సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారునం టైర్ పంక్చర్ అయి ఒక్కసారిగా పేలింది. దీంతో కారు సడెన్‌గా ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. టైర్ పేలడంతో అందరూ భయంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే వాహనాల నుంచి బయటకు వచ్చారు.
కాన్వాయ్‌లో వెళ్తున్న నాయకులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పేలిన టైర్లు రిపేర్ చేయడంతో మళ్లీ కొడంగల్‌కు బయలు దేరారు.
గతేడాది మార్చిలోనూ రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేటలో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి కాన్వాయ్‌లో ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తం ఏడు కార్లు ధ్వంసమయ్యాయి.
కాగా సీఎం రేవంత్ సోమవారం కొండగల్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో లోక్ సభ ఎన్నికలపై సన్నాహక సమానేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యుహాలపై దిశానిర్ధేశం చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‌నగర్ పరిధిలోనే ఉండటంతో.. ప్రత్యేక దృష్టి చెప్పారు సీఎం.
చదవండి: కవితకు దక్కని ఊరట.. బెయిల్ తీర్పులో కీలక అంశాలు
Comments
Please login to add a commentAdd a comment