హైదరాబాద్: విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, రైలు కనెక్టివిటీపై గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుతో రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దేవేందర్ సింగ్, బోర్డుకు చెందిన ఏడుగురు సభ్యుల బృం దం సమావేశమైంది. దేవేందర్ సింగ్‌తో పాటు సభ్యులు అశోక్‌కుమార్, విజయ్ కుమార్, కె. గుప్త, ఎ.సి.రే, ఎస్.పి. సమంత రే సీఎస్‌తో భేటీ అయ్యారు. విశాఖను జోనల్ కేంద్రంగా చేసి విజ యవాడ, గుంటూరు, గుంతకల్ డివిజ న్‌లను ఒకే జోన్‌గా చేసి ఈస్ట్-కోస్టల్ రైల్వేను ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు.
ఏపీలో ఓ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రైల్వే బోర్డుకు వినతి చేయడంతో బోర్డు సా నుకూలంగా స్పందించింది. విజయవాడలో కో చ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించనున్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో ఉండే రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. విశాఖపట్టణం, విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైలు ఏర్పాటుపైన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని బోర్డు తెలిపింది.
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్
Published Fri, Oct 10 2014 1:06 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement