమే!
Published Tue, Aug 19 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement