సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండువాలు కప్పి బుట్టా రేణుక, మాగుంటను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన కుమారుడు జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చదవండి....(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు)
మరోవైపు బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండా వైఎస్సార్ సీపీలో చేరినట్లు చెప్పారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని బుట్టా రేణుకా పేర్కొన్నారు. మళ్లీ తనను పార్టీలోకి తీసుకున్నందుకు వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి, 2014లో మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాంసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. ఏలూరు రామచంద్రారెడ్డి ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అవుతుందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా ఇవాళ పార్టీలో చేరిన విషయం విదితమే.
వైఎస్సార్‌సీపీలో చేరిన వాళ్లు
1.కర్నూలు ఎంపి బుట్టా రేణుక
2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి
3. ఆదాల ప్రభాకర్ రెడ్డి
4. మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్
5. మాజీ ఎమ్మెల్యే వంగా గీత
6. తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్
7. భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి
8. దారా సాంబయ్య సంత నూతల పాడు, ఆయన కుమార్తె కూడా వచ్చారు
9. డాక్టర్ రాంచంద్రారెడ్డి
అలాగే కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment