kurnool yuvabheri
-
వైఎస్ జగన్కు తృటిలో తప్పిన ప్రమాదం
-
వైఎస్ జగన్కు తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలులో నిన్న యువభేరి కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గంలో హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకుల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో కారును నియంత్రించటంతో ప్రమాదం తప్పింది. కారు టైరు మార్చిన తర్వాత ఆ వాహనంలోనే ఆయన హైదరాబాద్ వచ్చేశారు. వైఎస్ జగన్ సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి ఉండటంతో భద్రతా సిబ్బంది అక్కడికి ఎవరినీ రానీయలేదు. -
రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చూపిన బాటలో నడుస్తామని ఆమె హామీయిచ్చారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న యువభేరిలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం యావత్తు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే అధికార పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. 'ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్ని రకాలు అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ విషయంలో జగనన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి సిద్దంగా ఉన్నాం. అవసరమైతే రాజీనామా వల్ల ప్రత్యేక హోదా వస్తుందని విశ్వసిస్తే, మీ భవిష్యత్ కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ'ని బుట్టా రేణుక అన్నారు. -
'ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాటకం'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సీఎం చంద్రబాబు లాలూచీ పడ్డారని న్యాయవాది శంకరయ్య ఆరోపించారు. చంద్రబాబు నాటకం ఆడి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న యువభేరిలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు చెప్పడం శోచనీయమని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినప్పుడు పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామన్నారని హామీయిచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదా అని అధికార పార్టీలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అన్నివిధాలుగా మేలు జరుగుతుందన్నారు. కేంద్ర నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా, 10 శాతం లోనుగా ఇస్తారని వివరించారు. పారిశ్రామిక, రవాణా సదుపాయాల్లో రాయితీలు ఇస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా కారణంగానే హిమచల్ ప్రదేశ్ లో 10 వేల పరిశ్రమలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా ఇవాల్సిందేనని కేవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. -
రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక