Medha Coach Factory: Medha Group To Inaugurate India Largest Private Rail Coach In Telangana - Sakshi
Sakshi News home page

తెలంగాణలో త్వరలో దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ ప్రారంభం..!

Published Sun, Feb 6 2022 8:09 PM | Last Updated on Mon, Feb 7 2022 7:17 AM

Medha Group To Inaugurate India Largest Private Rail Coach in Telangana - Sakshi

హైదరాబాద్: లోకోమోటివ్స్ కోసం హైటెక్ ఎలక్ట్రానిక్స్'ను డిజైన్ చేసి తయారు చేసే మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని కొండకల్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. అయితే, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు కాబోతుందని మంత్రి కె.టి.రామారావు​ నేడు(ఫిబ్రవరి 6) ట్వీట్ చేశారు. మేధా గ్రూప్‌చే ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.​ 

తెలంగాణ త్వరలో రైలు కోచ్‌లను తయారు చేసి రవాణా చేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇది జరిగేలా చేసిన యుగంధర్ రెడ్డికి, అతని టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మేథా సర్వో డ్రైవ్స్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్‌లో కేటీఆర్ షేర్ చేశారు. ఈ రైలు కోచ్‌ ఫ్యాక్టరీ వల్ల 2200 మందికి ఉపాధి అవకాశాన్ని లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో కోచ్‌లు, లోకోమోటివ్స్, ఇంటర్ సిటీ రైలుసెట్లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ వంటి వాటికి సంబంధించినవి తయారు చేయనున్నారు. ప్రస్తుత ఇన్ స్టాల్ చేసిన ప్రొడక్షన్ కెపాసిటీ సంవత్సరానికి 500 కోచ్‌లు(వివిధ రకాల), 50 లోకోమోటివ్స్ తయారు చేయనున్నారు.
 

(చదవండి: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement