వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలులో నిన్న యువభేరి కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గంలో హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకుల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో కారును నియంత్రించటంతో ప్రమాదం తప్పింది. కారు టైరు మార్చిన తర్వాత ఆ వాహనంలోనే ఆయన హైదరాబాద్ వచ్చేశారు. వైఎస్ జగన్ సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి ఉండటంతో భద్రతా సిబ్బంది అక్కడికి ఎవరినీ రానీయలేదు.