తగ్గిపోతున్న పెద్ద రైతులు
వ్యవసాయంపై పుడమి పుత్రుల అనాసక్తి
హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న వారు 72 శాతం
{పత్యామ్నాయ ఉపాధికి పట్టణ బాట
వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబం మొత్తం జీవించే పరిస్థితులు క్రమంగా దూరమవుతున్నాయి. బతుకు బండి సాగాలంటే కుటుంబంలో ఒక్కరైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఏదో ఒక పని చేయాల్సి వస్తోంది. అదే సమయంలో జిల్లాలో సాగు భూమి గణనీయంగా తగ్గుతోంది. వ్యవసాయేతరాలకు మరలుతోంది. ఇంతకుముందు పెద్దపెద్ద కమతాలుగా ఉండే భూమి కరిగిపోతోంది.
పుంగనూరు మండలం కుమ్మరగుంటలో రైతు నారాయణప్పకు ఏడెకరాల పొలం ఉంది. కొన్నేళ్ల నుంచి పంటలు సరిగా పండటం లేదు. దీంతో నారాయణప్ప ఆర్థికంగా చితికిపోయాడు. కొడుకు బాబు తనలా బాధపడకూడదని అప్పుచేసి డిగ్రీ వరకు చదివించాడు. వ్యవసాయం గిట్టుబాటు కాదని పుంగనూరులోని ఓ న్యాయవాది దగ్గర రూ.4 వేల జీతానికి పనికి కుదిర్చాడు. ఆరుద్రరెడ్డిది చిత్తూరు మండలం తాలంబేడు. నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత పొలంలో మామిడి చెట్లు నాటాడు. మిగిలిన భూమిలో వరి సాగుచేస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రావడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక.. కుమారుడు హర్షత్‌రెడ్డిని పెద్ద చదువులు చదివించలేకపోయాడు. ప్రస్తుతం హర్షత్‌రెడ్డి బెంగళూరులోని ఓ హోటల్‌లో రూ.10 వేల జీతానికి పనిచేస్తున్నాడు.
చిత్తూరు: గతంలో వ్యవసాయం చేయడం అంటే గొప్పతనంగా భావించేవారు. భూమి ఎక్కువగా ఉండే రైతులను గౌరవంగా సంబోధించేవారు. వారికి సమాజంలో గౌరవమర్యాదలు ఉండేవి. ఇప్పుడు కాలం మారింది. ప్రకృతి సహకరించక పెద్ద రైతులు కుదేలయ్యారు. అప్పులపాలై భూములు అమ్ముకునే స్థితికొచ్చేశారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో ప్రతిఏటా సాగు భూమి తగ్గుతోంది. పంటలు తగ్గిపోతున్నాయి. వ్యవసాయ కుటుంబాలు కలిగి ఉండే భూ విస్తీర్ణంలోనూ తరుగుదల కనిపిస్తోంది. జిల్లాలో హెక్టారు కంటే తక్కువ ఉన్న రైతులు 72 శాతం మంది ఉన్నారు.
భూమి లేని కుటుంబాలు 30 శాతం
జిల్లాలో భూమి ఉన్న వారి సంఖ్య 6,67,182, జిల్లాలో ఉన్న కుటుంబాల సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం 10.50 లక్షలు. పదెకరాల కంటే ఎక్కువ ఉన్నరైతులు 67,561, సన్నకారు రైతులు 44,431 మంది. అంటే దాదాపు 30 శాతం మందికి భూమి లేదు. దేశవ్యాప్తంగా భూమి లేని కుటుంబాల సంఖ్య తగ్గుతుండగా.. మన జిల్లాలో వీరి సంఖ్య పెరుగుతోంది.
పొలం ఉన్నా తప్పని ఉపాధి వేట..
సాగు యోగ్యమైన భూమి తమ చేతిలో ఉన్నప్పటికీ కుటుంబంలో ఒక్కరో ఇద్దరో ఉపాధి కోసం బయట ప్రాంతాలకు తరలుతున్నారు. మెరుగైన జీవనం పేరుతో సొంత ప్రాంతాలను వీడుతున్నారు. జిల్లా పెద్ద రైతుల కుటుంబాల పిల్లలు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లుతున్నారు. రెండెకరాలలోపు ఉన్న కుటుంబసభ్యులు తరలి వెళ్లే సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది.
కౌలు రైతులు..
భూమిలేకుండా కౌలుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య జిల్లాలో 4వేల మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయం జీవనాధారం చేసుకునే వారి సంఖ్య తగ్గుతుండటమే దీనికి కారణం. ప్రభుత్వం కూడా వీరికి రుణ సదుపాయం కల్పించకపోవడంతో వారు వ్యవసాయానికి దూరం అవుతున్నారు.
సాగు భూమి తగ్గుతోందిలా..
జిల్లాలో మొత్తం 2.11 లక్షల హెక్టార్లు వ్యవసాయానికి అనుకూలం. ప్రకృతి సహకరించకపోవడంతో సాగు భూమి తగ్గిపోతోంది. దీనికి తోడు రైతులు కూడా వ్యవసాయంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా ఒక కారణం. దీంతో ఇరవై ఏళ్ల క్రితం 10 లక్షల మంది రైతులు ఉన్నవారు ప్రస్తుతం 6.67లక్షల మంది రైతులే మిగిలారు. 2014-15లో 19,1325 హెక్టార్లు సాగవ్వగా, ఇది 2015-16కి 18,6863 హెక్టార్లకు తగ్గింది.
నెల రోజులుగా కూలీగా పనిచేశా
మాకు పదెకరాల పొలం ఉంది. వుూడేళ్లుగా వర్షాలు పడకపోవడంతో బోర్లు అడుగంటారుు. వర్షాలు వస్తాయుని నమ్మి వేరుశెనగ పంట వేశాను. సకాలంలో వర్షాలు పడకపోవడంతో తీరని నష్టం కలిగింది. ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయుం లేదు. కుటుంబపోషణ కష్టమై పోరుుంది. చేసేదేమీ లేక కుటుంబంతో సహా బెంగళూరుకు వెళ్లిపోరుు, కూరగాయుల వుండీలో కూలీగా పనిచేస్తున్నాను.
- వుురళి, తోటకనువు, పలమనేరు