Magunta Sreenivasulu Reddy
-
ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిందితురాలు అయినప్పుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకే కేసులో ఉన్న ఇద్దరిలో ఆమె నిందితురాలు అయినప్పుడు ఆయన సాక్షి ఎలా అవుతారో తెలపాలంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని, ఆ విషయంలో భిన్నంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థల్ని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బదులిస్తూ.. కవిత ఫోన్లు ధ్వంసం చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడటమే కారణం అని తెలిపారు. మేజి్రస్టేట్ ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చి0దన్నారు. పాలసీలో భాగస్వామ్యం కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎంపీ మాగుంట కలిశారని, అయితే కవితను కలవాలని కేజ్రీవాల్ సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తన నివాసానికి కవిత రమ్మని ఫోను చేశారంటూ ఎంపీ మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవిత ఫోను ధ్వంసం చేయాల్సి వ0చ్చిదని ఎస్వీ రాజు తెలిపారు. పాలసీ అనుకూలంగా ఉండడానికి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని రూ. 50 కోట్లు తనకు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నట్లు రాజు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అభిõÙక్ బోయినపల్లి, బుచ్చిబాబులకు తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా రూ. 25 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అని ప్రశ్నించింది. కవిత నిందితురాలు అయినప్పుడు మాగుంట సాక్షి ఎలా అవుతారో చెప్పాలంది. ఈ సమయంలో కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కల్పించుకొని మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారడంతోనే బెయిలు వచ్చి0దన్నారు. ఇలాంటి ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని రోహత్గి తెలిపారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌కు ఏ కేసులో బెయిలు వచ్చి0దనే విషయాలు జస్టిస్ బీఆర్ గవాయి ఆరా తీశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని మాగుంట రాఘవ రూ. 25 కోట్లు బుచ్చిబాబు, అభిõÙక్కు ఇచ్చారని అంటున్నారు మరి మనీలాండరింగ్ కేసులో రాఘవ లేరని ఎలా అంటారని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. నేరారోపణ చేసిన వ్యక్తినే సాక్షిగా మార్చారు? రేపు ఇష్టానుసారం మరో వ్యక్తిని తీసుకొస్తారా? ఇదా దర్యాప్తు సంస్థల పారదర్శకత అని ప్రశి్నంచారు.కవితకు బెయిల్ మంజూరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళగా కవిత బెయిలుకు అర్హురాలని తేల్చి చెప్పింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45ను అర్థం చేసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందని పేర్కొంది. సహ నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు కాకుండా నేరంలో కవిత పాత్ర ఉందన్న ఆధారాలు ఇంకేమీ దర్యాప్తు సంస్థలు చూపకపోవడాన్ని గుర్తు చేస్తూ బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా.. దర్యాప్తు పూర్తి, చార్జిషీటు దాఖలు, మహిళ అనే మూడు అంశాల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. సుమారు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా ఇరుపక్షాలు వాదించాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిలును ధర్మాసనం మంజూరు చేసింది. ‘‘జులై 1న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు క్వాష్ చేస్తున్నాం. రెండు కేసుల్లోనూ చెరో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలి. సాక్షుల్ని బెదిరించడం, ఆధారాలు ట్యాంపర్ చేయడం చేయరాదు. ట్రయల్ కోర్టులో పాస్‌పోర్టు డిపాజిట్ చేయాలి. పిటిషనర్ ట్రయల్ కోర్టుకు రెగ్యులర్‌గా హాజరవుతూ.. దర్యాప్తు వేగవంతానికి సహకరించాలి’’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఫ్యామిలీకి ఎంపీ సీటు..
-
బాబు ష్యూరిటీ.. సీటుకు లేదు గ్యారంటీ..!
తెలుగుదేశం పార్టీ ‘జయహో బీసీ’ అంటూ గుంటూరులో ఆర్భాటంగా సమావేశం నిర్వహించింది. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగటమే లక్ష్యం అంటూ డిక్లరేషన్ ప్రకటించింది. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటోంది. జిల్లాకు చెందిన ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ సీటు ఇస్తానని సాక్షాత్తూ చంద్రబాబే హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బున్న బడా వ్యక్తి కళ్లెదుట కనిపించేసరికి ఆ నేతను కరివేపాకులా తీసిపడేశారు. ఇదేనా బీసీ డిక్లరేషన్ అంటూ పార్టీ కేడర్ అంతర్గతంగా మథనపడుతోంది. గతంలో మాదిగానే బీసీ నినాదం కేవలం ఎన్నికలకే పరిమితం చేస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీని టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావించారు. కనిగిరి, గిద్దలూరు శాసనసభా స్థానాల్లో ఏదైనా ఒక సీటు కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే అసెంబ్లీ సీటు ఇవ్వడం కుదరదని, అందుకు బదులుగా పార్లమెంటు సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తారని భావించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు బీసీలకు సీటు కేటాయించింది. కందుకూరు, కనిగిరి స్థానాల్లో బీసీలను పోటీకి దింపింది. ఆ పోటీగా టీడీపీ కూడా జిల్లాలో బీసీలకు సీటు తప్పకుండా ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కనీసం ఒక్క బీసీకి కూడా సీటు కేటాయించలేదు. నూకసాని పేరును అసలు పరిగణలోకి తీసుకోలేదు. రెండో విడతలో అయినా టికెట్ వస్తుందని భావించారు. పార్టీలో చేరకుండానే మాగుంటకు సీటు ? నూకసాని బాలాజీ ప్రస్తుతం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తానని చంద్రబాబు మాట ఇవ్వడంతో ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఒంగోలు నుంచి టీడీపీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయనున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సొంతంగా ప్రకటించుకోవడంతో నూకసాని ఖంగుతిన్నారు. ఇంకా పార్టీలో చేరని వ్యక్తి ఈ సీటు నాది అని ప్రకటించుకోవడమేమిటని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మాగుంటకు సీటు ఇవ్వాలనుకుంటే ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ప్రకటించాలి కానీ అందుకు విరుద్ధంగా మాగుంట ప్రకటించుకోవడం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇది టీడీపీ బలహీనతకు అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాఘవరెడ్డి పేరును ప్రస్తావిస్తూ పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేయడం బీసీల పట్ల టీడీపీ చిన్నచూపునకు ఇది నిదర్శనమని పార్టీ నేతలే చెబుతున్నారు. డబ్బుల్తో వస్తే బీసీలను పక్కన పెడతారా... ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు డబ్బున్న నాయకుడు రాగానే బీసీలను పక్కన పెట్టేశారని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మాగుంట అనేక పార్టీలు మారారని, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి అక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మళ్లీ ఇప్పుడు టీడీపీలోకి మారుతున్నారని, లిక్కర్ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు తరచుగా పార్టీలు మారుతున్న మాగుంటకు వచ్చీ రాగానే రెడ్ కార్పెట్ పరచడమేంటి అని విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న బీసీల కంటే పార్టీలు మారే మాగుంటలే ఎక్కువయ్యారా అని మండిపడుతున్నారు. అడుగడుగునా అవమానాలే.. పార్లమెంట్ అధ్యక్షుడైనప్పటికీ పార్టీ సమావేశాలకు పిలవకుండా, సమావేశాల్లో పాల్గొనకుండా అడుగడుగునా అవమానిస్తోంది. ఒకవైపు బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుంటే , మరోవైపు వెనకబడిన తరగతులు మా వెనకాలే నడవాలి, పెత్తనం మాత్రం మా చెప్పు చేతుల్లోనే ఉండాలంటూ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పార్టీలో సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులను ప్రోత్సహిస్తూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను వాడుకొని వదిలేస్తున్నాడన్న విమర్శలు వినవస్తున్నాయి. గత ఆదివారం నగరంలోని ఒక హోటల్లో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంతో కీలకమైన ఈ సమావేశంలో అటు టీడీపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు అధ్యక్షుడైన నూకసానికి పిలుపులేదు. కనీస మర్యాదగా సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. సోమవారం టీడీపీ, జనసేన నాయకులు కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటికెళ్లి కలిశారు. కేవలం బీసీ అయినందునే నూకసానిని అవమానిస్తున్నారని ఆయన వర్గం విమర్శిస్తోంది. జిల్లా పార్లమెంటు అధ్యక్షుడైన నూకసాని భాగ్యనగర్‌లో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దామచర్ల గుంటూరు రోడ్డులో నగర కార్యాలయం పేరుతో సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా కార్యాలయానికి రావలసి ఉంటుంది. కానీ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర నాయకులను వెళ్లకుండా దామచర్ల అడ్డుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక సార్లు అధినాయకుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా సొంత సామాజికవర్గానికే వత్తాసు పలికారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు సైతం నూకసానిని ఆహ్వానించడం లేదు. ఒకవైపు పార్టీని నమ్ముకున్న బీసీలకు మొండిచేయి ఇస్తూ జయహో బీసీ, బీసీ డిక్లరేషన్ అంటూ నాటకాలాడుతున్నారని బీసీ నాయకులు విమర్శిస్తున్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తోంది: ఎంపీ
-
నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు : ఎంపీ మాగుంట
-
నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు: ఎంపీ మాగుంట
సాక్షి, ప్రకాశం జిల్లా: తన కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందన్నారు. 10 రాష్ట్రాల్లో తమకు వ్యాపారాలు ఉన్నాయన్నారు. మా కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట స్పష్టం చేశారు. మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు: బాలినేని మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేసిందని.. అలాంటి కుటుంబంపై రాజకీయ కుట్ర చేయడం బాధాకరమని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.. ఒంగోలులో మాగుంట నివాసంలో ఎంపీ మాగుంటను పరామర్శించిన బాలినేని, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవ్వరితో విబేధాలు లేకుండా అందర్ని కలుపుకునిపోయే గుణం మాగుంట కుటుంబానిది అని అన్నారు. రాజకీయంగా మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బాలినేని అన్నారు. మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలతో పాటు పార్టీ అండగా ఉంటుందని బాలినేని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని బాలినేని అన్నారు. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! -
ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయం..
ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్‌ను కట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా ‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్‌బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్ టీవి రంగారావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. (క్లిక్ చేయండి: 2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా) -
ఏపీలో పొగాకు రైతులను ఆదుకోండి : ఎంపీ మాగుంట
-
నాపై వచ్చినవన్నీ కేవలం ఆరోపణలే
-
ఢిల్లీ లిక్కర్ స్కాంతో నాకు సంబంధం లేదు : ఎంపీ మాగుంట
-
ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించిన ఎంపీ మాగుంట
సాక్షి, ప్రకాశం జిల్లా: ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది పూర్తిగా సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా వ్యాపారులు చేస్తున్న కుట్రగా భావిస్తున్నట్లు చెప్పారు. తనకు, తన కుమారుడికి ఆ కంపెనీలో ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. ఆరోపణలపై త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని తెలిపారు. చదవండి: (సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్) -
మాగుంట కుటుంబంలో విషాదం
సాక్షి, చెన్నై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రజానేత దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు సుధాకరరెడ్డి(73) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. శుక్రవారం చెన్నైలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. స్వర్గీయ మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మ దంపతులకు 1949 సెప్టెంబర్ 9వ తేదీన సుధాకరరెడ్డి జన్మించారు. సినీ నిర్మాతగా, పంపిణీ దారుడిగా సుధాకరరెడ్డి పేరు గడించారు. విషాదంలో కుటుంబం కొద్ది రోజులుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సుధాకరరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1.41 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత సుబ్బరామిరెడ్డికి సుధాకరరెడ్డి తోడు నీడగా ఉండే వారని ఆయన సోదరుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు సైతం నిత్యం తోడు నీడగా ఉన్న సుధాకరరెడ్డి ఇక లేరన్న సమాచారం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. అన్నయ్య సుబ్బరామిరెడ్డి దివంగతులైన తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు రూపమైన సోదరుడు సుధాకర్ మరణం తమ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సుధాకరరెడ్డి భౌతిక కాయాన్ని నుంగంబా క్కం కాలేజ్ రోడ్డులోని సుబ్బారావు అవెన్యూలోని స్వగృహంలో ఉంచారు. శనివారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. నివాళులు సుధాకర్‌రెడ్డి మృతికి కెన్సస్ అధినేత నర్సారెడ్డి, తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు, అమర జీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అపోలో ప్రీతారెడ్డి, సత్యం థియేటర్స్ మునికన్నయ్య, నడిగర్ తిలకం శివాజీ గణేషన్ పెద్ద కుమారుడు రామ్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు. తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సంతాపం తెలిపారు. నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్సెట్) సుధాకరరెడ్డి -
లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మాగుంట
సాక్షి, ప్రకాశం: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికీ పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. తాజాగా ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకెలాంటి సంబంధం లేదు. 50 ఏళ్లుగా మేము మద్యం వ్యాపారం చేస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మా కుమారుడికి ఒక్క శాతం వాటా కూడా లేదు. లిక్కర్ స్కామ్‌లో మాపై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో నేను, నా కొడుకు డైరెక్టర్లుగా లేము. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే.. మా బంధువులకు రెండో జోన్లలో షాపులు ఉన్నాయి. మా బంధువులకు మాగుంట పేరు ఉండటంతో మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈడీ అధికారుల అనుమానం నివృత్తి చేశాము అని కామెంట్స్ చేశారు. -
నిశ్చితార్థానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి, ప్రకాశం(చీమకుర్తి): వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ కుమారుడు దుంపా ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతిల నిశ్చయ తాంబూలాల వేడుకను శనివారం ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఇనగంటి పిచ్చిరెడ్డి, మారం వెంకారెడ్డి, పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ స్థానిక నాయకులు, జిల్లాలోని పలువురు అధికారులు హాజరై ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతి జంటను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: (డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..) -
పార్టీ మారుతున్నట్లు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు
-
మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు: ఎంపీ వంగా గీత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు. అన్నవరం నుంచి జీఎంఆర్ఎస్ఈజడ్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు ఇతర అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, కేంద్రం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదని, డిజైన్లలో కరెక్షన్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే అత్యంత ముఖ్యమని, జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రూ. 20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుందన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాంమని, ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన రామాయపట్నం పోర్ట్ పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ పోర్ట్ నిర్మిస్తోందన్నారు. రామాయపట్నం పోర్టును కేంద్రమే నిర్మించాలని కోరినట్లు గుర్తు చేశారు. అయిదు వేల కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని, దీని వల్ల నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతందని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్ట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
త్వరలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు పూర్తి
సింగరాయకొండ: వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద, బాపట్ల జిల్లాలోని కొరిశపాడు–రేణంగివరం మధ్యలో ఏర్పాటు చేసిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్లను జాతీయ రహదారి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. సింగరాయకొండ వద్ద పరిశీలన సందర్భంగా మాగుంట మాట్లాడుతూ విమానాల ల్యాండింగ్ ప్రాజెక్టులు దేశంలో 13 మంజూరు కాగా, వాటిలో ప్రకాశం జిల్లా పరిధిలో ఒకటి, బాపట్ల జిల్లా పరిధిలో మరొకటి ఉన్నాయని, ప్రస్తుతం ఈ రెండూ చివరి దశలో ఉన్నాయన్నారు. సింగరాయకొండ వద్ద గల ప్రాజెక్టుకు అదనంగా 8.50 ఎకరాల స్థల సేకరణ చేయాల్సి ఉందని, అదనంగా సిమెంటు రోడ్లు నిర్మించాల్సి ఉందని ఎంపీ మాగుంట తెలిపారు. అందుకు రూ.40 కోట్ల అదనపు బడ్జెట్ అవసరమన్నారు. నిధుల మంజూరుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి అందిన ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టేందుకు ఎయిర్‌ఫోర్స్, జాతీయ రహదారి అధికారులు, పైలెట్లు వచ్చినట్టు తెలిపారు. సింగరాయకొండ ప్రాజెక్టు నిర్మాణంలో మలుపులుండటంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అయితే ఈ ప్రాజెక్టు వెనక్కి పోకుండా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ కొన్ని సూచనలు చేశారని, అందుకు ఎయిర్‌ఫోర్స్ అథారిటీ అధికారులు కూడా ఆమోదం తెలిపారని మాగుంట వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ అథారిటీకి చెందిన వీఎం రెడ్డి, అశోక్‌బాబు, ఆర్ఎస్ చౌదరి, వినోద్‌వాన్యా, ఆదిత్యదేశ్, జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్దన్, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
Prakasam: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రమణారెడ్డి
సాక్షి, ప్రకాశం(బేస్తవారిపేట): జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన యన్నం వెంకట రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఒంగోలులో శుక్రవారం అందుకున్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన ఎంపీ మాగుంటకు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మాగుంట నుంచి నియామక పత్రం అందుకుంటున్న పులి వెంకట కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కూడా.. తాళ్లూరు: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా బొద్దికూరపాడు మాజీ సర్పంచి పులి వెంకట కృష్ణారెడ్డిని నియమిస్తూ ఆ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి గతంలో గ్రామ సర్పంచిగా పని చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో కీలక నాయకుడిగా పనిచేస్తున్నారు. తనను అడ్వైజరి కమిటీ సభ్యుడిగా నియమించేందుకు సహకరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్‌కు పీవీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. -
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలి
-
ఆనందయ్యను కలిసిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి
-
స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట
సాక్షి, ఒంగోలు: తమిళనాడు డీఎంకే అధినేత, కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చైన్నైలోని ఆయన నివాసంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మొదటిసారి ఎన్నికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు మాగుంట మాగుంట రాఘవరెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాగుంటకు రెండో డోసు వ్యాక్సిన్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో మోతాదు వేయించుకున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ప్రజలు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకుంటూ వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్
-
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. అనంతరం సాక్షితో మాట్లాడుతూ.. 'నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. (గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించాము' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. (బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..) కాగా.. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీబీ భౌతిక కాయాన్ని ఫామ్‌హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గాన గంధర్వుడు బాలును చివరిసారిగా చూసేందుకు అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు తరలి వస్తున్నారు. శనివారం ఫామ్‌హౌస్‌లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి
-
‘వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి వంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి తప్పక ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఈవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మూలంగానే రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను వైఎస్సార్సీపీ 22 ఎంపీ సీట్లు గెల్చుకుందని తెలిపారు. -
ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట
సాక్షి, ఒంగోలు : భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో నూతనంగా ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న మాగుంట ప్రత్యేకంగా వీరిని కలిశారు. వెంకయ్యనాయుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. వెంకయ్యనాయుడు మాగుంట కుటుంబం గురించి సంక్షిప్తంగా ప్రధానికి వివరించారు. -
మాగుంట సంచలనం
సాక్షి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంచలనం సృష్టించారు. ఒంగోలు పార్లమెంట్లో 48 ఏళ్ల క్రితం నమోదైన భారీ మెజార్టీ రికార్డును బ్రేక్ చేశారు. 1952లో ఒంగోలు పార్లమెంట్ ఏర్పడగా, 1971లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన అంకినీడు ప్రసాదరావు తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి గోగినేని భారతీదేవిపై రికార్డు స్థాయిలో 1,79,894 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రికార్డును బ్రేక్ చేసిన వారు లేరు. అనంతరం 1980లో పులివెంకటరెడ్డి 1,51,175 ఓట్ల మెజార్టీ వద్ద ఆగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం 2019 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో రాత్రి 11.47 గంటల సమయానికి తన సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కంటే 2,12,522 ఓట్ల ఆధిక్యంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి ముందంజలో ఉన్నారు. 1971లో అంకినీడు ప్రసాదరావు నెలకొల్పిన రికార్డును మాగుంట బ్రేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి 1998లో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఓటమిపాలైనప్పటికీ 2004 ఎన్నికల్లో 1,06,021 ఓట్ల మెజార్టీతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009 ఎన్నికల్లోనూ 78,523 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపీగా పోటీచేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డిపై 15,658 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తాజాగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి ఒంగోలు పార్లమెంట్ చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నారు. -
వీరి మధ్యే అసలు పోటీ
సార్వత్రిక ఎన్నికల సమరం చివరి ఘట్టానికి చేరింది. మైకుల హోరు.. హామీల జోరుతో ముందుకు సాగిన నేతలు.. తమ తలరాతలు ఎలా మారబోతున్నాయోనని ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. జన సేన ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మూడు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు వారి గుణగణాలు, విజయావకాశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఘన చరిత్ర ఉంది. రాజకీయ ఉద్యమాలకు పురిటి గడ్డ ఇది. ఎందరో ఉద్దండులు, మహామహులు ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ తరఫున శిద్దా రాఘవరావు బరిలో నిలిచారు. మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబం ఒంగోలు కేంద్రంగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవ చేస్తోంది. శిద్దా రాఘవరావు పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు కేంద్రంగా నివాసం ఉంటూ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా.. శిద్దా రాఘవరావు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెంది ఎంఎల్సీగా రాజకీయాల్లో కొనసాగారు. 2014లో దర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన శిద్దా.. మాగుంట సహకారంతోనే ఆ ఎన్నికల్లో గట్టెక్కారని ఆయన సన్నిహతులే చెబుతుంటారు. శిద్దాకు రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇలా మాగుంట, శిద్దా.. జిల్లా రాజకీయాల్లో సుపరిచితులుగా ఉన్నారు. శిద్దా అందుబాటులో ఉన్నట్టే ఉంటారు. కొందరికే ఆయనను కలిసేందుకు అనుమతి ఉంటుంది. అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే కష్టమే. కొన్ని క్లిష్టతరమైన సందర్భాల్లో జనంపై చిర్రుబుర్రులాడతారు. జనం సమస్యలపై ఇచ్చే అర్జీల సంగతి పట్టించుకోరు. మంత్రిగా ఆయన ఇక్కడ సాధించిన విజయాలు అతి తక్కువే. కలుపుగోలుతనంగా ఉండరన్న విమర్శలున్నాయి. ఇటీవల యర్రగొండపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన నిజ రూపాన్ని ప్రదర్శించారని శిద్దా అనుచరులే అంటున్నారు. చేసే సాయం పది మందికీ తెలిసేలా చేయడం శిద్దా నైజం. తనకు ఇబ్బంది వచ్చే అంశాల నుంచి తప్పుకోవడానికి ఎంతటి వారినైనా ప్రలోభపెట్టడంలో ఆయకు ఆయనే సాటి అనే విమర్శ ఉంది. మాగుంట సౌమ్యంగా ఉంటారు. పది మందితో కలిసి ముందుకు సాగుతారు. కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఎంతటి వారినైనా గౌరవిస్తారు. పిల్లలతో పిల్లవానిగా, పెద్దలతో పెద్దగా, మేధావులతో తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అందరితో కలిసి భోజనం చేస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు. ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నా లేచి మాట్లాడతారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే గుణం మాగుంట శ్రీనివాసరెడ్డిది. వ్యాపారాల్లో దిట్టలు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శిద్దా రాఘవరావుకు చీమకుర్తి గ్రానైట్‌తో పాటు పాలిషింగ్ యూనిట్ ఇతర వ్యాపారాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి పరిచయం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇరువురూ ధార్మిక కార్యక్రమాలకు కొంత నగదు వెచ్చిస్తున్నారు. మాగుంట కుటుంబం గత 30 ఏళ్ల నుంచి సేవా రంగంలో ఉండి తన సొంత నిధులతో ప్రజలకు తాగునీరు, విద్య అందిస్తున్నారు. శిద్దా రాఘవరావు ధార్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. శిద్దా ఎక్కువగా మఠాధిపతులు, పీఠాధిపతులకు సమయం, ధనం వెచ్చిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘మాగుంట’కు ప్రజాభిమానం మెండు జిల్లా ప్రజానీకంతో మాగుంట కుటుంబానిది విడదీయరాని బంధం. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతున్న వేళ తాగునీటికి సొంత నిధులు వెచ్చించి దప్పిక తీర్చారు. నేటికీ పలు ప్రాంతాల్లో ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీరు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదాతగా పేరుపొందారు. ఒంగోలు నగర అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వివాదాలకు దూరం రాజకీయ వివాదాలకు మాగుంట ఎంత దూరంగా ఉంటారో.. శిద్దా కూడా అంతే. ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా మాగుంట ఆలోచిస్తారు. శిద్దా మాత్రం తన కుటుంబానికి ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో బేరీజు వేసుకుని ఆచితూచి అడుగు వేస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రజల నుంచి మంచితనాన్ని మాగుంట మూటగట్టుకున్నారు. శిద్దాకు గ్రానైట్ వ్యాపార రంగం నుంచి కొన్ని వివాదాలున్నా వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్తగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. ఇటీవల ఒంగోలు పర్యటనకు వచ్చిన పవన్‌కళ్యాణ్ శిద్దా గ్రానైట్ వ్యాపారం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావించడం గమనార్హం. నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ► సామాన్యుడిగా ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలు తమవాడిగా భావిస్తున్నారు ► నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నారు ► ప్రతి సమస్యా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ► హోదా వాణిని ఢిల్లీలో వినిపిస్తానని చెబుతున్నారు ► యువకుడు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ► పార్టీకి ఉన్న సానుకూలత కలిసొస్తుందని నమ్ముతున్నారు. శ్రీరామ్ మాల్యాద్రి, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ► ఆర్థిక బలంతోనే ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు ► ఎంపీ అయ్యాక నియోజకవర్గంలో ఉన్నది చాలా తక్కువ ► సమస్యలపై అవగాహన లేదు ► హోదాపై పోరాడిన దాఖలాలు లేవు ► ఎన్నికల సమయంలోనూ అంతంతమాత్రం ప్రచారమే.. ► టీడీపీపై వ్యతిరేకత ఉండడం ప్రతికూలాంశం -
అభివృద్ధే నా అజెండా..!
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లా ప్రజలకు వరప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టు. అన్ని సమస్యలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలిగొండ ద్వారా నీళ్లివ్వడానికి చర్యలు తీసుకుంటానని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. తన మనోభావాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. జిల్లాలో వాణిజ్య పంటల రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫ్లోరైడ్ సమస్య గ్రామాలను పీడిస్తోందని తెలిపారు. రైల్వే పరంగా అనేక సమస్యలున్నాయని అన్నారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణ పనులతోపాటు సంగమేశ్వర ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకోవాల్సి ఉందని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు తాను అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నానని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రక్షిత నీటిని ఇవ్వడానికి ఆర్వో ప్లాంటులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. వీటితోపాటు కిడ్ని బాధితుల సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఒంగోలులో డయాలసిస్ కేంద్రం ఉన్నా రోగులకు సరైన సేవలను అందించలేకున్నాయి. కిడ్నీ బాధితులకు అవసరమైన మేరకు డయాలసిస్ కేంద్రాలతో పాటు ఫ్లోరైడ్ తీవ్రంగా ఉన్న చోట ఆర్వో ప్లాంటులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా. వాణిజ్య పంటల రైతులకు గిట్టుబాటు ధరలకు కృషి జిల్లాలో ప్రధానంగా పొగాకు, శనగ, ఇతర వాణిజ్య పంటల రైతులతో పాటు సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరల సమస్య తీవ్రంగా ఉంది. కేంద్ర వాణిజ్య ప్రతినిధుల దృష్టికి వీరి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. పర్యాటకాభివృద్ధికి చర్యలు జిల్లాలో పర్యాటక అభివృద్ధి వల్ల సందర్శకులకు సౌకర్యాలు ఏర్పడతాయి. మొత్తం 24 ప్రదేశాలలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు, కొత్తపట్నం పర్యాటక అభివృద్దితో పాటు భైరవకోన అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. టెంపుల్ కారిడార్ పేరిట దేవాలయాల సందర్శనకు అనుసంధాన కార్యక్రమాలను రూపొందించాలి. ఒంగోలు తీరం వెంట అభివృద్ధికి వివిధ చర్యలు తీసుకోవాలి. అక్కడ పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా. ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కారం జిల్లాలో ఆక్వా ఎగుమతికి రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. అయితే ఆ రంగంలోని రైతులకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో 40 శాతం జిల్లా నుంచే వస్తుంది. రైతులకు సబ్సిడీలపై కరెంటు ఇతర సౌకర్యాలను కల్పించి ఆక్వా సాగు ప్రొత్సాహానికి తగిన చర్యలు తీసుకుంటాను. సాంకేతికంగా అన్ని విధాలుగా ఆక్వా రైతులకు సహకారాన్ని అందిస్తా. పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు తీయిస్తా.. దొనకొండ పారిశ్రామికవాడతోపాటు పామూరు వద్ద నిమ్జ్ అభివృద్ధి వల్ల ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. దశలవారీగా పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటా. ఒంగోలు కేంద్రం పరిధిలో రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ వర్తక వాణిజ్యపరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వాన్‌పిక్ భూముల్లో ప్రతిపాదించిన విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. రామాయపట్నంలో అదనంగా బెర్తుల కోసం కృషి చేస్తా. బకింగ్‌హాం కాలువ ఆధునికీకరణ మూలనపడింది, దీని ద్వారా ప్రత్యామ్నాయ రవాణా ఉపయోగకరంగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. వాటిని పరిశీలించి, కేంద్రం ద్వారా మెరుగైన రవాణాకు బకింగ్‌హాం కాలువ ప్రతిపాదన ముందుకు తీసుకొస్తా. సేవా కార్యక్రమాల కొనసాగింపు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు సొంత నిధులతో అందిస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తా. తాగునీరు, హెల్త్, విద్య వంటి కార్యక్రమాలను మాగుంట కుటుంబం అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. ఇంకా ప్రజల అవసరాలను గుర్తించి ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. రైల్వే సమస్యలు పరిష్కరిస్తా.. జిల్లాలో రైల్వే పరంగా ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి పనులు వేగవంతం చేయించాలి. గిద్దలూరు ప్రాంతంలోని రైల్వే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. వివిధ రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం నిలపాల్సిన పరిస్థితి ఉంది. వీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరిస్తా. డీకే యాజమాన్య హక్కు మార్పిడికి చర్యలు ప్రధానంగా ఒంగోలులోని ప్రజలు ఈ డీకే యాజమాన్య హక్కు మార్పిడి జరగక ఇబ్బంది పడ్తున్నారు. ఇంటి పన్నులు వారి పేరుపై రావడం లేదు. ఏ సౌకర్యం తీసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలుతో పాటు నియోజకవర్గంలోని వివిధ పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. డీకే పట్టాలు ఉన్న వారికి వారి పేరుపైనే యాజమాన్య హక్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను. అలాగే చుక్కల భూములు, ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలో రెవెన్యూ పరంగా ఈ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. ఎన్ఎస్పీ కాలువల ఆధునికీకరణతో గ్యాప్ ఆయకట్టుకు నీరు ఎన్ఎస్పీ కాలువల ఆధునికీకరణ పనుల ద్వారానే జిల్లాలోని కాలువల ద్వారా సాగవుతున్న ఆయకట్టులోని లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టు సమస్య తీరుతుంది. ఇందు కోసం కావాల్సిన నిధులను తీసుకురావడానికి కృషి చేస్తాను. దీర్ఘకాలం నుంచి సాగర్ కుడికాలువ పొడిగింపు సమస్య అలాగే ఉంది. కాలువ పొడిగింపు వల్ల మరికొన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది తొలగుతుంది. కొండపి నియోజకవర్గంలో సంగమేశ్వర ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న సమస్యలను తొలగించి సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాను. ఏడాదిలోగా వెలిగొండ పూర్తికి కృషి వెలిగొండ ప్రాజెక్టుతో సమస్యల పరిష్కారం ముడిపడి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెలిగొండ విషయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. సొరంగం పనులు నెమ్మెదిగా జరుగుతున్నాయి. తాగునీరు, సాగునీటికి వెలిగొండ పూర్తి చేయడం ద్వారానే ఇబ్బందులు తొలగుతాయి. టన్నెల్ పనులు ఇప్పుడు నెమ్మదిగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోగా పనులు పూర్తి చేసి నీళ్లివ్వడానికి చర్యలు తీసుకుంటా. -
మాగుంట విస్తృత ప్రచారం
-
సైకిల్ తొక్కి అలిసిపోయా..ఫ్యాన్ కింద చల్లగా ఉంది
సాక్షి, దర్శి (ప్రకాశం): సైకిల్ తొక్కి అలిసి పోయాయని... ఫ్యాన్ కింద చల్లగా ఉందని టీడీపీ పార్టీ పరిస్థితి, వైఎస్సార్ సీపీ పరిస్థితిపై ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్శి పట్టణంలో జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ మాగుంట కుటుంబం 30 ఏళ్లుగా సేవలందిస్తుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రేమ, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. తాను టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేని మంత్రి శిద్దా రాఘవరావు తాను టీడీపీని మోసం చేశానని అంటున్నారని.. దర్శి నియోజకవర్గంలో వాళ్ల విషయాలన్ని నాకు తెలుసని హెచ్చరించారు. మాగుంట కుటుంబం ప్రజా సేవకే అంకితమని, ప్రస్తుతం ఫ్యాన్ స్పీడు 120 కిలో మీటర్లతో దూసుకు పోతుందని, ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, ఎంపీ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. అఖండ మెజార్టీతో గెలిపించాలి: బూచేపల్లి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చలేదన్నారు. బాబు లాంటి మోసగాడిని ఇప్పటికి చూడలేదని, ఇకపై చూడలేమన్నారు. తొమ్మిదేళ్లు కలసిమెలసి కష్టాలు అనుభవించామని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగో పాల్‌ను, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నడూ లేని ఆదరణ: మద్దిశెట్టి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ పులివెందుల పులి అందరికి అన్న అయిన జగన్ అన్నకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి చరిత్రలో ఎప్పుడు లేని ఆదరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉందన్నారు. జన్మభూమి కమిటీలు అడ్డుపెట్టి వృద్ధులకు పింఛన్లు ఎగ్గొట్టారని, కనీసం గూడు లేని వారికి నివాసాలు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సంక్షేమ ఫలాలన్ని టీడీపీ నేతలే దోచుకుతిన్నారని మండిపడ్డారు. మరో పది రోజులు ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో తనకు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బూచేపల్లికి చట్టసభల్లో స్థానం: వైఎస్ జగన్ తన స్నేహితుడు, సోదర సమానుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూచేపల్లి శివప్రసాదరెడ్డికి చట్టసభల్లో స్థానం కల్పిస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. అన్ని విధాలా శివప్రసాదరెడ్డికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఆయా కార్యక్రమాల్లో పార్లమెంట్ ఇన్చార్జి నేదురమల్లి రామకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దిరిసాల రాజకుమార్‌రెడ్డి, నియోజక వర్గ అబ్జర్వర్ అవ్వారు ముసలయ్య, మద్దిశెట్టి శ్రీధర్, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షులు గోసుల శివభరత్‌రెడ్డి, రాష్ట్ర రైతు సంఘ సెక్రటరీ మారెడ్డి సుబ్బారెడ్డి, పలగాని యలమందారెడ్డి పాల్గొన్నారు. -
మార్కాపురం బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ
-
అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్సీపీ గెలవాలి : విజయమ్మ
-
‘జగన్ అనుకుంటే సాధిస్తాడు’
సాక్షి, ప్రకాశం : జగన్ అనుకుంటే సాధిస్తాడు.. ఇచ్చిన మాట తప్పడని వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం మార్కాపురం ప్రచార సభలో పాల్గొన్న విజయమ్మ ప్రసంగిస్తూ.. జగన్ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను.. చంద్రబాబు మూలకు పడేశారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ 70 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 30 శాతం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబుకు మనసు రాలేదని మండి పడ్డారు. పసుపు - కుంకుమ పేరుతో చంద్రబాబు జనాలను మాయ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం దేనికి ఉపయోగపడింది.. రాజధాని నిర్మాణానికా.. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడానికా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏసీ రూముల్లో కూర్చొని జగన్ నవవరత్నాలను కాపీ కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నిర్విర్యం చేసిన ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తాడని.. ఎంత ఖర్చయిన భరిస్తాడని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మార్కాపురం పలకల పరిశ్రమకు చేయూతనిస్తాడని పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలస్తూ.. జగన్ మీద నిందలు వేస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ ఎవరితోనూ కలవడు.. 25 ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేక హోదా తెచ్చుకుందామని తెలిపారు. మార్కాపురం అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించడని విజయమ్మ ప్రజలను కోరారు. -
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
సాక్షి, ఒంగోలు రూరల్: అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని త్రోవగుంట, మండువవారిపాలెం, అంబేడ్కర్‌నగర్, గుత్తికొండవారిపాలెం, ముక్తినూతలపాడు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించారు. బాలినేని ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. జన్మభూమి కమిటీలు మాకొద్దు, వారి నియంతృత్వ పాలనను సహించలేమంటూ పెద్ద పెట్టున వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రోడ్‌షో పొడవునా నినాదాలు చేశారు. రోడ్‌షోలో బాలినేని మాట్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో మనం భారీ మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒంగోలు నగరానికి కలికితురాయి వంటి రిమ్స్ వైద్యశాలను తీసుకువచ్చానన్నారు. అలాగే మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలును కార్పొరేషన్ చేసిన ఘనత తనదేనన్నారు. దాని ఫలితంగానే నిధులు భారీగా మంజూరయ్యాయన్నారు. ఆ నిధులను ఐదేళ్లుగా టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి కోట్ల రూపాయలు జేబుల్లో నింపుకున్నారన్నారు. అవొసరం లేని చోట రోడ్డు మీద రోడ్డు వేసి ఇష్టం వచ్చినట్లు కమీషన్ల దింగమింగారన్నారు. గత కొన్నేళ్లుగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఒంగోలు నగరానికి శాశ్విత పరిష్కారంగా మల్లవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే నన్నారు. ఫలితంగా ఒంగోలు నగరానికి తాగునీరు, ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలకు తాగునీరు, సాగునీరు వచ్చాయన్నారు. సంక్షేమ పథకాలకు జన్మభూమి కమిటీల మోకాలొడ్డు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఏకపక్ష నిర్ణయాలతో కార్పొరేషన్ రుణాలు, డ్వాక్రా రుణాలు, పక్కా ఇళ్లు వంటి అర్హులకు అందకుండా అధికార పార్టీ వారికి మాత్రమే అందాయన్నారు. రానున్నది జగనన్న రాజ్యమని, అప్పుడు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు గ్రామంలోనే సిబ్బందిని ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో కట్టా సింగయ్య, కట్టా గోపి, భీమేష్, తలతోటి అజయ్‌బాబు, బొచ్చు వెంకటరావు, పసుమర్తి శ్రీను, బొచ్చు కోటయ్య, యడవల్లి సాంబయ్య, రావులపల్లి నాగేశ్వరావు, రాయపాటి అంకయ్య, పల్లా అనురాధ, పి.ప్రభావతి, జల్లి సుబ్బులు, పులిచర్ల కృష్ణారెడ్డి, పిచ్చయ్య, సుబ్బారెడ్డి, రామకృష్ణ, వినోద్ పాల్గొన్నారు. అనంతరం టీడీపీకి చెందిన 20 మందికి బాలినేని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముక్తినూతలపాడు, గుత్తికొండవారిపాలెం గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో బాలినేని మాట్లాడుతూ తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం ఎన్నికలు రావడంతో పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. బాలినేని, మాగుంటలను గెలిపించడండి ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంట్ అ«భ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేశారు. 24వ డివిజన్లోని సమైక్యతానగర్, వంటపనివారల కాలనీ, బండ్లమిట్ట తదితర ప్రాంతాలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు బేతంశెట్టి హరిబాబు, బేతంశెట్టి సిద్ధార్థ, గోవర్ధన్, తోట సత్యన్నారాయణ, వల్లెపు మురళి, దేవా, బాబి, అయ్యప్ప, బండారు శ్రీను పాల్గొన్నారు. -
కృష్ణాలో టీడీపీని వీడుతున్న బలమైన సామాజిక వర్గం
సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేయగల సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు కృష్ణప్రసాద్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరావు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిలకు విజయవాడ, గన్నవరంలో గట్టి పట్టు ఉంది. వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు. స్వయానా మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ ప్రసాద్ ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌కు అన్ని వర్గాల ప్రజలతో విస్తృత సంబంధాలున్నాయి. అవనిగడ్డకు చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు చేరికతో నియోజక వర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ గురువారం జగన్ సమక్షంలో చేరారు. వైఎస్సార్ జిల్లాల్లో టీడీపీకి ఏకైక ఎమ్మెల్యే గుడ్‌బై గత ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధికార పార్టీని, పదవులను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు అందరితో సత్సంబంధాలున్నాయి. చాలా కాలం క్రితమే వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు రాజంపేట, మైదుకూరు, కడప సెగ్మెంట్లలో బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. మరో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించి ప్రచారంలో చురుగ్గా పని చేస్తున్నారు. మంగళగిరిలో టీడీపీకి షాక్... గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బలమైన వర్గం ఉంది. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మైనారిటీ నేత షౌకత్, జడ్పీ చైర్పర్సన్ జానీమూన్‌కు ఆయా సామాజిక వర్గాల్లో మంచి పరిచయాలున్నాయి. బలమైన వర్గం కలిగిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. మాజీమంత్రి మహమ్మద్ జానీ, ఆయన ఇద్దరు కుమారులు, రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తాజాగా చేరారు. బలమైన వర్గం వీరి వెంట ఉంది. మాగుంట చేరికతో మారిన రాజకీయం.. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు గిద్దలూరు, మార్కాపురం సెగ్మెంట్లలో మంచి పలుకుబడి ఉంది. పరిచయం అవసరం లేని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ప్రజల్లో మంచి పేరుంది. స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ పోరాటపటిమ కలిగిన నేత. వైఎస్సార్సీపీలో చేరిన ఈదర మోహన్ ఒంగోలు, సంతనూతలపాడులో ప్రభావం చూపగలరు. హిందూపురంలో సైకిల్‌కు పంక్చర్.. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. జేసీ దివాకరరెడ్డి ప్రధాన అనుచరుడు కోగటం విజయ భాస్కరరెడ్డి, పరిటాల రవి స్నేహితుడు వేపగుంట రాజన్న టీడీపీని వీడారు. మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడుకూడా వైఎస్సాసీపీలో చేరారు. టీడీపీ టికెట్ ఇచ్చినా రాజీనామా చేసి.. నెల్లూరు జిల్లాలో టీడీపీ నెల్లూరు రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించిన ఆదాల ప్రభాకరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ టికెట్‌పై ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ కూడా టీడీపీని వీడి తిరుపతి నుంచి వైఎస్సార్ సీపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక ఆనం కుటుంబం ప్రభావం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో బలంగా ఉంది. దివంగత సీఎం నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడు రామ్ కుమార్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. చంద్రబాబు మోసాన్ని గ్రహించి.. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్‌పై కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి అనంతరం టీడీపీలో చేరినా చంద్రబాబు వైఖరితో మనస్థాపం చెంది తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. ఎస్వీతోపాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ కూడా పార్టీలో చేరారు. రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ వైఎస్సార్సీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతి సీడ్స్ అధినేత పోచా బ్రహ్మానందరెడ్డికి రైతులతో మంచి సంబంధాలున్నాయి. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత దస్తగిరిరెడ్డి చేరడం నంద్యాలలో వైఎస్సార్సీపీకి మరింత బలం. -
ఆదరించండి..అండగా ఉంటాం
సాక్షి, అల్లూరు (కొత్తపట్నం): అల్లూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం 30 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిలు అన్నారు. స్థానిక రాజీవ్ కళా మందిరంలో సోమవారం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా కృష్ణుడు మందిరంలో పూజలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీతో ప్రచారం చేసుకుంటూ ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నా అన్న సుబ్బరామిరెడ్డి 1990 నుంచి అల్లూరు గ్రామాన్ని ఎన్నికల ప్రచారానికి ఎన్నుకున్నారన్నారు. అల్లూరు గ్రామ వాసులు ఆశీర్వదించడంతో మేము గెలుపుగా భావించేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పటికీ పదిసార్లు పోటీ చేస్తే అల్లూరు నుంచే ప్రచారానికి వచ్చి ప్రారంభించామన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ప్రజల సాధక, బాధలు తెలుసుకొని నవరత్నాల పథకాలను రూపొందించారన్నారు. అల్లూరులో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్ఎస్పీ కాలువ ద్వారా నీటి అల్లూరు చెరువుకు తీసుకువస్తామన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందితే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. సాగర్‌లో నీరు ఉన్నా అల్లూరు చెరువుకు ఎందుకు రాలేదని, రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు చెరువుకు నీరు వచ్చేయన్నారు. అల్లూరు చెరువుకు నీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. శింగరాజు రాంబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు చేసే మ్యాజిక్కులు, జిమ్మిక్కులు మోసపోవద్దన్నారు. దామచర్ల జనార్దన్‌రావు కమిషన్లకు, పర్శంటేజీలకు ప్రాధాన్యం ఇచ్చేవాడని, బాలినేని ఎప్పుడూ ప్రజలకు సేవలు చేసేవారని గుర్తు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి మీద నాన్‌బెయిల్‌బుల్ కేసుపెట్టడం ఎంత అన్యాయమని మండిపడ్డారు. సీనియర్ నాయకుడు వీరేపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మండలంలో సంక్షేమ పథకాల పేరుతో కోట్లు దండుకున్నారన్నారు. కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, అయినబత్తిన ఘనశ్యాం, శింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత, గొర్రెపాటి శ్రీనివాసులు, రాజశేఖర్, నానిరెడ్డి పేరారెడ్డి, యూత్ అధ్యక్షుడు మెట్టా రవికుమార్‌రెడ్డి, వీరేపల్లి రామచంద్రారెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, ఎంపీటీసీలు పాలపర్తి నాగేంద్రం, మొలకా బుజ్జమ్మ, వాయల మోహన్‌రావు, స్వర్ణ శివారెడ్డి, మిట్నసల భారతి తదితరులు పాల్గోన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన మాగుంట
-
వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక, మాగుంట
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండువాలు కప్పి బుట్టా రేణుక, మాగుంటను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన కుమారుడు జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చదవండి....(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు) మరోవైపు బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండా వైఎస్సార్ సీపీలో చేరినట్లు చెప్పారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని బుట్టా రేణుకా పేర్కొన్నారు. మళ్లీ తనను పార్టీలోకి తీసుకున్నందుకు వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి, 2014లో మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాంసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. ఏలూరు రామచంద్రారెడ్డి ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అవుతుందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా ఇవాళ పార్టీలో చేరిన విషయం విదితమే. వైఎస్సార్సీపీలో చేరిన వాళ్లు 1.కర్నూలు ఎంపి బుట్టా రేణుక 2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 3. ఆదాల ప్రభాకర్ రెడ్డి 4. మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్ 5. మాజీ ఎమ్మెల్యే వంగా గీత 6. తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్ 7. భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి 8. దారా సాంబయ్య సంత నూతల పాడు, ఆయన కుమార్తె కూడా వచ్చారు 9. డాక్టర్ రాంచంద్రారెడ్డి అలాగే కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. -
టీడీపీకి మాగుంట గుడ్ బై
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో అధికార పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను కౌన్సిల్ చైర్మన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావులకు పంపారు. ప్రజలు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. గురువారం ఒంగోలులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాగుంట ఈ వివరాలు వెల్లడించారు. రాజన్న పాలన మళ్లీ రావాలి.. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాజన్న పాలన తిరిగి వస్తుందని మాగుంట చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. తమ కుటుంబానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఎనలేని అనుబంధం ఉందన్నారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి, వదిన మాగుంట పార్వతమ్మలు వైఎస్‌తో కలిసి పనిచేశారని, వారి వారసుడిగా తాను కూడా వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట చెప్పారు. మాగుంట బ్రాండ్.. ప్రకాశం ప్రకాశం జిల్లాలో మాగుంట బ్రాండ్ అని, మాగుంట సుబ్బరామిరెడ్డిని జిల్లా ప్రజలు భగవంతుడిగా చూశారని శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. అందరూ తమ వెన్నంటే ఉన్నారన్నారు. ఒంగోలు వదలొద్దని, టీడీపీని వీడి వైఎస్సాసీపీలో చేరాలని ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ కోరినందునే వైఎస్ జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రకాశం జిల్లా మాగుంటకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతమన్నారు. పార్టీలకతీతంగా జిల్లాలో మాగుంట కుటుంబం సేవ చేసిందన్నారు. అందరూ తమను ఆదరించారన్నారు. ఎవరి బెదరింపులతోనో పార్టీ మారడం లేదన్నారు.విలేకరుల సమావేశంలో మాగుంటతో కలిసి ఆయన అనుచరులు ఘనశ్యామ్, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, ఐనాబత్తిన సత్యంతో పాటు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు ప్రకాశం జిల్లాలో సుధీర్ఘ కాలంగా రాజకీయం నెరుపుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అధికార టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించగానే మాగుంట అనుచర వర్గంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నాయి. మాగుంట రాకతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గత కొంతకాలంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీని వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ జాప్యం జరగడంతో అందరూ మాగుంట నిర్ణయం కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మాగుంట టీడీపీకి రాజీనామా చేయడం జిల్లా వ్యాప్తంగా గురువారం చర్చనీయాంశమైంది. ఇక జిల్లాలో వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యతను సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. మాగుంట రాకతో జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరనుంది. దీంతో 12 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో వైఎస్సార్సీపీ విజయావకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వైఎస్సార్ సీపీలో మరింత జోష్ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనుండడంతో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలో మరింత జోష్ నిండింది. మాగుంటకు జిల్లా వ్యాప్తంగా బలమైన వర్గం ఉండడంతో ఇది వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటికే కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పర్చూరుకు చెందిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆపార్టీళో రెట్టించిన ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవగా అధికార పార్టీ నేతలు వరుస పెట్టి పార్టీని వీడుతుండడంతో టీడీపీ డీలా పడిపోయింది. మాగుంట రాజకీయ ప్రస్థానం నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారింది. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి డేగా నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. ఆతర్వాత 1995 డిసెంబర్లో నక్సల్స్ కాల్పుల్లో మాగుంట మరణించారు. అనంతరం 1996 ఏప్రిల్‌లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ టీడీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. 1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1999లో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓటమి చవి చూశారు. 2004 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. తర్వాత 2009 ఎన్నికల్లో మాగుంట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో మాగుంట ఓటమి చెందారు. మొత్తంగా 5 సార్లు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి మాగుంట మూడు సార్లు విజయం సాధించి రెండుసార్లు ఓటమి చెందారు. సామాజిక సేవలోనూ మాగుంట కుటుంబం ముందుంటుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా మాగుంటకు ప్రత్యేక వర్గం ఏర్పడింది. తాజాగా ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ పార్టీకి ఇది కలిసి వచ్చే అంశం అయింది. -
జగన్ సీఎం అయితే వైఎస్ పాలన వస్తుంది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఏలేశ్వరం (ప్రత్తిపాడు): రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాగుంట ప్రకటించారు. గురువారం సాయంత్రం ఒంగోలులోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో మాగుంట కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి, వదిన మాగుంట పార్వతమ్మలు వైఎస్‌తో కలిసి పనిచేశారన్నారు. వారి వారసుడిగా వైఎస్ జగన్‌తో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట చెప్పారు. టీడీపీకి ఎమ్మెల్యే వరుపుల రాజీనామా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ మరో షాక్ తగిలింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు దివంగత నేత వైఎస్సార్ రెండుసార్లు, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఒకసారి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేను చేశారన్నారు. ఎటువంటి పదవులు అశించకుండా వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు తదితరులు కూడా వరుపులతో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. -
వామ్మో నాకొద్దు ఆ టికెట్!
సాక్షి, ప్రకాశం : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రకాశం జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయడంతో అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో టీడీపీ అధిష్టానం అయోమయంలో పడింది. ఒక వైపు నామినేషన్ల గడువు సమీపిస్తుండం.. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లేకపోవడంతో జిల్లా టీడీపీ కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఒంగోలు అభ్యర్థి కోసం గాలింపు మొదలుపెట్టారు. మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు బరిలోకి దించేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే శిద్దా మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దర్శి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని, ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయలేనని చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది. మరో వైపు తమ నేతకు దర్శి టికెట్ ఇవ్వాలని శిద్దా రాఘవరావు వర్గం కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఎవరిని ఒంగోలు నుంచి బరిలోకి దింపాలో తెలియక చంద్రబాబు అయోమయానికి గురవుతన్నారు. దర్శి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆ స్థానాల నుంచి ఎవరిని పోటీలో నిలబెడుతున్నారు ఇంకా స్పష్టత రాలేదు. ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చాకే దర్శి, కనిగిరి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. చదవండి : బాబ్బాబు.. పోటీ చేయండి -
టీడీపీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై
-
ప్రకాశం జిల్లాలో టీడీపీకి భారీ షాక్...
సాక్షి, అమరావతి : ఓవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు మీద సమీక్షలు జరుపుతుంటే...మరోవైపు ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో మాగుంట ఒంగోలు నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో స్థానిక సంస్థలు తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశారు. గత మూడేళ్లుగా ఆయన టీడీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. -
పార్టీ మారడం పునరాలోచించుకో
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో అధికార తెలుగుదేశంలో వేడి మొదలైంది. ముఖ్యమైన నేతలు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో ఏం చేయాలో తెలియని డోలాయమానంలో పడింది. దీంతో అధిష్టానం జిల్లా అధ్యక్షుడు దామచర్లను రంగంలోకి దింపి సర్దుబాటు చర్యలు ప్రారంభించినా.. ఎక్కడా ఓ కొలిక్కి రాలేదు. ఒంగోలు సబర్బన్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ప్రచారం కాస్త జోరందుకుంది. అదే విధంగా జిల్లా మంత్రి శిద్దా రాఘవరావును దర్శి అసెంబ్లీకి కాకుండా ఒంగోలు పార్లమెంట్‌కు నిలబడాలని పార్టీ అధిష్టానం వత్తిడి తీసుకువస్తోంది. దీన్ని దర్శిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు అంశాలపై అధికార టీడీపీలో పెద్ద దుమారమే రేగింది. ఈ సమాచారాన్ని ఇంటిలిజెన్స్ నిఘా ద్వారా పసిగట్టిన టీడీపీ అధిష్టానం జిల్లాలోని పరిస్థితులపై దృష్టి సారించింది. ఈ రెండు వ్యవహారాలను తక్షణమే సర్దుకునే చర్యలు చేపట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను పురమాయించింది. దీంతో దామచర్ల రంగంలోకి దిగి ఇరువురు నాయకులతో విడివిడిగా చర్చలు జరిపారు. శిద్దా, మాగుంటతో మంతనాలు.. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్‌కు వద్దని, దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేలా పార్టీ అధిష్టానం తన మనసు మార్చుకోవాలంటూ దర్శి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒంగోలు నగరానికి చేరుకున్నారు. పార్లమెంట్‌కు నిలబడేందుకు అంగీకరించవద్దని శిద్దాపై వత్తిడి చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి చేరుకొని కొంతసేపు చర్చలు జరిపారు. నాయకులు, కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయాలని చూశారు. అంతకు ముందు రామ్‌నగర్ రెండో లైన్లో ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసానికి దామచర్ల జనార్దన్ చేరుకున్నారు. తొలుత మాగుంటతో ఏకాంతంగా చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ మారే ఆలోచనను పునరాలోచించుకోవాలంటే బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం దామచర్లతో పాటు బయటకు వచ్చిన మాగుంట మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను త్వరలో బయటపెడతానని వెల్ల్లడించారు. సన్నిహితులతో, అభిమానులతో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, సంయమనం పాటించాలని హితవు పలికారు. -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మాగుంట..
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కొనసాగుతుంటే, మరోవైపు ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పేశారు. తాజాగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేనని అధినేత వద్ద ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయమని తనను బలవంతం పెట్టొద్దని చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు మాగంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్‌ను వ్యక్తిగతంగా కలిశానని, తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మాగుంట చెప్పడం విశేషం. కాగా ఇప్పటికే అధికార పార్టీ పలు జిల్లాల్లో పార్లమెంట్ అభ్యర్థుల కోసం భూతద్దంతో అన్వేషణ సాగిస్తోంది. ముఖ్యంగా నెల రోజులుగా అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం ఆశించే స్థాయి నేత దొరక్కపోవడం, ఆయా స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. నెల రోజులుగా పార్టీలో వేగంగా సమీకరణాలు మారిన క్రమంలో నేతలు అందరూ అసెంబ్లీకే మొగ్గు చూపడంతో పార్లమెంట్‌కు అభ్యర్థి సమీప దూరాల్లో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ఆయా సామాజిక వర్గంలో నేతలు ముందుకు రాకపోవడంతో పార్టీ ముఖ్యులు తలలు పట్టుకుంటున్నారు. -
వీడని సందిగ్ధం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన నేపథ్యంలో సీఎం బంపరాఫర్ ప్రకటించినట్లు సమాచారం. ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేవారి ఖర్చు మొత్తం పార్టీ భరాయిస్తుందని ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓడిపోయే సీటులో తెలిసి తెలిసి ఎవరు పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలే పేర్కొంటుండడం గమనార్హం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మంచి ఆధిక్యతతో ఉంది. ఈ పరిస్థితిలో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గెలుపు సాధ్యమయ్యేది కాదని అధికార పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితిఉంది. దీంతో ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పార్టీనే ఖర్చు భరిస్తుందని ముఖ్యమంత్రి ఆఫర్ ప్రకటించినట్లు టీడీపీ వర్గాల్లోనే ప్రచారం ఉంది. మాగుంట పోటీ నుంచి విరమించుకున్నాక బీసీ అభ్యర్థిని పోటీలో నిలిపితే బాగుంటుందని ముఖ్యమంత్రితో పాటు జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో యాదవ సామాజికవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలపాలని ముఖ్యమంత్రి తొలుత భావించారు. ఈ విషయమై జిల్లా టీడీపీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. బీదా అభ్యర్థిత్వం పట్ల అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు బీదా కుటుంబం కొంత అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న ఒంగోలు నుంచి పోటీచేసి డబ్బులు పోగొట్టుకొని ఓడిపోవడం ఎందుకని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఖర్చు ఎంతైనా పార్టీనే పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. డబ్బులు మొత్తం పార్టీ పెట్టుకొనే పక్షంలో పోటీకి సిద్ధమని బీదా సోదరులు అంగీకారం తెలిపినట్లు తాజా సమాచారం. ఒంగోలు బరిలో మాజీ డీజీపీ..? మరోవైపు ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ డీజీపీ నండూరి సాంబశివరావును పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాంబశివరావు ఒంగోలుకు చెందిన వ్యక్తే. ఇదే జిల్లాలోనే ఆయన వివాహం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు బంధుత్వం కూడా ఉంది. సాంబశివరావును ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలిపే విషయంపై ముఖ్యమంత్రి మంగళవారం జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. బీదా, మాజీ డీజీపీలలో ఎవరైతే మెరుగ్గా ఉంటుందని సీఎం ఆరాతీశారు. ఇద్దరిలో ఎవరైనా వారి సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకొనే అవకాశముందని జిల్లా టీడీపీ నేతలు ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని, పార్లమెంట్‌కు పోటీచేసే అభ్యర్థిని ఖరారు చేస్తానని జిల్లా నేతలకు ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. -
అభ్యర్థి ఎవరో..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అభ్యర్థి కరువయ్యారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట చేతులెత్తేయడంతో ఇప్పుడు టీడీపీకి అభ్యర్థిని వెతుకు లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత ఎమ్మెల్సీ కరణం బలరాంను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ఆలోచించినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరణంను చీరాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. బీదా సోదరులు ఇందుకు అంగీకరిస్తారా.. లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రకటించింది. తానే పోటీలో ఉంటానని మాగుంట సైతం ప్రకటించారు కూడా. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట టీడీపీ అధిష్టానానికి, ఇటు జిల్లా నేతలకు తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మాగుంట ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని వీరితో కలిసి పోటీకి దిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతులో ఓటమి ఖామయని మాగుంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు ఆయన వివరించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉందని, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడం సాధ్యమయ్యేది కాదని మాగుంట భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం, జిల్లా నేతలు బుజ్జగించినా ఆయన ససేమిరా అంటున్నట్లు సమాచారం. మాగుంట పోటీకి దూరమయ్యే పక్షంలో టీడీపీకి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కనిపించడం లేదు. ఆర్థికబలం, అంగబలం ఉన్న మాగుంటే ఓడిపోతానని చెబితే మిగిలిన వారు పోటీకి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారింది. రోజు రోజుకు ఆపార్టీ పార్లమెంటు నియోజకవర్గంలో బలం పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తెలిసి పోటీ చేసి ఓటమి కొని తెచ్చుకోవడం ఎందుకని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి ప్రాంతాల నుంచి కొత్త వారిని తెచ్చి ఇక్కడ పోటీలో నిలపాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. బలరాంను చీరాలలో నిలిపేందుకు సీఎం పట్టు.. మాగుంట పోటీ నుంచి తప్పుకుంటే టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత కరణం బలరాంను ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో కరణం బలరాంను చీరాల నుంచి బరిలో దింపుతారన్న ప్రచారం జోరందుకుంది. తాము చీరాల నుంచి పోటీ చేయడం లేదని, ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలలో ఒకరిని టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలుపుతామని కరణం చెబుతున్నా.. సీఎం ఒత్తిడి తెస్తే చివరకు కరణం బలరాం పోటీలో ఉండక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరణం ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. తెరపైకి బీదా.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. బీదా మస్తాన్‌రావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గం బలంగానే ఉంది. బీసీ ఓటు బ్యాంకు ఎక్కువే. మరో వైపు ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే బీసీ అభ్యర్థి లేరు. ఒకవేళ చీరాలకు బీసీ అభ్యర్థిని కేటాయిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ఎంపిక చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ నుంచి బీసీ అభ్యర్థి లేనట్లే అవుతోంది. ఈ క్రమంలో పార్లమెంటు నుంచి బీసీ అభ్యర్థిని నిలిపి ఆ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన సోదరుడు బీదా రవిచంద్రతో బుధవారం రాత్రి అమరావతిలో అధిష్టానం చర్చలు జరిపింది. ఈ పరిస్థితిలో బీదా సోదరులు ఒంగోలు నుంచి బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. -
మాగుంట కంపెనీల్లో ఐటీ జల్లెడ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై చెన్నైలో వరుసగా మూడో రోజు ఐటీ దాడులు కొనసాగాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాతోపాటు చెన్నై, మిగిలిన ప్రాంతాల్లో మాగుంటకు చెందిన 13 బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఆదివారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు, బంగారంతో పాటు ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ల పరంగా ఉన్న ఆస్తులకు, పన్ను చెల్లింపులకు పొంతన లేనట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మాగుంటకు సంబంధించిన కొందరు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని ఐటీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. గత నెల 30న చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో రూ.11 కోట్ల హవాలా సొమ్ముతో పాటు 7 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంట్లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కొరియన్లతో పాటు ఐదుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఎమ్మెల్సీ మాగుంటకు చెందిన కీలక సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు మాగుంటకు చెందిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, కార్యాలయాలపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. హవాలా రాకెట్‌తో లింకులపై ఆరా టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డికి, హవాలా వ్యాపారులతో ఉన్న సంబంధంపై చెన్నైతో పాటు ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజంగానే హవాలా రాకెట్‌తో మాగుంటకు సంబంధాలు ఉన్నాయా..? అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే హవాలా రాకెట్‌కు సంబంధించి చాలా మంది ప్రముఖ వ్యాపార వేత్తలకు కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ మాగుంటపై రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటీ అధికారులు నోరు విప్పితే కాని వాస్తవాలు బయటకు తెలిసే అవకాశం లేదు. మాగుంటపై ఐటీ దాడులు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
మూడోరోజూ 13చోట్ల సోదాలు
సాక్షి, చెన్నై: తెలుగుదేశం పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయాలపై రెండు రోజులుగా సాగుతున్న ఐటీ సోదాలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆయన ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తి కావడంతో ఐటీ వర్గాలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాయి. అన్ని రకాల సమాచారాన్ని పకడ్బందీగా సేకరించిన అనంతరమే శుక్రవారం నుంచి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఆదివారం 13చోట్ల సోదాలు జరగ్గా, అనేక ఆస్తుల డాక్యుమెంట్లు, కీలక రికార్డులు బయటపడినట్లు సమాచారం. హవాలా కేసు విచారణతో ఐటీ కన్ను అంతకుముందు.. గత నెల 30న చెన్నైలోని ఓ హోటల్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరపగా రూ.11 కోట్ల నగదు, ఏడు కేజీల బంగారం పట్టుబడింది. హవాలా రూపంలో ఈ నగదు, బంగారం మార్పిడి జరగడం, కొరియాకు చెందిన ఇద్దరు మహిళలు అరెస్టు కావడంతో విచారణలో మాగుంట సంస్థల వ్యవహారం వెలుగుచూసింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తి కావడంతో, అన్ని వివరాలు సేకరించిన అనంతరం ఐటీ శాఖ రంగంలోకి దిగింది. హవాలా కేసు విచారణ కొనసాగింపులో భాగంగా శుక్రవారం నుంచి మాగుంట సంస్థలు, కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి. రెండు రోజుల్లో పదిచోట్ల సోదాలు జరగగా.. ఆదివారం 13చోట్ల నిర్వహించారు. అలాగే, ఫ్యాక్టరీలో లభించిన రూ.55 కోట్ల నగదుపై ఆదివారం ఆరా తీశారు. ఈ తనిఖీల్లో పెద్దఎత్తున అనేక ఆస్తులు, నగలు లావాదేవీల వ్యవహారాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులకు లభించినట్లు సమాచారం. కాగా, పట్టుబడ్డ నగదు, రికార్డులు, ఇతర ఆస్తుల డాక్యుమెంట్లకు సంబంధించిన అన్ని వివరాలను రికార్డు చేసి, ఫైనాన్స్ అధికారి వాంగ్మూలం, సంతకం తీసుకుని, విచారణను ఐటీ వర్గాలు ముగించాయి. ఇప్పటివరకు లభించిన ఆధారాలను పరిశీలించాకే ఐటీ శాఖ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. -
మాగుంటపై ఐటీ కొరడా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఐటీ పంజా విసిరింది. చెన్నైలోని మాగుంటకు చెందిన పలు కంపెనీలు, వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఒకేసారిగా అధికారులు మూకుమ్మడి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.55 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు పలు కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల చెన్నైలో బంగారం హవాలా రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు విచారణ జరపగా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయట పడినట్లు తెలుస్తోంది. ఆ విచారణ ఆధారంగా ఐటీ అధికారులు చెన్నై ప్రాంతంలో దాదాపు 40 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు. రెండు రోజలుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ మాగుంట కంపెనీలపైన ఐటీ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయాన్నే ఐటీ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి చెన్నై నగర శివార్లలోని పూందమల్లి ప్రాంతంలో ఉన్న మాగుంటకు చెందిన బాలాజీ డిస్టిలరీ కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.55 కోట్ల నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మిగిలిన అధికారుల బృందం టీ నగర్లో ఉన్న మాగుంట ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి వరకు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులకు దిగడంతో నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాల్లో అలజడి రేగింది. మాగుంట అనుచరులతో పాటు ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో వారు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి చెన్నైలోని మాగుంట కంపెనీలు, కార్యాలయాలపైనే ఐటీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంబేలెత్తుతున్న అధికార పార్టీ నేతలు : ఇటీవలే జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీ ఫుడ్స్, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కంపెనీలపైనా ఐటీ పెద్ద ఎత్తున దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంత నగదుతో పాటు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంతలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ఎమ్మెల్సీ మాగుంటపైన ఐటీ దాడులకు దిగడంతో తెలుగుదేశం ముఖ్యనేతలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో అధికార పార్టీలో చాలా మంది నేతలు గ్రానైట్‌తో పాటు సీఫుడ్స్ వ్యాపారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విదేశీ ఎగుమతులతో కోట్లాది రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు నగదుతో పాటు వ్యాపారలావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను రహస్య ప్రదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. -
మాగుంట కంపెనీల్లో మూడో రోజూ ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బాలాజీ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలతో పాటు 13 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని మాగుంట గ్రూపు సంస్థల వ్యాపార లావాదేవీలన్నీ చెన్నై బజుల్లా రోడ్డులోని ప్రధాన కార్యాయం ద్వారానే సాగుతుంటాయి. ప్రధాన కార్యాలయంతో పాటు చెన్నై శివారు పూందమల్లిలోని డిస్టిలరీ ఫ్యాక్టరీల్లో అవినీతి నిరోధకశాఖ చేపట్టిన తనిఖీల్లో అత్యంత విలువైన డాక్యుమెంట్లు, డిస్టిలరీ ఫ్యాక్టరీలో శనివారం రూ.40 కోట్లు పట్టుబడ్డాయి. అనధికారిక సమాచారం ప్రకారం రూ.55 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 30వ తేదీన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చెన్నైలోని ఒక స్టార్ హోటల్‌పై నిఘాపెట్టి భారీ స్థాయిలో 7 కిలోల విదేశీ బంగారు బిస్కెట్లు, రూ.16 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా దీంతో సంబంధం ఉన్న కొరియా దేశానికి చెందిన ఇద్దరు యువతులను, చెన్నైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్ట్ చేశారు. వాటికి కొనసాగింపుగానే మాగుంట కార్యాలయంపై దాడులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. (మాగుంటపై ఐటీ కొరడా) -
మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ దాడులు
సాక్షి, చెన్నై : నగరంలోని మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీనగర్‌లోని కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు తనఖీలు జరిపారు. సవేరా హోటల్లో భారీగా నగదు, బంగారం లభ్యమైంది. ఇందుకు అనుగుణంగా అధికారులు తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు లెక్కకురాని 55 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. -
నేను చెప్పిన అభ్యర్ధికి టిక్కెట్ ఇస్తేనే ..
ఒంగోలు / పొన్నలూరు: అధికార పార్టీ నేతల మధ్య ఆసక్తికర సంవా దానికి సంగమేశ్వరుని ఆలయం సాక్షిగా నిలిచింది. విమర్శలు, ప్రతి విమర్శలకు చెన్నినపాడు గ్రామం వేదికగా మారింది. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పరస్పరం పరోక్ష ఆరోపణలు చేసుకున్నారు. ఛలోక్తులు విసురుకున్నారు. కొండపి మండలంలోని చెన్నిపాడు సంగమేశ్వరం ఆలయంలో స్థానికఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకుడు దామచర్ల సత్యనారాయణల ఆధ్వర్యంలో శనివారం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు టీడీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తాను చెప్పిన అభ్యరి టిక్కెట్ ఇస్తేనే ఒంగోలు ఎంపీగా పోటా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పలేదన్నారు. అంతకు ముందు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టీడీపీలో ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి తాము కృషి చేశామన్నారు. నామినేషన్లో జరిగిన తప్పిదం వలన 2009లో ఎమ్మెల్యే కాలేకపోయానని, మళ్లీ ప్రజల ఆశీస్సులతో 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారు, పార్టీలో చేరి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పుకుంటున్న వారు కార్యకర్తల్లో ఆందోళన సృష్టిస్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్సీ మాగుంటని, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. వెంటనే దీనికి స్పందించిన మాగుంట తాను ఏ రోజూ పలాన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వమని, పలాన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వొద్దని చెప్పలేదన్నారు. పార్టీలో ఎప్పుడు చేరినా ఆ పార్టీ అభివృద్ధి కోసమే పని చేస్తున్నామని బిగ్గరగా చెప్పారు. సంగమేశ్వరం ఆలయ ఆవరణంలో ఉండి చెబుతున్నాను జిల్లాలో ఏ ఎమ్మెల్యేను కూడా మార్చమని తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పలేదని బాబురావుకు సమాధానంగా చెప్పారు. అనంతరం కరణం బలరాం మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నాయకులం అయినప్పటికీ ఎమ్మెల్సీలుగా పిలిపించుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. వన భోజనాల పేరుతో ఇటువంటి కార్యక్రమం పెట్టి నాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదర్చడం మంచిదని సూచించారు. ఈ సభతో స్వామి కార్యం, స్వకార్యం రెండు జరిగాయని పరోక్షంగా ఎమ్మెల్యే డోలాను ఉద్దేశించి ఛలోక్తి విసిరారు. కనిగిరి ఎమ్మెల్యే బాబురావు టిక్కెట్ వ్యవహరంలో కొంత అయోమయంలో ఉన్నాడని, ఇబ్బందులు ఉన్నా పార్టీ కోసం అన్ని పరిస్థితులను నెట్టుకొని ముందుకు పోవాలని సూచించారు. టీడీపీ నేతల మధ్య నెలకొన్ని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. -
పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో ముఠా పోరు తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమ ప్రకాశంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇప్పుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టార్గెట్‌గా మారారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలోని పలు నియోజకవర్గాల అభ్యర్థులను మారిస్తేనే పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేస్తానని ఎమ్మెల్సీ మాగుంట ముఖ్యమంత్రి చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, కొండపి తదితర నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని మాగుంట సూచించినట్లు సమాచారం. అలా అయితేనే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వగలమని మాగుంట అధినేతకు వివరించినట్లు తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా ఇప్పటికిప్పుడు అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టాలని కూడా మాగుంట ఒత్తిడి పెంచినట్లు ప్రచారం సాగింది. ఇందుకు ముఖ్యమంత్రి సైతం అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీని ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు సైతం అధికార పార్టీ నేతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి మాగుంట మినహా అభ్యర్థి కనిపించలేదు. మాగుంటను ఒప్పించి ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించాలనేది సీఎం నిర్ణయంగా తెలుస్తోంది. ఇదే అదునుగా ఎమ్మెల్సీ మాగుంట తన సొంత ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం మాగుంట ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసే అవకాశం అధికంగా ఉంది. మాగుంటపై సిట్టింగ్‌ల గరం..గరం మాగుంట ప్రతిపాదన పశ్చిమ ప్రకాశం పరిధిలోని అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు మింగుడు పడడం లేదు. వారంతా ఆయనపై గరం..గరంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మాగుంటతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మాగుంట ప్రతిపాదనలకు సీఎం ఓకే చెప్పే పక్షంలో అందుకు వ్యతిరేకంగా పనిచేయాలని సిట్టింగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాగుంట ప్రతిపాదనలు అధిష్టానం వద్ద తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మరి కొందరు నేతలు మాగుంట ప్రతిపాదనలపై మండిపడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన టీడీపీ అభివృద్ధి కోసం పనిచేయాలేదన్నది పలువురు అధికార పార్టీ ముఖ్యనేతల వాదన. మాగుంట ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుందని ఓ ఎమ్మెల్యే మాగుంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మాగుంట సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వాన్ని వాడుకున్నారని, తద్వారా వేల కోట్లలో లబ్ధి పొందారని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సరైన వ్యక్తి లేకపోవడంతో ముఖ్యమంత్రి మాగుంటను బుజ్జగిస్తున్నారని, అదే అవకాశంగా మాగుంట సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే మాగుంటకు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు చేపట్టిందని, దీని వల్ల మాగుంటకు వందల కోట్లలో లాభం చేకూరిందని వారు పేర్కొంటున్నారు. దీంతో పాటు మాగుంట సంస్థలకు సంబంధించిన విలువైన భూములను ప్రభుత్వం ద్వారా పొందినట్లు కూడా అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఎమ్మెల్సీ ప్రొటోకాల్ ఇచ్చినా మాగుంట క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను ముందుకు నడిపించలేదని, పాత క్యాడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి వెళ్లి పోయారని, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అనంతరం మౌనం దాల్చకుండా మాగుంట మొదటి నుంచి క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలిచి ఉంటే పశ్చిమ ప్రకాశంలోనూ టీడీపీ కొంతమేర నిలదొక్కుకుని ఉండేదని సదరు నేత విశ్లేషించారు. క్యాడర్‌ను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాగుంట సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇచ్చారన్నది పలువురు అధికార పార్టీ నేతల వాదన. ఈనెల 15న సీఎం రివ్యూ : ఈనెల 15న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే రోజు సాయంత్రం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పై స్థానిక ఏ1 కన్వెన్షన్ సెంటర్లో రివ్యూ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మాగుంట ప్రతిపాదనలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే మాగుంట ప్రతిపాదనలకు అధికార పార్టీ సిట్టింగ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. -
షరతుల చిచ్చు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యవహారం జిల్లా టీడీపీలో చిచ్చు రేపింది. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే యర్రగొండపాలెం, కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మార్కాపురం ఇన్చార్జిని తప్పించాల్సిందేనని ఆయన సీఎం వద్ద పంచాయితీ పెట్టారు. మాగుంట ప్రతిపాదనకు సీఎం సైతం ఓకే చెప్పారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పునకు కసరత్తు మొదలైంది. దీంతో ఎమ్మెల్సీ మాగుంటపై బాధిత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు నియోజకవర్గ ఇన్చార్జులు మండిపడుతున్నారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేధాలను మరింత పెంచింది. మాగుంటకు బాబు బుజ్జగింపు.. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే అధికార టీడీపీ వెనుకబడిపోయింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓటమి చెందారు. పశ్చిమ ప్రకాశంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆదరణ ఉంది. అన్ని వర్గాలు ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందకు రాని పరిస్థితి. దీంతో తిరిగి మాగుంటను పోటీ చేయిస్తే కొంతమేరైనా పోటీ ఇస్తాడని సీఎం భావించారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ మాగుంటను సీఎం బుజ్జగించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని, తాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని మాగుంటకు హామీ ఇచ్చారు. సీఎం ఒత్తిడితో మాగుంట అంగీకారం తెలిపినట్లు సమాచారం. షరతులకు సీఎం అంగీకారం.. తాను పోటీ చేయాలంటే పార్లమెంటు పరిధిలో టీడీపీలో భారీ మార్పులు చేయాలని మాగుంట సీఎం వద్ద ఆంక్షలు పెట్టారు. ప్రధానంగా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, యర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్‌రాజులను మార్చి కొత్త అభ్యర్థులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని షరతు పెట్టారు. కనిగిరి నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వాలంటూ మాగుంట కండిషన్ పెట్టారు. ఇక యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఓ ఐఏఎస్ అధికారిని తానే తీసుకొచ్చి పోటీకి నిలుపుతానని మాగుంట చెప్పినట్లు సమాచారం. ఇక మార్కాపురం ఇన్చార్జిగా ఉన్న కందుల నారాయణరెడ్డికి కాకుండా వేరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని మాగుంట డిమాండ్ చేశారు. దర్శి నియోజకవర్గం నుంచి కూడా మంత్రి శిద్దా రాఘవరావును తప్పించే పక్షంలో ఎమ్మెల్సీ కరణం బలరాం కుటుంబానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి పోటీ చేయించాలని సూచించినట్లు సమాచారం. మాగుంట షరతులకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మార్పు చేర్పులకు కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కొత్త అభ్యర్థుల విజయానికి సహకరించాలని, మీకు తగిన న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కనిగిరి, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలతో పాటు మార్కాపురం ఇన్చార్జి కందుల నారాయణరెడ్డికి కూడా చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్సీపై ఫైర్.. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు ఇవ్వవద్దంటూ ముఖ్యమంత్రికి చెప్పడంపై కనిగిరి, వై.పాలెం ఎమ్మెల్యేలె బాబూరావు, డేవిడ్‌రాజు, మార్కాపురం ఇన్చార్జ్ కందుల నారాయరెడ్డిలు మాగుంటపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తమను తప్పించడమేమిటంటూ వారు మంత్రి శిద్దా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. తమను కాదని వేరొకరికి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని వారు రాష్ట్ర స్థాయి టీడీపీ ముఖ్య నేతలకు సైతం తేల్చి చెప్పారు. తనకు టికెట్ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆరు నూరైనా తానే వచ్చే ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేస్తానని బాబూరావు ఇప్పటికే సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది. కాదూ కూడదని కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపితే తాను వ్యతిరేకంగా పనిచేస్తానంటూ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇక డేవిడ్ రాజు సైతం వచ్చే ఎన్నికల్లో యర్రగొండపాలెం కాకపోయినా జిల్లాలో వేరొక చోటైనా తనకు టిక్కెట్ ఇస్తేనే పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తానని, అలా కాకుండా తనను వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పిస్తే యర్రగొండపాలెం, సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మార్కాపురం నియోజకవర్గంలో ఇన్నాళ్లూ పార్టీకోసం పనిచేసిన తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వాలనుకోవడంపై కందుల నారాయణరెడ్డి మండిపడుతున్నట్లు సమాచారం. మాగుంట ఒత్తిడితోనే టీడీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పుకు సిద్ధపడిందన్న ప్రచారం నేపథ్యంలో బాధిత నేతలు అధిష్టానంతో పాటు మాగుంట పైనా రగిలిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో గ్రూపుల గోలతో సతమతమవుతున్న టీడీపీని మాగుంట తాజా డిమాండ్ల వ్యవహారం మరింత ఇరకాటంలోకి నెట్టింది. -
మాగుంట నిరసన గళం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:‘ఉపయోగ పెట్టుకుంటే ఉపయోగపడతాం..లేకపోతే లేదు..’ నిన్న మొన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనుచరుల మాట ఇది. మాగుంట సైతం అంతర్గతంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ఇప్పుడు మాట మారింది. స్వరం పెరిగింది. అధికార పార్టీలో ఎవరు సంతృప్తిగా ఉన్నారో చెప్పాలంటూ మాగుంట ఏకంగా టీడీపీ జిల్లా మహానాడులోనే ప్రశ్నించారు. ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాగుంట వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి. మాగుంట పార్టీని వీడతారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు జిల్లా టీడీపీ నేతలు మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాగుంటను కరివేపాకు చందంగా చూశారు. ఇది మాగుంటతోపాటు ఆయన అనుచర వర్గం, అభిమానులు జీర్ణించు కోలేకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే పోరాటంలో భాగంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన ఐదుగురు పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సైతం పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదించాలని ఎంపీలు పట్టుబడుతున్నారు. రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు జరిగే అవకాశముందన్న ప్రచారమూ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఉప ఎన్నికలు జరిగే అవకాశముందని ఇదివరకే ప్రకటించారు. ఉప ఎన్నికలు వచ్చే పక్షంలో టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తిరిగి మాగుంట శ్రీనివాసులరెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అసంతృప్తితో ఉన్న మాగుంట ఉప ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ముఖ్యమంత్రి మాగుంటను పిలిచి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు మాగుంట ససేమిరా అన్నట్లు సమాచారం. వేరెవరినైనా పోటీలో నిలిపితే తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. నీవే పోటీలో ఉండాలంటూ సీఎం మాగుంటపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పేరుకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నా టీడీపీ జిల్లా నేతలు మాగుంటకు పెద్దగా విలువ ఇవ్వలేదు. ఎమ్మెల్సీగా ఉన్న మాగుంటకు మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా టీడీపీ ముఖ్య నేతలకు సైతం చెప్పారు. మంత్రి పదవి వచ్చేసినట్లేనని మాగుంటతో పాటు ఆయన అనుచరవర్గం ఆనందపడింది.తీరా చూస్తే మాగుంటకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి రాకుండా జిల్లా టీడీపీ అధ్యక్షుడితోపాటు ఆ వర్గం నేతలు అడ్డుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో మాగుంటతో పాటు ఆయన అనుచరవర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. అధికార పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మాగుంటకు మొక్కుబడి పిలుపుతో సరిపెడుతున్నారు. ఆయనకు నేతలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం సైతం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పనులు జరగకపోవడంతో మాగుంట వద్దకు కార్యకర్తలు వెళ్లే పరిస్థితి లేదు. ఒకప్పుడు కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడిన మాగుంట కార్యాలయం ఇప్పుడు జనం లేక వెలవెలపోతోంది. ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశాలకు సైతం మాగుంటను పెద్దగా పిలుస్తున్న పరిస్థితి లేదని తెలుస్తోంది. మాగుంట టీడీపీకి కొత్తకాపు కావడంతో ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. మాగుంట జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలను కానీ, పార్టీ అధిష్టానాన్ని కానీ ఇప్పటి వరకూ ఒక్క మాట అనలేదు. కానీ ఇప్పుడు గళం విప్పారు. టీడీపీలో ఎవరూ సంతృప్తిగా లేరని తేల్చి చెప్పారు. అదికూడా సాక్షాత్తు జిల్లా మహానాడులో నేతలు, కార్యకర్తల ముందే విమర్శ చేయడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్. వివాద రహితుడైన మాగుంట ఏకంగా మహానాడులోనే పార్టీపై విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన అధికార పార్టీని వీడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. -
ముప్పేట దాడి
శుక్రవారం జరిగిన జెడ్పీ సమావేశం గరంగరంగా సాగింది. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్ ) అధికారుల తీరుపై ముప్పేట దాడి జరిగింది. ప్రొటోకాల్ వివాదం వేడెక్కించింది. నలుగురు ఎంపీడీవోలపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ మంత్రి శిద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు: గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం( ఆర్‌డబ్ల్యుయస్ ) అధికారుల తీరుపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముప్పేట దాడి జరిగింది. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు డోలాశ్రీ బాలావీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2010 నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్ట పరిహారం రూ.35 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలంటూ వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణను గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి నిలదీశారు. కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ దళారుల దెబ్బకు లారీ వరి గడ్డిని రూ.25 నుంచి రూ.30 వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పశుసంవర్థకశాఖ చొరవ తీసుకొని గడ్డిని రవాణా చేయించగలిగితే పశుపోషకులకు ఉపయోగంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. పొదిలి ప్రాంతంలో పశువులను బలవంతంగా సంతలకు తరలిస్తున్నారంటూ పొదిలి ఎంపీపీ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఒక తీర్మానం చేసి కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, దానిపై తీర్మానం చేయాలంటూ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సభ దృష్టికి తీసుకువెళ్లగా జెడ్పీ చైర్మన్‌తోపాటు సభ్యులు అంగీకరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి డబ్బులు పుష్కలంగా ఉన్నా సమస్య ఏమిటో చెప్పాలంటూ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్డబ్ల్య్యుస్ అధికారులను నిలదీశారు. పథకాలు బాగుపడేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో చెప్పండి...నిధులు నేను తెప్పిస్తా అంతే గాని మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే మాత్రం సహించేదిలేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదనలు తయారుచేసి పంపామని, జెడ్పీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు చెప్పడంతో జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ జోక్యం చేసుకొని నిధులన్నీ ఒకే పథకానికి ఖర్చుచేస్తే మిగితా అభివృద్ధి పనులు కుంటుపడతాయని, దాంతోపాటు బోర్లు వేస్తే తప్పనిసరిగా నీరు పడుతుందో లేదో అనే అనుమానంతో ఆపినట్లు ప్రకటించారు. నలుగురు ఎంపీడీవోలపై విచారణ ఉలవపాడు, త్రిపురాంతకం, తర్లుబాడు, కొనకనమిట్ల ఎంపీడీవోలు అవినీతికి పాల్పడుతున్నారని చర్యలు చేపట్టాలంటూ జడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పాసుపుస్తకానికి వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు, చివరకు జెడ్పీటీసీ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనానికి, ట్రావెల్ అలవెన్స్‌లకు వాటా అడుగుతున్నారంటూ ధజమెత్తారు. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకొని తక్షణమే ఉలవపాడు ఎంపీడీవోను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. ఆర్డీవో స్థాయి అధికారితో విచారణకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావు, కదిరి బాబూరావులు హాజరుకాగా వేదికపై చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ సుజాతాశర్మ, జేసీ హరిజవహర్‌లాల్, సీఈవో ఎ.ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరసింహారావు, ఏవో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాగుంటకు సన్మానం ఒంగోలు: స్థానిక సంస్థల ప్రతినిధిగా ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ, కంచర్ల శ్రీకాంత్‌చౌదరి, జెడ్పీ సీఈవో ప్రసాద్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రతినిధిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. -
ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికలలో మాగుంట గెలుపు
ప్రకాశం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి మాగుంట శ్రీవాసులురెడ్డి విజయం సాధించారు. 711 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా మాగుంట ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అట్ల చినవెంకటరెడ్డికి 13 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చెల్లని ఓట్లు 17 అని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను వైఎస్ఆర్సీపీ బహిష్కరించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైన మెజారిటీ లేకపోయినా పోటీకి దిగిన టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఎంపీటీసీలతో ఇతర రాష్ట్రాల్లో క్యాంపు నిర్వహించడం, దీనిపై అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఓటింగ్ ఏకపక్షంగా మారినట్లు తెలుస్తోంది. -
నా భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు
-
నా భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ వెంకట్రావు భార్య మేరీ నా భర్తని టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డితోపాటు ఇతర నేతలు ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారు. నా భర్తను ఏమి చేస్తారోనని భయం వేస్తోంది. -ఇనమనమెళ్ళూరు ఎంపీటీసీ యాదాల వెంకట్రావు భార్య మేరీ ఒంగోలు అర్బన్: తన భర్తని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డితోపాటు ఇతర నేతలు ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెళ్ళూరు ఎంపీటీసీ సభ్యుడు యాదాల వెంకట్రావు భార్య మేరీ ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దివంగత నేత వైఎస్ పుణ్యంతో తమ బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయని, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీకి కట్టుబడి ఉండాలని తన భర్త ఎప్పుడూ చెబుతుండేవారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తమ కుమార్తెను తీసుకుని శుక్రవారం హైదరాబాద్ ఆసుపత్రికి బయలుదేరాడని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని చెప్పారు. వారెక్కడున్నారో తెలియక ఆందోళన చెందుతున్న తాను... వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీ నేతలు నెల్లూరులో దాచి ఉంచారన్న వార్తలు టీవీల్లో చూసి పార్టీ నేతలను కలవడానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు. తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని, తన భర్తను ఏమి చేస్తారోనని భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. -
మాగుంటను అనర్హుడిగా ప్రకటించాలి
ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ హామీ సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల నుంచి ఏపీ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాక, వారితో శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని తక్షణం అనర్హుడుగా ప్రకటించాలని, ఆ పార్టీ అధ్యక్షుడిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు మంగళవారం సచివాలయంలో ఉభయ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌ను కలుసుకుని ఆ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి 496 మంది, టీడీపీకి 472 మంది ఎంపీటీసీలున్నారు. దీన్నిబట్టి వైఎస్సార్సీపీ అభ్యర్థే గెలుపొందడం ఖాయమని తేలిపోవడంతో 35 మందికి రూ.2.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి శ్రీనివాసులురెడ్డి ప్రలోభపెట్టారని తెలిపారు. మొదట రూ.50 వేలు చొప్పున అడ్వాన్సుగా చెల్లించి ప్రలోభపెట్టి నెల్లూరు శిబిరానికి తరలించుకు వెళ్లారని చెప్పారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, అక్రమంగా శిబిరాల నిర్వహణకు కారణమైన మాగుంటను అనర్హుడుగా ప్రకటించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తమకు టీడీపీ అభ్యర్థి కొంత డబ్బు అడ్వాన్సుగా చెల్లించారని స్వయంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు మీడియాకు చెప్పిన దృశ్యాల సీడీని కూడా అందించారు. ఫిర్యాదుపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశిస్తానని భన్వర్‌లాల్ వారికి హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు భ్రష్టు పట్టాయని, జాతీయస్థాయిలో అందరి దృష్టీ ఇక్కడే ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సీఈఓను కలిసిన అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ప్రకాశంలో ప్రలోభాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి'
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుతంత్రాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కైవశం చేసుకునేందుకు ఎంటీసీల కొనుగోలుకు టీడీపీ ప్రయత్నించడంపై ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్ లాల్ కు వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడిన టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు ఒక్కో ఎంపీటీసీకి రూ.30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న టీడీపీ ముందస్తుగా రూ.50 వేలు ముట్టజెప్పారు. ఎంపీటీసీలను నెల్లూరులోని ఓహోటల్ లో దాచిపెట్టారు. ఈ కుట్రను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం బట్టబయలు చేయడంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. -
'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి'
-
రాజకీయాల్లో అరుదైన వ్యక్తి పోతుల
టంగుటూరు: రాజకీయాల్లో అరుదైన వ్యక్తి జెడ్పీ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య అని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. పోతుల చెంచయ్య 18వ వర్ధంతి సందర్భంగా స్థానిక పోతుల చెంచయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో గురువారం ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. పోతుల చెంచయ్య తనయుడు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మాగుంట ముఖ్య అతిథిగా మాట్లాడారు. 60 ఏళ్లకుపైగా సుదీర్ఘకాలం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా మచ్చలేని నాయకునిగా మిగలడం పోతులకే చెల్లిందన్నారు. ఆయనతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని అన్నారు. చివరకు తన అన్న సుబ్బరామిరెడ్డిపై కాల్పులు జరిగిన సమయంలోనూ ఆయన వద్దనే పోతుల ఉన్నారని గుర్తుచేశారు. ఆయన మా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారన్నారు. వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విసృ్తతం చేయాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి ఆరేటి కోటయ్య మాట్లాడుతూ పట్టుదలకు మారుపేరు చెంచయ్య అన్నారు. ఆయన కృషి ఫలితంగానే టంగుటూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, టీటీడీ కల్యాణ మండపం ఏర్పాటైందన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎదిగిన పోతుల ఎందరికో ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. తాను పోతుల అండతోనే రాజకీయాల్లో ఎదగగలిగానని అన్నారు. టుబాకో బోర్డు డెరైక్టర్ రావూరి అయ్యవారయ్య మాట్లాడుతూ ఏదైనా పనిమీద చెంచయ్య వద్దకు వెళ్తే..రెండో రోజు ఆయనే ఆ పని ఏమైందని మమ్మల్నే అడిగేవారని..అప్పటికీ కాకుంటే వెంటబెట్టుకుని సంబంధిత అధికారి దగ్గరకు తీసుకెళ్లి మరీ పని పూర్తి చేయించేవారన్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ తన తండ్రి పేరున సేవా కార్యక్రమాలు చేసేందుకు పోతుల చెంచయ్య ఫౌండేషన్‌ను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కరపత్రాలను సభలోనే ఆవిష్కరించారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రి ప్రతినిధి భాస్కరరెడ్డి మాట్లాడుతూ జబ్బులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో చెన్నై గ్లోబల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు, ఎన్టీఆర్ వైద్య సేవాపథకం కోఆర్డినేటర్ సతీష్‌రెడ్డి, డీవోఎం సంతోషి, కందుకూరు కోటారెడ్డి, ఒంగోలు రిమ్స్, అమృత ఆస్పత్రి వైద్యనిపుణులు, ఇతర వైద్యులు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల నరసింహారావు, మండలంలోని అన్ని గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
మాగుంట నిర్వేదం
సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది. మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది. రాజ్యసభ పదవికి ప్రయత్నాలు.. పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు. నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. -
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు
సాక్షి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వై.వి. సుబ్బారెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిపై 15,095 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా 12 నియోజకవర్గాల్లో ఆరుచోట్ల పార్టీజెండా రెపరెపలాడింది. బాపట్ల ఎంపీగా టీడీపీ అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి 32,301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం నుంచి పాలపర్తి డేవిడ్‌రాజ్, మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్, కందుకూరు నుంచి పోతుల రామారావు వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. టీడీపీ ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొంది రెండో స్థానానికి చేరగా, చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విజేతగా నిలిచారు. మున్సిపల్, జిల్లాపరిషత్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాన ప్రకాశించిన వైఎస్సార్ సీపీ... ఒంగోలు సమీపంలో ఉన్న మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో 12 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగిసింది. తొలుత పోస్టల్‌బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించారు. జిల్లాలో పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టంకట్టాయి. యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చింది. యర్రగొండపాలెంలో మొత్తం 16 రౌండ్లు లెక్కింపు ముగిసే సమయానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజు తన సమీప టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావుపై 19,150 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డికి సైతం భారీ ఓట్ల మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి 18 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి 12,893 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇక్కడ ఆయన తొలిరౌండ్ నుంచి సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై ఆధిపత్యం కనబరిచారు. మార్కాపురంలో జంకె వెంకటరెడ్డి ..టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై 9,802 మెజార్టీతో విజయం సాధించారు. అద్దంకి నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్‌కు 4072 ఓట్ల ఆధిక్యతనిచ్చి.. అక్కడ టీడీపీ అభ్యర్థి కరణం వెంకటేష్, అతని తండ్రి బలరాంకృష్ణమూర్తి హవాకు ఓటర్లు చెక్‌పెట్టారు. సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్...టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్‌పై 1,276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కందుకూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో కొనసాగగా.. టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల రామారావు 3,820 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కందుకూరు కౌంటింగ్ మొదటి 11 రౌండ్ల వరకు టీడీపీ ఆధిక్యతలో ఉన్నప్పటికీ.. 12వ రౌండ్ నుంచి ఓట్ల మెజార్టీ పోతుల రామారావు వైపు మొగ్గు చూపడం రసవత్తరమైన పోరుగా నిలిచింది. గెలిచి ఓడిన టీడీపీ.. ఆది నుంచి జిల్లాలో 12 నియోజకవర్గాలకు 11కి మించకుండా తామే కైవసం చేసుకుంటున్నామని విపరీత ప్రచారం చేసుకున్న టీడీపీ నేతలకు.. కౌంటింగ్ ఫలితాల సరళితో గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. 5 స్థానాల్లో మాత్రమే బలం చాటుకుని ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు మెజార్టీ బొటాబొటీగానే దక్కడం గమనార్హం. దర్శి నియోజకవర్గం కౌంటింగ్ ప్రారంభం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డికి ఓట్ల వెల్లువ సాగగా ఏడో రౌండ్ నుంచి టీడీపీ ఆధిక్యతలోకొచ్చింది. 18 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 1,374 మెజార్టీని తెచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థి శిద్దా రాఘవరావు విజయం సాధించారు. కొండపిలో టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి ఐదు వేల మెజార్టీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావుపై గెలుపొందారు. పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 19 రౌండ్లు ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై 10,335 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు మాత్రం 14,580 ఓట్ల ఆధిక్యత రావడం.. వరుసగా నాలుగుసార్లు గెలుపొందుతూ వ చ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటమిని చవిచూపింది. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగానే ‘ఆటో’ గుర్తుపై 10,335 ఓట్ల మెజార్టీతో మరోమారు గెలుపొందారు. జిల్లా ప్రధాన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం ఓట్ల లెక్కింపు ప్రశాంతంగానూ, వేగవంతంగానూ ముగిసింది. -
మాగుంటకు..యమ తంటా!
మాగుంట ఎంపీగా ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులే అయినా, తెలుగుదేశం కార్యకర్తలకు నాయకుడిగా అనుబంధం లేదు. నామినేషన్లు వేయడానికి మరో రెండు రోజుల సమయం ఉండగా, మాగుంట టీడీపీలో చేరారు. అప్పటి వరకు ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయనకు స్పష్టత లేదు. టీడీపీ ఒక దశలో ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని అనుకున్న విషయం తెలిసిందే. దీంతో మాగుంట టీడీపీలో చేరాలా, బీజేపీలో చేరాలా అని చివరి పది రోజులు మదనపడ్డారు. చివరకు తెలుగుదేశంలో చే రి ఆ పార్టీ టికెట్టు సంపాదించారు. అకస్మాత్తుగా ఊడిపడిన నాయకుడు కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆయనకు దగ్గర కాలేకపోతున్నారు. దీంతో పాటు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, సీనియర్ నేత కరణం బలరాం లాంటి నేతలు ఆయనకు ప్రచారంలో సహకరించడం లేదని తెలుస్తోంది. గెలుపుపై తక్కువ ఆశలున్న దామచర్ల జనార్దన్ తనకు తానే ప్రచారం చేసుకోవడం లేదు. మాగుంటకు ప్రచారం చేయడం వల్ల తనకు వచ్చే లాభమేమిటని అనుకుంటున్న ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి మాగుంటతో వచ్చిన ఆయన సన్నిహిత వర్గం ఎన్నికల ప్రచారం చేస్తూ ‘మాగుంటకు ఓటెయ్యండి కాంగ్రెస్‌ను గెలిపించండి’ అని ప్రచారం చేసి నాలుక కరుచుకుంటున్నారు. ఇటీవల మాగుంట కొండపి నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వెళ్లగా ఆయన వెంట, అక్కడి టీడీపీ నాయకులు ఆశించినంత మంది రాకపోవడంతో విసుగు ప్రదర్శించినట్లు తెలిసింది. మాగుంటతో గతంలో అనుబంధం ఉన్న చిన్న కార్యకర్తలు మినహా, పెద్ద నాయకులు రాకపోవడం ఆయన్ను ఆవేదనకు గురిచేసింది. కనిగిరి నియోజకవర్గం పామూరులో చేసిన ప్రచారంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. మాగుంట సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు మినహా, మిగిలిన వారు ఆయనతో కలసి ప్రచారం చేయలేదు. తెలుగుదేశం నేతలను నమ్ముకుంటే కష్టమని భావిస్తున్న మాగుంట, తన వదిన పార్వతమ్మతోపాటు, కుటుంబ సభ్యులను ప్రచారానికి సహకరించాలని కోరుతున్నట్లు తెలిసింది. -
మాగుంట కుటుంబానికి ‘బాబు’ ఎర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు మహిళలకు ఇస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ సీటును కూడా కాంగ్రెస్ నుంచి వలస తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఆ సీటును మాగుంట కుటుంబ సభ్యులకు కేటాయించే వాతావరణం కనిపిస్తోంది. ధనబలం వున్న వారి కోసం వలలు విసిరి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబునాయుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట పార్వతమ్మను పార్టీలోకి తీసుకురావడానికి తెర చాటుమంతనాల వేగం పెంచారు. ఇందులో భాగంగానే తమ దారెటో నిర్ణయించుకోవడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయంలో ఆదివారం మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి తట్టుకోవాలంటే వందలు, వేల కోట్లున్న ధనవంతులను పోటీకి దించడమే ఏకైక మార్గంగా టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికి వారు కోరిన సీట్లు కేటాయించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్నా అవసరమైతే అలాంటి వారినే వదులుకుని కొత్త వారికి టికెట్లు ఇచ్చేలా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం చూపగల మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా తమ వైపునకు లాక్కోవడానికి తమ పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఆయన వదిన పార్వతమ్మను పార్టీలోకి రావాలంటూ వారి మీద ఒత్తిడి పెంచుతున్నారు. శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ, పార్వతమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చంద్రబాబు తన సన్నిహిత నాయకుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయించడం ద్వారా ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ధన సహాయం అందించి ఎన్నికల్లో వెయ్యి రూపాయల నోట్లు పారించే ఎత్తుగడకు తెర లేపారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్వతమ్మను పోటీ చేయించి అక్కడ కూడా విరివిగా ధన ప్రవాహం పారించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉదయగిరి పార్టీ ఇన్చార్జిగా ఉన్న బొల్లినేని రామారావు పార్టీ హై కమాండ్ సూచించినంత డబ్బు ఖర్చు పెట్టే ధైర్యం చేయలేక వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డి తన మద్దతు దారుడు ఒంటేరు వేణుగోపాలరెడ్డికి ఆ టికెట్ ఇప్పించే ప్రయత్నాలకు తెర లేపారు. అయితే చంద్రబాబు మాత్రం పార్వతమ్మను ఇక్కడి నుంచి పోటీచేయించే ఆలోచన చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను ఒప్పించో, టికెట్లు ఎర వేసో తమ పార్టీలోకి లాక్కొచ్చే పనిచేస్తున్న ఇద్దరు టీడీపీ ముఖ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి పెంచారని తెలిసింది. టికెట్లు ఖరారు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నందువల్ల వెంటనే నిర్ణయం తెలియ చేయాలని వారు రకరకాల మార్గాల్లో మాగుంట కుటుంబాన్ని ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. తమకు వస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయలు సేకరించారు. ఒకటి,రెండు రోజుల్లో ఒంగోలులో కూడా మద్దతుదారులతో సమావేశమై ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే తమ నాయకుడు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, అనేక రకాల ఆలోచనల్లో మాత్రమే ఉన్నారని ఆదివారం నాటి సమావేశానికి హాజరైన ఒక నాయకుడు సాక్షి ప్రతినిధికి చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వలస నాయకులను తీసుకుని వచ్చి టికెట్ల పందేరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
మాగుంట కుటుంబానికి ‘బాబు’ ఎర
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు మహిళలకు ఇస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ సీటును కూడా కాంగ్రెస్ నుంచి వలస తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఆ సీటును మాగుంట కుటుంబ సభ్యులకు కేటాయించే వాతావరణం కనిపిస్తోంది. ధనబలం వున్న వారి కోసం వలలు విసిరి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబునాయుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట పార్వతమ్మను పార్టీలోకి తీసుకురావడానికి తెర చాటుమంతనాల వేగం పెంచారు. ఇందులో భాగంగానే తమ దారెటో నిర్ణయించుకోవడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయంలో ఆదివారం మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి తట్టుకోవాలంటే వందలు, వేల కోట్లున్న ధనవంతులను పోటీకి దించడమే ఏకైక మార్గంగా టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికి వారు కోరిన సీట్లు కేటాయించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్నా అవసరమైతే అలాంటి వారినే వదులుకుని కొత్త వారికి టికెట్లు ఇచ్చేలా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం చూపగల మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా తమ వైపునకు లాక్కోవడానికి తమ పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఆయన వదిన పార్వతమ్మను పార్టీలోకి రావాలంటూ వారి మీద ఒత్తిడి పెంచుతున్నారు. శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ, పార్వతమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చంద్రబాబు తన సన్నిహిత నాయకుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయించడం ద్వారా ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ధన సహాయం అందించి ఎన్నికల్లో వెయ్యి రూపాయల నోట్లు పారించే ఎత్తుగడకు తెర లేపారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్వతమ్మను పోటీ చేయించి అక్కడ కూడా విరివిగా ధన ప్రవాహం పారించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉదయగిరి పార్టీ ఇన్చార్జిగా ఉన్న బొల్లినేని రామారావు పార్టీ హై కమాండ్ సూచించినంత డబ్బు ఖర్చు పెట్టే ధైర్యం చేయలేక వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డి తన మద్దతుదారుడు ఒంటేరు వేణుగోపాలరెడ్డికి ఆ టికె ట్ ఇప్పించే ప్రయత్నాలకు తెర లేపారు. అయితే చంద్రబాబు మాత్రం పార్వతమ్మను ఇక్కడి నుంచి పోటీచేయించే ఆలోచన చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను ఒప్పించో, టికెట్లు ఎర వేసో తమ పార్టీలోకి లాక్కొచ్చే పనిచేస్తున్న ఇద్దరు టీడీపీ ముఖ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి పెంచారని తెలిసింది. టికెట్లు ఖరారు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నందువల్ల వెంటనే నిర్ణయం తెలియ చేయాలని వారు రకరకాల మార్గాల్లో మాగుంట కుటుంబాన్ని ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. తమకు వస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయలు సేకరించారు. ఒకటి, రెండు రోజుల్లో ఒంగోలులో కూడా మద్దతుదారులతో సమావేశమై ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే తమ నాయకుడు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, అనేక రకాల ఆలోచనల్లో మాత్రమే ఉన్నారని ఆదివారం నాటి సమావేశానికి హాజరైన ఒక నాయకుడు సాక్షి ప్రతినిధికి చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వలస నాయకులను తీసుకుని వచ్చి టికెట్ల పందేరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
ఒంగోలు రాజధానికై ప్రధానికి లేఖ రాసా: మాగుంట
-
'పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని కిరణ్‌కు చెప్పా'
ఒంగోలు : ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఒంగోలును సీమాంధ్రకు రాజధాని చేయాల్సింగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ ఇచ్చినట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను కాంగ్రెస్‌కు చేసిన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని మాగుంట తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరపున పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తాననని ఆయన చెప్పారు. మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దానిపై బుధవారం తిరుపతిలో ప్రకటన చేయవచ్చని తెలిసింది. సమైక్యాంధ్ర పేరుతో ఇప్పటికే రిజిస్టరైన ఒక రాజకీయ పార్టీని తీసుకుని, దానితో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై నిన్న కాంగ్రెస్ బహిష్కత ఎంపీలు, కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. -
కొనసాగుతున్న రాజీనామాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపినట్టు ఆయన ఢిల్లీలో చెప్పారు. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ... స్పీకర్ కార్యాలయానికి అందలేదని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. -
అయోమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో జిల్లాలోని కాంగ్రెస్ నేతలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తమకిక భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ సీఎం వెనుక ఉన్నందుకు ప్రజలు తమపై ఆగ్రహంతో ఉన్నారని భావిస్తున్నారు. సీఎం కిరణ్ నాటకీయంగా రాష్ట్ర విభజనకు సహకరించారని అంతా విశ్వసిస్తుండటంతో ఇప్పటి వరకు ఆయన వెంట నడిచిన జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వచ్చేందుకు జంకుతున్నారు. జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది జిల్లా కాంగ్రెస్ నేతలను మరింత కుంగదీసింది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించడంతో ఆమెపై జిల్లావాసుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదించడంతో మంగళవారం యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులు తమ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటేశ్వరరావు చాలాకాలం క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసి పార్టీ పట్ల ఉన్న విముఖతను తెలియజేశారు. ఇకపై ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది. ఆయన టీడీపీ లేదా బీజేపీల వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దర్శి తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అద్దంకి తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా నేడో, రేపో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి మహీధర్ రెడ్డి కాంగ్రెసును వీడి, కిరణ్ కొత్త పార్టీ పెడితే దానివైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రాజీనామా చేసే సమయంలో ఆయన వెనకే ఉండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక సంతనూతలపాడు, కొండపి, కనిగిరి ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, జీవీ.శేషు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు వారి వైఖరిని స్పష్టంచేయాల్సి ఉంది. వీరు కూడా కాంగ్రెసు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం కొత్త పార్టీపైనా సందేహాలు.. కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన నాయకత్వం జిల్లాలో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయంలో పడ్డారు. దీంతో వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనే గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్న కూడా వీరిలో తలెత్తుతోంది. కిరణ్‌కు చరిష్మా ఏముందని, ఆయన పట్ల ప్రజలు ఏమేరకు ఆకర్షితులవుతారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా మంచి పేరు లేని ఆయన వెంట ఎంతమంది నాయకులు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవడంలో కాంగ్రెస్ నేతలు తలమునకలై ఉన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి మాగుంట రాజీనామా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖను ఆయన బుధవారం పత్రికలకు విడుదల చేశారు. లోక్‌సభలో ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 40 ఏళ్లుగా తమ కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని అన్నారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఆరు సార్లు లోక్‌సభకు, రెండుసార్లు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే సీమాంధ్ర అగ్ని గుండ మైందని, దాంతో తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. సీమాంధ్రుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయలేదు: కొన్ని టీవీ చానెళ్లలో మాగుంట రాజీనామాను లోక్‌సభ స్పీకరు ఆమోదించినట్లు వార్తలు రావడంపై ఒంగోలులోని ఆయన కార్యాలయం ఖండించింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేశారని తెలిపింది. గతంలో ఆయన చేసిన రాజీనామాను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. -
పురందేశ్వరి,మాగుంట రాజీనామాల ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాలను ఆమోదించారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామాను కూడా ఆమోదించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు నిన్న లోక్‌సభలో ఆమోదం పొందడంతో వీరు ముగ్గురూ తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. నిన్న లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంతో పురందేశ్వరి మంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సీమాంధ్రల అభిప్రాయాలను గౌరవించకుండా లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందటంతో లగడపాటి లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. లగడపాటి రాజీనామా లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి, ఆ మాట ప్రకారం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఇదే అంశంపై లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
అధికార వాహనం వదిలి ఆటోలో ఇంటికి...
హైదరాబాద్: విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాల బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలో మిగతా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ అధికారిక వాహనాన్ని వదిలి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు. అయితే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం లేదు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు నిన్న రాజీనామా చేశారు. -
కాంగ్రెసుకు మాగుంట గుడ్‌బై?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి త్వరలో కాంగ్రెసు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెసు పార్టీ తీరు ఆయన మనసును కలచివేసిందని, దీంతో ఆయన పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మాగుంట ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ మొండి వైఖరితో ఉండటంతో, నియోజకవ ర్గంలోని ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆయన పార్టీని వీడే అవకాశం ఉంది. పార్లమెంటులో జరిగిన విషయాలను తెలుపుతూ శనివారం విలేకరులతో మాట్లాడిన మాగుంట, పార్టీ వీడుతున్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. కాంగ్రెసు తన వైఖరి మార్చుకోకపోతే, పార్టీ వీడే విషయం గురించి ఆలోచిస్తామని అన్నారు. అయితే ఆయన పార్టీ వీడేందుకు ఇది వరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ భూస్థాపితం అవుతుందని భావిస్తున్న ఆయన, పార్టీని వీడటంపై ఇది వరకే తన కుటుంబ సభ్యులతో చర్చించిన ట్లు సమాచారం. తన సన్నిహితులు నెల్లూరుకు రమ్మంటున్నారని, మరికొంత మంది ఇక్కడ నుంచే పోటీ చేయాలని కోరుతున్నారని అన్న మాగుంట ఏ పార్టీకి వెళతారనే విషయాన్ని దాట వేశారు. ఏ వైపు మొగ్గు చూపుతున్నార నేది కూడా ఆయన స్పష్టం చేయలేదు. అయితే కొంత కాలంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, దీనికి ముహూర్తం కూడా ఈనెల 21వ తేదీన ఖరారు చేశారనే వదంతులు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించలేదు. మరికొందరు ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందిందని కూడా అంటున్నారు. ఇవేవీ కాదు ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మరి కొన్ని వదంతులు కూడా వచ్చాయి. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులను కలుసుకుని, వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. దీంతో పాటు చెన్నైలో ఉన్న ఆయన సన్నిహితులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ మారే అంశంపై విలేకరుల సమావేశంలో ఆయనను పలువురు పాత్రికేయులు గుచ్చి గుచ్చి అడిగినా, తాను కన్య్ఫూజన్‌లో ఉన్నానని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ దూతలు వచ్చిన సమయంలో కూడా ఆయన వారిని కలుసుకోని విషయం తెలిసిందే. మాగుంట పార్టీ వీడే తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఒంగోలు నుంచే పోటీ చేస్తా కానీ... ?
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఒంగోలు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఒంగోలులో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ పట్టుకోవడం లేదన్నారు. టి.బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తాను పట్టిన కాళ్ల కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చూసిన మాపై వేటు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటమని ఆయన అభివర్ణించారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు నుంచి పోటీ చేస్తా కానీ ఏ పార్టీ తరఫున అనేది మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. -
ఐక్యతా పరుగు
కదంతొక్కిన సమైక్యవాదులు సాక్షి నెట్వర్క: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర వ్యాప్తంగా ఆదివారం ‘సమైక్య పరుగు’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ఉద్యోగులు, విద్యార్థులు, పాల్గొన్నారు. విభజన బిల్లును అడ్డుకోని ప్రజాప్రతినిధులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన 5కే రన్ లో ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు , ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలో సమైక్యరన్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ ఆవరణలో కేంద్ర మంత్రుల ఫొటోల ఫ్లెక్సీలను టమాటాలతో కొట్టిన ఉద్యోగులు వాటిని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహించిన సమైక్య నడక(10కె) కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఒంగోలులో నిర్వహించిన పరుగులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జ్యోతిని పట్టుకొని ముందుకు కదలగా విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు అనుసరించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోనూ సమైక్య రన్ నిర్వహించారు. కర్నూలులో నిర్వహించిన 5కే రన్ లో మంత్రి టి.జి.వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని అయోధ్యా మైదానం నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు వేలాది మంది సమైక్యవాదులు రన్లో పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణం బెలగాంలో, సాలూరులో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరుగు నిర్వహించారు. ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సమైక్య రన్ నిర్వహించారు. విశాఖ సాగరతీరంలో వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులతో సమైక్య నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏయూలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె పట్టణాల్లో ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర రన్ నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, వాణిజ్యపన్నులు, ఖజానా, రవాణాశాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, కొవ్వూరు పట్టణాలు సమైక్య నినాదాలతో మార్మోగాయి. మునిసిపల్ ఉద్యోగులు, సమైక్యాంధ్ర జేఏసీ, విద్యాసంస్థల జేఏసీ, సమైక్యవాదులు, వ్యాపారులు పెద్దఎత్తున రన్లో పాల్గొని సమైక్యవాదాన్ని చాటారు. ఆకివీడు, కొయ్యగూడెం తదితర మండల కేంద్రాల్లోను సమైక్య పరుగు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కడప మున్సిపల్ స్టేడియం నుంచి అప్సర సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ‘సమైక్య రన్’లో వేలాది మంది విద్యార్థులు, ఎన్జీవోలు, ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దారిపొడవునా సమైక్యోద్యమ గీతాలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రొద్దుటూరులో బార్ అసోషియేషన్, ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యరన్ జరిగింది.