
'ఉపాధి'లో సాగు పనుల ప్రతిపాదన లేదు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ ....
ఎంపీలు కవిత, బుట్టా రేణుక ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అన్వయించే ప్రతిపాదనలు కేంద్రం వద్ద లేవని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌భాయ్ కుందారియా స్పష్టం చేశారు.
భూసార పరీక్షల నిర్వహణకు కేంద్రం తీసుకుంటున్న చర్య లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వ్యవసాయ పనులను చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత లోక్‌సభలో ప్రశ్నను లేవనెత్తారు. ఈ మేరకు కుందారియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.