
నేడు బుట్టా రేణుక బళ్లారి రాక
వైఎస్సార్‌సీపీకి చెందిన కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక ఆదివారం బళ్లారికి రానున్నట్లు జిల్లా కురుహీనశెట్టి ...
సాక్షి, బళ్లారి : వైఎస్సార్‌సీపీకి చెందిన కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక ఆదివారం బళ్లారికి రానున్నట్లు జిల్లా కురుహీనశెట్టి తరుణ సంఘం జిల్లా అధ్యక్షుడు తుక్కా రాజేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బళ్లారి నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి 9వ వార్షికోత్సవం పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కురుహీన శెట్టి సమాజానికి చెందిన బుట్టా రేణుక లోక్‌సభ సభ్యురాలు అయిన తర్వాత బళ్లారికి ప్రప్రథమంగా వస్తున్న నేపథ్యంలో ఆమెను ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. కాగా బుట్టా రేణుక ఆదివారం బళ్లారికి విచ్చేస్తున్న నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.