రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక | ready resign for AP special status, says butta renuka | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 25 2016 11:45 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చూపిన బాటలో నడుస్తామని ఆమె హామీయిచ్చారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో జరుగుతున్న యువభేరిలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం యావత్తు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే అధికార పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరముందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement