‘కువైట్ జైల్లో ఉన్న వారి శిక్షను తగ్గించాలి’ | we requested to reduce their jail period in kuwait prison | Sakshi
Sakshi News home page

‘కువైట్ జైల్లో ఉన్న వారి శిక్షను తగ్గించాలి’

Published Wed, Aug 3 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

we requested to reduce their jail period in kuwait prison

సాక్షి, న్యూఢిల్లీః కువైట్‌లో వివిధ నేరాలకు పాల్పడి 17 మంది భారతీయులు పలు జైళ్లలో ఉన్నారని, వీరిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వై.ఎస్.అవినాష్‌రెడ్డి, బుట్టా రేణుక అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

ఉరిశిక్ష పడిన 13 మంది మాదక ద్రవ్యాల కేసులో అరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్‌ను కోరినట్టు తెలిపారు. ఇండియా, కువైట్‌ల మధ్య ఖైదీల పరస్పర బదిలీకి ఒప్పందం కుదిరిందని, అయితే ఉరిశిక్ష పడిన వారి విషయంలో ఇది వర్తించదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement