పార్టీ ఫిరాయించడానికి ముందు రోజు చంద్రబాబుతో సమావేశమైన బుట్టా రేణుక.
సాక్షి, అమరావతి : ‘‘ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీలోనే ఉండాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటి మంచి మెసేజ్‌ని ప్రజలకు ఇవ్వాలి. లేకపోతే రాజకీయాలపైన, నాయకులపైన జనంలో చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే భవిష్యత్ తరాలకు మనం మంచి మార్గాన్ని చూపాలి..’’ అని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కొన్ని నెలల కిందట ఘంటాపథంగా చెప్పారు. ఏ పార్టీ నుంచైతే తాను గెలిచానో, ఆ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. సీన్ కట్‌చేసే...
మంగళవారం అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ వల్లే దక్కిన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె పార్టీ ఫిరాయించారు. తానెప్పుడూ అభివృద్ధినే ఆశిస్తానని, గడిచిన మూడేళ్లు కూడా దానినే కోరుకున్నానని, సారు(చంద్రబాబు) ఆహ్వానించడంతో టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు. బుట్టా రేణుక.. ‘‘బుట్టలో పడకముందు.. బుట్టలో పడ్డాక’’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?’’ అని ప్రశ్నించారు. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారని విమర్శించారు.
బుట్టలో పడక ముందు.. బుట్టలో పడ్డాక వీడియో వీక్షించండి
Comments
Please login to add a commentAdd a comment