ఉద్యోగుల పంపకాలు ఇలా
వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి, బుట్టాల ప్రశ్నలకు కేంద్ర మంత్రి వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఏర్పా టు చేసిన కమల్‌నాథన్ కమిటీ పరిగణనలోకి తీసుకున్న ప్రతిపాదనలు, నిబంధనలపై ప్రణాళిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ వివరణ ఇచ్చారు. పంపిణీకి సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలు అడిగిన ప్రశ్నకు ఆయన బుధవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 80 ప్రకారం ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో వివరించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల ఉద్యోగుల సంఖ్యను లెక్కించడం, వీరిని తెలంగాణ,ఏపీ రాష్ట్రాలకు ప్రత్య క్ష నియామకాల , పదోన్నతుల కోటాల వారీగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించడం వంటి అంశాలను తన సమాధానంలో మంత్రి వివరించారు.